finance bill
-
బడ్జెట్ కేటాయింపులు లేకుండా పోలవరం ఎలా పూర్తి చేస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత 60 రోజుల పాలనలో రోజుకో హత్య జరుగుతోందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ఈ హత్యలకు ఎవరు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించకుండా ఎలా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. ఎవరు ఈ హత్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు. వాగ్నర్ గ్రూపు తరహాలో హత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు భద్రతను పెంచాలి, హోంశాఖకు తగిన నిధులు కేటాయించాలన్నారు. అలాగే, తెలంగాణ నుంచి ఏపీ జెన్కోకు రూ. 7000 కోట్ల బకాయిలు రావాలి. ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ బకాయిలు ఇవ్వని నేపథ్యంలో పన్నుల వాటాలో కోత విధించాలి. ఏపీలో ఎన్డీఏ సీఎం, తెలంగాణలో కాంగ్రెస్ సీఎం మధ్య స్నేహం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఈ స్నేహం కొనసాగితే అంగీకరించం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను మేరకు నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇలా కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించాలి. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై జరిమానాలు వేయవద్దు. సమగ్రమైన జీవిత బీమా పథకాలు తీసుకురావాలి’ అని అన్నారు. -
మధ్యతరగతిపై పన్నుల భారాన్ని తగ్గించాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప.. వాళ్లకు ఒనగూరుతోంది ఏంటని? వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ఓవైపు ఆదాయపన్ను, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒనగురుతున్నది ఏంటి?. కేవలం రోడ్లు భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలి’’ అని ప్రసంగించారు.‘‘పెన్షన్‌పై ఎలాంటి పన్నులు వేయవద్దు. లక్ష రూపాయల వరకు పెన్షన్లు టాక్స్ ఫ్రీ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. సీనియర్ సిటిజన్లో కోసం ఐటీ ఫైలింగ్ కోసం ప్రత్యేక సహాయ యంత్రంగా ఏర్పాటు చేయాలి. పీపీఎఫ్ వడ్డీరేట్లు, ఎఫ్డీ రేట్లకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలి పొదుపును ప్రోత్సహించాలి. సరైన సమయంలో ఆదాయ పన్ను ఫైల్ చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని కేంద్రాన్ని కోరారాయన. వీటితో పాటు.. తక్కువ వడ్డీకే వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలని, అలాగే.. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని తగ్గించాలి అని ఆయన వైఎస్సార్సీపీ తరఫున కేంద్రాన్ని కోరారు. -
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్‌పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్‌లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్‌టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్‌చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్‌చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్‌లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్‌యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
ఏప్రిల్ 1 నుంచి ఎక్స్‌రే మెషిన్లపై సుంకాలు పెంపు
న్యూఢిల్లీ: ఎక్స్‌రే మెషిన్లపై దిగుమతి సుంకాలను పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే ఎక్స్‌రే మెషిన్లు, నాన్ పోర్టబుల్ ఎక్స్ రే జనరేటర్లపై సుంకాన్ని ఏప్రిల్ 1 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీటిపై 10 శాతం సుంకం అమల్లో ఉంది. ఫైనాన్స్ బిల్లు, 2023లో ఈ మేరకు మార్పులు చేశారు. లోక్ సభ శుక్రవారం దీన్ని ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయం భారత్ లో తయారీని ప్రోత్సహిస్తుందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
ఊగిసలాట కొనసాగుతుంది
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక బిల్లు సవరణ మార్కెట్లలో ఒడిదుడుకులకు ప్రధాన కారణమయ్యాయి. మార్కెట్ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్ సోల్డ్) ఉండటం వాస్తవం. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెరపైకి రావడంతో సెంటిమెంట్ బలపడలేకపోతుంది. అమ్మకాలు కొ నసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు నెలకొంటే ఎగువ స్థాయిలో 17,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గతవారంలో సెన్సెక్స్ 463 పాయింట్లు నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. ఇరుసూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలం పాటు 16,800–17,200 శ్రేణిలో ట్రేడవ్వొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. బ్యాంకింగ్ సంక్షోభం గత వారాంతాన జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ సంక్షోభ ఉదంతం తెరపైకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) ప్రీమి యం ఒక్కసారిగా పెరగడంతో ఈ బ్యాంక్ సైతం దివాలా బాట పటొచ్చని ఊహాగానాలు నెలకొన్నాయి. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రంగంలో జరిగే ప్రతి పరిణామాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ఐఐలు ఈ మార్చి 20–24 తేదీల మధ్య రూ.6,654 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఈ మార్చిలో సంస్థాగత ఇన్వెస్టర్లు మొతం్త రూ.9,430 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. -
ట్యాక్స్‌పేయర్లకు కొంత ఊరట..
న్యూఢిల్లీ: ఆదాయం రూ. 7 లక్షలకన్నా స్వల్పంగా ఎక్కువుండి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 7 లక్షల పరిమితిని దాటిన మొత్తానికి మాత్రమే పన్ను విధించేలా ఆర్థిక బిల్లును సవరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం ఉండదు. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) కానీ రూ. 7,00,100 ఉంటే మాత్రం రూ. 25,010 మేర పన్ను కట్టాల్సిరానుంది. అంటే రూ. 100 ఆదాయానికి రూ. 25,010 పన్ను భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిమితికన్నా ఆదాయం కాస్త ఎక్కువ ఉంటే, దానికి మించి పన్ను భారం ఉండరాదంటూ స్వల్ప ఊరటను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఎంత మేర అధిక ఆదాయానికి ఇది వర్తిస్తుందనేది ప్రభుత్వం నిర్దిష్టంగా వివరించలేదు. సుమారు రూ. 7,27,700 వరకు ఆదాయం ఉన్న వారికి దీనితో ప్రయోజనం ఉండగలదని నాంగియా ఆండర్సన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత -
Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది. శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం! డెట్ ఎంఎఫ్లపైనా.. తాజా బిల్లు ప్రకారం డెట్ ఎంఎఫ్ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్ గెయిన్) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఎంఎఫ్ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్లకు ప్రస్తుతం ఇండెక్సేషన్ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) ట్యాక్స్ వర్తిస్తోంది. ఆశ్చర్యకరం ఎల్టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ చీఫ్ ఎ.బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా నాబార్డ్ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద సబ్స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్వీస్ ఏఎంసీ హెడ్ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్ కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్ ఫండ్ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. డెట్ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదనపు లావాదేవీ చార్జీలు రద్దు ఏప్రిల్ 1 నుంచి ఎన్ఎస్ఈ అమలు ఈక్విటీ నగదు, డెరివేటివ్స్ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ తాజాగా తెలియజేసింది. ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్(ఐపీఎఫ్టీ) మూలధనాన్ని(కార్పస్) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్ఎస్ఈ విధించింది. -
రెండో విడత పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ, అదానీ వ్యవహారం, రాజకీయ ప్రత్యర్థు్టలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. వ్యూహరచన చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం సమావేశం కానున్నాయి. అదానీ–హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌ను తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకుడు కె. సురేశ్ చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల్లో సీబీఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీ నాయకులపైకి ప్రయోగిస్తోందన్న అంశం కూడా ఈ సారి సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. మార్చి 13న మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. సహకరించండి: ఉపరాష్ట్రపతి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ నిర్వహణపై విపక్ష నేతల నుంచి సూచనలు, సలహాలను కోరారు. సమావేశానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, విజయ సాయిరెడ్డి (వైఎస్సార్సీపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్) రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కె.రవీంద్రకుమార్ (టీడీపీ), కేశవరావు (బీఆర్ఎస్)లతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ డిమాండ్లను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధన్‌ఖఢ్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్లు విజయసాయిరెడ్డి, భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సుసరేంద్ర సింగ్ నగార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రతి అంశంపైనా చర్చకు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బాధ్యునిగా చేసేందుకు నిర్మాణాత్మకపాత్ర పోషిస్తాయని అన్నారు. -
Rajya Sabha: స్టీల్‌ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం
సాక్షి, ఢిల్లీ: ప్రైవేటీకరణకు పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్‌కి వెయ్యి కోట్ల లాభాలు వచ్చాయి. లాభాల్లో ఉన్న పీఎస్‌యూలను ప్రైవేటీకరణ చేయవద్దు. సొంత గనులను కేటాయించకపోవడం, హక్కులను పునర్వ్యవస్థీకరించకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని’’ ఎంపీ అన్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఎలాంటి సంస్కరణలు చేయలేక పోవడం శోచనీయం. హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ తగ్గించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: మనసుకి కష్టంగా ఉంది: సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం 20,928 కోట్ల నుంచి 26,264 కోట్ల రూపాయలకు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 20,928 కోట్ల రూపాయలతో చేపట్టే విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌కు జూలై 2016లో హెచ్పీసీఎస్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పనులు 2020 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్ట్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సవరించిన లక్ష్యం ప్రకారం ప్రాజెక్ట్ పనులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 26,785 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ దిగుమతులు ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 వరకు 26,785 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎం) ద్రవరూప సహజ వాయువును దిగుమతి చేసుకున్నట్లు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 31,137 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో (ఆన్‌షోర్‌లో) 2016-17 నుంచి 2020-21 వరకు 4,647 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2017-18లో 32 వేల మెట్రిక్ టన్నుల సీఎన్జీ అమ్మకాలు జరగ్గా 2020-21లో అది 13 వేల మెట్రిక్ టన్నులకు తగ్గాయని చెప్పారు. కోవిడ్ కారణంగా సీఎన్జీ అమ్మకాలు తగ్గినట్లు తెలిపారు. 2021-22లో సీఎన్జీ అమ్మకాలు పుంజుకుని 14 వేల మెట్రిక్ టన్నులకు చేరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, విజయవాడ, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు, కోలార్, వెల్లూరు జిల్లాల్లో కలిపి మొత్తం 111 సీఎన్జీ స్టేషన్లు ఉన్నట్లు మంత్రి వివరించారు. -
డిజిటల్ ట్యాక్స్‌పై కేంద్రం వెనకడుగు
న్యూఢిల్లీ: సమాన అవకాశాలు కల్పించే దృష్టితో విదేశీ ఈ కామర్స్ సంస్థలపై అమలు చేస్తున్న 2 శాతం డిజిటల్ పన్ను విషయంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. భారత అనుబంధ విభాగాల ద్వారా విదేశీ ఈ కామర్స్ సంస్థలు విక్రయాలు నిర్వహిస్తే డిజిటల్ పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన ఆర్థిక బిల్లు 2021లో కేంద్రం స్పష్టతనిచ్చింది. భారత్‌లో శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నా లేదా ఇక్కడ ఆదాయపన్ను చెల్లిస్తున్నా 2 శాతం సమానత్వలెవీని చెల్లించక్కర్లేదని కేంద్రం పేర్కొంది. అయితే భారత్‌లో ఆదాయపన్ను చెల్లించకుండా ఈ కామర్స్ విక్రయాలు చేపట్టే విదేశీ సంస్థలపై ఇక ముందూ 2 శాతం పన్ను కొనసాగుతుందని స్పష్టం చేసింది. వార్షిక ఆదాయాలు రూ.2 కోట్లు దాటిన విదేశీ సంస్థలపై డిజిటల్ ట్యాక్స్‌ను 2020 ఏప్రిల్‌లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం గమనార్హం. ‘సవరణ ద్వారా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. భారత్‌లో నివసించే వారికి సంబంధించిన వస్తువులపై సమానత్వ పన్ను అమలు కాదు. భారత్‌లో పన్నులు చెల్లించే భారత వ్యాపార సంస్థలు.. అదే సమయంలో భారత్‌లో ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఈ–కామర్స్ విక్రయాలు నిర్వహించే విదేశీ కంపెనీల మధ్య సమాన అవకాశాల కోణంలోనే దీన్ని ప్రవేశపెట్టాం’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. డిజిటల్ ట్యాక్స్ అన ్నది అమెరికా కంపెనీల పట్ల వివక్ష చూపించడమేనంటూ అమెరికా గతంలో ఆరోపించింది. భారత రేటింగ్ తగ్గదు భారత్‌కు పెట్టుబడుల రేటింగ్ కొనసాగుతుందని.. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు అవకాశాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అధిక జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యలోటు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచే అంశాలుగా పేర్కొన్నారు. యూపీఏ హయంలో 2009–14 మధ్య సగటు జీడీపీ 6.7 శాతంగా ఉంటే, ఎన్డీఏ హయాంలో 2014–19 మధ్య 7.5 శాతంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ హయంలోని యూపీఏ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యçస్తం చేయగా, మోదీ సర్కారు దీన్ని సరైన దారిలో పెట్టినట్టు తెలిపారు. ఆర్థిక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆర్థిక బిల్లు 2021కి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. చర్చలో భాగంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతారామన్ సమాధానమిచ్చారు. చర్చ అనంతరం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బడ్జెట్ 2021–22కు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. పీఎఫ్ సభ్యులకు పన్ను లేని చందా రూ.5 లక్షలకు పెంచడం సహా పలు సవరణలను బిల్లులో ప్రతిపాదించారు. -
లోక్ సభలో ఆర్ధిక బిల్లు 2021 పై చర్చ
-
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫైనాన్స్ బిల్లుతో పాటు పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(సవరణ) బిల్లు, విద్యుత్(సవరణ) బిల్లు, క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు.. తదితర కీలక బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. కీలకమైన పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇదే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు సభ్యుల హాజరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జాతీయ పార్టీల సీనియర్ నాయకులతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ భేటీలకు గైర్హాజరయ్యే అవకాశముంది. తొలివిడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. -
పెట్రోల్, డీజిల్‌పై ముందుంది మరింత బాదుడు
న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.18 వరకు, డీజిల్‌పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. సవరణ ముందు వరకు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.10, డీజిల్‌పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పార్లమెంట్ నిరవధిక వాయిదా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్‌పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ► స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది. ► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. -
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రజలపై పన్ను భారం తగ్గించడం, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే బడ్జెట్ ప్రతిపాదనల లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు తెలిపారు. అయితే, పెట్రోల్, డీజిల్‌పై సెస్‌తోపాటు, క్యాష్ విత్డ్రాయల్స్పై 2 శాతం టీడీఎస్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను మాత్రం ఆమె తిరస్కరించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధనకు ఈ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. కాగా, చట్టపరమైన కార్యక్రమాలు మిగిలి ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలను రెండు, మూడు రోజులు పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ‘పార్లమెంట్ సమావేశాలను రెండు లేక మూడు రోజులపాటు పొడిగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై బీజేపీ నేతలు ప్రతిపక్షాలతో చర్చించనున్నారు’ అని అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 17వ తేదీన మొదలైన 17వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. -
ఆందోళనల మధ్య బడ్జెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు 8వ రోజు కూడా కొనసాగాయి. సభ్యుల నిరసన మధ్యే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ఎటువంటి చర్చా లేకుండానే లోక్‌సభ ఆమోదించింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ప్రారంభించారు. ఈ గొడవ మధ్యనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేవలం 25 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ వెంటనే సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో మోదీ ప్రభుత్వం ఐదోది, ఆఖరు బడ్జెట్ ఆమోదం పొందినట్లయింది. ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించకున్నా ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు. రాజ్యసభలో ఉదయం నుంచి విపక్షాలు ఆందోళన చేయటంతో గురువారానికి వాయిదావేశారు. -
ఆర్థిక బిల్లుకు ఆమోదం: లోక్‌సభ రేపటికి వాయిదా
సాక్షి,న్యూఢిల్లీ: 2018 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆర్థికబిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే 21 సవరణలు, 3 కొత్త క్లాజులతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను సప్లిమెంటరీ డిమాండ్లను సభ ఆమోదించింది. అనంతరం లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. కాగా ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, వివిధ సమస్యలపై పలు పార్టీలు ఆందోళన చేయడంతో లోక్‌సభ ఎనిమిదో రోజు కూడా అట్టుడికింది. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభను స్పీకర్ సుమిత్రామహాజన్ కొంతసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం ఫైనాన్షియల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో లోక్‌సభ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. -
ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఐదు సవరణల్ని ప్రతిపాదించిన ప్రతిపక్షాలు, మళ్లీ లోక్‌సభకు బిల్లు న్యూఢిల్లీ: ఐదు సవరణలతో ఆర్థిక బిల్లు– 2017ను రాజ్యసభ ఆమోదించింది. ఈ పరిణామంతో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ఐదు సవరణల్ని అడ్డుకోలేకపోయింది. దీంతో సవరణల ఆమోదం కోసం బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. మొత్తం ఐదు సవరణల్లో మూడింటిని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్, రెండింటిని సీతారాం ఏచూరీ(సీపీఎం) ప్రతిపాదించారు. ఓటింగ్ ప్రారంభానికి ముందే 10 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ మైనార్టీలో కొనసాగుతోంది. సభలో బీజేపీకి 56 మంది సభ్యులుండగా ఎన్డీఏకు మొత్తంగా 74 మంది ఉన్నారు. అంతకముందు ఆర్థిక బిల్లుపై చర్చకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ.. వివిధ పథకాల లబ్ధికి ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల్ని సమర్ధించారు. ఈ విధానంతో మోసాలతో పాటు పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. ఆధార్‌ను తీసుకొచ్చిన ఘనత యూపీఏదే అని.. దాని మరింత విస్తరించడం ఎన్డీఏ ప్రభుత్వ విధి అని చెప్పారు. గతంలో ఆధార్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లో కొందరి సభ్యులకు అనుమానాలుండేవని, ప్రధానికి సమర్పించిన నివేదికతో ఆ సందేహాలు తొలగిపోయాయని తెలిపారు. లోక్‌పాల్ నియామకంలో జాప్యంపై లోక్‌సభలో ప్రతిపక్షం ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన వివరాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి జైట్లీ స్పందిస్తూ.. లోక్‌పాల్ నియామకానికి అవసరమైన చట్ట సవరణల్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 2013తో పోల్చితే 2015లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలు 89 శాతం తగ్గాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2013 లో 1,51,841 నియామకాలు చేస్తే.. 2015లో15,877 నియమాకాలే జరిగాయని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. -
రాజ్యసభలో ఆర్థిక బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కీలకమైన ఆర్థిక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు సభ ఆమోదించింది. అంతకు ముందు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుపై కాంగ్రెస్ పార్టీ పలు సవరణల ప్రతిపాదించింది. బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి ఓటింగ్ కోరారు. దీనిపై ఓటింగ్ అనంతరం ఆర్థిక బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కాగా ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
ఒకే ఒక కార్డు... ఆధార్: జైట్లీ
-
ఒకే ఒక కార్డు... ఆధార్: జైట్లీ
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీ, పాన్ లాంటి కార్డుల స్థానాల్లో ఆధార్ ఒక్కటే గుర్తింపు కార్డుగా మిగిలిపోయే రోజు రావొచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక బిల్లు, పలు చట్టాలకు 40 సవరణలు చేయడానికి సంబంధించి బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ...‘భవిష్యత్‌లో ఆధార్ ఒక్కటే గుర్తింపు కార్డుగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఇతర దేశాల్లో తలెత్తాయి. అమెరికాలో సామాజిక భద్రతా సంఖ్య లాంటిదే మన ఆధార్ సంఖ్య’ అని అన్నారు. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు, పాన్ దరఖాస్తుకు ఆధార్‌ను తప్పనిసరిచేయడంపై స్పందిస్తూ...పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడానికే ఈ ఏడాది పన్ను శ్లాబులను తగ్గించామని వెల్లడించారు. ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలు ఉండటం వల్ల అది దుర్వినియోగమయ్యే అవకాశాలు తక్కువేనని తెలిపారు. యూనివర్సిటీ సర్టిఫికెట్లకూ ఆధార్ ఇకపై విద్యార్థుల సర్టిఫికెట్లకు వారి ఫొటో సహా ఆధార్ నంబర్‌ను జతచేయాలని దేశంలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల యాజమా న్యాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. దీనివల్ల విద్యార్థుల మార్క్షీట్లు, సర్టిఫికెట్లలో భద్రతతో పాటు నకిలీ పత్రాలను అరికట్టవచ్చని యూజీసీ సెక్రటరీ జేఎస్ సంధు తెలిపారు. -
ముగిసిన తొలిదశ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి దశ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. మలి దశ సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2తో ముగుస్తాయి. జనవరి 31న ప్రారంభమైన తొలి దశలో భాగంగా లోక్‌సభ ఏడుసార్లు, రాజ్యసభ ఎనిమిది సార్లు సమావేశమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఇరు సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ పూర్తయిందని, లోక్‌సభ సమావేశాలు 113 శాతం, రాజ్యసభ సమావేశాలు 97 శాతం ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మొదటి దశ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో పాటు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు, పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు, స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల బిల్లు, ఐఐఎం బిల్లు, రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వీటిలో పేమెంట్ ఆఫ్ వేజెస్ బిల్లును ఇరు సభలు ఆమోదించాయి. -
మ్యాట్‌పై ఉన్నత స్థాయి కమిటీ: జైట్లీ
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడిదారుల భయాలను పోగొట్టడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) చెల్లింపుల వివాదాస్పద అంశాన్ని అత్యున్నత స్థాయి కమిటీ ఒకటి పరిశీలిస్తుందని, తగిన సూచనలు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పేర్కొన్నారు. రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, మ్యాట్‌తో పాటు పన్నులకు సంబంధించి నెలకొన్న పలు వివాదాస్పద అంశాలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ఈ కమిటీకి లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా నేతృత్వం వహిస్తారని కూడా వెల్లడించారు. కమిటీ చేసిన సూచనల ప్రకారం కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రూ. లక్ష దాటిన చెల్లింపుల విషయంలో పాన్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు. -
‘పోంజీ’ బాధితులకు పరిహారం!
చట్ట సవరణ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల్లో(పోంజీ స్కీమ్స్) నష్టపోయిన వారికి ఊరట కలిగించే కీలక సంకేతాన్ని కేంద్రం ఇచ్చింది. శారద తరహా పథకాల్లో మోసానికి గురైన వారికి నష్టపరిహారం అందేలా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)కు సవరణలు చేస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ శుక్రవారం ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ (ఈడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన మదుపుదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా. నష్టపోయిన విలువ దాదాపు రూ.80,000 కోట్లుగా భావిస్తున్నారు. ఆయా అంశాలను శక్తికాంత దాస్ ప్రస్తావిస్తూ... ఐబీ, సీబీఐ, కస్టమ్స్, డీఆర్ఐ, ఆదాయపు పన్ను శాఖ, ఈడీ వంటి వివిధ విచారణా సంస్థల మధ్య చక్కటి సమన్వయం, సహకారం ద్వారా మోసపూరిత పథకాలను నిరోధించవచ్చని అన్నారు. ఫైనాన్స్ బిల్లులో చొరవ... ఫైనాన్స్ బిల్లులో పోంజీ స్కీమ్‌ల నిరోధానికి సంబంధించి నిబంధనలు ఉన్నట్లు పేర్కొంటూ, అయితే ఈ విషయం తగినంత ప్రచారం కాలేదని అన్నారు. పోంజీ స్కీమ్‌ల బాధితులకు పరిహారం కల్పించేలా చర్యలకు ఒక నిబంధన ఫైనాన్స్ బిల్లులో ఉందన్నారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన వారికి పరిహారం అందించడం... కోర్టుల పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించి రానున్న కాలంలో తగిన మార్గదర్శకాలు, నిబంధనలను వెలువరించనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను చట్ట నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేటే కఠిన చర్యలు తీసుకునేలా పీఎంఎల్ఏలో సవరణల అంశం ఫైనాన్స్ బిల్లులో మరో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
-
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
* ఏకగ్రీవంగా ఆమోదించిన ఉభయసభలు * బక్రీద్, రంజాన్, క్రిస్మస్లకు రెండురోజుల చొప్పున సెలవులు * బిల్లుకు మద్దతిస్తూనే వాకౌట్ చేసిన టీడీపీ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యవినిమయ బిల్లును శుక్రవారం శాసనసభ, శాసనమండలి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఉభయసభల్లో బిల్లుపై విస్తృత చర్చ జరిగింది. అయితే, బిల్లుకు టీడీపీ మద్దతు పలుకుతూనే... తమ సభ్యుడు రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది. బిల్లుపై ఓటింగ్ కోరుతామని విప్ జారీ చేసిన కాంగ్రెస్, చివరి క్షణంలో మద్దతు తెలిపింది. అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బిల్లుపై సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. సభ్యులు చేసిన కొన్ని సూచనలను ముఖ్యమంత్రి ఆమోదించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎలా అధిగమిస్తారో ఆయన వివరించారు. సంక్షేమ పథకాల కొనసాగింపు, పెన్షన్లు, రేషన్‌కార్డుల్లో కోతలు లేకుండా ఇవ్వడం, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక పరిస్థితి, రోడ్ల నిర్మాణం, 108, 104 సర్వీసులను మెరుగుపరచడం వంటి అంశాలను సోదాహరణంగా వివరించారు. వాటర్‌గ్రిడ్ ద్వారా నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతి గుడిసెకు, ఇంటికి కొళాయిల ద్వారా నీటిని అందించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని పునరుద్ఘాటించారు. ‘‘సహనం ఉండాలని కొందరు నాకు సలహాలిస్తున్నారు. ఉప్పూకారం తింటున్నాం. హద్దులు మీరితే (బియాండ్ లిమిట్ పోతే) విమర్శలపై తగిన విధంగా స్పందిస్తాం’అని స్పష్టం చేశారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా... ‘ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి ధైర్యం, సాహసం కావాలి. ప్రజల క్షేమాన్ని కాంక్షించి ప్రతిష్టాత్మకంగా వీటి ని చేపడుతున్నాం. తెలంగాణకు వాటా ప్రకారం రావాల్సిన విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తొండాట కొనసాగిస్తూనే ఉంది. కేంద్రం నిర్ణ యాత్మకంగా వ్యవహరించడం లేదు. ఏపీ నుం చి తెలంగాణకు విద్యుత్ వాటా రాకపోతే, మేం కూడా ఏపీకి వాటా ఇవ్వబోము. కృష్ణపట్నం నుంచి నేటికి 650 మెగావాట్లు ఏపీ ఉత్పత్తి చేస్తున్నా తెలంగాణకు 6 మెగావాట్లు కూడా ఇవ్వడం లేదు. ఏపీ నుంచి విద్యుత్ వస్తే 2700 మెగావాట్లు ఉంటుంది. తెలంగాణ వాటా ఇవ్వకపోతే 2000 మెగావాట్లు ఉంటుంది. త్వరలోనే అఖిల పక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలుసుకుని సమస్యలపై చర్చిద్దాం. అమరులను గౌరవించలేని కుసంస్కారం మాది కాదు. (మృతుల) లెక్కలింకా తేలలేదు. వివరాలు వచ్చినకాడికి పరిహారం ఇవ్వాలని చెప్పాం’ అని కేసీఆర్ వివరించారు. 108 సర్వీసు బ్రహ్మాండం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా, 108 సర్వీసు బ్రహ్మాం డంగా పనిచేసిందని కేసీఆర్ చెప్పారు. ‘ఎవరు మంచి పని చేసినా అభినందించాల్సిందే. నేను తెలంగాణ ఉద్యమంలో పరకాల దగ్గర ఉండగా ప్రమాదం జరిగితే, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళితే మంచిదని ఆగాను. అంతలో పక్కనున్న యువకులు 5 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుం దని చెప్పారు. చూస్తుండగానే 108 సర్వీసు వచ్చింది. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేలా ఆ సర్వీసు నడిచింది. వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 104 సర్వీసు ద్వారా గ్రామీణప్రాంతాల్లోని గర్భిణులు, నిరుపేదలకు షుగర్,బీపీ, రక్తహీనత, ఇతరాలకు మంచి సేవలను అందించార’ని సీఎం తెలిపారు. 108, 104 సర్వీసులను క్రమబద్ధీకరించి 411 ఉన్న వాహనాల ను 927కు పెంచబోతున్నామని చెప్పారు. ‘కొత్త 108 సర్వీసులను చూసి ప్రజలు సంతోషిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులకు (ఉస్మానియా,గాంధీ,నీలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జు,42 ఏరియా ఆసుపత్రులు) మొత్తం 400 కోట్ల మేర కేటాయించాం. ఆరోగ్యశ్రీ కింద ఉద్యోగులకు ఎలాం టి ప్రీమియం లేకుండా దేశంలోకాని, మరే రా ష్ర్టంలో కాని లేని విధంగా రూ. 323కోట్లతో పథకాన్ని అమలుచేస్తున్నాం. క్రిస్మస్, రంజాన్, బక్రీద్లకు ఇకపై రెండురోజుల చొప్పున ప్రభుత్వ సెలవులు ఉంటాయని ప్రకటించారు అదనంగా ఒకరోజు సెలవు తీసుకున్నందుకు రెండో శని వారం సెలవుదినాల్లో పని చేయాలన్నారు. రెండు విడతల్లో రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మరో రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారు. మూడు విడతలుగా రైతుల రుణ మాఫీ చేస్తామన్నారు. పెన్షన్లలో, ఎలాంటి కోత విధించబోమన్నారు. బియ్యం కార్డులను గుంజుకోబోమని, ఏడాదికి మూడు, నాలుగు వేల కోట్ల రూపాయ ల భారం పడినా పెన్షన్లు ఇస్తామన్నారు. హైదరాబాద్‌తో సహా వరంగల్,నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో 50, 60, 70 గజాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రెవెన్యూ లోటుపై గణాంకాలేవి: అక్బర్ రెవెన్యూ మిగులు లోటుపై ప్రభుత్వం ఎలాంటి గణాంకాలు ఇవ్వలేదని అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్) ఆరోపించారు. ఈ ఆరునెలల ఆదాయ, వ్యయాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్లకు రెండురోజుల వంతున సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నాళ్లీ తప్పటడుగులు: కిషన్‌రెడ్డి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తూ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీజేపీ సభ్యు డు కిషన్‌రెడ్డి అన్నారు. సభ్యుల హక్కులను స్పీకర్ కాపాడి రక్షణగా ఉండాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయమేది: తాటి కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రకటించాలని తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ) డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ,.బీసీ,మైనారిటీల ఉపకార వేతనాలు పెంచాలని, పిజీ,డిగ్రీ విద్యార్థులకు రూ.3 వేలు, స్కూలు విద్యార్థులకు రూ.2వేలు చొప్పున చెల్లించాలని సున్నం రాజయ్య (సీపీఎం) కోరా రు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారని బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ఎస్) అన్నారు. సభలో సంవాదం... ‘ప్రభుత్వ స్టీరింగ్, బ్రేకులు తన వద్దే ఉన్నాయని ఒక నేత ప్రకటించారు. దానిపై ఏ మని స్పందిస్తారు?’ అన్న బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బలాల అభ్యంతరం చెప్పారు. ‘నా కారు నేనే నడిపిస్తా. బ్రేకులు నా అధీనంలో ఉంటాయి’ అని తమ అధ్యక్షుడు అసదుద్దీన్ చెప్పినదాన్ని ఒక పత్రికలో వక్రీకరించారన్నారు. బీజేపీ సభ్యులు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మక్కామసీదు పేలుళ్లకు పాల్పడినవారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తానెవరి పేరూ ప్రస్తావించలేదని, పత్రికలో వచ్చిందే చెబుతున్నానని కిషన్‌రెడ్డి స్పందించారు. హిందువులను, దేవాలయాలను కించపరుస్తున్న వారు మాకు నీతులు చెబుతారా అంటూ నిలదీశారు. మండలిలో బిల్లు పెట్టిన మంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు యాదృచ్ఛిక ఖర్చులకు సంబంధించిన కంటింజెన్సీ బిల్లు, టీఎస్-ఐపాస్ బిల్లులను మండలిలో అన్ని పక్షాలూ మద్దతు పలికాయి. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఆమోదానికి విపక్షాలు సహకరించాలని కోరుతూ.. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బిల్లును ప్రతిపాదించగా విపక్షనేత డి. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నేత నర్సారెడ్డి, మజ్లిస్ నాయకుడు హైదర్ రజ్వీ తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ బిల్లును శాసన మండలి ఆమోదించినట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
తెలంగాణ బిల్లు ఆర్థికపరమైన బిల్లే....
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. విభజన బిల్లు ద్వారా వివిధ ప్రాంతాలకు, కొత్త రాజధానికి నిధులు కూడా కేటాయించాల్సి ఉంటుందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అందుకనే తెలంగాణ బిల్లు... ఆర్థికపరమైన బిల్లేనని కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లు కాదని కేంద్ర మంత్రి చిదంబరం గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతం పెడుతున్న బిల్లులో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అవుతోంది. ఆర్థిక బిల్లు అవుతుందా, లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహాను కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ ముందుకు రావాల్సిన బిల్లు వెనక్కి వెళ్లింది. రేపు కూడా బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎల్లుండి గురువారం తొలుత లోకసభలో బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.