golla babu rao
-
బీజేపీ, టీడీపీ డబుల్ గేమ్.. ఆధారాలు బయటపెట్టిన గొల్లబాబు రావు
-
కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలి: ఎంపీ గొల్లబాబురావు
సాక్షి,విశాఖపట్నం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం (సెప్టెంబర్ 16) మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి. పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదు.కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాదిమంది రోడ్డున పడతారు’అని బాబురావు అన్నారు. ఇదీ చదవండి.. తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, టీడీపీ డబుల్ గేమ్..
-
వైఎస్ కుటుంబాన్ని వదలను
-
పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు: ఎంపీ గొల్ల బాబురావు
సాక్షి, విశాఖపట్నం: పార్టీ మారుతున్నట్టు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు. దళితుడిని కాబట్టే తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు.కాగా, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. ఈ ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. నాపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంపై చాలా బాధేస్తోంది. వైఎస్ కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. దివంగత మహానేత వైఎస్సార్ నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే.. వైఎస్ జగన్ నన్ను రాజ్యసభకు పంపించారు.వైఎస్ జగన్ పట్ల నేను ఎంతో నిబద్ధతతో ఉంటాను. వైఎస్సార్ మరణించిన సమయంలో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. నీతి, నిజాయితీగా బతికిన వ్యక్తిని నేను. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తాను’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతాం.. గొల్ల బాబూరావు వార్నింగ్
-
ప్రజలను ముంచేసిన కూటమి.. ఎంపీ గొల్ల బాబురావు కామెంట్స్
-
గౌరవాన్ని ఇచ్చిన పార్టీని మేమేందుకు వదిలేస్తాం
-
ఎల్లోబాన్లపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలపై వైయస్సార్సీపీ నేతలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్య. పుంగనూరులో ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి. వాహనాల «ధ్వంసం ఘటనలను వారు ముక్త కంఠంతో ఖండించారు.అ«ధికారం చేపట్టిన టీడీపీ తొలి రోజు నుంచి పాలన గాలికి వదిలేసి, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఎక్కడికక్కడ దాడుల చేస్తోందని వారు ఆక్షేపించారు. ఇకనైనా టీడీపీ తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని వైయస్సార్సీపీ నేతలు, నాయకులు హెచ్చరించారు.వైయస్సార్సీపీ నేతలు.. ఎవరు, ఏమన్నారంటే..: ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్ళతో, మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరు ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగమే ఈరోజు అక్కడ రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. రూ.5 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ పుంగనూరులో ఏర్పాటవుతుంటే, దాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్ర చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండాలని చూస్తున్నారు. అందుకే మా వాహనాలు ధ్వంసం చేశారు. నాపై రాళ్ల దాడి చేశారు.:::పి.మిధున్‌రెడ్డి. రాజంపేట ఎంపీపుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్‌రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు.:::రెడ్డప్ప. చిత్తూరు మాజీ ఎంపీఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.:::గొల్ల బాబురావు. ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మిధున్‌రెడ్డిపై దాడి అమానుషం. ఎంపై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు« «ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు.:::ఇస్సాక్ బాషా. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ.రేపు (19వ తేదీ, శుక్రవారం) ఉదయం మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్‌ను దారుణంగా నరికి చంపారు.:::బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే (వినుకొండ)వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్ ఆర్డర్ కనిపిస్తోంది. వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.:::సి.అనిల్‌కుమార్ యాదవ్. మాజీ మంత్రి.వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది.:::ధర్మాన కృష్ణదాస్. మాజీ మంత్రి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్‌పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్య. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ దాడులపై మా పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరు.:::కోరుముట్ల శ్రీనివాసులు. మాజీ ఎమ్మెల్యే (రైల్వే కోడూరు)రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి.:::జక్కంపూడి రాజా. మాజీ ఎమ్యెల్యే. (తూ.గో.జిల్లా)కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం.:::కాసు మహేష్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (గురజాల).తెలుగుదేశం నాయకులు అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు?. నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే రషీద్‌ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య. గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంగి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం. మరోవైపు రషీద్‌ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు.:::మర్రి రాజశేఖర్. ఎమ్మెల్సీ.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని చెప్పడం దారుణం.:::గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (నర్సారావుపేట) పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ని తలపిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అటు పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది.:::కనుమూరు రవిచంద్రారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవక ముందే మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు తీవ్రమయ్యాయి. ఎంపీ మిధున్‌రెడ్డిపై పుంగనూరులో రాళ్లదాడిని ఖండిస్తున్నాం. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి ఎంత వరకు సబబు?. తమ నియోజకవర్గంవలో పర్యటించే హక్కు, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని టీడీపీ చూడడం దారుణం.:::అకేపాటి అమర్నాథ్రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. గుంటూరు జిల్లాలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు నోరు మెదపడం లేదు.:::కాకాణి గోవర్థన్‌రెడ్డి. మాజీ మంత్రి.పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాల «ధ్వంసం హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి. పుంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన ఆయనపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైనా, ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం కనుక్కోక పోవడం దారుణం.:::జి.శ్రీకాంత్‌రెడ్డి. వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడురాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు.:::గురుమూర్తి. ఎంపీ (తిరుపతి) -
పార్లమెంటులో పోలవరంపై చర్చ
-
రాజ్యసభలో ఏపీ కోసం గళం విప్పిన వైఎస్సార్సీపీ ఎంపీ
ఢిల్లీ: అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాజ్యసభ చైర్మన్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంలో ఏపీ అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. ఏపీలో ఎన్నికల అనంతర హింసను అరికట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టేందుకుకు తగ్గిన గనులను కేటాయించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. ఒకవైపు నీట్ రగడతో లోక్‌సభ శుక్రవారం అర్ధాంతరంగా వాయిదా పడగా.. మరోవైపు సజావుగా సాగిన రాజ్యసభ సైతం సోమవారం( జూలై 1)కి వాయిదా పడింది. -
YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముగ్గురు ఎంపీలు
Live Updates.. ►వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ►వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Yerram Venkata Subba Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/iYPbG6qrHM — SansadTV (@sansad_tv) April 4, 2024 ►ఈ సందర్భంగా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Meda Raghunadha Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/cbYUwdztlC — SansadTV (@sansad_tv) April 4, 2024 ►హిందీలో దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల బాబురావు #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Golla Baburao in the Parliament House.#RajyaSabha @VPIndia @BaburaoGolla @harivansh1956 pic.twitter.com/LfsieauzrE — SansadTV (@sansad_tv) April 4, 2024 ►రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ►ఇక, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైఎస్సార్సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. ►అంతకుముందు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల్లో దళితులకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నా నాలాంటి పేద, దళిత వర్గాలకు రాజ్యసభ సీటు ఇచ్చారు. నా పదవీకాలంలో పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఈరోజు హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. -
సీఎం జగన్ కి మా కృతజ్ఞతలు
-
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలుపు ఖాయం
-
చంద్రబాబును ఒకటే కోరుతున్నా..
సాక్షి, పాయకరావుపేట: నక్కపల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేటలలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేష్టలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాలు పంపిణీని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలను అడ్డుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబును ఒకటే కోరుతున్నా..అభివృద్ధిని అడ్డుకోవద్దు ప్రజల తీర్పును గౌరవించాలి' అంటూ హితవు పలికారు. (కుల, మతాలకు అతీతంగా సంక్షేమం: సజ్జల) -
ద్రోహం చేసింది చంద్రబాబే..!
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల విమర్శలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేసే ముందు స్థాయిని చూసి మాట్లాడాలని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో అత్యధికంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మద్యం షాపులు తెరవడం కేంద్ర నిర్ణయం అని తెలుసుకోకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంతో మీ బుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిందని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. ద్రోహం చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకుండా విమర్శలు చేయడంపై మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే బాబురావు హితవు పలికారు. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..) -
రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ఓటు బ్యాంక్‌గా చూస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను వాడుకుని.. కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఉద్యమం పేరుతో చంద్రబాబు.. రాజధాని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బినామీ భూములు పోతాయని చంద్రబాబుకు భయం పట్టుకుందని..అందుకే దొంగ ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. అమరావతి ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు.రాజధాని ముసుగులో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందన్నారు.అన్ని ప్రాంతాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలను అవమానపర్చడమే చంద్రబాబు నైజం.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. దళితులను, గిరిజనులను అవమానపర్చడమే ఆయన నైజమని మండిపడ్డారు. సభను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత చట్టాలను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఆలోచన అంతా ఆస్తులను, పార్టీ ఉనికి కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును రాష్ట్ర ప్రజలంతా గమనించారని.. దళితుల పట్ల చంద్రబాబు,టీడీపీ వైఖరి బయటపడిందని పేర్కొన్నారు. -
చంద్రబాబుపై కొనసాగుతున్న ఫిర్యాదులు
-
చంద్రబాబుపై ఫిర్యాదుల వెల్లువ
నక్కపల్లి (పాయకరావుపేట)/సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్)/ఏలూరు టౌన్: దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాలుగు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీ లెజిస్లేటివ్ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుపై నక్కపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ విజయకుమార్, ఎస్ఐ రామకృçష్ణలకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై బోస్టన్ కమిటీ నివేదికను చదివి వినిపించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను చంద్రబాబు వాడు వీడు అంటూ సంబోధించి చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కాగా, చంద్రబాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సౌత్‌జోన్ ఏసీపీ సూర్యచంద్రరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఏలూరులో దళిత్ రైట్స్ ఫోరం ఫిర్యాదు దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాళ సుదర్శన్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్నూలులో.. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ప్రజా, దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి వారంతా నిరసన తెలిపారు. విజయవాడలో.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమిషనర్ తిరుమలరావుకు సోమవారం దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితుల పట్ల టీడీపీ తీరు మార్చుకోకపోతే రాజకీయసమాధి కడతామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ల సంఘం ఆగ్రహం ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మున్సిపల్ కమిషనర్ల సంఘం ఖండించింది. విజయ్ కుమార్‌ని కించపరిచేలా మాట్లాడడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విజయ్ కుమార్ బీసీజీ నివేదికను వివరించారని, రాజధానిపై కీలక సమాచారాన్ని వివరించడం ఉన్నతాధికారిగా ఆయన బాధ్యత అని తెలిపింది. అధికారిగా తన విధులు నిర్వర్తించిన విజయ కుమార్‌ను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడటం తగదని, చంద్రబాబు తక్షణమే తన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్షురాలు ఆశాజ్యోతి డిమాండ్ చేశారు. సంబంధిత వార్తలు.. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్న దళిత సంఘాలు -
'రాజధాని పేరిట చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయంతో ఉత్తారంధ్ర అభివృద్ధికి భీజం పడిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌కు దూరమై అన్ని రకాలుగా కొత్త రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాజధాని పేరిట కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణాన్ని కూడా చేపట్టలేకపోయారని తెలిపారు. అమరావతి పేరిట గ్రాఫిక్‌లు చూపించి బాబు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారని దుయ్యబట్టారు. -
విభజన రాజకీయ కుట్ర: గొల్ల బాబురావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలన్నది రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు. ఎన్నికల ముంగిట్లో హడావుడిగా విభజన బిల్లు తీసుకుని రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు- 2013’పై తమ పార్టీ చర్చలో పాల్గొంటే విభజన బిల్లుకు సహకరించినట్లేనని, అందుకే తాను అభిప్రాయం మాత్రమే చెప్తానని అన్నారు. రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం చేయాలని స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని పలుమార్లు కోరినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర సరిహద్దులు తెలియని వారు రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు... ఈ విభజనకు సహకరిస్తున్న పెద్దలు చాలా మంది ఉన్నారని వివరించారు. ‘‘కేంద్రంలో యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ సహకరిస్తే.. ఇప్పుడు వారి గొంతు కోస్తూ, తెలుగుజాతిని నిలువునా నరికేస్తున్నారు. ఆర్టికల్ 3ను సవరించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై మా పార్టీ నాయకుడు జగన్మోహన్రెడ్డి దేశంలోని పలు రాజకీయ పార్టీల నాయకులను కలసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలు ఏర్పడాలంటే.. ఎస్సార్సీ లేదా జ్యుడీషియల్ కమిషన్ లేదా శాసనసభ తీర్మానం ద్వారా మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతకుముందు రెండో ఎస్సార్సీ వేయాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట ఎందుకు మార్చింది? ఏ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు? తెలంగాణ వాదం ఎలా ఉందో.. సమైక్యవాదం అంతే బలంగా ఉంది. సమైక్యాంధ్ర ముసుగులో రాష్ట్ర పాలకులు డూడూ బసవన్న అంటున్నారు. తెలంగాణలో ఎన్ని ఇబ్బందులున్నా మేము సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నాం. పాలకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాత్రం రాజకీయ లబ్ధి, అధికార దాహంతో ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సమైక్యాంధ్ర పేరిట ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారు. విభజన బిల్లును ఆపాలంటే ఓటింగ్‌కు పట్టుపడాల్సిందే. అలా జరిగితేనే రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి విషయం బోధపడుతుంది. రాష్ట్రంలో విభజన రాజకీయం, భజన రాజకీయం, చీకటి రాజకీయాలు నడుస్తున్నాయి. రాజశేఖరరెడ్డి వంటి సమర్థుడైన నాయకుడు లేకే విభజన ఉద్యమాలు వచ్చాయి. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయ’’ని అన్నారు. ఓటింగ్‌కు పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆ పార్టీ సభ్యులు ఓటింగ్ జరపాలన్న డిమాండ్‌తో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభను స్పీకర్ పావుగంట పాటు వాయిదా వేశారు. -
చంద్రబాబు పాదయాత్ర.. పాతాళ యాత్ర
శ్రీకాకుళం:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర పాతాళయాత్రగా మారిపోయిందని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భంగపాటు తప్పదన్నారు. సోనియా గాంధీ ఓడిపోయి జగన్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. కాగా, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. షర్మిల పాదయాత్ర రికార్డు సాధించడం కోసం కాదని.. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆమె పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని పాలకపక్షం, ప్రజల తరపున నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కైయాయని ఆయన చురకలంటించారు. టీడీపీ ప్రజల పక్షం నిలబడటం మాని..అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు. -
వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ