సాక్షి, పాయకరావుపేట: నక్కపల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేటలలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
'రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేష్టలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాలు పంపిణీని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలను అడ్డుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబును ఒకటే కోరుతున్నా..అభివృద్ధిని అడ్డుకోవద్దు ప్రజల తీర్పును గౌరవించాలి' అంటూ హితవు పలికారు. (కుల, మతాలకు అతీతంగా సంక్షేమం: సజ్జల)
Comments
Please login to add a commentAdd a comment