Payakaraopeta
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
ఏపీలో హోంమంత్రి అనిత ఇలాకాలో టీడీపీ అరాచకం
-
సీఎం జగన్ కోసం పాయకరావుపేట సిద్ధం(ఫొటోలు)
-
ఇదిగో చంద్రబాబు సంతకం.. కూటమి గాలి తీసేసిన సీఎం జగన్
-
పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదు.. అందుకే..
-
జరిగేది మహా కురుక్షేత్రం, పేదలను గెలిపిస్తారా.. బాబు మోసాలకు ఓటేస్తారా..
-
చంద్రబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తల పెట్టడమే..
-
మీ జగన్ భూములిచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదు: సీఎం జగన్
అనకాపల్లి జిల్లా, సాక్షి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు తీసుకునే వాడు కాదు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. భూములపై సమగ్ర సర్వే చేయించి.. వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా?. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశ్యం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వే జరగలేదు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదు. ఆ సర్వే లేక భూములన్నీ సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం’’ అని సీఎం వివరించారు.వాళ్ల భూముల మీద సర్వ హక్కులూ వాళ్లకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి, రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే..‘‘పేదలకు, బాబు మోసాలకు మధ్య జరిగే యుద్ధం ఇది. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, విలువలకు, విశ్వసనీయతకు ఓటేయడానికి మీరంతా సిద్ధమేనా?. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే. ఎన్నికల్లో మీరు వేసే ఓటే పేదల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోంది. మీ జగన్ మంచి చేశాడని చంద్రబాబుకు కోపమొస్తుంది’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు‘‘అవ్వాతాతలకు ఇంటివద్దే పెన్షన్ ఇవ్వడం విప్లవం అవునా?కాదా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విప్లవాత్మక మార్పు. ఉన్నత చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన.. పిల్లలను బడులకు పంపే తల్లులకు అమ్మఒడి పథకం.. అక్కా చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నావడ్డీ.. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్.. మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘రైతన్నకు తోడుగా పెట్టుబడి సాయం విప్లవాత్మక మార్పు. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ విప్లవాత్మక మార్పు. సకాలంలోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ విప్లవాత్మక మార్పు. ఫ్యామిలీ డాక్టర్ విప్లవాత్మక మార్పు. పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం విప్లవాత్మక సాయం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. వాలంటీర్ వ్యవస్థతో పౌర సేవలందిస్తున్నాం’’ అని సీఎం చెప్పారు‘‘రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేయడం ఓ విప్లవం. అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు రెక్కలు కడుతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. పేదల పక్షాన మీ బిడ్డ జగన్ నిలబడ్డాడు. చంద్రబాబు పక్షాన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా, కుట్రలు.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో పెన్షన్‌ను అడ్డుకున్నాడు. 14 ఏళ్లలో బాబు ఏనాడూ అవ్వాతాతలను పట్టించుకోలేదు’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్..వంచనతో బాబు.. మంచితో జగన్ ఎన్నికలకు వెళ్తున్నాం. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగింపు..బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే.బాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబు వంచన చేస్తే.. మీ జగన్ మంచి చేశాడు’’ అని సీఎం పేర్కొన్నారు. -
Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
-
Vangalapudi Anitha: అవినీతి అనకొండ వంగలపూడి అనిత
సాక్షి, అనకాపల్లి: అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ వంగలపూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా భారీ అవినీతి, భూఆక్రమణలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పులతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న (2014–19) ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె చేసిన అక్రమాలు అన్ని ఇన్నీ కావు. వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం చేయడమే కాదు.. కోట్ల విలువైన అభివృద్ధి పనులను నామినేషన్ పద్ధతిలో పంచేసుకుని సొమ్ముచేసుకున్నారు. ఇసుకను దోచేశారు. మట్టిని కాజేశారు. మరుగుదొడ్లలో మెక్కేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి దోచుకున్నారు. నీరు–చెట్టు పథకంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. చెరువు తవ్వకాల్లో వచి్చన మట్టిని రియల్ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించడం, తాండవ, వరాహ నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వి కంపెనీలకు విక్రయించడం, భూరికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు పుట్టించి పాసు పుస్తకాల్లో నమోదు చేయించుకోవడం, ఈ భూములకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు పరిహారం పొందేందుకు స్కెచ్ వేయడం ఇలా అక్రమాల చిట్టా చాలానే ఉంది. జన్మభూమి కమిటీలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను అర్హులైన వారికి కేటాయించకుండా లక్షలాది రూపాయలకు అమ్మేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. రేషన్ డిపోలు, అంగన్వాడీ ఆయా, కార్యకర్తల పోస్టులు కూడా ఇలాగే అమ్మేసుకున్నారు. మరుగుదొడ్లు, పక్కా గృహాలు, పింఛన్ల మంజూరు వంటి పథకాల అమలులో కూడా లబి్ధదారులనుంచి వేలాది రూపాయలు గుంజేశారు. మట్టి విక్రయాల్లో రూ.25 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నీరుచెట్లు పథకం కింద పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగేళ్లలో సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు జరిగాయి. వీటిలో రూ.6 కోట్లు వరకూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అనిత బొక్కేశారు. ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లో ఇలా నిధులు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. కోటవురట్లలో ఊరచెరువు, జల్లూరులో నాగన్న చెరువు, ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నంలో జగ్గరాజు చెరువు, పెదగుమ్ములూరులో రాతి చెరువు, పెద ఉప్పలం చెరువు అప్పలరాజు చెరువులలో పనులు జరగకపోయినా జరిగినట్లు చూపించి మోసం చేశారు. మట్టి విక్రయాల ద్వారా మరో రూ.25 కోట్లు వెనకేసుకున్నారు. రూ.50 కోట్ల ఇసుక తరలింపు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు చూసుకుని టీడీపీ నాయకులు ఇసుక నుంచి కోట్లు పిండేశారు. తాండవ, వరాహ నదుల్లో దార్లపూడి, పందూరు, గొట్టివాడ, గుమ్ములూరు, పెదఉప్పలం, పెనుగొల్లు, ధర్మవరం, సోముదేవుపల్లి సత్యవరం, పెంటకోట, మాసయ్యపేట, అరట్లకోట తదితర ప్రాంతాల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వేశారు. సుమారు రూ.50 కోట్లు విలువైన ఇసుకను కొల్లగొట్టడం ద్వారా నాలుగు మండలాల ముఖ్య నాయకులు సుమారు రూ.20 కోట్ల మేర లాభాలు ఆర్జించారు. మరుగుదొడ్లలో 15 కోట్లు.. టీడీపీ ప్రభుత్వంలో పాయకరావుపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు నిరి్మంచారు. ఆరి్థక సంఘం నిధులు దాదాపుగా సుమారు రూ.300 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, ముఖ్య నాయకులే చేపట్టారు. నాణ్యతా లోపంతో పనులు చేసి రూ.50 కోట్ల వరకు స్వాహా చేశారు. అలాగే నియోజకవర్గానికి 25 వేల మరుగుదొడ్లు మంజూరైతే..వాటికి రూ.37 కోట్లు విడుదల చేశారు. ఒక్కో దానికి రూ.15 వేలు కేటాయించారు. వీటిని నిరి్మంచే బాధ్యత తెలుగుతమ్ముళ్లే తీసుకున్నారు. వీటిలో సగం మరుగుదొడ్లు బినామీలకే మంజూరు చేశారు. ఇలా మరుగుదొడ్లలో రూ.15 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు తెలిసింది. 600 ఎకరాల్లో భూ కుంభకోణాలు అప్పట్లో అనిత నేతృత్వంలో నియోజకవర్గంలో సుమారు 600 ఎకరాల్లో భూకుంభకోణాలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పుల పేరిట.. భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. సబ్‌డివిజన్–2లో సుమారు రూ.10 కోట్ల విలువైన 4.40 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీగా పేర్కొంటూ మరో ముగ్గురి పేరున ఒన్ బీ, ఆన్లైన్లో నమోదు చేశారు. ల్యాండ్ సీలింగ్ పేరిట టీడీపీ నాయకులు భారీగా ఆక్రమణలకు పాల్పడ్డారు. అమలాపురంలో 105 ఎకరాల భూముల్లో రూ.22 కోట్లు, రాజయ్యపేటలో 19 ఎకరాల్లో రూ.5 కోట్లు, నెల్లిపూడిలో 42 ఎకరాల్లో రూ.15 కోట్లు, గుర్రాజుపేటలో 10 ఎకరాల్లో రూ.3 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారు. -
పాయకరావుపేట రోడ్డు కూడా తాకలేవు
-
లోకేష్ పాదయాత్రలో వంగలపూడి అనిత పరువు తీసిన టీడీపీ కార్యకర్తలు
-
పాయకరావుపేట టికెట్ జనసేనకే.. అనిత పరిస్థితి ఏంటి..!
అనకాపల్లి: టీడీపీ జెండా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని పలువురు ఆశావహులు పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యరి్థగా ప్రచారం అవుతున్న అనితకు మద్దతు ఇచ్చి మళ్లీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడలేమంటూ వారు శనివారం పాయకరావుపేటలో జరిగిన సమావేశంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నుంచి జన సమీకరణ చేసి, బలప్రదర్శన చేశారు. కేవలం పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించాలన్న ప్రధాన ఎజెండాతోనే ఈ సమావేశం నిర్వహించారు. జనసేననుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మి శివకుమారి, బోడపాటి శివదత్, పెద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటివరకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ఇకనైనా నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయించాలని కోరారు. పార్టీరాష్ట్రకార్యదర్శి, సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచి, తర్వాత జనసేన నాయకులు, కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని తెలిపారు. పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో పాయకరావుపేట టికెట్ టీడీపీకే ఇవ్వదలిస్తే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. అనితకు టికెట్ ఇస్తే మాత్రం కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తెలిపారు. జనసేన కార్యకర్తల అభ్యర్థనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హమీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాయకరావుపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీకుమారి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను పర్యటిస్తున్నారు. గ్రామాల్లో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలోను జనసేన నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. -
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వంగల పూడి అనితపై అసమ్మతి నేతలు ఆగ్రహం
-
ఉత్తరాంధ్రలో తొలి రోజు తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర
-
పొత్తు పొడవకముందే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు
అనకాపల్లి: ఆ సీటు మాదే అంటే మాదే అంటున్నారు టీడీపీ-జనసేన నేతలు. ఇంకా పొత్తు పొడవకముందే సీట్ల పంపకం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేతలు సమావేశం కాగా, అక్కడ సీటు తమకే కేటాయించాలని జనసేన స్వరం పెంచింది. అక్కడ టీడీపీకి సీటు ఇస్తే తాము సహకరించమని తేల్చిచెబుతున్నారు జనసేన నేతలు. అనితకి సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించమని తెగేసి చెబుతున్నారు జనసేన నేతలు. గతంలో అనితను ఎమ్మెల్యేని చేస్తే తమపై తప్పుడు కేసులు బనాయించారని జనసేన నేతలు కుండ బద్ధలు కొట్టారు. దాంతో అనితకు సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్తోనూ టీడీపీ సహకరించమని అంటున్నారు. అనితకు సీటు ఇస్తే ఓడించే తీరుతామని ప్రతిన పూనారు జనసేన నేతలు.. అందుకు సంబంధంచి తీర్మానం కూడా చేశారు. -
అసలు విషయం బట్టబయలు.. వంగలపూడి అనిత ఏం చేసింది?
పాయకరావుపేట సీటు దక్కదనే అపనమ్మకం ఆమెలో పెరుగుతోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తనకు మొండి చేయి చూపిస్తుందని భావిస్తున్నారా? సీటును కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబునే బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ కార్యకర్తల మెడలో కండువాలు వేసి వారంతా వైసీపీ కార్యకర్తలేనని పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితి పైన పల్లకి మోతా.. ఇంట్లో ఈగల మోతలా తయారయిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది.. ఎందుకంటే పాయకరావుపేట నియోజక వర్గంలో ఆమెకు ఎదురువుతున్న పరిస్థితులే అందుకు కారణమని తెలుస్తోంది.. వంగలపూడి అనిత పేరుకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకుంటుంది కానీ.. ఆమెకు మాత్రం నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి ఇప్పటికి అదే విధంగా ఉంది అంటే ఆమె నాయకత్వంపట్ల నియోజవర్గంలో ఎలాంటి విశ్వసనీయత వుందో సులువుగా అర్థమవుతుంది. ఆమెకు ఈ సారి ఎన్నికల్లో పాయకరావుపేట సీటు ఇస్తే వచ్చే ఓడించి తీరుతామని అనిత వ్యతిరేక వర్గీయులు శపథం చేస్తున్నారు.. టీడీపీ ముద్దు.. అనిత వద్దు అంటూ గతంలో అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు నిరసనలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో అనితకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు. ఎన్నికల తర్వాత అనిత మళ్లి పాయకరావుపేటకు వచ్చారు.. వంగలపూడి అనిత మీద పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆమెను మరొకసారి.. ఈ వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.. లేదా టీడీపీ జనసేన పొత్తు ఉంటే పోత్తులో భాగంగా పాయకరావుపేట సీటును జనసేనకు కేటాయిస్తారని చర్చ నడుస్తోంది. చదవండి: అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..? ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అనిత. అయితే ఇందుకోసం ఆమె అనుసరిస్తున్న మార్గమే విమర్శలపాలవుతోంది.. పార్టీ క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేసి తాను బలంగా ఉన్నానని ఆమె చెప్పుకుంటే పరవాలేదు.. కానీ ఆమె అలా చేయడంలేదు.. వంగలపూడి అనిత ఈ మధ్యకాలంలో చేసిన ఒక కార్యక్రమం పట్ల సొంత పార్టీ నేతలే చీత్కరించుకుంటున్నారు. ఇంతకీ అనిత చేసిన ఆ పని ఏమిటో ఒకసారి చూద్దాం.. తెలుగుదేశం పార్టీలో ఉన్న పదిమందిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని నమ్మబలికింది. వారి మెడలో కండువాలు వేసి వారంతా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే టీడీపీలో చేరుతున్నారంటూ సభ ఏర్పాటు చేసింది.. వాస్తవంగా వారంతా తెలుగుదేశం పార్టీలో వున్నవారే.. వారు మొన్నటిమొన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగాను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి వారిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంటూ అటు టీడీపీ అధిష్టానాన్ని ఇటు నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వనిత. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..! అనిత చేసిన మోసం ఎంతో కాలం నిలవలేదు. సాక్ష్యాలతో సహా వైఎస్సార్సీపీ నాయకులు బట్టబయలు చేశారు. భాస్కర్ చౌదరి అనే టీడీపీ నాయకునితో పాటు కొంతమంది కార్యకర్తలు ఈ మధ్యనే టీడీపీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీడియా ముందు విడుదల చేశారు.. ఓ పదిమంది టీడీపీ నేతలను తీసుకువచ్చి వారందరికీ కండువాలు వేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రజా సేవ చేసి ప్రజల మనసు గెలవాలి గాని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కండువా లేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా చిత్రీకరించడం తగదంటూ వంగలపూడి అనితకు హితవు పలికారు. వంగలపూడి అనిత ప్లాన్ చేసిన ఈ నిర్వాకాన్ని ముందుగానే గ్రహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, యనమల కృష్ణుడు ఆమె నిర్వహించిన బహిరంగ సభకు రాకుండా గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయట పడడంతో అనిత నవ్వుల పాలయ్యారు. -
ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ ఆమె కథేంటి?
పార్టీ ఏదైనా..తమ నేతను గెలిపిస్తాం అని కేడర్ చెబుతుంది. కానీ ఒక చోట టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ అభ్యర్థి అయితే ఓడించడం ఖాయం అంటున్నారట. తమ అభ్యంతరాలు కాదని ఆమెకే సీటిస్తే ఓటమి తథ్యమని ముందే ప్రకటించేశారట. ఇంతకీ ఆ కథేంటో మీరే చదవండి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలోని నేతలతో ఆమెకు ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అనిత అవినీతిని వ్యతిరేకించిన నాయకులుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని స్థానిక పార్టీ నేతలే చెబుతారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో నచ్చని నేతలపై తప్పుడు కేసులు పెట్టించారట. అనిత తప్పుడు కేసులతో విసిగిపోయిన టీడీపీ నేతలు గతంలోనే ఆమెపై తిరుగుబాటు చేశారు. 2019 ఎన్నికలకు ముందు అనిత వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. పాయకరావుపేటలో అనితకు సీటు ఇస్తే ఓడిస్తామని పార్టీ అధినేతకే నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను తట్టుకోలేక అనిత పాయకరావుపేటని వదిలి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలవడంతో మళ్లీ పాయకరావుపేటకు మకాం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పరాయిచోటుకు వెళ్ళి ఓడిపోయి.. తిరిగి సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు చేరుకున్న అనిత తన పాత లక్షణాలను ఏమాత్రం వదులుకోలేదు. స్థానిక టీడీపీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో తనపై వ్యతిరేక గళం వినిపించిన నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు మినహా ఎక్కడా అనిత ఫోటోలు లేవు. ఈ పోస్టర్ల వెనక మాజీ మంత్రి గంటా హస్తం ఉందని అనిత అనుమానిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొంతమంది కాపు నేతలను గంటా ప్రోత్సహిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో గంటాతో సన్నిహితంగా మెలిగే కాపు నాయకులను గుర్తించిన ఆమె వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. గతంలో అనిత వద్దు.. టీడీపీ ముద్దు అని ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ పోస్టర్ల వెనక వారే ఉన్నారని అనిత భావిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి అనిత తీసుకెళ్ళారు. తన వ్యతిరేకులుగా భావించిన ఇద్దరిని పార్టీ నుంచి అనిత సస్పెండ్ చేయించారు. అనిత సస్పెండ్ చేయించిన ఆ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు పాయకరావుపేట టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది కాపు సామాజిక వర్గ నాయకులే. ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేయించడంతో అనిత మీద ఆగ్రహంతో ఉన్న కాపు సామాజిక వర్గ టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అనితను ఓడించడమే కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ అనితకు ఇస్తే ఊరూరు తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామంటూ సవాళ్ళు విసురుతున్నారు. స్థానిక పార్టీ నేతల హెచ్చరికల నేపథ్యంలో అనితకు పాయకరావుపేటలో మళ్లీ సీటు ఇస్తారో లేక గతంలో మాదిరిగా మరో చోటకు మార్చుతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ -
24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్.. రూ.10 వేల తక్షణ సాయం, వీల్ ఛైర్
శంఖవరం : పుట్టుకతోనే బుద్ధిమాంద్యం గల బాలుడి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఔదార్యం మరోమారు ప్రశంసలు అందుకుంది. గురువారం సీఎం పాయకరావుపేట పర్యటనలో రోడ్డు పక్కన విలపిస్తున్న ఓ తల్లిని గమనించడం, కాన్వాయ్ ఆపించి ఆమెతో మాట్లాడటం, రెండు గంటల్లోనే ఆమె కుమారుడు ధర్మతేజకు వికలాంగ పింఛన్ మంజూరు కావడం, తక్షణ సాయంగా రూ.10 వేలు, రూ.30 వేల విలువైన వీల్ ఛైర్‌ను కలెక్టర్ కృతికా శుక్లా ద్వారా అందజేయడం తెలిసిందే. (చదవండి: మానవత్వమై నిలిచి..) వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు. అతి తక్కువ సమయంలో తమ సమస్యను పరిష్కరించినందుకు బాలుడి తల్లిదండ్రులు నక్కా చక్రరావు, తనూజ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ) -
మానవత్వమై నిలిచి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక మహిళ.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఏడుస్తుండటం కనిపించింది. వెంటనే కాన్వాయ్‌ని ఆపించిన సీఎం.. దిగి నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. బుద్ధిమాంద్యం గల కుమారుడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని ఆమె విన్నవించింది. ఈమె కష్టం తీర్చండని సీఎం కలెక్టర్‌ను ఆదేశించిన రెండు గంటల్లోనే తక్షణ సాయంగా ఆమెకు రూ.10 వేలు అందింది. ఆ బాలుడికి వికలాంగ పింఛన్ మంజూరైంది. రూ.35 వేల విలువైన వీల్ ఛైర్ అందింది. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ/నక్కపల్లి: రోడ్డు పక్కన కన్నీటితో కనిపించిన ఓ తల్లిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఆపించి, వాహనం నుంచి కిందకు దిగి సాయం చేసిన తీరు ప్రశంసలందుకుంటోంది. గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో రోడ్డుకు ఇరువైపులా జనం జై జగన్ అంటూ జేజేలు పలుకుతున్నారు. వారి మధ్యలో ఒక మహిళ.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఏడుస్తుండటం సీఎం కంట పడింది. వెంటనే కాన్వాయ్‌ని రోడ్డుపైనే ఆపించి, ఆయన బస్సు దిగారు. అక్కడ ఉన్న వారంతా ఏం జరిగిందా అని ఉత్కంఠగా చూస్తుండగా.. సీఎం నేరుగా నడుచుకుంటూ ఆ మహిళ వద్దకు వెళ్లారు. ఎందుకు ఏడుస్తున్నావని ఆరా తీశారు. ‘నా పేరు తనూజ. మేం నిరుపేదలం. మాది ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామం. నా ఎనిమిదేళ్ల కుమారుడికి పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మీరే ఆదుకోవాలి’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. బాలుడి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి తీవ్రంగా చలించిపోయారు. సీఎం ఆదేశాల మేరకు పింఛన్ మంజూరు పత్రాన్ని అందిస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆ బాలుడికి తక్షణమే సాయం అందించాలని అక్కడే ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. తప్పకుండా ఆదుకుంటామని తనూజకు ధైర్యం చెప్పి ముందుకు సాగారు. మధ్యాహ్నం1.30 గంటలకు సీఎం అక్కడి నుంచి వెళ్లగా, రెండు గంటల వ్యవధిలోనే.. 3.30 గంటలకు బాధిత తల్లీ, కుమారుడిని కలెక్టర్ కాకినాడకు రప్పించారు. తక్షణ సాయంగా రూ.10 వేలు తనూజకు అందజేశారు. వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా మంజూరు పత్రాన్ని అందించారు. బాలుడికి నిత్యం ఉపయోగపడేలా రూ.35 వేలు విలువ చేసే వీల్‌చైర్‌ను అందజేశారు. బాలుడి పరిస్థితి తన దృష్టికి రాగానే రెండు గంటల వ్యవధిలోనే సాయం అందించి ఆదుకున్న సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తనూజ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం మానవత్వంతో స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాకు పులి టెన్షన్ మొదలైంది. కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించింది. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే.. కాగా, సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకున్నట్లు సమాచారం. అదే సమయంలో బెండపూడి నుంచి రొయ్యల ఫ్యాక్టరీ బస్సులో ఇళ్లకు వెళుతున్న కార్మికులు దీనిని గుర్తించారు. బస్సు లైట్ల కాంతికి కొంతసేపు పులి రహదారిపైనే ఉన్నట్లు వీరు తెలిపారు. తర్వాత తాండవ నదిలోకి దిగేందుకు మార్గం కనిపించకపోవడంతో కుచ్చులకొండపైకి వెళ్లినట్లు పేర్కొన్నారు. -
తప్పుడు ప్రచారం ఆపండి
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): తాను వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్సీపీకి వీర విధేయుడినని, సీఎం జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడారు. సోమవారం తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు, చానళ్లు వక్రీకరించాయని చెప్పారు. తాను హింసావాదిని కాదని.. సౌమ్యవాదినని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన తన మాటలను వేరే రకంగా ప్రచారం చేశారని వాపోయారు. 2009లో వైఎస్ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ధర్మం పక్కన నిలబడటం కోసం.. వైఎస్ జగన్‌కు అండగా నిలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచానంటే రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం చేసిన సేవలే కారణమన్నారు. వైఎస్ జగన్ దయ వల్లే ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. అలాంటి నేను మంత్రి పదవి ఇవ్వనందుకు హింసావాదిగా మారతానని ఎలా అంటానని ప్రశ్నించారు. మంత్రి పదవులిచ్చే విషయంలో సీఎం జగన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని.. ఆయన నిర్ణయం శిరోధార్యమన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి మంగతాయారు, నాయకులు పి.ఈశ్వరరావు, గొర్ల బాబూరావు, శీరం నర్సింహమూర్తి, నూకినాయుడు, సాయి, వెంకటసూరి, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మోసగాడి చెర నుంచి 22 మందికి విముక్తి
నక్కపల్లి/పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరిట సంస్థను నిర్వహిస్తూ యువతీ, యువకుల్ని బందీలుగా మార్చుకున్న మోసగాడి ఆట కట్టింది. అతని చెరలో ఉన్న వారందరికీ విముక్తి కల్పించిన అధికారులు అతడి భవంతికి శనివారం తాళం వేశారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులు, నలుగురు యువకులు అతడి భవంతిలో బందీలుగా ఉన్నట్టు గుర్తించారు. తమ ఇళ్లకు పంపమని కోరిన 8 మందిని శుక్రవారమే ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య వారి స్వస్థలాలకు పంపించారు. మిగతా 14 మంది తాము భవనం ఖాళీ చేసే ప్రసక్తి లేదని, ఇక్కడే ఉంటామని మొండికేయడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం వారిని కూడా విశాఖ కేజీహెచ్‌లోని దిశ షెల్టర్ హోమ్‌కు తరలించారు. వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధార్ హోమ్‌కు తరలిస్తామని, మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు చెప్పారు. సంస్థ నిర్వాహకుడైన అనిల్‌కుమార్ అలియాస్ ప్రేమదాసు, అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమదాస్‌కు సహకరించిన రాజేశ్వరి అలియాస్ లిల్లీ పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు. -
ఇక్కడా ఓ డేరా బాబా!
Fake Baba in Visakha Payakaravupeta: విశాఖ జిల్లా పాయకరావుపేటలో దేవుడి పేరుతో రాసలీలలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ కృష్ణలంకకు చెందిన అంబటి అనిల్ రైల్వేలో కారుణ్య నియామకం కింద టికెట్ కలెక్టర్‌గా చేరాడు. ఐదేళ్ల క్రితం బెజవాడ నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేటకు మకాం మార్చి, ప్రేమదాసు పేరుతో బాబాగా మారాడు. భక్తుల నుంచి భారీగా విరాళాలు సేకరించి, పాయకరావుపేట శ్రీరంపురంలో అధునాతన భవంతి నిర్మించాడు. యువతీ యువకులను లోబరుచుకొని ఆ భవనంలో వారితో వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని చేష్టలు భరించలేకపోయిన ఆ యువతి, మరికొందరు యువకులు గురువారం పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 344, 354, 506, 493, 374, 312, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు పాయకరావుపేట సీఐ నారాయణరావు తెలిపారు. గురువారం రాత్రి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠచందోల్ ఆ భవనాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న యువతుల నుంచి సీడీపీవో, పోలీసులు స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. వారిలో కొంతమంది ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వెంటనే స్పందించారు. సీఐ నారాయణరావు, తహసీల్దార్ పి.అంబేద్కర్, ఎంపీడీవో సాంబశివరావు, ఎస్ఐ ప్రసాద్, సీడీపీవో నీలిమలతో సమావేశం ఏర్పాటు చేశారు. వీరంతా ఒక కమిటీగా ఏర్పడి, భవనంలో ఉన్న వారిని బంధువులకు అప్పగించాలని ఆదేశించారు. -
పాయకరావుపేటలో తళుక్కు.. జమధాని సొగసు
పువ్వు వంటి పడుసు.. నవ్వుతూ సింగారిస్తే.. ఏచీరకు ఎంతందము ఎదురొచ్చెనో తెలియక సిక్కొచ్చి పడ్డాదిలే.. సిన్ని రామసిలక.. అంటూ బంగారిమామ పాటలా.. ఈ చీరల సొగసు చూస్తే పాడాలనిపిస్తుంది.. ఎవరికైనా..! తళుక్కుమనే జమధాని చీరల తయారీలోప్రసిద్ధి పొందిన పాయకరావుపేట చేనేతకార్మికుల కళాత్మకత చూపరులను కట్టిపడేస్తుంది.. పాయకరావుపేట: జమధాని చీరల తయారీ రోజురోజుకీ కొంగొత్త అందాలను సంతరించుకుంటుంది. పట్టణంలో సుమారు 300 కుటుంబాలు చీరల తయారీలో ప్రావీణ్యం పొంది ఉన్నారు. సుమారు 110 చీరలు తయారు చేసే మగ్గాలు ఉన్నాయి. పాయకరావుపేట జమధాని చీరలకు మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. 1994 నుంచి ఇక్కడ జమధాని చీరలు తయారు చేస్తున్నారు. ఇదీ ప్రత్యేకత.. ఆల్ ఓవర్, బోర్డర్ డిజైన్, పల్లా బుట్టా అనే ప్రధాన రకాల జమధాని చీరలు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. పూర్తి డిజైన్‌తో ఖరీదైన చీరలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. అంచులతో, ఆల్ఓవర్ డిజైన్ చీరలు ఎంతో ఆకట్టుకుంటాయి. చీరకు పది రోజులు... మగ్గానికి ముగ్గురు చొప్పున చీరను తయారు చేయడం ప్రారంభిస్తే పూర్తికావడానికి సుమారు 10 రోజులు పడుతుంది. అదే విధంగా నెలకు కేవలం 300 వరకు ఇక్కడ ప్రత్యేకమైన చీరలను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన చీరలను హైదరాబాద్, ముంభై, ఢిల్లీ, విశాఖపట్నం, శ్రీకాకుళం, బెంగుళూరు, చెన్నైకి ఎగుమతి చేస్తుంటారు. సుమారుగా రూ.3500 నుంచి రూ. 7000 వరకు ఖరీదు గల చీరలు ఇక్కడ నుంచి ఎగుమతి అగుతున్నాయి. తయారీ, మార్కెటింగ్ ఇలా జమధాని చీరల తయారీకి ముడి సరకు విజయవాడ నుంచి వస్తుంది. నేషనల్ డెవలప్‌మొంట్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని తయారీదారులు కోరుతున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న చీరలు మార్కెట్లో అమ్మకాలు సాగించుకోవలసి వస్తుంది. పాయకరావుపేటలో తయారైన జమధాని చీరలు ఢిల్లీ, బెంగలూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పెద్ద పెద్ద షాపులకు వెళ్తున్నాయి. పట్టు, ముడి నూలు రేటు పెరగడం కారణంగా అధిక సంఖ్యలో చీరలు తయారు జరగడం లేదు. నెలకు చేనేత కార్మికురాలు ఆరు చీరలు తయారు చేస్తారు. నెలకు రూ.6 వేలు వరకు మజూరి వస్తుంది. రూ.3 వేల నుంచి రూ. 25 వేలు వరకు ధరల్లో చీరలు తయారు చేస్తున్నారు. ప్రతి నెలా 100 చీరలు వరకు ఇక్కడ నుంచి ఆర్డర్ల మేరకు దుకాణాలకు పంపించడం జరుగుతుంది. చీరల తయారీకి ఆప్కో ద్వారా రాయితీలు కల్పించలేదు. ఆప్కో సంస్థ ద్వారా రాయితీలు, ముడి సరకు సరఫరా చేస్తే ఎక్కువగా చీరలు తయారీకి, ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టు, నూలు రేటు పెరిగింది జమధాని చీరల తయారీకి అవసరమైన పట్టు, నూలు రేటు పెరిగింది. ఆప్కో సరఫరా చేయడం లేదు. ఎగుమతులు కూడా తగ్గాయి. తయారీ దారులు ఉన్నారు. ముడి సరుకు సరఫరా జరగడం లేదు. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. –రొబ్బి సుబ్రమణ్యం, జమధాని చీరల టెక్నికల్ మాస్టర్, పాయకరావుపేట ముడి సరుకు ఇస్తే మేలు చీరలు తయారు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల సరిపడా ఆదాయం లేదు. ముడి సరకు సరఫరా చేస్తే చీరలు పెద్ద మొత్తంలో తయారు చేసే వీలుంది. ఇక్కడ చీరల తయారీ దారులు ఎక్కువగానే ఉన్నారు. ముడి సరుకు సరఫరా కాక ఉపాధి కరువైంది. –అల్లంక భ్రమరాంబ, చీర తయారు చేసే మహిళ -
క్షణాల్లో వ్యాపించిన మంటలు, ఆలస్యం అయ్యుంటే..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఉన్న బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. అయితే డ్రైవర్ అప్రపమత్తతో ప్రమాదం తప్పింది. పాయకరావుపేట జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద ఈ ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం ఒడిషా నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాయకరావుపేట వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ క్రమంలోనే బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడం ప్రారంభమైంది. అప్రత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించారు. చూస్తుండగానే బస్సులో మంటలు అంతకంతకూ ఎక్కువయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ ప్రమాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
చంద్రబాబును ఒకటే కోరుతున్నా..
సాక్షి, పాయకరావుపేట: నక్కపల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేటలలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేష్టలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాలు పంపిణీని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలను అడ్డుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబును ఒకటే కోరుతున్నా..అభివృద్ధిని అడ్డుకోవద్దు ప్రజల తీర్పును గౌరవించాలి' అంటూ హితవు పలికారు. (కుల, మతాలకు అతీతంగా సంక్షేమం: సజ్జల) -
గౌతమ్ మోడల్ స్కూల్లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని పాయకరావుపేట గౌతమ్ మోడల్ స్కూల్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇన్వర్టర్లో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా గురువారం నాగుల చవితి రోజున విద్యార్థులకు సెలవు కావడంతో ప్రమాదం తప్పింది. అయితే స్కూల్ వాతావరణాన్ని పరిశీలించిన అధికారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా లేవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాయకరావుపేట బహిరంగ సభలో వైఎస్ జగన్
-
పొరపాటున బాబుకు ఓటేస్తే.. అంతే సంగతి : వైఎస్ జగన్
సాక్షి, పాయకరావుపేట (విశాఖపట్నం) : ‘చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. ఆర్టీసీ, కరెంట్ కూడా ఏమి మిగల్చడు.. అన్నీ ప్రైవేట్ పరం చేస్తారు.. చార్జీలు పెంచేస్తారు. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు సహా ఇక ఏమి మిగలవు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని.. ఆయన అబద్దపు వాగ్ధానాలకు మరోసారి మోసపోవద్దని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పాయకరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్ల బాబూరావు , అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డాక్టర్ కాండ్రేగుల సత్యవతిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి.. ‘పాదయాత్రలో ఈ ప్రాంత రైతన్నలు చెప్పిన సమస్యలను మర్చిపోలేదు. సహకార సంఘంలోని చక్కెర ఫ్యాక్టరీలు రూ.32 కోట్ల నష్టాలతో.. 9 నెలల జీతాలు అందకుండా నడుస్తున్నాయి. ఈ సీజన్లో రైతులకు ఒక్క రూపాయి చెల్లించలేదు. సహకార ఫ్యాక్టరీలు మూతపడుతున్నా చంద్రబాబుకు కనిపించడం లేదు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో టన్నుకు రూ.4 వేల బోనస్ వచ్చేది. ఇవ్వాళ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. వరాహ, తాండవ నదుల్లో ఇసుక ఏ మాత్రం లేకుండా దోచేస్తున్నారు. ఇసుక ఫ్రీ అంటూ చెవుల్లో పువ్వులు పెడ్తున్నారు. లారీ ఇసుకు రూ. 40 వేలు ఉంది. నీరు చెట్టు కింద గ్రామాలను గ్రామాలను దోచెస్తున్న పరిస్థితి. ఎలాంటి ప్రమాణాలు లేకుండా చెరువులను తాటిచెట్టంతా తవ్వేసారు. పాయకరావుపేటలో డిగ్రీ కాలేజీ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. తాగు నీటి కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. పొరపాటున అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. నారాయణ స్కూల్లో ఎల్కేజీ చదవాలన్నా రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ ఫీజు రూ. లక్ష చేస్తారు. ఆర్టీసీ, కరెంట్ కూడా మిగల్చడు.. అన్నీ ప్రయివేట్ పరం చేస్తాడు. కరెంట్, ఆర్టీసీ, పెట్రోల్ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. రేషన్ కార్డులు, పెన్షన్లు కుదించేశాడు. ఇప్పుడిస్తున్న పెన్షన్లను కూడా మళ్లీ అధికారంలోకి రాగానే తగ్గించేస్తాడు. భూములు లాగేస్తాడు. ఇప్పటికే వెబ్ ల్యాండ్ పేరుతో తన అత్తగారి సొత్తంటూ పేదల భూమలు లాగేస్తున్నాడు. పొరపాటున బాబు అధికారంలోకి వస్తే.. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు, సహా ఇక ఏమీ మిగలవు. జన్మభూమి కమిటీలదే రాజ్యం.. పొరపాటున చంద్రబాబుకు ఒటేస్తే.. మీరు ఏ సినిమా, టీవీ చానెల్ చూడాలన్నా.. ఏ పేపర్ చదవాలన్నా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా వారే చెబుతారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్ధానాలు.. పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తాడు. చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని కోరుతున్నా. 1994 ఎన్నికల ముందు మద్యపాన నిషేదం.. కిలో రెండు రూపాయల బియ్యమని చెప్పి.. ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో మద్యపాన నిషేధం ఎత్తేశారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఐదు రూపాయలు చేశారు. ఇదే పెద్దమనిషి మళ్లీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచేస్తాడు. సున్నా వడ్డీ రుణాలుండవ్. రైతులకు రుణాలే ఇవ్వరు. ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది.. ఇంకా పూర్తిగా లేకుండా పోతుంది. 108,104లు కనుమరుగవుతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అటకెక్కుతుంది. ఫీజులు ఆకాశానికి పడుగెత్తుతాయి. చంద్రబాబును వ్యతిరేకించే వారిని ఎవ్వరిని బతుకనివ్వరు. గ్రామం నుంచి రాజధాని వరకు తన పోలీసులే కాబట్టి కేసులు ఉండవు. సీబీఐ, సీఐడీని రానివ్వరు. పత్రికలు, టీవీలు ఇప్పటికే అమ్ముడుపొయ్యాయి. చనిపోయినా ఒక్క వార్త రాదు. వారే చంపించి పైగా బాధిత కుటుంబంపై నెట్టేస్తారు. చివరి మూడు నెలలు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలు నమ్మవద్దని కోరుతున్నా. వీటన్నిటిని నమ్మితే.. నరమాంసం తినే రాక్షసిని నమ్మినట్టే. ఒకసారి మోసపోయాం.. మళ్లీ అవే మోసాలు, అబద్దాలు చంద్రబాబు చెబుతున్నారు. ఈ సారి కూడా మోసపోతే మనమెవ్వరం ఉండం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయాల్లో రాజకీయ నాయకుడు పలానా చేస్తానని చెప్పి... అధికారంలోకి వచ్చాక చేయకపోతే రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అన్న ఉన్నాడని చెప్పండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
పాయకరవుపేటలో తారాస్థాయికి చేరిన టీడీపీ వర్గ విభేదాలు
-
పాయకరావుపేట టీడీపీలో విభేదాలు
-
హెరిటేజ్ ప్రీజర్‌లో వన్యప్రాణుల మాంసం!
మృగయా వినోదం పేరిట వన్యప్రాణుల వేట.. వాటి మాంసంతో విందు వినోదాలు ఒకనాడు హోదాకు చిహ్నాలు..నేటి సమాజంలో వన్యప్రాణుల వేట ఓ నేరం.. కానీ కొందరు బడాబాబులు తమ హోదాను చాటుకునేందుకు ఇదే దుస్సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు..వన్యప్రాణుల మాంసంతో మంత్రులు, ఇతర ప్రముఖులను ఖుషీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ అమాత్యుడి ముఖ్య అనుచరుడి కుటుంబ ఫంక్షన్ కోసం.. ఇలా వన్యప్రాణుల మాంసాన్ని తరలించడం.. ఈ ప్రాంతంలో పాతుకుపోయిన ఈ దుస్సంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చింది. విడ్డూరమేంటంటే.. వన్యప్రాణుల మాంసాన్ని సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రీజర్ బాక్స్‌లో తరలించడం..! అయితే కథ అడ్డం తిరిగి.. అడ్డగోలుగా తరలిస్తున్న ఈ మాంసం నిల్వలు అటవీ అధికారులకు దొరికిపోవడం.. వారి విచారణలో కఠోర వాస్తవాలు వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. పాయకరావుపేట దుర్గాకాలనీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున హెరిటేజ్ ప్రీజర్ బాక్స్‌లో పెట్టి స్కార్ఫియో వాహనంలో తరలిస్తున్న మూడు సంచుల వన్యప్రాణుల మాంసంతో పాటు కణుజు తోలు, కాళ్లు పట్టుబడిన కేసులో నిందితులంతా టీడీపీ నేతలే..మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నెట్టి కృష్ణంరాజు కుటుంబ ఫంక్షన్ కోసమే ఈ మాంసాన్ని తరలిస్తున్నట్టు పట్టుబడిన వారు చెప్పడంతో పరారీలో ఉన్న కృష్ణంరాజును ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ఆదివారం ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు 70 కిలోల వన్యప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం స్వాధీనం చేసుకుంది. వన్యప్రాణులైన కణుజు, అడవి పంది, అడవి గొర్రెలను చంపి.. ఆ మాంసాన్ని సీఎం చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్రీజర్ బాక్సులో తరలించడం కలకలం రేపింది. మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నెట్టి కృష్ణంరాజుకు చెందిన కుటుంబ ఫంక్షన్ కోసమే ఈ మాంసాన్ని తరలిస్తున్నట్టు అటవీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు నిందితులు చెప్పుకొచ్చారు. వారి విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికొస్తున్నాయి. చక్కెర కర్మాగారం వెనుక కూత వేటు దూరంలో ఉన్న తోటల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఓ భూస్వామికి గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడే ఆదివారం భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరయ్యే ప్రముఖులకు వడ్డించేందుకు మూడు రకాల వన్యప్రాణులను వేటాడినట్లు సమాచారం. అక్కడే వేటాడారా? కోటవురట్ల మండలం పందూరు, అల్లుమియ్యపాలెం ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడి.. మాంసాన్ని వాహనంలో విందు వేదిక వద్దకు తరలిస్తూ దొరికిపోయారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఓ వర్గం నేతలు జిల్లా అటవీ అధికారులకు ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతున్నప్పటికీ ఏనాడు వీటివైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు ఇప్పుడు మాటు వేసి పట్టుకోవడానికి టీడీపీలని ప్రత్యర్ధి వర్గీయులు చేసిన పక్కా ఫిర్యాదే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే తంతు కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజుపై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసే కృష్ణంరాజుకు ఇటువంటి విందుల నిర్వహణలో సిద్ధహస్తుడిగా పేరుంది. ఆదివారం మాంసాన్ని తరలిస్తూ పట్టుబడ్డ వాహనం(స్కార్పియో వాహనం నెం:ఎపి.35డి.5678) కూడా ఆయనదే కావడం గమనార్హం. కాగా, మారుమూల తోటలో ఉన్న గెస్ట్ హౌస్‌లో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు స్థానికంగా ఉన్న చోటా మోటా నాయకులకు వన్యప్రాణుల మాంసంతో విందు ఇచ్చే తంతు చాలా ఏళ్ల నుంచి నడుస్తోందని అంటున్నారు. రెండు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన మంత్రికి ఇదే గెస్ట్‌హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మారుమూల గెస్ట్ హౌస్‌కు, ఇక్కడి తోటల్లో జరిగే పంక్షన్లకు మంత్రులు పదే పదే రావడం వెనుక మర్మం ఇదేనని అంటున్నారు. సెలవులో డీఎఫ్‌వో? వాస్తవానికి జిల్లా అటవీశాఖాధికారి(డీఎఫ్‌వో) సెల్వంకు వచ్చిన సమాచారంతోనే యలమంచిలి అటవీరేంజ్ అధికారులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి డీఎఫ్‌వో ఆ కేసు గురించి మాట్లాడేందుకు సుముఖత చూపడం లేదు. దాని గురించి అడిగినవారికి సోమవారం నుంచి సెలవులో ఉన్నానని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే డీఎఫ్‌వో ఆ కేసు విషయంలో ఎవరితోనూ మాట్లాడటం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. హెరిటేజ్ ఫ్రిజ్ ఎక్కడిది? వన్యప్రాణుల మాంసాన్ని హెరిటేజ్ ఫ్రిజ్‌లో తరలించడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపారసంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులో తరలిస్తే అధికారులెవ్వరూ తనిఖీ చేయరన్న ధైర్యంతోనే నిందితులు దాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. తునిలో ఓ టీడీపీ నేతకు చెందిన సాయిరామ్ పార్లర్ నుంచి కూల్‌డ్రింక్‌లు భద్రపరిచేందుకు ప్రిజ్ కావాలని అడిగి మాంసం తరలించేందుకు ఉపయోగించినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి సదరు సాయిరామ్ పార్లర్‌కు హెరిటేజ్ డీలర్షిప్ రద్దు అయినట్టు తెలుస్తోంది. రూ.6వేల రూపాయల బకాయి పడిన సాయిరామ్ పార్లర్ యజమాని హెరిటేజ్ డీలర్‌షిప్‌ను వదిలేసినట్లు సమాచారం. అలా డీలర్షిప్ వదిలేసిన తర్వాత ఫ్రిజ్‌ను తీసుకువెళ్ళకుండా హెరిటేజ్ సంస్థ ఎందుకు వదిలేసిందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. డీలర్షిప్ రద్దయిన తర్వాత బాక్స్‌లపై హెరిటేజ్ స్టిక్కర్‌ను తీసివేసే ఆనవాయితీ ఉందని, అయినా సరే అలా ఎందుకు వదిలేశారన్నది కూడా అనుమానంగానే ఉంది. ఆ ముగ్గురికీ రిమాండ్ యలమంచిలి: వన్యప్రాణుల మాంసాన్ని తరలిస్తూ దొరికిపోయిన నిందితులు తుని మండలం మర్లపాడు గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్, సీతారామపురం గ్రామానికి చెందిన కోలా సత్యశివలోక్నా«థ్, కె.నవీన్‌కుమార్‌లను సోమవారం యలమంచిలి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవిప్రసాద్ వన్యప్రాణుల వేట, మాంసం తరలింపు కేసులో ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చుక్కల రవిప్రసాద్ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని చెప్పారు. తాండవ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గెస్ట్ హౌస్‌లో జరిగే విందులపై ఇకపై దృష్టి పెడతామని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చంద్రబాబు 36 సార్లు మాటమార్చారు : పవన్
సాక్షి, పాయకరావుపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై 36 సార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోరాటయాత్రలో భాగంగా శుక్రవారం పాయకరావుపేట బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) హయాంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కనీస ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు. సామాజిక వెనుకబాటు తనాన్ని ప్రజల్లోకి పదునైన రచనలతో తీసుకెళ్లిన గురజాడ అప్పారావు జన్మించిన చోట అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు నదులను సైతం కబ్జా చేస్తున్నారని అన్నారు. విశాఖపట్టణం-చెన్నై కారిడార్ పేరుతో వేల ఎకరాలను సేకరించారని, పరిశ్రమల కోసం భూతద్దం వేసి వెతికినా దొరకడం లేదని మండిపడ్డారు. ఇక వెనుకబడిన వర్గాల అభివృద్ధి జాడే లేదని, పాయకరావుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట నేటికీ నెరవేరలేదని అన్నారు. ఉత్తరాంధ్రలో వైద్య వ్యవస్థ నిద్రావస్థలో ఉందని ఆవేదన వెలిబుచ్చారు. -
ఎంత పని చేశావు కన్నా..
ఎస్.రాయవరం (పాయకరావుపేట): తల్లి మందలించిదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన కరెడ్డి సాయి అస్రిద్ (13) శనివారం ఉదయం అప్పటిదాక ఆడుకుంటూనే ఉన్నాడు. చెల్లెల్ని ఏడిపిస్తున్నావెందుకని తల్లి కేకలు వేయడంతో చిన్నబుచ్చుకొని లోనికి వెళ్లాడు. పనిలోపడి తల్లి పట్టించుకోలేదు. తర్వాత చూడగా పక్క గదిలోనికి వెళ్లి ఫ్యాను ఉక్కుకు చీర బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలోకి వెళ్లిన కుమారుడు ఏమి చేస్తున్నాడని చూడగా ఉరికి వేలాడుతూ అపస్మారక స్థితిలో కనిపించాడు. హుటాహుటిన నక్కపల్లి 30 పడకల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణం పోయినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు సాయి అస్రిద్ తిమ్మాపురం శ్రీవిశ్వశాంతి కాన్వెంట్లో 8 వ తరగతి చదువుతున్నాడు. ఒక్కగాని ఒక్క కుమారుడు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో తండ్రి రమణ కుప్పకూలిపోయారు. తల్లి గుండె పగిలేలా రోదిస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్.రాయవరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. అస్రిద్ పాఠశాలలో మొదటి తరగతి నుంచి తెలివైన విద్యార్ధిగా గుర్తింపు పొందాడని ఉపాధ్యాయులు, మిత్రులు తెలిపారు. ఇదే పాఠశాలలో తల్లి నాగమణి టీచర్‌గా పనిచేస్తున్నారు. -
నాట్య విలాసం
నృత్యవిన్యాసం సమ్మోహితులను చేసింది.. నాట్య విలాసం ప్రేక్షకులను అలరించింది. శ్రీప్రకాష్ విద్యాసంస్థలో శుక్రవారం స్పిక్మెన్ నాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ ఎమాంగ్ ది యూత్ సంస్థ దేశంలో ఉన్న విద్యా సంస్థల్లోని యువతకు నాట్య కళ పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో నత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. స్పిక్మెన్ సంస్థ తరపున వచ్చిన కళాకారులు శ్రీప్రకాష్ విద్యా సంస్థలో ప్రదర్శన ఇచ్చారు. వీరు చేసిన ఒడిశా నత్యం గోట్టిపౌ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. –పాయకరావుపేట -
అక్కడ అ అంటే అవినీతి
ఇటు పాయకరావుపేట.. అటు తుని.. మధ్యలో తాండవ వంతెన. జిల్లాలు వేరైనా.. దాన్నే వారధిగా చేసుకుని ఈ రెండూ సామాజికంగా, సాంస్కతికంగా జంట పట్టణాలుగా అనుబంధాన్ని పెనవేసుకున్నాయి. ఆ అనుబంధం అక్కడితో ఆగలేదు.. రెండు నియోజకవర్గాలస్థాయికి విస్తరించింది.. పెడదారి పట్టింది. మునుపెన్నడూ లేని విధంగా గత రెండేళ్లలో అవినీతి, అక్రమాలు జంట నియోజకవర్గాలను అక్టోపస్‌లా కబళించాయి. అధికార దన్నుతో అడ్డగోలు వసూళ్లు, ఇసుక దోపిడీ, భూ దందాలు, దురాక్రమణలు, మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు, సెటిల్మెంట్లు, ఇష్టారాజ్యంగా ప్రభుత్వోద్యోగుల బదిలీలు.. అబ్బో.. ఇంకా చెప్పాలంటే.. ప్రతి పనిలోనూ కాసుల వేటతో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. సరే.. తూర్పుగోదావరి జిల్లా తునిలో అవినీతి తుట్టె గురించి మనకెందుకు గానీ.. మన విశాఖ జిల్లా పాయకరావుపేటలో రెండేళ్లుగా ఏం జరుగుతుందో చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అర్ధంతరంగా అందిన అధికారం, నడమంత్రపు సిరి, దానికితోడు తలబిరుసుతో చెలరేగిపోతున్న ఓ పచ్చ నేత పైత్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మనం చిన్నప్పుడు అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని చదువుకున్నాం. కానీ అక్కడ మాత్రం ఇప్పుడు అ అంటే అవినీతి,. ఆ అంటే ఆనకట్ట లేని అక్రమాలు అంటూ కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. అ.. ఆ..లకు వారెలా కొత్తగా నిర్వచించారో.. ఈ వారం విశాఖ తీరంలో తెలుసకుందాం.. రండి.. –జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన దరిమిలా ఆ పదేళ్ల ఆకలిని తీర్చుకునేందుకు ఈ రెండేళ్ల కాలంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందినకాడికి ఆబగా దోచేశారు. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కుంటూ రూ.కోట్లు కూడగట్టేశారు. పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఇందులో మినహాయింపేమీ లేదు. అయితే ప్రత్యేకించి ఓ టీడీపీ నేత వ్యవహారశైలి మాత్రం ఆ పార్టీ శ్రేణులకే మింగుడుపడటం లేదు. అడ్డగోలుగా రూ.కోట్లు కూడగడుతూనే అధికారులను, ఉద్యోగులను, పార్టీ కార్యకర్తలను ఏ మాత్రం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ ఏవగింపు కలిగిస్తోంది. మండలాలు, గ్రామాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకుని దందాలు చేయడం సదరు నేత ప్రత్యేకత. చిన్న పనికి కూడా రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఉద్యోగుల బదిలీలు మొదలుకొని అంగన్వాడీ కార్యకర్తలు, చివరికి ఆయాల నియామకాలకూ డబ్బులు ముట్టజ్పెపాల్సిందే. –ఎస్.రాయవరం మండలంలో ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలు సదరు నేత పుట్టిన రోజు పురస్కరించుకుని తలో కొంత వేసుకుని బంగారం కొనుగోలు చేసి గిప్ట్గా ఇచ్చారు. అంతే.. అప్పటివరకు వేధింపులతో అల్లాడిపోయిన వారికి గిప్ట్ ఇచ్చిన తర్వాత ఒకింత ఉపశమనం లభించింది. – మద్యం షాపులవారు ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్న ఆ నేత ఒత్తిళ్లకు ఇటీవలే వ్యాపారులు తలొగ్గారు. గత నెల తలో యాభై వేల పోగేసి మొత్తం రూ.16 లక్షలు సమర్పించుకున్నారని అంటున్నారు. ఇలా ప్రతి నెలా ఇవ్వాలంటే మాత్రం సాధ్యం కాదని తెగేసి చెప్పేశారు. అయితే ఎంతోకొంత ఇవ్వకుంటే అధికారం తలకెక్కిన ఆ నేత పగబట్టి ఏం చేస్తారోనన్న ఆందోళన కూడా మద్యం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. అందుకే మద్యం సిండికేట్లు ఎంఆర్పీని పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన ధరలకు మద్యం విక్రయాలు చేసేస్తున్నారు. గ్రామాల్లో బెల్టుషాపులూ రెట్టింపయ్యాయి. ఇసకాసుర అవతారం తాండవ, వరహా నదులను చెర పట్టిస్తూ అడ్డగోలుగా చేస్తున్న ఇసుక దోపిడీ ఆయా ప్రాంతాల్లో పరాకాష్టకు చేరింది. పందూరు ఇసుక రీచ్‌ను గ్రామస్తులు వేలం పాడుకుంటే వారి నుంచి రూ.3 లక్షలు, గొట్టివాడ రీచ్ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎయిర్‡పోర్టు, అచ్యుతాపురం ప్రాంతాలకు ఇసుక తరలింపు విషయంలోనూ భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ నేత అండదండలతోనే నిత్యం ఈ రెండు నదుల్లో వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోందనేది అక్కడ బహిరంగ రహస్యం. ఇసుక దోపిడీ విషయంలో టీడీపీకే చెందిన తుని నాయకుడితో సదరు నేతకు చాన్నాళ్లు విభేదాలు నడిచాయి. ఎట్టకేలకు ఇటీవల ఇరు జిల్లాల పార్టీ పెద్దలు రాజీ కుదిర్చిన నేపథ్యంలో వివాదాలు లేకుండా ఎవరికి అందినంత వారు దోచేసుకుంటున్నారు. ప్రతి పనికీ ఓ లెక్కుంది.. దానికో రేటుంది జాబు రావాలంటే బాబు రావాల్సిందే.. ఎన్నికల ముందు ఇదే టీడీపీ నినాదం. కానీ పాయకరావుపేటలో ఇప్పుడు ఆ నినాదం.. ‘జాబు రావాలంటే జేబు నిండాల్సిందే’ అన్నట్లు మారిపోయింది. కె.వెంకటాపురం, పాములవాక, కోటవురట్లలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో టీచర్ల పోస్టులకు రూ.30 వేలు చొప్పున డిమాండ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. నీరు చెట్టు పథకం ద్వారా నియోజకవర్గానికి మంజూరైన కోట్లాది రూపాయల నిధుల్లో కమీషన్లు ఇవ్వాలంటూ అదే పనిగా అధికారులు, కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ పధకం ద్వారా మంజూరైన పనులను కమీషన్లు ఇచ్చినవారికే కేటాయించారని చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయం నుంచి నెలవారీ మామూళ్లు ఇవ్వనందుకు.. పైగా ఈ విషయం బయట ప్రచారం చేసినందుకు ఓ తహశీల్దార్, పలువురు వీఆర్వోలు అర్ధంతరంగా బదిలీ అయ్యారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ఎన్నాళ్లుగానో నియోజకవర్గంలోనే పాతుకుపోయిన ఓ డిఫ్యూటీ తహశీల్దార్ నుంచి రెండు లక్షలు తీసుకుని ఆయన బదలీని అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. హడలెత్తిపోతున్న మహిళా అధికారులు అధికారంలో ఉన్న నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారంటే ఉద్యోగులు ఒకింత భయభక్తులతోనే ఉంటారు. కానీ సదరు నేత వస్తే మాత్రం ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడే ఆ నేత తీరుతో అల్లాడిపోతున్నారు. ఆ మధ్య పాయకరావుపేటలోని ఎండీవో కార్యాలయానికి ఆ నేత వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి బదిలీపై వచ్చిన పంచాయతీరాజ్ మహిళా ఉద్యోగి సంతకాలు చేసే హడావుడిలో ఆ నేత రాకను గమనించలేదు. అంతే.. ‘నేనొచ్చినా పట్టించుకోవా.. నీసంగతి చూస్తా.. మళ్లీ నిన్ను కొండలెక్కించేస్తా’ అని వీరంగం వేసేశారట. ఇక నక్కపల్లి ఐసీడీఎస్ మహిళా అధికారిని సైతం ఇదేవిధంగా వేధింపులకు గురిచేశారని అంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఎంపిక మొత్తం తనకు చెప్పి చేయాలని నేత హుకుం జారీ చేశారు. అది సాధ్యం కాదని, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీల ద్వారా ఎంపిక చేస్తారని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఆ మహిళా అధికారిపై నోరుపారేసుకున్నారని అంటున్నారు. ఎస్.రాయవరం మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి నక్కపల్లి మండలంలో లేని భూమిని ఉన్నట్టుగా చూపించి రికార్డులు తయారు చేయాల్సిందిగా ఆ నేత అధికారులపై ఒత్తిడి చేశారు. అలా కుదరదన్న అధికారులపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్నారట. భూ సేకరణలోనూ కాసుల వేట నక్కపల్లి మండలంలో జరుగుతున్న భూసేకరణలో సదరు నేత నోట్ల కట్టలు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను పార్టీ కార్యకర్తల పేరిట మార్చడం, ఆపై పరిహారం నొక్కేయడం అక్కడ తంతుగా మారింది. సదరు నేత బినామీ ఒకరు నక్కపల్లి మండలం సీతంపాలెం సర్వే నెం 1లో ఉన్న 240 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్రభుత్వ పెద్దలకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ భూమిని ఎన్నాళ్ల నుంచో సాగుచేస్తున్న రైతులకు డబ్బు ఆశ చూపి కొనుగోళ్లకు బేరం పెట్టారు. ఒక్కో రైతుకు రూ.50 వేలు చొప్పున అడ్వాన్స్ కూడా చెల్లించారు. అడ్వాన్సులు ఇచ్చిన రైతులకు డీఫారం పట్టాలు మంజూరు చేయాలని మండలస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పట్టాలు వచ్చిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు పక్కా ఆధారాలు ఉంటాయని భావించారు. అయితే సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పట్టాలు ఇవ్వలేమని ఓ తహశీల్దార్ అడ్డం తిరిగారు. అంతే ఆ అధికారిని బదిలీ చేయించిన సదరు నేత ఇప్పటికీ ఆ భూముల విక్రయాల కథను కొలిక్కి తీసుకురాలేకపోయారు. కానీ ఆ భూముల పేరిట పెద్దమొత్తంలో డబ్బులు కూడబెట్టుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇక కౌలురైతులుగా సదరు నేత అనుచరులు లేని భూమి ఉన్నట్టుగా రుణాలు పొందారన్న ఆరోపణలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. అవినీతిపై ప్రశ్నించిన వారిని, అడ్డగోలు దందాలకు అడ్డొచ్చిన వారిని కులం పేరిట బెదిరించడం, నానాయాగీ చేయడం అక్కడ నిత్యకత్యంగా మారింది. ఈ దందాలన్నీ సరిపోలేదో.. లేక తన స్థాయి పెరిగిందన్న భ్రమల్లో ఉన్నారో గానీ.. క్యాబినెట్ హోదా పదవి కోసం ఆ నేత కొన్నాళ్లుగా పాకులాడుతున్నారు.. అటువంటి పదవి వచ్చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అధికార మత్తులో తూగుతున్న సదరు నేతకు మూడేళ్ల తర్వాత పరిస్థితేమిటన్నదే ఇప్పుడు అక్కడ అందరి నోళ్లలో నానుతున్న చర్చ. -
పోలీస్ ఫెయిల్..!
సాక్షి,విశాఖపట్నం: రెండు రోజుల ముందునుంచి ఘర్షణలు జరుగుతున్నాయని,అక్కడ పరిస్థితి చేయిదాటుతుందని తెలుసు. అయినా ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని ఊహించలేకపోయారు. దారుణాన్ని ఆపలేకపోయారు. పాల్మన్‌పేట దారుణకాండలో పోలీసుల వైఫల్యం స్పష్టమైంది. పాల్మన్‌పేటలో మంత్రి సోదరుడి గూండాలు అమాయకులపై దాడి చేసి చావగొట్టడంతో పాటు ఆస్తులు, వాహనాలు ధ్వంసం చేసిన ఘటనకు ముందు రెండు చిన్న చిన్న గొడవలు జరిగాయి. తొలుత ఒక యువకుడిని కొందరు అకారణంగా కొట్టారు. అనంతరం కొందరిని ఇరవై మంది అడ్డుకుని బావ బాదారు. ఈ రెండు సంఘటనపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మొదట పట్టించుకోని ఎస్ఐ సత్యనారాయణ రెండోసారి ఘర్షణలు జరిగిన తర్వాత విచారణకు వచ్చారు. నిందితులను విచారించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అప్పటికే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెండు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పది మందిని కాపలా ఉంచారు. కానీ తెల్లారేసరికి వందలాది మంది ఊరిమీద పడి దారుణకాండ సృష్టించనున్నారని పోలీసులు, నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయి. ఎస్ఐ మీదే కోపమెందుకు : ఉదయం 8.15 గంటల సమయంలో కత్తులు, కర్రలు, ఈటెలు పట్టుకున్న వందలాది మంది గ్రామంపై దాడికి వచ్చారు. కొందరు కానిస్టేబుళ్లు గూండాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైనా దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో అక్కడికి వ చ్చిన పాయకరావుపేట ఎస్ఐ సత్యనారాయణ గూండాలను నియంత్రించడానికి కానిస్టేబుళ్లలా కూడా ప్రయత్నించలేదు. అతనికి ఎదురుగానే గూండాలు మరోసారి కొట్టడంతో బాధితులు నిస్సహాయంగా పరుగులు తీశారు. ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుని పాల్మన్‌పేట వాసులు ఎస్ఐపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 75మంది అరెస్ట్: పాల్మన్‌పేట వాసులపై దాడులకు పాల్పడిన కేసులో ఇంత వరకూ 75 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఏసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఈ ఘటనలో రాజయ్యపేట, వేమవరం,ఈదడం, ఆడలవారి వీధిలకు చెందిన 100 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. -
పాయకరావుపేటలో 144 సెక్షన్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో రెండు కాలనీ వాసుల మధ్య బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు కాలనీ వాసులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘర్షణ చోటు చేసుకున్న ప్రదేశానికి చేరుకుని... 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే పాయకరావుపేటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. -
వీఐపీ రిపోర్టర్ : పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత
-
పాయకరావుపేట టిడిపి నాయకుల మధ్య వర్గపోరు
(గణేష్) పాయకరావుపేట: తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా పాయకరావుపేట నాయకుల మధ్య వర్గ పోరు ఉధృతమైంది. పార్టీ నియోజకవర్గం సమస్వయ కమిటీ సభ్యుడు చింతకాలయ రాంబాబు వర్గీయులు జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండల టిడిపి అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు, రాంబాబులను సస్పెండ్ చేశారు. పాయకరావుపేట నియోజక వర్గం బాధ్యురాలు అనిత నియామకాన్ని వీరిద్దరూ వ్యతిరేకిస్తున్నారు. గ్రూపులు కడుతూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు నిన్న రామానాయుడు ప్రకటించారు. దాంతో తాడోపేడో తేల్చుకోవడానికి రాంబాబు వర్గీయులు సిద్ధపడ్డారు. మండలంలోని అత్యధికమంది కార్యకర్తలు వీరిద్దరివైపే ఉన్నారు. సరైన కారణాలు చూపకుండా రాంబాబు, వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. -
రైతును గుండెల్లో పెట్టుకుని చూసిన వైఎస్: షర్మిల
-
రైతును గుండెల్లో పెట్టుకుని చూసిన వైఎస్: షర్మిల
రైతులను వైఎస్ఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, మీకు నేను అండగా ఉన్నానని ప్రతి రైతుకూ భరోసా కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆమె ప్రసంగించారు. వైఎస్ పావలా వడ్డీలకే రుణాలు ఇచ్చారని, విద్యార్థుల గురించి ఓ తండ్రిలా వైఎస్ ఆలోచించారని అన్నారు. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని భరోసా కల్పించారని తెలిపారు. పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం పొందాలని ఆరోగ్యశ్రీ పెట్టారని గుర్తు చేశారు. తన హయాంలో వైఎస్ ఏనాడూ ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, గ్యాస్, ఆర్టీసీ, విద్యుత్‌పై ఒక్క రూపాయి కూడా వైఎస్ పెంచలేదని కానీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని పాడె కట్టిందని, చేసిన పాపాలు సరిపోలేదని అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోందని మండిపడ్డారు. ఇప్పుడు హఠాత్తుగా ఇంకో రాష్ట్రం వస్తే సీమాంధ్ర రైతాంగం ఏమైపోవాలని ఆమె ప్రశ్నించారు. ఇంకో రాష్ట్రం వస్తే పోలవరం ప్రాజెక్టును ఏం నీళ్లతో నింపుతారు, హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా అని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టిందని, ఇంకో రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే పదేళ్లు సరిపోతుందా? అని నిలదీశారు. వీటన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని.. మన కర్మకొద్దీ పాలకపక్షం ఇలా ఏడిస్తే, ప్రధాన ప్రతిపక్షం కూడా అలాగే ఉందని.. ఇంతిలా జరుగుతున్నా చంద్రబాబు గుడ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోండని చంద్రబాబును తాము పదేపదే అడుగుతూనే ఉన్నామని, ఆయన తాను చేసిన తప్పును ఒప్పుకుని చెంపలేసుకుని కోట్లాదిమందికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకపక్షంతోనే కుమ్మక్కై రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నాడంటే అసలు చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడనాలా? దుర్మార్గుడనాలా అని నిలదీశారు. -
దిగజారుడు విమర్శలు చేస్తున్న సీఎం: బాబూరావు
రాష్ట్రంలో పులిలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు ఎందుకు పిల్లిలా మారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు చాలా మంది రాష్ట్రాన్ని ఏలినా ఎందుకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. విశాఖలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆరోపించారు. అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయేతర ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.