విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ అక్కరకు రానుంది. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై సోమవారం నుంచి ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. నెల రోజుల క్రితమే దీని నిర్మాణం పూర్తయింది. అయితే, ఫ్లైఓవర్ ప్రారంభానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రావాల్సి ఉంది.