బడ్జెట్‌లో బీహార్‌కు నిధులిచ్చి, ఏపీకి రుణాలిచ్చారు
రాష్ట్రానికి వేటికి ఎంతిచ్చారో కేంద్రం, ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పాలి
అమరావతికిచ్చే రూ.15 వేల కోట్లు రుణమే.. రాష్ట్రమే భరించాలి
పోలవరానికి నిధుల విషయంలో స్పష్టత లేదు
రాష్ట్రం దమనకాండకు కేంద్ర బిందువుగా మారింది
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది ఏమీ లేనప్పటికీ, రూ.48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించార న్నట్లుగా ఎన్డీఏతో పాటు ఇండియా కూటమి సభ్యు లు ప్రచారం చేయడం శోచనీయమని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆ రెండు కూటముల నేతలను ఏపీ సీఎం చంద్రబాబు తన గారడీతో బుట్టలో వేసుకుని, ఇలా మాట్లాడి స్తున్నారని చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌పై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మా ట్లాడుతూ.. ఇది భారత దేశానికి అమృత్‌కాల్ కా వచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం విషమ కాల మని అభివర్ణించారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు వేటికి కేటాయించారో కేంద్రం, ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ, బీహార్‌లో అధికారంలో ఉన్న భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూల ద్వారానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
బీహార్‌లో మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దే శంతోనే ఆ రాష్ట్రానికి నిధులిచ్చారని, ఏపీలో ఇప్ప టికే అధికారంలో ఉండడంతో కేటాయింపులు జరగలేదన్నారు. బీహార్‌లో రహదారులకు రూ.26 వేల కోట్లు గ్రాంట్‌గా ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌లో అమ రావతికి ఇస్తామన్న రూ.15 వేల కోట్లు రుణంగా ఇ చ్చారన్నారు. ఈ రుణం మొత్తన్ని వడ్డీతో సహా రాష్ట్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.55 వేల కోట్లు కేటాయింపు పైనా ఆర్థిక మంత్రి స్పష్టత ఇవ్వలేదన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని విభజన చట్టంలో ఉన్నప్పుడు 2014లో నిర్మాణ బాధ్యత లను రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారని నిల దీశారు. డబ్బులు దండుకొనేందుకే చంద్రబాబు పోలవరం బాధ్యతలు తీసుకున్నారని అన్నారు. ఏపీ గత 50 రోజులుగా దమనకాండకు కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఫేక్ వార్తల కట్టడికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదు?
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.
చంద్రబాబుతో సర్వ నాశనమే
2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు అనేక కుంభకోణాలతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డా రన్నారు. ఆ కేసులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉంటే ఏపీకి నిధులు కోరబోమని చంద్రబాబు బీజేపీతో క్విడ్ ప్రోకో చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అంటే ‘టోటల్ డిజప్పా యింట్‌మెంట్ పార్టీ’ అని వ్యాఖ్యానించారు. రాజ్య సభలో ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక్కడిలా.. అక్కడలా..
రాష్ట్రంలో అధికార కూటమి రాక్షస పాలనను విజయసాయి రెడ్డి సభ దృష్టికి తెస్తుండగా బడ్జెట్ పైనే మాట్లాడాలని, లేదంటే రికార్డుల్లోంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరి వంశ్ హెచ్చరించడం గమనార్హం. మరోవైపు లోక్‌సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్పుడు సభాపతి స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ అడ్డుచెప్పకపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment