‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’ | YSRCP In Parliament Raises Its Voice On AP Issues | Sakshi
Sakshi News home page

‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’

Published Tue, Mar 11 2025 6:17 PM | Last Updated on Tue, Mar 11 2025 6:42 PM

YSRCP In Parliament Raises Its Voice On AP Issues
  • పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు
  • పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది
  • దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది
  • ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి 
  • లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి డిమాండ్‌
  • వైఎస్‌ జగన్‌ విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు
  • విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు ఖర్చు చేశారు
  • రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు
     

ఢిల్లీ:  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు,  బడ్జెట్ లో పోలవరంకు కేటాయించిన నిధులు, పెరిగిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు, విద్యారంగం తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ తన గళం వినిపించింది.  ఉభయ సభల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు కొన్ని కీలకాంశాలు లేవనెత్తారు.ఈరోజు(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ గురుమూర్తి.. లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది. దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది.  ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి.

ఇటీవల బడ్జెట్‌లో పోలవరంకు అరకొరగా రూ. 5936 కోట్లు మాత్రమే కేటాయించారు. పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?, పోలవరం సిఈఓ ఆఫీస్ ను ఏపీకి తరలించాలి. ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది.  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం లేఖతో కడప మెడికల్ కాలేజీ పర్మిషన్ ను ఉపసంహరించారు.

మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారా లేదన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇస్తారా లేదో చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ హామీని నిలుపుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే. అమరావతికి ఇచ్చే 15000 కోట్ల రూపాయలను ఎవరు చెల్లిస్తారు?, అమరావతి అప్పులను ఎవరు చెల్లిస్తారనేది స్పష్టం చేయాలి’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్  విద్యారంగం అభివృద్ధి కృషి చేశారు


రాజ్యసభలో విద్యాశాఖ పద్దులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ‘ వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలలను నందనవనంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయి. కాలేజీ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది  కాలేజీలో కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఎలాంటి నైపుణ్యాలు లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు’ అని ఎంపీ గొల్ల బాబురావు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement