Import Duties
-
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్‌లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్‌లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్‌లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్‌లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
ఏప్రిల్ 1 నుంచి ఎక్స్‌రే మెషిన్లపై సుంకాలు పెంపు
న్యూఢిల్లీ: ఎక్స్‌రే మెషిన్లపై దిగుమతి సుంకాలను పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే ఎక్స్‌రే మెషిన్లు, నాన్ పోర్టబుల్ ఎక్స్ రే జనరేటర్లపై సుంకాన్ని ఏప్రిల్ 1 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీటిపై 10 శాతం సుంకం అమల్లో ఉంది. ఫైనాన్స్ బిల్లు, 2023లో ఈ మేరకు మార్పులు చేశారు. లోక్ సభ శుక్రవారం దీన్ని ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయం భారత్ లో తయారీని ప్రోత్సహిస్తుందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
-
వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట
న్యూఢిల్లీ: వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ ఈడీ బీవీ మెహతా తెలిపారు. -
వజ్రాలు, రత్నాలు కొనేవారికి కేంద్రం శుభవార్త..!
న్యూఢిల్లీ: మీరు వజ్రాలు, రత్నాలు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలోప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్లో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పాలిష్ చేయని వజ్రాలపై ఎలాంటి దిగుమతి సుంకం ఉండదని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ మేరకు వజ్రాలు, రత్నాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్, రత్నాలపై 7.5 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. లోక్ సభలో 2022-23 బడ్జెట్ సమర్పించిన సీతారామన్, ఈ కామర్స్ ద్వారా ఆభరణాల ఎగుమతి చేయడానికి ప్రభుత్వం సులభతరం విధానాన్ని ఈ ఏడాది జూన్ నాటికి తీసుకొని రానున్నట్లు ప్రకటించారు. తక్కువ విలువ కలిగిన అనుకరణ ఆభరణాల దిగుమతులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకాన్ని కిలోకు కనీసం రూ.400 చెల్లించే విధంగా సిఫారసు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనపై ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పెతే మాట్లాడుతూ.. "మొత్తం మీద బడ్జెట్ 2022-23 సానుకూలంగా కనిపిస్తోంది. కానీ, ఈ బడ్జెట్లో పరిశ్రమకు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు ఏమీ లేవు. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకంలో కోత తప్ప" అని ఆయన అన్నారు. కేంద్రం వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ రంగానికి చెందిన షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. (చదవండి: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!) -
ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రావాలంటే..ఇలా చేయాల్సిందే..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. టెస్లా లాంటి కంపెనీలు భారత్‌లోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తుండగా...అధిక దిగుమతి సుంకాలతో టెస్లా ఏంట్రీ కాస్త నెమ్మదించింది. ఇతర విదేశీ కంపెనీలు కూడా భారత్‌లోనే అడుగుపెట్టేందుకు సన్నహాలను చేస్తున్నాయి. కాగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకోవాలని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సూచించింది. ఒక నిర్ణీత కాలం పాటు లేదా పరిమిత యూనిట్లపై ఇంపోర్ట్ టాక్స్ తగ్గించాలని బీఎండబ్ల్యూ పేర్కొంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బీఎండబ్ల్యూ వెల్లడించింది. తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం..! అధిక దిగుమతి సుంకాలు తగ్గితే...భారత్‌లోనే పలు దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉందని బీఎండబ్ల్యూ అభిప్రాయపడింది. బీఎండబ్ల్యూ వాహనాలకు భారత్‌లో క్రేజ్ ఉండడంతో గత 15 ఏళ్లుగా తమ కంపెనీ భారత్‌లోనే పలు మోడళ్లను తయారు చేస్తోందని బీఎండబ్ల్యూ తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో మూడు విద్యుత్తు కార్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు బీఎండబ్ల్యూ ఇటీవల ప్రకటించింది. విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు 100 శాతం వరకు..! విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. చదవండి: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం -
టెస్లా కంపెనీకి భారత్ భారీ షాక్!
అమెరికా వాహనాల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లో టెస్లాకు కంపెనీ సంబంధిత ప్రోత్సహకాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దిగుమతి సుంకంపై టెస్లాకు ఎలాంటి రాయితీలు ఉండబోవని, భవిష్యత్తులో అవి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో మన దేశంలోని బెంగళూరులో స్థానికంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇండియా అధిక దిగుమతి సుంకాలపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్వీటేసిన మరుసటి రోజే.. కేంద్రం నుంచి ఇలాంటి ప్రతికూల సంకేతాలు రావడం విశేషం. ఈ మేరకు ఓ ప్రముఖ బిజినెస్ సైట్‌తో మాట్లాడిన సీనియర్ అధికారి ఒకరు.. ఆదివారం టెస్లా అభ్యంతరాలపై స్పందించారు. ఇండియాలో టెస్లా ఎంట్రీపై ఓ ఇండియన్ ట్విటర్ చేసిన ట్వీట్‌కు జులై 24న ఎలన్ మస్క్ బదులిచ్చాడు. భారత్ అధిక దిగుమతి సుంకాల వల్లే ఈ-వెహికిల్ మేకర్ అయిన తమకు ఎంట్రీ ఆటంకంగా మారిందని చెప్పాడు. అంతేకాదు ఒకవేళ టెస్లా వెహికిల్స్ దిగుమతికి లైన్ క్లియర్ అయితే.. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చాడు కూడా. అంతకు కొన్నిరోజుల ముందు రూటర్స్లో ఓ కథనం.. ‘మస్క్ ఈ మేరకు భారత ప్రభుత్వంతో లాబీయింగ్ నడుపుతున్నాడ’ని పేర్కొంది. అయితే దేశంలో ఇప్పటికే ఈ-వెహికిల్స్ మీద సెక్టోరల్ ఇన్సెంటివ్స్.. అది కూడా స్థానిక(డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్) కంపెనీలకే వర్తిస్తాయని స్పష్టం చేశాడు ఆ సీనియర్ అధికారి. ప్రస్తుతం సుమారు 30 లక్షల విలువ కంటే వాహనాలపై 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది భారత ప్రభుత్వం. దీంతో రీజనబుల్ ధరలతో టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టెస్లా మెయిన్ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40000 డాలర్ల కంటే తక్కువగా ఉంది. ఈ మేరకు సుంకాన్ని తగ్గించాలని టెస్లా కంపెనీ భారత ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాయడం విశేషం. -
దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రాన్ని కోరిన టెస్లా
Tesla Car: టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను(ఈవీలు) పెద్ద ఎత్తున తగ్గించాలని కోరుతూ టెస్లా ఇంక్ భారత మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. దిగుమతి సుంకాలను తగ్గిస్తే డిమాండ్ పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని కొందరి నిపుణుల అభిప్రాయం. అయితే, స్థానికంగా ఉత్పత్తుల తయారిని పెంచే ప్రయత్నంలో భాగంగా అనేక పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులపై అధిక దిగుమతి పన్నులను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విధించింది. గతంలో కూడా ఇతర లగ్జరీ ఆటోమేకర్లు దిగుమతి చేసుకున్న కార్లపై పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. భారతదేశంలో ఈ ఏడాది నుంచి అమ్మకాలను ప్రారంభించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రిత్వ శాఖలకు, ప్రముఖ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ రాసిన లేఖలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులపై ఫెడరల్ పన్నులను 40%కు తగ్గించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది. టెస్లా యుఎస్ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర $40000 కంటే తక్కువగా ఉంది. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో మన దేశంలోని బెంగళూరులో స్థానికంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. భారత రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మార్చిలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో టెస్లా ఉత్పత్తి వ్యయం చైనాలో కంటే తక్కువగా ఉండేలా చూడటానికి భారతదేశం ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉందని, కానీ స్థానికంగా తయారు చేస్తే మాత్రమే అని పేర్కొన్నారు. -
తగ్గనున్న పామాయిల్ ధర.. మరి మిగితావో ?
హైదరాబాద్ : భగ్గుమంటున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మండిపోతున్న వంట నూనె ధరలు.... ఇలా పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులకు ఊరట కలిగించే చర్య తీసుకుంది కేంద్రం. వంటలో ఉపయోగించే పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని తగ్గించింది. మూడు నెలల పాటు ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకునేది మన దేశమే. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఏటా 8,50,000 టన్నుల పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతిపై మన ప్రభుత్వం 15 శాతం వరకు బేస్ ట్యాక్స్ విధిస్తోంది. పెరిగిన ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు పామాయిల్ దిగుమతులపై ఉన్న బేస్ ట్యాక్స్ 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మూడు నెలల పాటు ఈ పన్ను తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంటుంది. పన్ను తగ్గించడం వల్ల అదనంగా 50,000 టన్నుల పామాయిల్ దిగుమతులు పెరగవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఫలితంగా పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మిగిలిన వాటి సంగతో సాధారణంగా పామాయిల్ని ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న రకరకాల పన్నుల మొత్తం 35 శాతం ఉండగా దాన్ని 30 శాతం తగ్గించింది. కానీ గృహ అవసరాలకు ఎక్కువగా వినియోగించే సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్‌లపై దిగుమతి పన్ను తగ్గించకలేదు. దీంతో వాటి ధరలు ఇప్పట్లో తగ్గేది కష్టమే. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కంటి తుడుపు చర్య అవుతుందే తప్ప సామాన్యులకు దీని వల్ల ఒరిగేది లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : NITI Aayog: పన్ను మినహాయింపులకు నీతి ఆయోగ్ ఓటు -
వాటి ధరలు ఇక షాకే..
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతవుతున్న 50 రకాల వస్తువులు, ఉత్పత్తులపై దిగమతి సుంకాలను పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఎలక్ర్టానిక్స్, ఎలక్ర్టికల్ పరికరాలు, రసాయనాలు, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి పలు వస్తువులపై సుంకాల పెంపునకు రంగం సిద్ధమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే వార్షిక బడ్జెట్లో ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. దిగుమతులను తగ్గించడం ద్వారా లోటుపోట్లను అధిగమించడంతో పాటు దేశీ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం, ఆర్థిక మందగమనాన్ని నివారించే చర్యలనూ ఆమె ప్రకటించనున్నారు. కస్టమ్స్ డ్యూటీలను పెంచడం వల్ల మొబైల్ ఫోన్ చార్జర్లు, పారిశ్రామిక రసాయనాలు, ల్యాంప్‌లు, ఫర్నీచర్, క్యాండిల్స్, జ్యూవెలరీ, హ్యాండీక్రాఫ్ట్ ఐటెమ్స్ సహా పలు వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముడి పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌ఫోన్ తయారీదారులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లో కస్టమ్స్ సుంకాలు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఐకియా వంటి సంస్ధలూ తాజా నిర్ణయంతో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయి. ఇక ఆహారేతర ఉత్పత్తులు, వస్తువుల దిగుమతులను ప్రోత్సహించరాదనే లక్ష్యంతోనే దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కలిగిన దేశాల నుంచి వెల్లువలా వచ్చి పడుతున్న చౌక ఉత్పత్తుల నుంచి దేశీ తయారీదారులను కాపాడేందుకు దిగుమతి సుంకాల పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. వర్తక ఒప్పందాల ముసుగులో నాసిరకం దిగుమతులకు బడ్జెట్ చెక్ పెడుతుందని భావిస్తున్నామని బీజేపీ ఆర్థిక వ్యవహారాల విభాగం చీఫ్ గోపాల్ కృష్ణన్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : ఆ 63 మంది సంపద మన బడ్జెట్ కంటే అధికం -
చైనాపై సుంకాలకే ట్రంప్ మొగ్గు!!
వాషింగ్టన్: చైనాతో ప్రతిపాదిత చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఆ దేశం నుంచి మరిన్ని దిగుమతులపై సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. దాదాపు 200 బిలియన్ డాలర్ల దిగుమతులపై కొత్తగా టారిఫ్‌లను అమలు చేసే విషయంలో ట్రంప్ ముందుకే వెళ్లనున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ టారిఫ్‌ల అమలు సోమవారం నుంచే ప్రారంభంకావచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు. సుంకాలు గతంలో విధించిన 25 శాతం కన్నా తక్కువ స్థాయిలో సుమారు 10 శాతం మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. టారిఫ్‌ల వివాదంపై చర్చించుకునేందుకు అమెరికాను ఆహ్వానించినట్లు చైనా వెల్లడించిన నేపథ్యంలో ఈ కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల దిగుమతులపై ఇరు దేశాలు 25% టారిఫ్‌లు విధించింది. ఒకవేళ అమెరికా గానీ మరో దఫా తమ దిగుమతులపై సుంకాలు విధించిన పక్షంలో.. ప్రతిగా తాము 60 బిలియన్ డాలర్ల పైగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించడం ఖాయమని చైనా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన దేశ పరిశ్రమపైనా ప్రభావం చూపిస్తుందని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. -
అమెరికా వస్తువులపై చైనా దిగుమతి సుంకాలు
బీజింగ్: అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే 128 వస్తువులపై చైనా తాజాగా దిగుమతి సుంకాలను విధించింది. అమెరికా నుంచి వచ్చే పందిమాంసం, పండ్లు తదితర ఉత్పత్తుల పై ఈ సుంకాలు విధించామని తెలిపింది. అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా తాము సుంకాలు విధిస్తున్నామని చైనా పేర్కొంది. పండ్లు, సం బంధిత 120 ఉత్పత్తులపై 15%, పంది మాంసం, సంబంధిత 8 ఉత్పత్తులపై 25% చొప్పున సుంకాలను వేసినట్లు పేర్కొంది. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను సమర్థిస్తామని, అయితే తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం అమెరికా దిగుమతులపై సుంకాల రాయితీలను రద్దు చేస్తున్నామని చైనా వివరించింది. -
ట్రంప్ ‘సుంకం’ షాక్..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మొత్తానికి అన్నంత పనీ చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను, ఎకానమీని కాపాడే పేరిట వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిత్యం టెన్షన్ పెడుతున్న ట్రంప్ తాజాగా ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్టీఆర్) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు రెండూ.. దేశ భద్రతకు సైతం కీలకమైనవని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఉక్కు ఉక్కే. దీనికి తిరుగులేదు. ఉక్కు లేకుంటే దేశం లేదు. అనేక సంవత్సరాలుగా మన పరిశ్రమలను మిగతా దేశాలు టార్గెట్ చేశాయి. నిజానికి దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్న అనుచిత విదేశీ వాణిజ్య విధానాల వల్ల మన ప్లాంట్లు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని వర్గాలు పూర్తిగా అణగారిపోయాయి. ఇకపై ఇలాంటివన్నీ ఆగిపోతాయి‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధించడం ద్వారా అమెరికా భద్రతను కూడా కాపాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం రంగంలో పెరుగుతున్న సంక్షోభం గురించి వాణిజ్య శాఖ తొమ్మిది నెలలుగా అధ్యయనం చేసిన మీదట ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అమెరికా ప్రయోజనాల కోసమే.. అమెరికా ఉద్యోగులు, కంపెనీల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికాలో తయారు చేసే ఉత్పత్తులపై పన్నులు ఉండవని.. ఒకవేళ ఇతర దేశాల కంపెనీలేవైనా ఆ ప్రయోజనాలు పొందదల్చుకుంటే, అమెరికాలోనే ప్లాంటు పెట్టి పొందవచ్చని తెలియజేశారు. ‘మన నౌకలు, మన విమానాలు.. మన యుద్ధ పరికరాలు మొదలైన వాటన్నింటినీ మన దేశంలో తయారైన ఉక్కు, అల్యూమినియంతోనే ఉత్పత్తి చేద్దాం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటున్నాం‘ అని ట్రంప్ పేర్కొనారు. కాగా అమెరికాలోనే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొని వర్గాలు అమెరికాకు ప్రయోజనకరమైన చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించగా... మరికొన్ని వర్గాలు ఈ నిర్ణయం దేశ ఎకానమీని దెబ్బతీస్తుందని, వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్ ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రతికూలం.. సుంకాల వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) చైర్మన్ రవి సెహ్గల్ తెలిపారు. అమెరికా బాటలోనే చైనా, యూరప్ కూడా రక్షణాత్మక చర్యలకు దిగితే భారత ఎగుమతులు మరింతగా దెబ్బతింటాయన్నారు. అమెరికా దిగుమతి చేసుకునే మొత్తం ఉక్కులో భారత్ వాటా 1.28 శాతంగా, అల్యూమినియం దిగుమతుల్లో 1.12 శాతంగా ఉంది. చైనా, ఈయూ అభ్యంతరాలు.. దిగుమతి సుంకాల విధింపుపై చైనాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించాయి. సుంకాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొనగా.. ఇరు దేశాల సంబంధాలపై ఇది పెను ప్రభావం చూపుతుందని జపాన్ వ్యాఖ్యానించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీవో) ఫిర్యాదు చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా వెల్లడించింది. మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి పరిణామాల ప్రభావాలపై చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటామని ఫ్రాన్స్ పేర్కొంది. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు టారిఫ్‌లు విధించడమనేది సరైన పద్ధతి కాదని బ్రిటన్ అభిప్రాయపడింది. రక్షణాత్మక ధోరణులు, టారిఫ్‌లు పనిచేయవని పేర్కొంది. సుంకాల పెంపునకు ప్రతీకారంగా చర్యలు తీసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తామని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ జిర్కీ కెటైనెన్ తెలిపారు. అమెరికా నుంచి దిగుమతయ్యే ఏయే ఉత్పత్తులపై సుంకాలు విధించవచ్చన్న దానిపై బ్రసెల్స్ ఇప్పటికే ఒక జాబితా కూడా సిద్ధం చేసింది. భారత్‌కు హెచ్చరిక.. సుంకాల విధింపు విషయంలో పనిలో పనిగా చైనాతో పాటు భారత్‌కు కూడా హెచ్చరికల్లాంటివి చేశారు ట్రంప్. చైనా, భారత్ లాంటి దేశాలు విధించే సుంకాలకు, అమెరికా విధించే సుంకాలకూ వ్యత్యాసముంటే ఆ మేరకు మార్పులుంటాయన్నారు. ‘ఏదో ఒక దశలో ఈ తరహా విధానాన్ని కూడా తెస్తాం. ఉదాహరణకు మనమేమీ సుంకాలు విధించకుండానే.. చైనా 25 శాతమో.. భారత్ 75 శాతమో విధిస్తోందనుకుందాం. అలాంటప్పుడు మనమూ అదే స్థాయిలో సుంకాలు విధిస్తాం. వాళ్లు 50 శాతం వేస్తే.. మనమూ 50 శాతం విధిస్తాం‘ అని అధికారిక ప్రకటనలపై సంతకాలు చేయడానికి ముందు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా మోటార్ సైకిల్స్ ముఖ్యంగా – హార్లే డేవిడ్సన్ బైకుల మీద భారత్ విధిస్తున్న సుంకాలు చాలా భారీగా ఉంటున్నాయని ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మార్చి 20న భారత్ నిర్వహించబోయే డబ్ల్యూటీవో సదస్సుకు అమెరికా ప్రతినిధి రాబర్ట్ లైథిజర్ రాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. -
పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గించండి
కేంద్రాన్ని కోరిన జీజేఈపీసీ న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది. దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలన్న నిబంధన (80:20 ఫార్ములా)ను రద్దుచేయాలని కోరింది. జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా బుధవారం న్యూఢిల్లీలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం 10% దిగుమతి సుంకం విధిస్తుండడంతో బంగారం అక్రమ రవాణాయే లాభదాయకంగా మారిందని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా స్మగ్లింగ్‌ను నిరోధించవ్చని పేర్కొన్నారు. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన దృష్ట్యా 80:20 ఫార్ములా రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచడంతో 2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నారు.