parlaiment session
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
-
బడ్జెట్ కేటాయింపులు లేకుండా పోలవరం ఎలా పూర్తి చేస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత 60 రోజుల పాలనలో రోజుకో హత్య జరుగుతోందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ఈ హత్యలకు ఎవరు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించకుండా ఎలా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. ఎవరు ఈ హత్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు. వాగ్నర్ గ్రూపు తరహాలో హత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు భద్రతను పెంచాలి, హోంశాఖకు తగిన నిధులు కేటాయించాలన్నారు. అలాగే, తెలంగాణ నుంచి ఏపీ జెన్కోకు రూ. 7000 కోట్ల బకాయిలు రావాలి. ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ బకాయిలు ఇవ్వని నేపథ్యంలో పన్నుల వాటాలో కోత విధించాలి. ఏపీలో ఎన్డీఏ సీఎం, తెలంగాణలో కాంగ్రెస్ సీఎం మధ్య స్నేహం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఈ స్నేహం కొనసాగితే అంగీకరించం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను మేరకు నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇలా కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించాలి. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై జరిమానాలు వేయవద్దు. సమగ్రమైన జీవిత బీమా పథకాలు తీసుకురావాలి’ అని అన్నారు. -
వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (ఫొటోలు)
-
Budget 2024-25: బడ్జెట్ ముఖ్యాంశాలు
Parliament Budget Session 2024 Highlights: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, అప్డేట్లు.ఆదాయ సమీకరణ కేవలం పన్ను ఆధారితమైంది కాదు: నిర్మలా సీతారామన్మనీలాండరింగ్ను నిరోధించడంలో ఏంజెల్ ట్యాక్స్ రద్దు అంశం కీలక ప్రభావం చూపుతుంది. ఇన్ని రోజులు ఇది భారతదేశంలో పెట్టుబడులకు ఆటంకంగా మారింది.యూపీఏ 2లో ఏంజెల్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై తీసుకొచ్చిన 12.5% ట్యాక్స్‌ను నిజానికి సరాసరి పన్నురేటుతో పోలిస్తే చాలా తగ్గించాం.పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం.ఎప్ అండ్ ఓల్లో ఎస్టీటీ ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి .కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్: మోదీమహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్.ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.భారత్‌ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తాం.పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.#WATCH | Post Budget 2024: Prime Minister Narendra Modi says "For MSMEs, a new scheme to increase ease of credit has been announced in the budget. Announcements have been made to take export and manufacturing ecosystem to every district in this budget...This budget will bring new… pic.twitter.com/C0615OJjdt— ANI (@ANI) July 23, 2024స్టాంప్ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.ట్యాక్స్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్లో రూ.42,277 కోట్లు.అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.చండీగఢ్‌కు రూ.5,862 కోట్లు.లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.క్యాపిటల్ గెయిన్‌లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు రూ.1,200 కోట్లు.న్యూ క్లియర్ ప్రాజెక్ట్‌లకు రూ.2,228 కోట్లు.ఫార్మాసూటికల్స్ రంగంలో పీఎల్ఐ పథకానికి రూ.2,143 కోట్లు.సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.సోలార్ పవర్(గ్రిడ్) రూ.10 వేలకోట్లు.ఎల్పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 19 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 27 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 19 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుసబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 పైసలుఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 9 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర ఖర్చులు 9 పైసలుకొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.ట్రేడింగ్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై ఎస్టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్‌తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి.ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.నేపాల్‌లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్‌లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు.ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.సులభంగా నిధులు అందేలా చర్యలు.గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం.ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటు.బీహార్‌లో ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మాణం.బీహార్, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.ఏపీకి అండగా ఉంటాం..ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.వాటర్, పవర్, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సాయం అందించేలా చర్యలు.అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.ఈ ఏడాదిలోనే ఆర్థిక సాయం.అవసరమైతే మరిన్ని నిధులు.విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం.ఈపీఎఫ్ఓ ద్వారా నగదు బదిలీ.వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు.నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ.ఈ బడ్జెట్లో వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్.సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్లో నిర్ణయాలు.కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్పార్లమెంట్లో బడ్జెట్ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభకు చేరుకున్నారు.#WATCH | PM Modi in Parliament, ahead of the presentation of Union budget by Finance Minister Nirmala Sitharaman(Video source: DD News) pic.twitter.com/T0RD4hBO2z— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ చేరుకున్నారు.#WATCH | Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi reaches Parliament ahead of Union Budget presentation by Finance Minister Nirmala Sitharaman in Lok Sabha. pic.twitter.com/zNcijSYS4e— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్-మే వరకు అమలు అవుతుంది.ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్మరో గంటలో పార్లమెంట్లో బడ్జెట్స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉంటుదన్న ప్రధాని మోదీఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament, to present the first Budget in the third term of Modi Government. pic.twitter.com/0tWut8mhEu— ANI (@ANI) July 23, 2024 పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.(Source: DD News) pic.twitter.com/VdsKg5bSLG— ANI (@ANI) July 23, 2024జమ్మూకశ్మీర్ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.#WATCH | Delhi | J&K budget copies arrive in Parliament; Union Finance Minister Nirmala Sitharaman will present the estimated receipts and expenditure (2024-25) of the Union Territory of Jammu and Kashmir (with legislature) in Parliament today. pic.twitter.com/gMIf8y31bU— ANI (@ANI) July 23, 2024నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.కొవిడ్ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.లోక్‌సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి పార్లమెంట్‌ను చేరుకుంటారు.బడ్జెట్‌ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్ టాబ్‌ను ఆవిష్కరించారు. #WATCH | Finance Minister Nirmala Sitharaman heads to Rashtrapati Bhavan to call on President Murmu, ahead of Budget presentation at 11am in Parliament pic.twitter.com/V4premP8lL— ANI (@ANI) July 23, 2024ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం. నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.Finance Minister Nirmala Sitharaman reaches Ministry ahead of Union Budget presentationRead @ANI Story | https://t.co/2pLE5R08Yh#Budget2024 #BudgetDay #NirmalaSitharaman pic.twitter.com/Vu9E7tqsio— ANI Digital (@ani_digital) July 23, 2024ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్.#WATCH | Chief Economic Advisor V Anantha Nageswaran arrives at Ministry of Finance, ahead of Union Budget presentation pic.twitter.com/vWrU3LbcLz— ANI (@ANI) July 23, 2024ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ..‘గత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంది. ఈసారి కూడా ఆర్థిక సర్వే 7% వృద్ధి రేటును సూచిస్తుంది. పర్యాటక రంగంలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రజల సంప్రదాయాల విస్తరణకు ఈ రంగం వారధిగా ఉంటుంది. బడ్జెట్ 2024-25లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలుంటాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.#WATCH | Union Budget 2024 | Rikant Pitti, co-founder of EaseMy Trip says, "... Last year our GDP growth rate was around 6.5%, and this time as well, the economic survey suggests around 7% growth rate... In the coming time, our GDP growth rate will become even better... Tourism… pic.twitter.com/vZgPne4vyd— ANI (@ANI) July 23, 2024ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో జమ్ము కశ్వీర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రకటన2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన ఎకనామిక్‌సర్వేలో ‘వికసిత్ భారత్’ కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తే జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో నిర్మల ఎలాంటి కీలక నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఈసారి నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి.పాత పన్ను విధానానికే చాలామంది మొగ్గు చూపుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులు వస్తాయని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. -
పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యాన అన్ని స్థానాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను సికింద్రాబాద్, హైదరాబాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలు కట్టబెట్టడం విశేషం.' రాజకీయంగా సీనియర్ నాయకులు, మంత్రులైన భట్టి, తుమ్మలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలోని పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భట్టిని సికింద్రాబాద్, హైదరాబాద్, తమ్మలను మల్కాజ్గిరి ఇన్చార్జిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భట్టి హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యాన జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలకు సై అంటున్నాయి. పొంగులేటికి కీలకంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో విస్తరించి ఉండగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి కొనసాగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబాబాబాద్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ లక్ష్యమని చెప్పగా.. భద్రాచలం మినహా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించాయి. ఈ మేరకు భట్టి, తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటిని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించినట్లు రెండు పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో స్పష్టమవుతోంది. ఈ రెండింటి పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ దక్కించుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. దీంతో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పొంగులేటికి ఉన్న పరిచయాలు, పార్టీ కేడర్, కుటుంబ బంధుత్వం లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కలిసొస్తుందన్న భావనతో ఆయనకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. కాగా, ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబాబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా చదవండి: ‘పార్లమెంట్’పై కాంగ్రెస్ 0గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా.. -
వర్షాలు, వరదలతో 9 ఏళ్లలో 17 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2012–2021 సంవత్సరాల మధ్య సంభవించిన వరదలు, భారీ వర్షాలతో 17,422 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం రాజ్యసభలో జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలను ఆయన వెల్లడించారు. అతి తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురియడమే పట్టణ ప్రాంతాల్లో వరదలకు ప్రధాన కారణమన్నారు. ఆక్రమణలకు గురైన సహజ నీటి వనరులు, విచ్చలవిడిగా నిర్మాణాలు, నాణ్యతలేని మురుగు వ్యవస్థ వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2012–21 సంవత్సరాల కాలంలో వర్షాలు, వరదలతో పంటలు, నివాసాలు, ఇతరాలకు కలిపి మొత్తం రూ.2.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. -
'పరిశ్రమ' హోదాతోనే పర్యాటక వికాసం
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక రంగానికి రాష్ట్రాలు పరిశ్రమ హోదా కల్పిస్తే అది మరింతగా రాణిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. పరిశ్రమ హోదా పొందడం ద్వారా పర్యాటక రంగం దాని అనుబంధ రంగాలు ఇతర పరిశ్రమలతో సమానంగా విద్యుత్ చార్జీలు, ఇతర పన్నుల వంటి ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పర్యాటక రంగం వాణిజ్యం కేటగిరిలో ఉన్నందున అధిక రేట్లను చెల్లించాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పిస్తే భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఆతిధ్య రంగంలో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహకారిగా మారుతుందని అన్నారు. దేశంలో ఇప్పటికే గుజరాత్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూ,కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి పదకొండు రాష్ట్రాలు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ పదేపదే సలహా ఇస్తోంది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయిలో జరిగే ఇంటరాక్టివ్ సెషన్స్‌లోను, సమావేశాలలోను, కరస్పాండెన్స్ ద్వారా వాటిని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు నిధి న్యూఢిల్లీ, మార్చి 16: గిగ్ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వర్కర్ల (తాత్కాలిక కార్మికులు) సామాజిక భద్రత కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేస్తున్నతాత్కాలిక కార్మికలకు కనీస వేతన విధానం అమలుపై రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేస్తున్న శ్రామికులు అందరూ కనీస వేతనం పొందడానికి అర్హులుగా చేస్తూ ప్రభుత్వం 2019లో వేతన కోడ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ చట్టం ప్రకారం ప్రతి కార్మికుడికి వారు చేసే పని కాల వ్యవధికి అనుగుణంగా కనీస వేతనాలను యాజమాన్యం నిర్ణయించాలి. కార్మికుడు పని చేసే వ్యవధి, గంట, దినసరి, నెలసరి అయినప్పటికీ వేజ్ కోడ్ కింద అతను కనీస వేతనం పొందడానికి అర్హుడని మంత్రి వెల్లడించారు. సేవా రంగంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ పాత్ర గణనీయ పాత్ర పోషిస్తున్న దృష్ట్యా గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేసే గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత కోడ్ చట్టం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కోడ్ ద్వారా తొలిసారిగా గిగ్ వర్కర్‌ను చట్టం నిర్వచించినట్లు తెలిపారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం పలు పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సామాజిక భద్రత నిధిని ఏర్పాటు చేసే సౌలభ్యాన్ని కోడ్ కల్పిస్తోంది. అలాగే అగ్రిగేటర్ తమ వార్షిక టర్నోవర్‌లో 1% నుంచి 2% లేదా వర్కర్లకు చెల్లిస్తున్న మొత్తంలో పరిమితులకు లోబడి 5% వరకు సామాజిక భద్రతా నిధికి చందా ఇవ్వడం ద్వారా వర్కర్ల సంక్షేమ నిధికి తోడ్పడవచ్చని మంత్రి తెలిపారు. కార్మిక శాఖ నిధుల్లో 98 శాతం వినియోగం కార్మిక, ఉపాధి కల్పన శాఖ ద్వారా వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో 98 శాతం వినియోగించినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కావడంలేదన్న విషయం వాస్తవమేనా? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం కోవిడ్ మహమ్మారి వివిధ పథకాలకు నిధుల వినియోగంపై ప్రభావం చూపడం వలన కాలయాపన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కోచింగ్, గైడెన్స్, నేషనల్ కెరీర్ సర్వీస్, వర్తకులకు సంబంధించిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, నేషనల్ పెన్షన్ వంటి పబ్లిక్ ఫేసింగ్ స్కీమ్‌లు గణనీయంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే రిజిస్ట్రేషన్లను మెరుగుపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, లేబర్ వెల్ఫేర్ స్కీం సబ్ కాంపోనెంట్ పథకమైన రివైజ్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీం వంటి పథకాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, సమగ్ర శిక్ష యోజన పథకాల్లో విలీనం చేసినట్లు తెలిపారు. దీని ఫలితంగా కొత్త రిజిస్ట్రేషన్లు చేపట్టలేదని అయితే పాత బాధ్యతలు మాత్రమే ప్రోసెస్ చేసినట్లు తెలిపారు. పీఎంఆర్పీవై పథకం కింద లబ్ది పొందేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం చిట్టచివరిది కావడంతో పథకం కింద నమోదు చేసుకున్న యజమానులు అంతకు ముందు సంవత్సరాల వినియోగం ఆధారంగా ఊహించిన డిమాండ్ రాలేదని అన్నారు. మంత్రిత్వ శాఖ ఇతర పథకాలలో నిధుల వినియోగాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని, 13306.50 కోట్ల బీఈకి వ్యతిరేకంగా, రూ. 11211.97 కోట్ల నగదు సప్లిమెంటరీని తీసుకొని రూ. 24036.33 కోట్ల ఖర్చు చేసిందని అన్నారు. ఇది ఇది మొత్తం కేటాయింపుల్లో 98.03% వినియోగించినట్లు మంత్రి తెలిపారు. -
Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో..
సాక్షి, ఢిల్లీ: దేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై ఓ స్పష్టత వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి.. రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 6,53,307 కోట్లు, మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లుగా తేలింది. ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్ల రూపాయలుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆరో స్థానంలో కర్ణాటక అప్పు రూ. 4,61,832 కోట్లతో నిలిచింది. ఏడు స్థానంలో గుజరాత్ అప్పు రూ. 4,02,785 కోట్లుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. ఏపీ అప్పుల పెరుగుదల 10.7 శాతంతో దేశంలో 15వ స్థానంలో నిలవగా.. తెలంగాణ మాత్రం 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. -
జీవించే హక్కుంది.. ప్రజలను బతకనివ్వండి.. కన్నీరుపెట్టిన ఎంపీ..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బీర్బమ్ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఈ ఘటన పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. జీరో అవర్‌లో భాగంగా ఆమె శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. బెంగాల్‌ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెంగాల్లో జరిగిన బీర్బమ్ హింస గురించి ప్రస్తావించారు. బెంగాల రాష్ట్రంలో దారుణ హత్యలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడ కేవలం 8 మంది మాత్రమే మరణించారని, ఎక్కువ మంది చనిపోలేదని మమత సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె మాట్లాడుతూనే అటాప్పీ రిపోర్ట్ ప్రకారం.. చనిపోయిన వారిని మొదట దారుణంగా కొట్టారని ఆ తర్వాత సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయని రూపా గంగూలీ ఆరోపించారు. భారత్‌లో బెంగాల్ భాగమని, అక్కడ జీవించే హక్కు ఉందని, మేం బెంగాల్లో పుట్టామని, అక్కడ పుట్టడం తప్పుకాదు అని, మహాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. అయితే, గత సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. దాదాపు డజను ప్రత్యర్థుల ఇళ్లకు కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8మంది సజీవదహనం అయ్యారు. తృణమూల్ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ సహా 23మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బీర్బమ్ సజీవదహనాల కేసులో కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. #WATCH | BJP MP Roopa Ganguly broke down in Rajya Sabha over Birbhum incident, demanded President's rule in West Bengal saying, "Mass killings are happening there, people are fleeing the state... it is no more liveable..." pic.twitter.com/EKQLed8But — ANI (@ANI) March 25, 2022 -
ఢిల్లీలో హైఅలర్ట్
-
రాష్ట్రానికి రావాల్సిన హక్కులకోసం పార్లమెంట్ లపోరాడతాం : మిథున్ రెడ్డి
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరాం : విజయసాయిరెడ్డి
-
నటుడు రవికిషన్‌కు వై-ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రసంగించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ డ్రగ్స్ నెక్సస్ లింగ్‌లపై ప్రస్తావించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీకి, ఆయన కుటుంబానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వై-ప్లస్ భద్రతను కల్పించారు. దీంతో తనకు తన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు భద్రత కల్పించినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ట్విటర్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) ‘గౌరవనీయులైన మహారాజ్ జి, నా భద్రతను దృష్టిలో ఉంచుకుని నాకు వై-ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. అంతేగాక నా కుటుంబంతో పాటు లోక్‌సభ నియోజకవర్గ ప్రజల క్షేమం గురించి ఆలోచించిన మీకు మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రజల తరపున సభలో నా గొంతు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని మీకు మాటఇస్తున్నాను’ అంటూ ఎంపీ ట్వీట్ చేశారు. అయితే బాలీవుడ్లో ప్రస్తుతం కలకలం రేపుతోన్న డ్రగ్ కేసు వ్యవహారంపై ఎంపీ రవి కిషన్ పార్లమెంటులో ఇటివల ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగిస్తున్న క్రమంలో ఎంపీ జయబచ్చన్‌తో సహా పలువురు ఎంపీలు ఆయనను వ్యతిరేకించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) -
ఎంపీల సస్పెన్షన్: బరిలోకి పవార్
న్యూఢిల్లీ : రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అడ్డుకున్న 8 మంది విపక్ష ఎంపీలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వారంతా పార్లమెంట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్ సింగ్ పార్లమెంటు ఆవరణంలో సస్పెండ్ చేసిన 8 మంది ఎంపీలకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు విపక్షాలు నిరాకరించడంతో పాటు మీడియా ముందు కావాలని ఇలా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాగా సస్పెండ్ అయిన 8 మంది సభ్యులకుఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగానే ఓ రోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం శరద్ పవర్ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో మరింత చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఈ బిల్లుకు సంబంధించి సభ్యులకు ప్రశ్నలు ఉన్నాయని, ఇప్పటి వరకు జరిగిన దానిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం దీనిపై చర్చను కోరుకోవడం లేదనిపిస్తుందన్నారు. సభ సభ్యులకు స్పందన రాలేని సమయంలో ఉపసభాపతి పోడియం వద్దకు వచ్చారని, బిల్లును ఆమోదించడానికి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. దానిపై చర్చ జరగాలని, కానీ ఇలా ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న క్రమంలో ఆదివారం రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదించడంపై అభ్యంతంర వ్యక్తం చేస్తున్నానారన్నారు. బిల్లులు ఇలా ఆమోదం పొందడం తానెప్పుడూ చూడలేదని పవార్ పేర్కొన్నారు. కేవలం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే వారిని బహిష్కరించారని, సభ్యుల హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వైస్ చైర్మన్ నిబంధనలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. విపక్షాలు నిరసన చేస్తున్న క్రమంలో వైస్ చైర్మన్ వచ్చి టీ, స్నాక్స్ అందించడం బాలేదని, వ్యవసాయ బిల్లులకు నిరసన తెలిపే సభ్యులకు సంఘీభావంగా తాను ఈ రోజు ఏమీ తినను అని పేర్కొన్నారు. కాగా విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తనతో అసభ్యంగా ప్రవర్తించి వేటుకు గురైన 8 మంది ఎంపీల కోసం హరివంష్ టీ, స్నాక్స్ తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. -
‘ఆ బిల్లులను అడ్డుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ : రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయరాదని విపక్ష నేతలు రాష్ట్రపతికి సోమవారం విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరాయి. వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి ఎదురయ్యే నష్టాన్ని వివరించేందుకు తమకు సమయం కేటాయించాలని 12 రాజకీయ పార్టీలు రాష్ట్రపతిని కోరాయని కాంగ్రెస్ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ తెలిపారు. కాగా విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులను అంతకుముందు లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని, ఇది సేద్య చరిత్రలో చారిత్రక ఘట్టమని, దళారీ వ్యవస్థకు ముగింపు పలకవచ్చని పాలక బీజేపీ పేర్కొంటుండగా, రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చేస్తున్నారని విపక్షం మండిపడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో రభస సృష్టించిన ఘటనలో ఎనిమిది మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి తమ గొంతు నొక్కలేరని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్ఫన్ దురదృష్టకరమని, ఇది ప్రభుత్వ మనోభావాలకు అద్దం పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. చదవండి : వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు -
రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ సమావేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండి పడ్డారు. కొందరి కోసం అందరిని విమర్శించడం తగదన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘కొంతమంది వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చడం సరి కాదు. నిన్న లోక్‌సభలో పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడంతో నేను ఎంతో సిగ్గు పడ్డాను. ఆయన వ్యాఖ్యలు చూస్తే.. అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది’ అంటూ తీవ్రంగా మండి పడ్డారు జయా బచ్చన్. (చదవండి: డ్రగ్స్ కేసు: నాకేం బాధ లేదు ) బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని రవి కిషన్ అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కరోనా టెస్టు చేయించుకున్న ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 72 గంటల ముందు ఎంపీలంతా కరోనా టెస్టు చేసుకోవాలని వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు కరోనా నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఆస్పత్రులు, లాబోరేటరీలు, పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టు సమర్పించాలన్నారు. పార్లమెంటు అధికారులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేసుకోవాలని, డీఆర్డీవో ద్వారా ఎంపీలకు కరోనా ప్రత్యేక కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎలక్ట్రానిక్ మోడ్‌లో పార్లమెంట్ బిజినెస్ పేపర్లు ఉండనున్నాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి. శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌తో నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయ సభల్లోను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
27 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేస్తాం: కేంద్రం
సాక్షి, కొవ్వూరు: రాష్ట్రవ్యాప్తంగా 27 ఫుడ్ పార్క్ పరిశ్రమలు మంజూరయ్యాయని, వాటిలో తొమ్మిది ఉభయ గోదావరి జిల్లాలో నెలకొల్పనున్నట్టు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి రామేశ్వర్ తెలిపారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్‌రామ్ మాట్లాడారు. ఏపీఈడీఏ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ, ఎంపీఈడీఏ మెరైన్ ప్రోడెక్ట్స్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్‌పోర్టు అథారిటీ మంత్రిత్వ శాఖ ఏపీలో ఆహార సంస్కరణల పరిశ్రమలు మరిన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. గత రెండేళ్లలో ఏపీలో 200 ఆహార సంస్కరణల పరిశ్రమలు ఏర్పాటు కావడం వాస్తవమేనా అని అడిగారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పుడ్ పార్క్స్ ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆహార మంత్రిత్వ శాఖ ద్వారా ఫుడ్ పార్క్స్ పెట్టుబడిదారులకు కొల్లేటరల్ ఫ్రీ రుణాలు మంజూరుకు ఏ చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనికి స్పందించిన కేంద్ర ఆహార మంత్రి రామేశ్వర్ ప్రకటించారు. 27 ఆహార సంస్కరణ పరిశ్రమలకు రూ. 347.93 కోట్లను కేటాయిస్తున్నామని, దేశం మొత్తంలో 90 ప్రాసెసింగ్ ప్లాంట్స్ రిజిస్టర్ అయితే వీటిలో 27 పశ్చిమ గోదావరిలో ఉన్నట్లు తెలిపారు. ఆహార సంస్కరణల పరిశ్రమలు 2014–15లో 4,572, 2016–17లో 4,702కు పెరిగాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. రూ.6 వేల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంతో కలిపి మంజూరు చేసినట్టు మంత్రి రామేశ్వర్ ప్రకటించారు. -
‘తక్షణమే హెచ్ఆర్డీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు బ్యాంకు రుణాలపై హెచ్ఆర్డీ నిబనంధనలు విధించడంపై రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్బీఏ గుర్తింపు కలిగిన యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వాలన్న నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు, ఐఐటీ విద్యార్థులకు మాత్రమే 100 శాతం ప్రాంగణ నియామకాలు దొరుకుతాయన్న వాదనలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాలు అందించే సౌకర్యంపై షరతులు విధించడం సబబు కాదని, తక్షణమే హెచ్ఆర్డీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని సూచించారు. స్టేటస్ కో అమలు చేయాలని, నాలుగున్నర లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రుణాలు అందిస్తామన్న నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాలక్ష్మీ పోర్టల్ ద్వారా అన్ని రుణాలు అందివ్వాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. -
ఢిల్లీకి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, విశాఖపట్నం : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ నుంచి అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరిన అనంతపురం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కాకినాడ ఎంపీ వంగా గీత, కర్నూల్ ఎంపీ డా.సంజీవ్ కుమార్‌లకు పార్టీ శ్రేణులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటులో పలు విషయాలపై ఎంపీలు గళమెత్తనున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన, పోలవరం నిధుల కేటాయింపు, ఆయా పార్లమెంట్ పరిధిలలో అభివృద్ధికి కేంద్రం నుంచి రాబట్టేలా గళం విప్పుతామని వెఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. అలాగే తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తామని ఎంపీలు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 23 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. -
ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెన్షన్ పొందేందుకు ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్, ఇతర బిల్లుల(సవరణ) చట్టం– 2019కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ..‘ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చాం. ఆధార్ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించం. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుంది. ఐటీ మంత్రి హోదాలో ఓ వ్యక్తి ఆధార్ వివరాలను నేను కోరినా నాకూ మూడేళ్లశిక్ష పడుతుంది. ఆధార్ వివరాలను దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుంది. ఆధార్ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్ పార్టీలు వ్యతిరేకించాయి. ఎంసీఐ బిల్లుకు రాజ్యసభ ఓకే: భారత వైద్య మండలి(సవరణ) బిల్లు–2019కు పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఇందులోని నిబంధనల మేరకు ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘ఎంసీఐ తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎంసీఐని నిర్వహించే బాధ్యతను ప్రముఖ డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించాం. మేం ఈ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. కానీ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతామన్నారు. అద్దాల భవంతులపై ఆధారాల్లేవు.. అద్దాలతో నిర్మించిన భారీ భవంతులు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ లోక్‌సభలో తెలిపారు. ఓ భవనాన్ని అద్దాలతో పక్కాగా డిజైన్ చేస్తే లాభాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో గతంలో ఏవైనా అధ్యయనాలు జరిగిఉంటే నా దృష్టికి తీసుకురండి. పరిశీలిస్తాను. న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నేను ఐదేళ్లు సంతోషంగా, నిక్షేపంగా ఉన్నా’ అని మంత్రి పేర్కొన్నారు. -
బీసీ క్రీమీ లేయర్‌పై నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలలో క్రీమీ లేయర్ నిర్ధారణకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిశీలన కోసం ఈ ఏడాది మార్చి 8న మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి బీపీ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి బుధవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. నిపుణుల సంఘం విధి విధానల గురించి మంత్రి తన జవాబులో వివరిస్తూ వెనుకబడిన తరగతులలో క్రీమీ లేయర్ (ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారు) నిర్ధారణ కోసం గతంలో నియమించిన ప్రసాద్ కమిటీ అనుసరించిన ప్రాతిపదికను లోతుగా పరిశీలిస్తుందని చెప్పారు. ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్రీమీ లేయర్ విధానాన్ని సరళతరం, క్రమబద్ధీకరించే దిశగా తగిన సిఫార్సులు చేయడం శర్మ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలలో ఒకటని మంత్రి చెప్పారు. అలాగే కేటగిరీ 2 సీ కింద ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీలకు ఉద్యోగ ఖాళీల సంఖ్యను నిర్ధారించడానికి కూడా తగిన సిఫార్సులను ఈ నిపుణుల కమిటీ చేస్తుందని చెప్పారు. క్రీమీ లేయర్‌కు సంబంధించి సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులు దాఖలు చేసిన అపరిష్కృత కేసులను శర్మ కమిటీ పరిశీలిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం బీసీ సర్టిఫికెట్ సమర్పించిన అభ్యర్ధులలో క్రీమీ లేయర్ వారిని గుర్తించి తొలగించడానికి అనుసరించవలసిన ఆచరణ సాధ్యమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని మంత్రి చెప్పారు. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన బీసీ అభ్యర్ధుల సర్టిఫికెట్లను యూపీపీఎస్సీ తిరస్కరించిన నేపథ్యంలో తిరస్కరణకు గురైన ప్రతి కేసుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ఈ కమిటీ నిర్దిష్టమైన సిఫార్సు చేస్తుందని మంత్రి వివరించారు. -
దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయసభలు
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. దీంతో లోక్‌సభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్ననికి వాయిదా పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, ఏపీకి ప్రత్యేక హోదా, రిజర్వేషన్ల అంశంపై చర్చకు సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సమావేశాలను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను వారించినా ఫలితం లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. -
వైవి సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీల సమావేశం
-
ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం గురువారమిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల తేదీని మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశంపైనా చర్చించి ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కాగా లోక్‌సభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం వచ్చే నెల మొదట్లో స్వల్పకాలం పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవి 4-12 తేదీల మద్య జరిగే అవకాశముంది. ఈ షెడ్యూల్‌ను కేబినెట్ ఖరారు చేయనుంది.