
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విగ్రహంపై వివాదం నెలకొంది. జయలలిత విగ్రహంలోని పోలికలు ముఖ్యమంత్రి పళనిస్వామి సతీమణిని పోలినట్లు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జయలలిత 70వ జయంతి సందర్బంగా పాలకఅన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత నేత భారీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం నెలకొల్పింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా నెల్లూరులో రూపుదిద్దుకున్న జయ విగ్రహాన్ని గత ఏడాదే పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించాల్సి ఉండగా, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.