
సాక్షి,విశాఖపట్నం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం (సెప్టెంబర్ 16) మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి.
పార్లమెంట్‌లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదు.కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాదిమంది రోడ్డున పడతారు’అని బాబురావు అన్నారు.

ఇదీ చదవండి.. తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment