శంఖవరం : పుట్టుకతోనే బుద్ధిమాంద్యం గల బాలుడి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఔదార్యం మరోమారు ప్రశంసలు అందుకుంది. గురువారం సీఎం పాయకరావుపేట పర్యటనలో రోడ్డు పక్కన విలపిస్తున్న ఓ తల్లిని గమనించడం, కాన్వాయ్ ఆపించి ఆమెతో మాట్లాడటం, రెండు గంటల్లోనే ఆమె కుమారుడు ధర్మతేజకు వికలాంగ పింఛన్ మంజూరు కావడం, తక్షణ సాయంగా రూ.10 వేలు, రూ.30 వేల విలువైన వీల్ ఛైర్‌ను కలెక్టర్ కృతికా శుక్లా ద్వారా అందజేయడం తెలిసిందే.
(చదవండి: మానవత్వమై నిలిచి..)
వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు. అతి తక్కువ సమయంలో తమ సమస్యను పరిష్కరించినందుకు బాలుడి తల్లిదండ్రులు నక్కా చక్రరావు, తనూజ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ )
Comments
Please login to add a commentAdd a comment