ఢిల్లీ: అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాజ్యసభ చైర్మన్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంలో ఏపీ అంశాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. ఏపీలో ఎన్నికల అనంతర హింసను అరికట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టేందుకుకు తగ్గిన గనులను కేటాయించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.
ఒకవైపు నీట్ రగడతో లోక్‌సభ శుక్రవారం అర్ధాంతరంగా వాయిదా పడగా.. మరోవైపు సజావుగా సాగిన రాజ్యసభ సైతం సోమవారం( జూలై 1)కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment