పగలు డ్రైవర్.. రాత్రి దొంగ
జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోని ప్రబుద్ధుడు
చోరీ సొత్తు అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన నిందితుడు
వరంగల్‌క్రైం : పగలంతా నగరంలో ఆటో నడుపుతూ రాత్రయితే దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.70 వేల విలువ చేసే 17 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కథనం ప్రకా రం.. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పు డు రైళ్లలో సమోసాలు అమ్మేవాడు. వీటి ద్వారా వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతోపాటు జల్సాలకు అలవా టు కావడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2012లో మొదటిసారి మిల్స్‌కాలనీ, మట్టెవాడ పరిధిలో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత నగరంలో పగలంతా ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. ఇలా జనవరిలో మడికొండ, హన్మకొండ, మట్టెవాడ, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ లకు పాల్పడ్డాడు.
చోరీ సొత్తును అమ్మడానికి మంగళవారం వరంగల్ బులియన్ మార్కెట్ వద్ద తిరుగుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తన సిబ్బందితో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.70 వేల విలువ చేసే 17 గ్రాముల బంగా రు, 500 గ్రాముల వెండి ఆభరణాల ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతి భ కనపరిచిన సీసీఎస్ సీఐ శ్రీధర్, హెడ్‌కానిస్టేబుల్ వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, జంపయ్యను సీపీ అభినందించారు.