
ఫ్లైఓవర్ బ్రిడ్జిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జె.నివాస్ తదితరులు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): అనతి కాలంలో నిర్మాణ పనులు పూర్తి అయిన బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈ నెల 10న సీఎం వైఎస్ జగన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. రవాణా, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వి.ప్రసన్నతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జిని, ప్రారంభోత్సవ ఏర్పాట్లును శనివారం పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సీఎం, కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. విజయవాడలోని స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటెల్ హోటల్ మధ్య రూ.88 కోట్లతో 2.47 కి.మీ. మేర అనుకున్న సమయానికే నిర్మించారన్నారు. దీని వల్ల ఆ మార్గంలోని పలు జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు.