
తన కుమార్తె పుస్తకంలోని పేజీలు చించారని పిల్లలపై దాడి
కంభం: ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కుమార్తె పుస్తకంలోని పేజీలు చింపారంటూ ఓ టీడీపీ నేత తమ పిల్లలను తీవ్రంగా కొట్టాడంటూ పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎల్‌కోట పంచాయతీకి టీడీపీ నేత గని చిన్నవెంకటేశ్వర్లు కుమార్తె ఎల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. శనివారం తన కూతురి పుస్తంలోని కొన్ని పేజీలను ఎవరో చించారు.
అదే తరగతిలో చదువుకుంటున్న పిల్లలే చించారన్న అనుమానంతో శనివారం సాయంత్రం మరో ఇద్దరితో పాఠశాలలోకి వచ్చి తమ పిల్లలను తీవ్రంగా కొట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నేత జయరాజ్, ఓ బాధిత విద్యార్థి తండ్రి దుగ్గెపోగు బాబురావు మీడియాతో మాట్లాడారు. ఘటనపై హెచ్‌ఎం, ఎంఈవోకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ విషయమై కంభం సీఐ మల్లికార్జునను వివరణ కోరగా ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment