అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు
దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి
ఈవీఎంలను పక్కన పెట్టాలి అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు
‘ఎక్స్’లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పోస్ట్
సాక్షి,అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలపై ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్‌లాకింగ్ తదితర అంశాలపై మరోవైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఫలితాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక మాధ్యమం(ఎక్స్) ఖాతాలో ఓ కీలక సందేశాన్ని పోస్ట్ చేశారు.
‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు కాదు. దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలను పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment