
టారిఫ్‌లపై ట్రంప్ ఉత్తర్వు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి.. ఆయా దేశాలపై వారితో సమానంగా టారిఫ్‌లు విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంతమొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో.. అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతులపై తాము దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.
ట్రంప్ నిర్ణయం.. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ‘ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. వారితో సమానంగా వడ్డించే సమయం వచ్చింది’ అని ట్రంప్ అంతకుముందు తన సొంత సోషల్‌మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’లో గురువారం పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు ట్రంప్ తాజా నిర్ణయం మింగుడుపడనిదే. భారీగా సుంకాలు విధిస్తే.. మార్కెట్‌లో ధరలు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment