సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ఓటు బ్యాంక్‌గా చూస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను వాడుకుని.. కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఉద్యమం పేరుతో చంద్రబాబు.. రాజధాని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బినామీ భూములు పోతాయని చంద్రబాబుకు భయం పట్టుకుందని..అందుకే దొంగ ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. అమరావతి ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు.రాజధాని ముసుగులో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందన్నారు.అన్ని ప్రాంతాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎస్సీ,ఎస్టీలను అవమానపర్చడమే చంద్రబాబు నైజం..
ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. దళితులను, గిరిజనులను అవమానపర్చడమే ఆయన నైజమని మండిపడ్డారు. సభను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత చట్టాలను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఆలోచన అంతా ఆస్తులను, పార్టీ ఉనికి కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును రాష్ట్ర ప్రజలంతా గమనించారని.. దళితుల పట్ల చంద్రబాబు,టీడీపీ వైఖరి బయటపడిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment