- యజమానులపై కేసు
హిమాయత్‌నగర్
ఇళ్లలో పనులు చేస్తున్న ఇద్దరు బాల కార్మికులకు బాలల హక్కుల సంఘం, కార్మిక శాఖ అధికారుల జోక్యంతో విముక్తి లభించింది. హైదర్‌గూడలోని అపొలో హాస్పిటల్ సమీపంలోని జగన్నాధ్ రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్-203 యజమాని భాగ్యరాణి నివాసంలో పని మనిషిగా చేస్తున్న విశాఖకు చెందిన బాలిక(13), ఫ్లాట్ నెంబర్ -101 యజమాని చందన్‌లాల్ ఇంటిలో పనిచేస్తున్న బాలుడి(13)పై బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.
ఈ మేరకు వారు కార్మిక శాఖ అధికారులను తీసుకుని ఆ ఇళ్లలో మంగళవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. ఈ సందర్భంగా కనిపించిన బాలుడు, బాలికను గుర్తించి స్టేట్‌హోంకు తరలించారు. యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్, కార్మిక శాఖ శాఖ అసిస్టెంట్ అధికారి నజీముద్దీన్ ఉన్నారు.