firoze
-
బిగ్ బాస్ జంట విడాకులు.. వీడియో రిలీజ్ చేసిన నటి!
మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్లో ఫేమ్ తెచ్చుకున్న జంట ఫిరోజ్ ఖాన్, సజ్నా ఫిరోజ్. ప్రస్తుతం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విడిపోవడానికి కేవలం తన వ్యక్తిగత కారణాలేనని సజ్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. విడాకుల గురించి తెలిసి.. తన అభిమానులు తన పట్ల పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించింది. (ఇది చదవండి: యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!) సజ్నా వీడియోలో మాట్లాడుతూ..'ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. మాతో సన్నిహితులు కూడా ఇది ఊహించి ఉండరు. కానీ ఫిరోజ్, నేను విడాకులకు సిద్ధమవుతున్నాం. ఈ విషయాన్ని పరస్పరం అంగీకరించాం. అయితే ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయమే. ఈ విషయం తెలిసిన కొందరు నాతో అనుచితంగా ప్రవర్తించారు. నా తమ్ముడిగా భావించే వ్యక్తి నుంచే చేదు అనుభవం ఎదురైంది' అని తెలిపింది. అయితే విడిపోయినప్పటికీ మా పిల్లల కోసం మాట్లాడతామని పేర్కొంది. ప్రస్తుతం పిల్లలు మా అమ్మ వద్ద ఉన్నారని.. మేం విడిపోయామన్న విషయం వారికి తెలియదని చెప్పుకొచ్చింది. విడిపోయిన తర్వాత వచ్చిన మార్పులను సజ్నా వివరించింది. ప్రస్తుతం నా జీవితంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నానని సజ్నా తెలిపింది. అయితే ఒకసారి నేను విడాకుల కోసం దాఖలు చేసిన తర్వాత దుబాయ్‌లో ఓ ఈవెంట్‌కి వెళ్లానని వెల్లడించింది. అక్కడ ఉన్న నా కుటుంబానికి చెందిన సోదరుడి లాంటి వ్యక్తి నాతో చెడుగా ప్రవర్తించాడని చెప్పింది. వాడు నా వీపు మీద చెయ్యి వేసి అసభ్యంగా వ్యవహరించాడు. అతనికి చెడు ఉద్దేశాలు ఉంటే నేను అర్థం చేసుకోలేకపోయానని.. దీంతో ఏడుస్తూ కూర్చున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిరోజ్, సజ్నాలకు ఇది రెండో వివాహం కాగా.. ఈ జంట మలయాళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. ఈ జంట షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సజ్నా టీవీ సీరియల్స్‌లో యాక్టివ్‌గా ఉంది. (ఇది చదవండి: ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్) View this post on Instagram A post shared by SAJNANOOR (@itssajnanoor) View this post on Instagram A post shared by SAJNANOOR (@itssajnanoor) -
Hyderabad: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు. ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. కుటుంబసభ్యులంతా నేరచరితులే... గుంటూరుకు చెందిన ముజీబ్ కుటుంబ సభ్యులు తొలినుంచి నేరచరిత్ర కలిగి ఉన్నారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఒక భూమిని ఆక్రమించిన కేసులో ముజీబ్ సోదరుడు ఫిరోజ్, ఇంతియాజ్, బషీర్లపై రౌడీషీట్లున్నాయి. ఆటోనగర్‌లో సైతం గతంలో కత్తులు తీసుకుని ఆ ప్రాంతమంతా హల్చల్ సృష్టించిన విషయంలో కాకాని పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీంతోపాటు కొంతమందిపై దాడిచేసిన కేసులున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముజీబ్, అతడి సోదరులపై అధికారులను కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది. తొలినుంచి వివాదాలకు దిగే ముజీబ్, అతడి కుటుంబ సభ్యులపై మరోమారు కేసు నమోదవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. ముజీబ్ సోదరుడు సయ్యద్ ఫిరోజ్ రౌడీïÙట్ కలిగి ఉండటంతో పాటు టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముజీబ్ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని, అతడిపై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు. -
మహిళపై అఘాయిత్యానికి నేపాల్ యువకుల యత్నం
కందుకూరు: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు అఘాయిత్యానికి విఫలయత్నం చేశారు. దిశ యాప్‌లో వచ్చి న ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నేపాల్‌కు చెందిన యువకులు కాగా, మరొకరు పట్టణానికి చెందిన యువకుడు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చింది. అయితే ఆలస్యం కావడంతో రాత్రి 11 గంటల వరకు పట్టణంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సు కోసం పామూరు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలోని గూర్ఖాలుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన యువకులు కరణ్, జ్యోషిలతో పాటు, పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఫిరోజ్ ముగ్గురూ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మాచవరం వైపు తీసుకెళుతున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. దీంతో పెట్రోల్ బంకులో పనిచేసే యువకుడు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు రక్షణ కల్పించి యువకుల కోసం గాలించారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఆటో ఆధారంగా బుధవారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
మద్యం మత్తులో యువతి హల్చల్
హైదరాబాద్: పీకలదాకా మద్యం సేవించి ఓ యువతి సోమవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై నిలబడి హల్చల్ చేసింది. తన మాజీ ప్రియుడు, అతని ప్రియురాలు ఇద్దరూ తనకు మద్యం తాగించి నడిరోడ్డుమీద నగ్నంగా నిలబెట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... మాదాపూర్‌కు చెందిన యువతి (21) ఏడాదిక్రితం బంజారాహిల్స్‌కు చెందిన ఫిరోజ్‌ను ప్రేమించింది. ఆరు నెలల పాటు చెట్టపట్టాలేసుకుని తిరిగాక మనస్పర్ధలు రావడంతో ఆమె దుబాయ్ వెళ్లిపోయింది. వారం క్రితం హైదరాబాద్ వచ్చింది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న అమెన్షియా పబ్‌కు వెళ్లి మద్యం సేవిస్తుండగా.. అక్కడ ఫిరోజ్, అతని ప్రియురాలు కీర్తి కనిపించారు. కీర్తి.. ఆ యువతి టేబుల్ వద్దకు వచ్చి మద్యం సేవించి గొడవపడింది. అనంతరం ఫిరోజ్ ఆ యువతిని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని కీర్తి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలసి మద్యం తాగించారని, ఫిరోజ్ తనతో సన్నిహితంగా ఉండటం చూసిన కీర్తి తన చేతులకు బ్లేడ్‌తో గాట్లు పెట్టిందని ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. అంతేకాకుండా తన గొంతు నులిమేందుకు యత్నించిందని, జుట్టు పట్టుకొని కొట్టి బయటకు ఈడ్చేసిందని తెలిపింది. తర్వాత ఇద్దరూ కలసి తనను జీవీకే వన్ చౌరస్తాకు తీసుకొచ్చి బంగారు గొలుసు, మొబైల్ ఫోన్లు, ఖరీదైన వాచ్, రూ.12 వేల నగదు లాక్కొని వివస్త్రను చేసి గంటపాటు నడిరోడ్డుపై నిలబెట్టారని వివరించింది. నడిరోడ్డుపై నగ్నంగా ఉన్న తనను బంజారాహిల్స్ పోలీసులు బట్టలు కప్పి స్టేషన్‌కు తీసుకొచ్చారంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫిరోజ్, కీర్తి ఈ తతంగాన్నంతా చేశారని ఫిర్యాదు చేసింది. అయితే తాగిన మైకంలో పబ్‌లో ఉన్నప్పుడు ఆ యువతే బ్లేడ్‌తో చేతులు కోసుకుందని ఫిరోజ్ పోలీసులకు తెలిపాడు. అక్కడి నుంచి తానిక్ వైన్‌షాప్‌కు వెళ్లి మళ్లీ మద్యం సేవించిందన్నాడు. జీవీకే వన్ చౌరస్తాలో సిగరెట్ కొనడానికి రాగా, ఆమె తన దుస్తులు విప్పేసుకుందని చెప్పాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో మరో రౌడీషీటర్ హత్య
హైదరాబాద్ : నగరంలోని మరో రౌడీషీటర్ దారుణ హత్యకు గురైయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో టికల్కుంట ప్రాంతంలో రౌడీషీటర్ ఫైరోజ్‌ను ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం ప్రత్యర్థులు అక్కడ నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు ముహమ్మద్ ప్రూట్, ఆసిఫ్, బాబాఖాన్లతో ఉన్న వైరమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.