సీఎం కాన్వాయ్‌ వెంట మహిళ పరుగు..ఓఎస్‌డీని పంపిన సీఎం..! | Woman running along with CM YS Jagan convoy | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌ వెంట మహిళ పరుగు..ఓఎస్‌డీని పంపిన సీఎం..!

Published Mon, Nov 15 2021 5:10 AM | Last Updated on Mon, Nov 15 2021 7:58 AM

Woman running along with CM YS Jagan convoy - Sakshi

మహిళను గమనించి కాన్వాయ్‌ ఆపిన సీఎం

రేణిగుంట: తిరుపతిలో 29వ సదరన్‌ జోనల్‌ సమావేశానికి హాజరయ్యేందుకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి వెళుతున్న సీఎం కాన్వాయ్‌ వెనుక ఓ మహిళ అర్జీ చేత పట్టుకుని సార్‌.. సార్‌.. అంటూ పరుగులు తీసింది. కారు అద్దంలో నుంచి గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌.. వెంటనే కారు ఆపి వెనుక కూర్చున్న ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిని ఆమె వద్దకు పంపించారు. ఆయన వెళ్లి సమస్యను తెలుసుకుని అర్జీ స్వీకరించారు.
విజయకుమారి సమస్య తెలుసుకుంటున్న ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి 

వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి తనకు ఉద్యోగం ఇప్పించాలని, జీవనం కష్టతరంగా మారిందని అర్జీలో పేర్కొంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కూడా అనారోగ్య విషయమై అర్జీ ఇచ్చారు. స్పందించి వాహనాన్ని ఆపిన సీఎంకు  విజయకుమారి ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement