
మంగళవారం ఒడిషా నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాయకరావుపేట వై జంక్షన్ వద్దకు చేరుకుంది.
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఉన్న బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. అయితే డ్రైవర్ అప్రపమత్తతో ప్రమాదం తప్పింది. పాయకరావుపేట జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద ఈ ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం ఒడిషా నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాయకరావుపేట వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ క్రమంలోనే బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడం ప్రారంభమైంది. అప్రత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించారు. చూస్తుండగానే బస్సులో మంటలు అంతకంతకూ ఎక్కువయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ ప్రమాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.