సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు.
ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.
కుటుంబసభ్యులంతా నేరచరితులే...
గుంటూరుకు చెందిన ముజీబ్ కుటుంబ సభ్యులు తొలినుంచి నేరచరిత్ర కలిగి ఉన్నారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఒక భూమిని ఆక్రమించిన కేసులో ముజీబ్ సోదరుడు ఫిరోజ్, ఇంతియాజ్, బషీర్లపై రౌడీషీట్లున్నాయి. ఆటోనగర్‌లో సైతం గతంలో కత్తులు తీసుకుని ఆ ప్రాంతమంతా హల్‌చల్ సృష్టించిన విషయంలో కాకాని పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతోపాటు కొంతమందిపై దాడిచేసిన కేసులున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముజీబ్, అతడి సోదరులపై అధికారులను కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది. తొలినుంచి వివాదాలకు దిగే ముజీబ్, అతడి కుటుంబ సభ్యులపై మరోమారు కేసు నమోదవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. ముజీబ్ సోదరుడు సయ్యద్ ఫిరోజ్ రౌడీïÙట్ కలిగి ఉండటంతో పాటు టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముజీబ్ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని, అతడిపై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment