సీఎం కాన్వాయ్‌లో 108 రయ్‌ రయ్‌.. | CM Jagan Convoy given way to 108 Ambulance | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌లో 108 రయ్‌ రయ్‌..

Published Wed, Apr 6 2022 3:07 AM | Last Updated on Wed, Apr 6 2022 7:20 AM

CM Jagan Convoy given way to 108 Ambulance - Sakshi

కాన్వాయ్‌ మధ్యలో నుంచి వెళ్తున్న అంబులెన్స్‌

గన్నవరం: తన పర్యటన సందర్భంగా ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. సరిగ్గా సీఎం కాన్వాయ్‌ గన్నవరం వద్ద జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయానికి విజయవాడ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమై సీఎం కాన్వాయ్‌ మధ్యలో నుంచి అంబులెన్స్‌ను ముందుకు పంపించారు. అనంతరం సీఎం కాన్వాయ్‌ ఎయిర్‌పోర్టులోకి చేరుకుంది. అక్కడ సీఎంను కలిసిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement