Kakani Venkataratnam
-
మహామహులు ఏలిన పెనమలూరు
సాక్షి, కృష్ణా : పెనమలూరు నియోజకవర్గం విలక్షణమైనది. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గాల్లో రెండోది. 2009లో చేపట్టిన నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 41 గ్రామాలు, ఒక మున్సిపాలిటి, ఉయ్యూరు నగర పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 68,208 ఎకరాలు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గం. 41 గ్రామాలు, 1 మున్సిపాలిటీకి అన్నింటికీ రహదారి మార్గం, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నిత్యం విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–ఏలూరు, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. నియోజకవర్గం మీదుగా ప్రధానంగా బందరు, రైవస్ కాలువలు, వాటికి అనుబంధ కాలువలు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ కూడా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని ఐదు గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. సాగునీరు వ్యవస్థ అం దుబాటులో ఉంది. ప్రధానంగా బోర్లు, కాలువ నీటిపై ఆధారపడి సాగు జరుగుతుంది. వ్యవసాయాధారిత గ్రామాలు ఎక్కువ. పెనమలూరు మండలం సెమీ అర్బన్ ప్రాంతం. పట్టణీకరణ వాతావరణం. ఉద్యోగులు, కార్మికులు ప్రధానంగా ఉన్నారు. రాజధా ని అమరావతి, విజయవాడకు కూతవేటు దూరంలోనే నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయి. ప్రతి పనికీ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తుంటారు. మూడవ పర్యాయం.. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి, టీడీపీ అభ్యర్థి చలసాని వెంకటేశ్వరరావు (పండు)పై 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పార్థసారథి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్, వైఎస్సార్సీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్‌పై 31,448 మెజారిటీతో గెలుపొందారు. రద్దయిన కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు పునర్విభజనతో రద్దయ్యాయి. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గంలో ఉన్న పమిడిముక్కల, తోట్లవల్లూరు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. విజయవాడ రూరల్, అర్బన్ డివిజన్లు మైలవరం, విజయవాడ పరిధిలోకి వెళ్లాయి. కంకిపాడు నియోజకవర్గంలో... తొలి రోజుల్లో ఇక్కడ కమ్యూనిష్టులదే ప్రభావం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక కంకిపాడు టీడీపీకి పెట్టని కోట అయ్యింది. 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన నేత మాత్రం దేవినేని రాజశేఖర్ (నెహ్రూ). రాజకీయంగా కోనేరు రంగారావుకు విజయాన్ని అందించింది కూడా కంకిపాడు నియోజకవర్గమే. రద్దయిన ఉయ్యూరు నియోజకవర్గంలో సమరయోధుడు కాకాని వెంకటరత్నం మూడు సార్లుగెలిచారు. ఉయ్యూరుకు తలమానికం చక్కెర కర్మాగారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెక్కర కర్మాగారాల్లో ఉయ్యూరు కేసీపీ కర్మాగారం కూడా ఒకటి. కర్మాగారం పరిధిలో 20 మండలాల్లో 26 వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతోంది. 16 వేల మంది రైతులు కర్మాగారంలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు మొత్తం జనాభా : 3,55,277 మొత్తం ఓటర్లు : 2,58,586 పురుషులు: 1,26,239 మహిళలు : 1,32,324 ఇతరులు : 23 -
కాకాని విగ్రహం తొలగింపు
పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ నేత యలమంచిలి రవి తదితరులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ అనుమతి లేకుండా, ముందస్తు సమాచార మివ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విగ్రహ తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాలు.. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం సేవలను గుర్తించి విజయవాడ లోని బెంజ్ సర్కిల్లో అప్పట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో ఫ్లైవోవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకు విగ్రహం అడ్డు వస్తోందంటూ ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, అధికారులు.. దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తదితరులు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. యలమంచిలి రవి మాట్లాడుతూ.. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార దర్పంతో నగరంలోని విగ్రహాలను, గుళ్లను కూల్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు జై ఆంధ్రా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడం దారుణమన్నారు. విగ్రహం తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోబోగా పోలీసులు రవిని అరెస్టుచేసి ఆ తర్వాత విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం బాపు మ్యూజియంలో విగ్రహాన్ని భద్రపర చినట్లు అధికారులు తెలిపారు. కాగా ‘బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు విగ్రహం అడ్డు వస్తున్నట్లు జాతీయ రహదారుల విభాగం నుంచి నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకున్నాం’ అని ట్రాఫిక్ ఏసీపీ శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ పనులు పూర్తి కాగానే విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని దొంగతనంగా తరలించి కృష్ణా జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ప్రభుత్వంపై పార్లమెంటు మాజీ సభ్యుడు, వ్యవసాయ రంగ ప్రముఖుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాకాని వెంకటరత్నం ఓ వ్యక్తి కాదని ఓ ఉద్యమానికి చిహ్నమని గుర్తు చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో విజయవాడలో కాల్పులు జరిగి 9 మంది చనిపోయారని.. ఆ సమయంలో కెనాల్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కాకాని ఈ విషయం తెలిసి గుండెపోటుతో మరణించారని చెప్పారు. -
పీఎస్ నుంచి యలమంచలి రవి విడుదల
సాక్షి, కృష్ణా: ఉంగుటూరు పోలీసు స్టేషన్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత యలమంచిలి రవి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలిగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో.. వారిని యలమంచిలి రవి అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అరెస్టు చేసి.. ఉంగటూరు పోలీసు స్టేషన్‌ను తరలించారు. అంతకుముందు విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని యలమంచిలి పోలీసులను నిలదీశారు. ప్రొక్లైనర్‌ను అడుకుని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో యలమంచిలి రవిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఉంగుటూరు పోలీసు స్టేషన్లో ఉన్న యలమంచలి రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు పరామర్శించారు. ఆ తర్వాత సాయంత్రం యలమంచలి రవి పీఎస్ నుంచి విడుదలయ్యారు. -
కాకాని విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలి: కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : జై ఆంధ్ర ఉద్యమనేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న కాకాని విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించగా కాంగ్రెస్ నేతలు, ప్రజలు అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహారశెట్టి నరసింహారావు, అధికార ప్రతినిధి కె శివాజితో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసి.. ఉంగటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అధికారులు కాకాని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. కాకాని విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ప్రతిష్టించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ పనుల కారణంగా కాకాని విగ్రహం తొలగించడం.. తెలుగు వారిని అవమానించడమేనన్నారు. -
ఆంధ్ర రాష్ట్ర స్ఫూర్తి, దీప్తి కాకాని
పదమూడు జిల్లాల రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఇది ఆంధ్ర ప్రజలకు మొదటి క్రిస్మస్. రాష్ట్ర విభజన కోసం ప్రాణాలు కూడా లెక్కపెట్టని స్ఫూర్తి దాయకులని గుర్తు చేసుకునే సంప్రదాయం నేటి నుంచే మొదలవ్వాలి. సరిగ్గా 41 ఏళ్ల క్రితం ఈ రోజునే, రాష్ట్ర విభజన ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి నాయకత్వం వహించిన కాకాని వెంకటరత్నం, యువకుల మీద పోలీసు కాల్పులు తట్టుకోలేక గుండె ఆగి చని పోయారు. తెలంగాణ నుంచి విడిపోయి ప్రత్యేకం గా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందగల దని 1970లోనే ఆలోచించిన నేతల్లో కాకాని ప్రథ ములు. కన్నుమూసి నాలుగు దశాబ్దాలైనా.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజా నాయకుడు అంటే అలా ఉండాలని ఈ నాటికి ప్రజలు కాకానిని గుర్తు చేసుకుంటారు. కృష్ణానది ఒడ్డున ఆయన అంత్యక్రియలకి డిసెంబర్ 25న విజయవాడ వచ్చిన జనసమూహం నాటి నుండి నేటివరకు కనీ వినీ ఎరుగని విషయం. కాకాని రాజకీయాలకు కొత్త అర్థం చూపించిన జననేత. నాయకులు ఎలా ఉండాలి అనే దానికి తానొక ఉదా హరణ. అలాగే మంత్రి పదవికే గౌరవం తెచ్చిన నాయకుడు. సామాన్య ప్రజలు రాజకీయనేతల చుట్టూ తిరగాల్సిన అవ సరం రాకూడదనీ, నాయకులే ప్రజల దగ్గరకెళ్లి వాళ్ల అవసరాలు, కష్టనష్టాలు, ఆకాంక్షలని తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవా లని నాడే చెప్పారాయన. ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు రాజధానికి తీసుకెళ్లాలి కాని, ప్రజలు రాజధాని చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడద న్న అంశాన్ని జీవితాంతం చేసి చూపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో అధి కారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అలాగే ఎన్ని కల తర్వాత పార్టీలకతీతంగా పనిచేసుకుపోవాలని చెప్పి, చేసి చూపించారు కూడా. కాకాని చదువుకున్నది నాలుగో తరగతి వరకే. అయితే జిల్లా బోర్డు అధ్యక్షులుగా కృష్ణాజిల్లాలో విద్యను నలుమూలలా విస్తరింపచేసి, ప్రతిగ్రామం నుంచి ఎంతో మంది ప్రపంచం నలుమూల లకి వెళ్లే విధంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల్లోని ప్రముఖ వైద్యులు, ఇంజ నీర్లు, కంప్యూటర్ నిపుణులు ఈ రోజుకీ కాకానిని ఇలాగే గుర్తు చేసు కుంటున్నారు. పాడిపంటలను అందరికీ అందుబా టులోకి తీసుకువచ్చి, ఎన్నో గ్రామాల్లో మహిళలకి ఆర్థికస్థోమత కలిగించారు. గ్రామరహదారుల కో సం కృషిచేశారు. సాగునీటి కల్పన, గ్రంథాలయాల అభివృద్ధి, రైతుల రుణాలకు సహకార సంఘాలు వంటి కార్యక్రమాలను అమలు చేసి చూపించారు. నాలుగు దశాబ్దాలపాటు విజయవాడే కాకాని కార్యక్షేత్రం. ఆంధ్ర రాష్ట్ర విభజన పోరాటంలో ప్రాణాలు కూడా అక్కడే అర్పించారు. పొట్టి శ్రీరా ములు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర జిల్లాల విభజ నకు కృషి చేసి ప్రాణాలు అర్పిస్తే, కాకాని సమైక్య రాష్ట్రం నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విభజనకు కృషి చేశారు. అయితే అది జరగకుండానే చనిపో యారు. కాకాని చనిపోయాక విభజన ఉద్యమాన్ని నీరుకార్చారు. అయితే నాటి ఆంధ్ర రాష్ట్ర విభజన ఉద్యమాలు తెలంగాణకు కానీ అక్కడి ప్రజలకు కానీ వ్యతిరేకంగా జరగలేదు. ద్వేషాలు పెంచే విధంగా అసలే జరగలేదు. విభజనతో భవిష్యత్ బాగా ఉంటుందనే నమ్మకంతోనే వాదనలు జరి గాయి. కాకాని చేపట్టిన విభజన ఉద్యమాన్ని నాటి తెలంగాణ ప్రముఖ నేతలు సానుకూలంగానే చూశా రు. అభివృద్ధి కోసం ఆంధ్ర విభజనకి నిరంతర కృషి చేసి, జీవితాలు అర్పించిన వారిని గుర్తు చేసు కోవటమే కాక, కాకాని లాంటి నాయకులు కన్న కలల సాధన కోసం కృషిచేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో కాకానిని స్మరించుకు నేలా స్మారక చిహ్నం ఏర్పాటుచేసి, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి డిసెంబర్ 25న నిర్వహిస్తే కొత్త తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. (నేడు కాకాని వెంకటరత్నం వర్ధంతి) (వ్యాసకర్త మీడియా నిపుణులు)