సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత 60 రోజుల పాలనలో రోజుకో హత్య జరుగుతోందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ఈ హత్యలకు ఎవరు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించకుండా ఎలా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. ఎవరు ఈ హత్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు. వాగ్నర్ గ్రూపు తరహాలో హత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు భద్రతను పెంచాలి, హోంశాఖకు తగిన నిధులు కేటాయించాలన్నారు.
అలాగే, తెలంగాణ నుంచి ఏపీ జెన్‌కోకు రూ. 7000 కోట్ల బకాయిలు రావాలి. ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ బకాయిలు ఇవ్వని నేపథ్యంలో పన్నుల వాటాలో కోత విధించాలి. ఏపీలో ఎన్డీఏ సీఎం, తెలంగాణలో కాంగ్రెస్ సీఎం మధ్య స్నేహం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఈ స్నేహం కొనసాగితే అంగీకరించం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను మేరకు నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇలా కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించాలి. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై జరిమానాలు వేయవద్దు. సమగ్రమైన జీవిత బీమా పథకాలు తీసుకురావాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment