సాక్షి, విజయవాడ : జై ఆంధ్ర ఉద్యమనేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న కాకాని విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించగా కాంగ్రెస్ నేతలు, ప్రజలు అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
దీంతో పోలీసులు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహారశెట్టి నరసింహారావు, అధికార ప్రతినిధి కె శివాజితో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసి.. ఉంగటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అధికారులు కాకాని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. కాకాని విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ప్రతిష్టించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ పనుల కారణంగా కాకాని విగ్రహం తొలగించడం.. తెలుగు వారిని అవమానించడమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment