ఫించన్ ఎత్తేశారు! | YS Jagan Mohan Reddy fires on Chandrababu guarantees | Sakshi
Sakshi News home page

ఫించన్ ఎత్తేశారు!

Published Sat, May 4 2024 5:14 AM | Last Updated on Sat, May 4 2024 11:59 AM

YS Jagan Mohan Reddy fires on Chandrababu guarantees

బాబు సూపర్‌ సిక్స్‌లో మాయం.. అవ్వాతాతల పెన్షన్లపై పాపిష్టి కళ్లు 

నరసాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభల్లో సీఎం జగన్‌ ధ్వజం

బాబు కడుపుమంట ఇంకా చల్లారక పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నాడు 

ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ తొలి సంతకం అవ్వాతాతల కోసమే 

మళ్లీ మనం రాగానే మీ ఇంటికే పింఛన్లు.. పెరుగుదల కూడా కనిపిస్తుంది.. మన ఐదేళ్ల పాలనలో లంచాలు లేని సమాజాన్ని ఆవిష్కరించాం

గ్రామ, వార్డు సచివాలయాలతో 600 సేవలు మన ఇంటికే నడిచి వస్తున్నాయి.. పేదల ఖాతాల్లోకి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు 

నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం  

ఈ మంచిని కొనసాగించేందుకు రెండు ఓట్లు ఫ్యాన్‌కే వేయండి

విలువలు, విశ్వసనీయతలను గెలిపించండి 

రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 
14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన  ప్రకటన చూశారా? సూపర్‌ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్‌ను అప్పుడే ఎత్తేశారు. సూపర్‌ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్‌ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు  ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా.  – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  


సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్‌ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్‌ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్‌ ఇంటికే పంపుతున్నది ఎవరు? 

చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీల్లో అవ్వాతాతల పెన్షన్‌ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెద­కూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 

సాధ్యం కాని హామీలతో వల.. 
మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. 

వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా?  

నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్‌గా 66 లక్షలు 
ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్‌ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు  చొప్పున పెన్షన్‌ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు.  

ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. 
చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్‌ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. 

ఇంకా కడుపు­మం­ట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్‌ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్‌ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. 

ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మను­షులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయా­లు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాల­న కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్‌ ఇంటికి పంపిన పరిస్థితి అంత­కంటే లేదు. 

మీ కోసమే నా తొలి సంతకం..  
నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్‌ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. 

విద్యా విప్లవం.. మహిళా సాధికారత 
గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్‌ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్‌ మీడియం, బైజూస్‌ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్‌ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్‌ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్‌రూమ్‌ లలో డిజిటల్‌ బోర్డులు, డిజిటల్‌ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. 

పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.

పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. 

లంచాలు లేని సమాజం 
గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్‌ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్‌ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు.  

నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. 
ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్‌ వార్‌. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వా­తాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లా­డం­డి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్‌ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్‌లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్‌ అధికారంలో ఉంటేనే పెంచిన  అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది.  

ఆ మోసాలు మీరంతా చూశారు.. 
మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మల­కు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒక­సారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయ­లు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. 

ఈ 59 నెలల్లో మీ జగన్‌ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీ­యాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి.

 తాగేసిన టీ గ్లాస్‌సింకు­లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? 

మన అభ్యర్థులను ఆశీర్వదించండి
వైఎస్సార్‌సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. 

గతంలో ఇవి ఉన్నాయా?
» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్‌లు గతంలో ఎప్పుడైనా చూశారా?  
»    రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా?  
»  తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం,  ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? 
»  ఇంటికే రూ.3 వేల పెన్షన్‌ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? 
»  వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్, ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్‌ గతంలో ఉన్నాయా? 
»  మీ జగన్‌ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి.  

2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..
»  రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ  చేస్తానన్నాడు... జరిగిందా? 
» రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా?  
»  ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? 
»   ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా?  
»   అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?  
»   రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ జరిగిందా?  
»    ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా?  
»   సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? 
»  ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు.  
»ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కార్‌  అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం.   

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..  
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

 మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.   

పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిక 
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్‌ నివాసి సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్‌ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్‌ తివారీకి సీఎం జగన్‌ వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement