సాక్షి, చెన్నై : తమిళ ఉగాది ఏప్రిల్ 14న తాను రాజకీయ పార్టీ, జెండా ప్రకటించడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడులో మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ధ్వంసం, వీహెచ్‌పీ రథయాత్రలపై స్పందించిన రజనీకాంత్ పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రామ రాజ్య రథయాత్రతో మత విద్వేషాలు చెలరేగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు.
తమిళనాడు ప్రశాంతతకు మారు పేరని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ ప్రవేశం వెనక బీజేపీ ఉందంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలను రజనీ తోసిపుచ్చారు. తన వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. రెండు వారాల పాటు ఆధ్యాత్మిక పర్యటన అనంతరం రజనీకాంత్ మళ్లీ చెన్నైకి చేరుకున్నారు. తన హిమాలయాల పర్యటన ప్రశాంతంగా జరిగిందని, కొత్త శక్తినిచ్చిందని రజనీ పేర్కొన్నారు. ఇక తనపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment