
న్యూఢిల్లీ: ఎక్స్‌రే మెషిన్లపై దిగుమతి సుంకాలను పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే ఎక్స్‌రే మెషిన్లు, నాన్ పోర్టబుల్ ఎక్స్ రే జనరేటర్లపై సుంకాన్ని ఏప్రిల్ 1 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం వీటిపై 10 శాతం సుంకం అమల్లో ఉంది. ఫైనాన్స్ బిల్లు, 2023లో ఈ మేరకు మార్పులు చేశారు. లోక్ సభ శుక్రవారం దీన్ని ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయం భారత్ లో తయారీని ప్రోత్సహిస్తుందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment