![Global Anti Scams Alliance report revealed: India ranks number 9 in cybercrime](/styles/webp/s3/article_images/2025/02/14/CYBER-CRIME.jpg.webp?itok=J8P33ZqV)
ఆసియా దేశాల్లో కొల్లగొట్టింది రూ.6.88 లక్షల కోట్లు
సైబర్ నేరాల బాధిత దేశాల్లో తొమ్మిదో స్థానంలో భారత్
గ్లోబల్ యాంటీ స్కామ్స్ అలయన్స్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.88.58 లక్షల కోట్లు కొల్లగొట్టడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గ్లోబల్ యాంటీ స్కామ్స్ అలయన్స్ (గాసా) నివేదిక సైబర్ నేరాల బాధితులపై సర్వే చేసింది.
నివేదికలోని ప్రధాన అంశాలు..
⇒ ఆసియా దేశాల్లో రూ.6.88 లక్షల కోట్లు కొల్లగొట్టారు.
⇒ ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది సైబర్ నేరాల బారినపడ్డారు.
⇒ 74శాతం మంది బాధితులు వారి తప్పిదం, అవగాహన రాహిత్యంతోనే సైబర్ నేరాల బారిన పడుతున్నారు.
⇒ 67శాతం మంది బాధితులు తమకు వచ్చిన లింకులు సైబర్ నేరాలకు సంబంధించినవని సందేహిస్తూనే క్లిక్ చేస్తూ మోసపోతున్నారు.
⇒ 70శాతం మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే లేదు.
⇒ 25 శాతం మంది తమ బ్యాంకు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.
⇒ సైబర్ నేరాల్లో 28శాతం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్, బ్యాంకు ట్రాన్స్‌ఫర్ ద్వారానే సాగుతున్నాయి.
⇒ 36శాతం సైబర్ నేరాలకు ఈ–వాలెట్ విధానాన్ని వాడుకుంటున్నారు.
⇒ ఫిర్యాదు చేస్తున్న వారిలో కేవలం 4శాతం మంది బాధితులే తాము కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందుతున్నారు.
⇒ కేవలం 0.05శాతం మంది సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
⇒ ఆన్‌లైన్ మోసాలను ముందుగా గుర్తించడంలో చైనీయులు మొదటిస్థానంలో ఉండగా భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు.
⇒ అత్యధికంగా సైబర్ నేరాల బాధిత దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది.
⇒ అమెరికా, డెన్మార్క్, స్లోవేకియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
⇒ భారత్‌లోని సైబర్ బాధితులు సగటున రూ.35వేలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment