న్యూఢిల్లీ: మీరు వజ్రాలు, రత్నాలు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలోప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్‌లో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పాలిష్ చేయని వజ్రాలపై ఎలాంటి దిగుమతి సుంకం ఉండదని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ మేరకు వజ్రాలు, రత్నాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్, రత్నాలపై 7.5 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు.
లోక్ సభలో 2022-23 బడ్జెట్ సమర్పించిన సీతారామన్, ఈ కామర్స్ ద్వారా ఆభరణాల ఎగుమతి చేయడానికి ప్రభుత్వం సులభతరం విధానాన్ని ఈ ఏడాది జూన్ నాటికి తీసుకొని రానున్నట్లు ప్రకటించారు. తక్కువ విలువ కలిగిన అనుకరణ ఆభరణాల దిగుమతులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకాన్ని కిలోకు కనీసం రూ.400 చెల్లించే విధంగా సిఫారసు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనపై ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పెతే మాట్లాడుతూ.. "మొత్తం మీద బడ్జెట్ 2022-23 సానుకూలంగా కనిపిస్తోంది. కానీ, ఈ బడ్జెట్‌లో పరిశ్రమకు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు ఏమీ లేవు. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకంలో కోత తప్ప" అని ఆయన అన్నారు. కేంద్రం వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ రంగానికి చెందిన షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి.
(చదవండి: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!)
Comments
Please login to add a commentAdd a comment