![MP Margani Bharat Ram Questioned Central Minister Rameswar Teli In Parliament - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/4/margani.jpg.webp?itok=ZJgf9sQq)
ఫైల్ ఫోటో
సాక్షి, కొవ్వూరు: రాష్ట్రవ్యాప్తంగా 27 ఫుడ్ పార్క్ పరిశ్రమలు మంజూరయ్యాయని, వాటిలో తొమ్మిది ఉభయ గోదావరి జిల్లాలో నెలకొల్పనున్నట్టు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి రామేశ్వర్ తెలిపారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్‌రామ్ మాట్లాడారు. ఏపీఈడీఏ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ, ఎంపీఈడీఏ మెరైన్ ప్రోడెక్ట్స్ డెవలప్‌మెంట్ అండ్ ఎక్స్‌పోర్టు అథారిటీ మంత్రిత్వ శాఖ ఏపీలో ఆహార సంస్కరణల పరిశ్రమలు మరిన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు.
గత రెండేళ్లలో ఏపీలో 200 ఆహార సంస్కరణల పరిశ్రమలు ఏర్పాటు కావడం వాస్తవమేనా అని అడిగారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పుడ్ పార్క్స్ ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆహార మంత్రిత్వ శాఖ ద్వారా ఫుడ్ పార్క్స్ పెట్టుబడిదారులకు కొల్లేటరల్ ఫ్రీ రుణాలు మంజూరుకు ఏ చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనికి స్పందించిన కేంద్ర ఆహార మంత్రి రామేశ్వర్ ప్రకటించారు. 27 ఆహార సంస్కరణ పరిశ్రమలకు రూ. 347.93 కోట్లను కేటాయిస్తున్నామని, దేశం మొత్తంలో 90 ప్రాసెసింగ్ ప్లాంట్స్ రిజిస్టర్ అయితే వీటిలో 27 పశ్చిమ గోదావరిలో ఉన్నట్లు తెలిపారు. ఆహార సంస్కరణల పరిశ్రమలు 2014–15లో 4,572, 2016–17లో 4,702కు పెరిగాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. రూ.6 వేల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంతో కలిపి మంజూరు చేసినట్టు మంత్రి రామేశ్వర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment