
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అయితే, కైలాసగిరిపై వ్యాపారస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. శుక్రవారం పాత టైర్లను తగలబెట్టడంతోనే మంటలు అంటుకున్నట్టు పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. భద్రతను గాలికి వదిలేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment