statue contravercy
-
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం
లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో విగ్రహాలపై దాడులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం నూతన విగ్రహ ప్రతిష్ట విషయంలో తీసుకున్న నిర్ణయంపై కూడా పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమతుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఉన్న స్థానంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) పరిసరాల్లో దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గే సీఎంకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన సీఎం కార్యాలయం విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకొవాల్సిందిగా డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహ ఏర్పాటు సమయంలో శాంతి భద్రతలు కాపాడాల్సిందిగా పోలీసు శాఖకు సూచించింది. ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో.. గార్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించడం దళితుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. దళితుల హక్కులకై పోరాడిన నాయకుడు దీన్‌దయాళ్ అని పేర్కొన్నారు. ఏఎంసీ పరిసరాల్లో రెండు అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయన్నారు. ఒకటి పాతది కాగా.. మరొకటి మయావతి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిష్టించారని తెలిపారు. ప్రస్తుతం పాత దాని స్థానంలో దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు వెల్లడించారు. పాత అంబేడ్కర్ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్టించడం కానీ, భద్రపరచడం కానీ చేస్తామని తెలిపారు. కాగా ఏఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. 90 శాతం, 100 మంది కౌన్సిలర్లలో 24 మంది దళితులు కావడంతో.. వారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రతన్పూర కౌన్సిలర్ ధర్మవీర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ముందునుంచే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే దళితులంతా రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. ఇది కేవలం రెచ్చగొట్టే ప్రయత్నమని అని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ విగ్రహ స్థానంలో దీన్‌దయాళ్ విగ్రహం పెట్టాలనుకోవడం సామాజిక వర్గాల మధ్య దూరం పెంచుతుందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. -
కాకాని విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలి: కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : జై ఆంధ్ర ఉద్యమనేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న కాకాని విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించగా కాంగ్రెస్ నేతలు, ప్రజలు అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహారశెట్టి నరసింహారావు, అధికార ప్రతినిధి కె శివాజితో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసి.. ఉంగటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అధికారులు కాకాని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. కాకాని విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ప్రతిష్టించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ పనుల కారణంగా కాకాని విగ్రహం తొలగించడం.. తెలుగు వారిని అవమానించడమేనన్నారు. -
నా వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడు
-
ఆ ఆరోపణలను తోసిపుచ్చిన రజనీకాంత్
సాక్షి, చెన్నై : తమిళ ఉగాది ఏప్రిల్ 14న తాను రాజకీయ పార్టీ, జెండా ప్రకటించడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడులో మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ధ్వంసం, వీహెచ్‌పీ రథయాత్రలపై స్పందించిన రజనీకాంత్ పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రామ రాజ్య రథయాత్రతో మత విద్వేషాలు చెలరేగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. తమిళనాడు ప్రశాంతతకు మారు పేరని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ ప్రవేశం వెనక బీజేపీ ఉందంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలను రజనీ తోసిపుచ్చారు. తన వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. రెండు వారాల పాటు ఆధ్యాత్మిక పర్యటన అనంతరం రజనీకాంత్ మళ్లీ చెన్నైకి చేరుకున్నారు. తన హిమాలయాల పర్యటన ప్రశాంతంగా జరిగిందని, కొత్త శక్తినిచ్చిందని రజనీ పేర్కొన్నారు. ఇక తనపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఆయన తెలిపారు. -
ఎంజీఆర్, పెరియార్ విగ్రహాలపై కాషాయ వస్త్రాలు
సాక్షి, చెన్నై : విగ్రహాల విధ్వంసం ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ సీఎంలు ఎంజీఆర్, అన్నాదురై, ద్రవిడ కజగం వ్యవస్ధాపకులు పెరియార్ విగ్రహాలకు కాషాయ వస్త్రాలను కట్టడం కలకలం రేపింది. నమక్కల్‌లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అస్సాంలోని కోక్రాజర్ పట్టణంలో జన్‌సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహం ధ్వంసం చేసిన మరుసటి రోజు ఈ ఉదంతం వెలుగుచూడటం గమనార్హం. బుధవారం ఉదయం కొందరు దుండగులు ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో కోక్రాజర్ డిప్యూటీ కమిషనర్ నిరంజన్ బారువా పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్ధలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ నెల 7న కోల్‌కతాలోనూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చినందుకు నిరసనగా తాము ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశామని నిందితులు స్వయంగా వెల్లడించారు. మరోవైపు బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాలనూ ఇటీవల ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
రచ్చకెక్కిన ‘అమ్మ’ విగ్రహం.!
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత విగ్రహం రచ్చకెక్కింది. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టారన్న విమర్శలు అన్నాడిఎంకే పాలకుల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఆ విగ్రహాన్ని మార్చేందుకు నిర్ణయించారు. అన్నాడిఎంకే వర్గాలు అమ్మ జయలలిత 70వ జయంతి వేడుక శనివారం ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, అస్సలు అక్కడ ఉన్న విగ్రహం జయలలిత దేనా..? అన్న ప్రశ్న అందరిలో మొదలైయింది. జయలలిత ముఖం పోలికలు ఆ విగ్రహంలో లేవన్న విమర్శలు బయలు దేరాయి. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టినట్టున్నారని అన్నాడిఎంకే కేడర్ సైతం విమర్శల్ని గుప్పించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, ఆ విగ్రహం చర్చ హోరెత్తింది. అక్కడున్నది అమ్మా...చిన్నమ్మా..? అంటూ కొందరు ప్రశ్నించారు. కొందరు సీనియర్ నేత వలర్మతిని నిలబెట్టినట్టుందని, మరి కొందరు సీఎం పళని స్వామి సతీమణి ముఖాన్ని పోలినట్టుందని రక రకాల వ్యంగ్యాస్త్రాలతో సామాజిక మాధ్యమాల ద్వారా అన్నాడిఎంకే వర్గాలపై దాడి చేసిన వాళ్లు ఎక్కువే. విగ్రహావిష్కరణ సమయంలో మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ను పదే పదే మీడియా ప్రశ్నించగా, అమ్మ విగ్రహమే క్షుణ్ణంగా చూడండంటూ సమాధానం ఇచ్చి వెళ్లడం మరింత చమత్కారాలకు దారి తీశాయి. మార్పుకు నిర్ణయం : అమ్మ ఎక్కడ ..? అని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తడం ఓ వైపు ఉంటే, మరో వైపు అన్నాడిఎంకే వర్గాలు సైతం విగ్రహం మీద పెదవి విప్పడం చర్చకు దారి తీసింది. అన్నాడిఎంకే కేడర్ అమ్మేది అని ప్రశ్నించే స్థాయి పరిస్థితి చేరింది. అదే సమయంలో అన్నాడిఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ సైతం పన్నీరు, పళనిల తీరుపై విమర్శల దాడిని పెంచారు. అమ్మ విగ్రహాన్ని పరిహాసం చేశారని మండి పడ్డారు. అమ్మ విగ్రహాన్నే సక్రమంగా చేయించ లేని వాళ్లు, ఇక పార్టీ నిర్వాకాన్ని ఏ మేరకు ఒలక బెడుతున్నారో కేడర్ పరిగణించాలని సూచించారు. ఇక, జయలలిత మేన కోడలు దీప సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేని డిమాండ్ చేశారు. అలాగే, ఈ విగ్రహావిష్కరణకు దూరంగా ఉన్న మైలాడుతురై ఎంపి భారతి మోహన్ కూడా విమర్శలు ఎక్కుబెట్టడం విగ్రహం ఆవిష్కరణ రచ్చకెక్కింది. ఇది మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉండటంతో పాలకులు మేల్కొన్నట్టున్నారు. విగ్రహాన్ని మార్చేందుకు తగ్గ చర్యల్లో పడ్డారు. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఆ విగ్రహాన్ని మార్చి, మరో విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ రచ్చను ఇంతటితో వదలి పెట్టాలని వేడుకోవడం గమనార్హం. -
జయలలిత విగ్రహంపై రచ్చ రచ్చ..
-
ముఖ్యమంత్రి సతీమణిలా జయ విగ్రహం!
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విగ్రహంపై వివాదం నెలకొంది. జయలలిత విగ్రహంలోని పోలికలు ముఖ్యమంత్రి పళనిస్వామి సతీమణిని పోలినట్లు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జయలలిత 70వ జయంతి సందర్బంగా పాలకఅన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత నేత భారీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం నెలకొల్పింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా నెల్లూరులో రూపుదిద్దుకున్న జయ విగ్రహాన్ని గత ఏడాదే పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించాల్సి ఉండగా, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. -
విగ్రహంపై కలెక్టర్ అమ్రపాలి మండిపాటు
వరంగల్: అత్యుత్సాహంతో కొందరు యువకులు చేసిన పనిపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మండిపడ్డారు. నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటకు చెందిన యువకులు కొందరు.. ‘అమ్రపాలి ఒడిలో వినాయకుడు’ కాన్సెప్ట్‌తో విగ్రహాన్ని తయారుచేసి, ఆ ఫొటోలు, వీడియోలను శుక్రవారం ‘హమారా వరంగల్’ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే అవి వైరల్ కావడంతో అధికారిణి స్పందించారు. తన ప్రతిమను తయారుచేయడం పట్ల కలెక్టర్ అమ్రపాలి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే దానిని తొలగించాలంటూ సిబ్బందికి సూచించారు. అప్పటికే విషయం తెలుసుకున్న యువకుల బృందం తాము తయారు చేయించిన విగ్రహానికి నల్లరంగు పూసి, అక్కడి నుంచి తరలించారు. దీంతో ఈ వ్యవహారం సర్దుమణిగింది. (కలెక్టర్ అభ్యంతరం తర్వాత విగ్రహానికి నల్ల రంగు పూస్తోన్న దృశ్యం)