CM Jagan Speech Highlights In Payakaraopeta Public Meeting, Details Inside | Sakshi
Sakshi News home page

మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదు: సీఎం జగన్‌

Published Wed, May 1 2024 3:07 PM | Last Updated on Wed, May 1 2024 6:41 PM

Cm Jagan Speech On Payakaraopeta Public Meeting

అనకాపల్లి జిల్లా, సాక్షి: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్‌ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు తీసుకునే వాడు కాదు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌.. భూములపై సమగ్ర సర్వే చేయించి.. వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?
అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశ్యం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వే జరగలేదు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదు. ఆ సర్వే లేక భూములన్నీ సబ్‌ డివిజన్‌ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.  ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం’’ అని సీఎం వివరించారు.

వాళ్ల భూముల మీద సర్వ హక్కులూ వాళ్లకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి, రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే..
‘‘పేదలకు, బాబు మోసాలకు మధ్య జరిగే యుద్ధం ఇది. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, విలువలకు, విశ్వసనీయతకు ఓటేయడానికి మీరంతా సిద్ధమేనా?. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే. ఎన్నికల్లో మీరు వేసే ఓటే పేదల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోంది. మీ జగన్‌ మంచి చేశాడని చంద్రబాబుకు కోపమొస్తుంది’’ అని సీఎం జగన్‌  ధ్వజమెత్తారు

‘‘అవ్వాతాతలకు  ఇంటివద్దే పెన్షన్‌ ఇవ్వడం విప్లవం అవునా?కాదా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం విప్లవాత్మక మార్పు. ఉన్నత చదువుల కోసం విద్యాదీవెన, వసతి  దీవెన.. పిల్లలను బడులకు పంపే తల్లులకు అమ్మఒడి పథకం.. అక్కా చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నావడ్డీ.. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.. మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘రైతన్నకు తోడుగా పెట్టుబడి సాయం విప్లవాత్మక మార్పు. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ విప్లవాత్మక మార్పు. సకాలంలోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినిక్‌ విప్లవాత్మక మార్పు. ఫ్యామిలీ డాక్టర్‌ విప్లవాత్మక మార్పు. పేషెంట్‌ విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం విప్లవాత్మక సాయం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. వాలంటీర్‌ వ్యవస్థతో పౌర సేవలందిస్తున్నాం’’ అని  సీఎం చెప్పారు

‘‘రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేయడం ఓ విప్లవం. అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు రెక్కలు కడుతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ నిలబడ్డాడు. చంద్రబాబు పక్షాన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా, కుట్రలు..  చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో పెన్షన్‌ను అడ్డుకున్నాడు. 14 ఏళ్లలో బాబు ఏనాడూ అవ్వాతాతలను పట్టించుకోలేదు’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్‌..వంచనతో బాబు.. మంచితో జగన్‌ ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగింపు..బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే.బాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబు వంచన చేస్తే.. మీ జగన్‌ మంచి చేశాడు’’ అని సీఎం పేర్కొన్నారు.
 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement