డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు
పదమూడు జిల్లాల రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఇది ఆంధ్ర ప్రజలకు మొదటి క్రిస్‌మస్. రాష్ట్ర విభజన కోసం ప్రాణాలు కూడా లెక్కపెట్టని స్ఫూర్తి దాయకులని గుర్తు చేసుకునే సంప్రదాయం నేటి నుంచే మొదలవ్వాలి. సరిగ్గా 41 ఏళ్ల క్రితం ఈ రోజునే, రాష్ట్ర విభజన ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి నాయకత్వం వహించిన కాకాని వెంకటరత్నం, యువకుల మీద పోలీసు కాల్పులు తట్టుకోలేక గుండె ఆగి చని పోయారు. తెలంగాణ నుంచి విడిపోయి ప్రత్యేకం గా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందగల దని 1970లోనే ఆలోచించిన నేతల్లో కాకాని ప్రథ ములు. కన్నుమూసి నాలుగు దశాబ్దాలైనా.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజా నాయకుడు అంటే అలా ఉండాలని ఈ నాటికి ప్రజలు కాకానిని గుర్తు చేసుకుంటారు. కృష్ణానది ఒడ్డున ఆయన అంత్యక్రియలకి డిసెంబర్ 25న విజయవాడ వచ్చిన జనసమూహం నాటి నుండి నేటివరకు కనీ వినీ ఎరుగని విషయం.
కాకాని రాజకీయాలకు కొత్త అర్థం చూపించిన జననేత. నాయకులు ఎలా ఉండాలి అనే దానికి తానొక ఉదా హరణ. అలాగే మంత్రి పదవికే గౌరవం తెచ్చిన నాయకుడు. సామాన్య ప్రజలు రాజకీయనేతల చుట్టూ తిరగాల్సిన అవ సరం రాకూడదనీ, నాయకులే ప్రజల దగ్గరకెళ్లి వాళ్ల అవసరాలు, కష్టనష్టాలు, ఆకాంక్షలని తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవా లని నాడే చెప్పారాయన. ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు రాజధానికి తీసుకెళ్లాలి కాని, ప్రజలు రాజధాని చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడద న్న అంశాన్ని జీవితాంతం చేసి చూపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో అధి కారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అలాగే ఎన్ని కల తర్వాత పార్టీలకతీతంగా పనిచేసుకుపోవాలని చెప్పి, చేసి చూపించారు కూడా.
కాకాని చదువుకున్నది నాలుగో తరగతి వరకే. అయితే జిల్లా బోర్డు అధ్యక్షులుగా కృష్ణాజిల్లాలో విద్యను నలుమూలలా విస్తరింపచేసి, ప్రతిగ్రామం నుంచి ఎంతో మంది ప్రపంచం నలుమూల లకి వెళ్లే విధంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల్లోని ప్రముఖ వైద్యులు, ఇంజ నీర్లు, కంప్యూటర్ నిపుణులు ఈ రోజుకీ కాకానిని ఇలాగే గుర్తు చేసు కుంటున్నారు. పాడిపంటలను అందరికీ అందుబా టులోకి తీసుకువచ్చి, ఎన్నో గ్రామాల్లో మహిళలకి ఆర్థికస్థోమత కలిగించారు. గ్రామరహదారుల కో సం కృషిచేశారు. సాగునీటి కల్పన, గ్రంథాలయాల అభివృద్ధి, రైతుల రుణాలకు సహకార సంఘాలు వంటి కార్యక్రమాలను అమలు చేసి చూపించారు.
నాలుగు దశాబ్దాలపాటు విజయవాడే కాకాని కార్యక్షేత్రం. ఆంధ్ర రాష్ట్ర విభజన పోరాటంలో ప్రాణాలు కూడా అక్కడే అర్పించారు. పొట్టి శ్రీరా ములు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర జిల్లాల విభజ నకు కృషి చేసి ప్రాణాలు అర్పిస్తే, కాకాని సమైక్య రాష్ట్రం నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విభజనకు కృషి చేశారు. అయితే అది జరగకుండానే చనిపో యారు. కాకాని చనిపోయాక విభజన ఉద్యమాన్ని నీరుకార్చారు. అయితే నాటి ఆంధ్ర రాష్ట్ర విభజన ఉద్యమాలు తెలంగాణకు కానీ అక్కడి ప్రజలకు కానీ వ్యతిరేకంగా జరగలేదు. ద్వేషాలు పెంచే విధంగా అసలే జరగలేదు. విభజనతో భవిష్యత్ బాగా ఉంటుందనే నమ్మకంతోనే వాదనలు జరి గాయి. కాకాని చేపట్టిన విభజన ఉద్యమాన్ని నాటి తెలంగాణ ప్రముఖ నేతలు సానుకూలంగానే చూశా రు. అభివృద్ధి కోసం ఆంధ్ర విభజనకి నిరంతర కృషి చేసి, జీవితాలు అర్పించిన వారిని గుర్తు చేసు కోవటమే కాక, కాకాని లాంటి నాయకులు కన్న కలల సాధన కోసం కృషిచేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో కాకానిని స్మరించుకు నేలా స్మారక చిహ్నం ఏర్పాటుచేసి, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి డిసెంబర్ 25న నిర్వహిస్తే కొత్త తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
(నేడు కాకాని వెంకటరత్నం వర్ధంతి)
(వ్యాసకర్త మీడియా నిపుణులు)