custom duty
-
అసలు తగ్గింపు ఇక నుంచే.. శ్రావణం ముంగిట శుభవార్త!
శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.ఎంత మేర తగ్గుతాయి?కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు. -
ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: విదేశాల్లో పూర్తిగా తయారై (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్/సీబీయూ) భారత్‌లోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లు సహా అన్ని రకాల కార్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. విదేశాల్లో పూర్తిగా తయారైన వాటిని ‘సీబీయూ’లుగా చెబుతారు. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర (ఇన్వాయిస్ వ్యాల్యూ) ఉన్నవి లేదంటే ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ కార్లపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. ఎలక్ట్రిక్ కార్లు 40,000 డాలర్లకు పైన ధర ఉంటే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. సెమీ నాక్డ్ డౌన్ (ఎస్కేడీ/పాక్షికంగా తయారైన) కార్లపై (ఎలక్ట్రిక్ సహా) కస్టమ్స్ డ్యూటీని 30% నుంచి 35%కి పెంచారు. ప్రస్తుతం విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లు 40,000 డాలర్లు లేదా ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ మించిన∙డీజిల్ కార్లపై 100% కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2 శాతం వరకు పెరగనున్న ధరలు ప్రభుత్వం కస్టమ్స్ సుంకం పెంపు ప్రతిపాదనలతో కార్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ బెంజ్, లెక్సస్ ప్రకటించాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వం సవరించడంతో, ఎస్ క్లాస్ మేబ్యాచ్, జీఎల్బీ, ఈక్యూబీ ధరలపై ప్రభావం పడుతుందని మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్‌లోనే ఎక్కువ తయారీ చేస్తున్నందున 95 శాతం మోడళ్ల ధరలపై ప్రభావం ఉండదని చెప్పారు. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్: బడ్జెట్‌పై కోటి ఆశలు!
న్యూఢిల్లీ: 2023-24 కేంద్రం బడ్జెట్‌కు సంబంధించిన కేటాయింపులు, మినహాయింపులు, కోతలపై సామాన్య ప్రజానీకం నుంచి కార్పొరేట్ దాకా చాలా ఆశలు, ఊహాగానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టన్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో మరిన్ని ప్రజాకర్షక పథకాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పసిడి ధర, బంగారు ఆభరణాల ధర తగ్గుముఖం పడుతుందా? దిగుమతి సుంకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పండుగల సీజన్లో రిటైల్ అమ్మకాలను దెబ్బతీస్తూ బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరుగుతున్న తరుణంలో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారని భారతీయ ఆభరణాల విభాగం భావిస్తోంది. ప్రస్తుతం, బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్‌గా అదనంగా 2.5శాతంగా ఉంది. గత బడ్జెట్లో కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ఈ సుంకాన్ని పెంచారు. ఫలితంగా బంగారం దిగుమతులు 2021లో 1,068 టన్నుల నుంచి 2022లో 706 టన్నులకు తగ్గిపోయాయి. సుంకం పెంపు వల్ల భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా పెరిగిందనీ, ఇది ఏడాదికి 200 టన్నులు అని అంచనా వేశామని వాస్తవానికి బంగారం రిటైల్ అమ్మకాలను ఇది ప్రభావితం చేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ,ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 4 శాతంక తగ్గించాలని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) డిమాండ్ చేస్తోంది. ఈ దిగుమతి సుంకం ఎగుమతిదారుల నుండి మూలధనాన్ని హరించివేస్తోందని భావిస్తోంది. కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా ప్రకారం. దిగుమతి సుంకం తగ్గింపు ఆరోగ్యకరమైన ,మరియు పారదర్శక పరిశ్రమను కలిగి ఉండటానికి సహాయడుతుందనీ, అలాగే ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు. దీనికి తోడు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరల సెగ కాస్త తగ్గుముఖం పట్టి..ప్రజల చేతుల్లో పుత్తడి మరింత మెరిసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. త్వరలో భారత్‌లో తయారయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం మొబైల్స్‌లో వినియోగించే ఇన్ పుట్స్పై (ఫోన్లో వినియోగించే విడి భాగాలు) కస్టమ్ డ్యూటీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమ్ ఛార్జీలు అమల్లోకి వస్తే .. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు పెరిగిన ధరల్ని కొనుగోలు దారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా తయారయ్యే స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. పలు నివేదికల ప్రకారం..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (cbic) విభాగంగా ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల డిస్ప్లే అసెంబ్లీ దిగుమతిపై 10శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ విధిస్తుంది. ఆ కస్టమ్ డ్యూటీని మరో 5 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. "సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ మొదలైన వాటి కోసం ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లు (ఎఫ్పీసీ), ఇతర వస్తువులు డిస్ప్లే అసెంబ్లీతో దిగుమతి చేసుకుంటే 15శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ అమలవుతుందని సీబీఐసీ తెలిపింది. నో క్లారిటీ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో,ఒప్పోలతో పాటు ఇతర కంపెనీలు కస్టమ్ డ్యూటీ ఎగవేతకు పాల్పడ్డాయని సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై.. ఫోన్ల విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే ఎంత కస్టమ్ డ్యూటీ చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదని, అందుకే సీబీఐసీ అధికారులు నోటీసులు అందించినట్లు పలు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు ఫోన్ల విడి భాగాలపై విధించే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంటనూనె ధరలు
న్యూఢిల్లీ: దేశంలో అధిక వినియోగంలో ఉన్న సన్‌ఫ్లవర్(పొద్దు తిరుగుడు) తోపాటు సోయాబీన్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. రాబోయే రెండేళ్ల కాలానికి ఈ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ, అగ్రిసెస్‌ను మినహాయిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అమాంతం పెరిగిన నూనె ధరలకు కళ్లెం వేయడంలో భాగంగానే వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ప్రభుత్వ తాజా చర్యతో దేశీయంగా వంటనూనెల ధరలు రాబోయే రోజుల్లో తగ్గుముఖం పట్టనున్నాయి. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, దిగుమతుల కోటా కోసం ఈ నెల 27 నుంచి జూన్ 18లోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గడువు మించితే మాత్రం గతంలోని సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, దేశీయంగా పంచదార ధరలు పెరగకుండా చూసేందుకు ఎగుమతులకు పరిమితులు విధించింది. ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. -
'మేక్ ఇన్ ఇండియా' కోసం భారీగా కస్టమ్స్ సుంకం మినహాయింపులు!
దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 2022-23 బడ్జెట్లో 350 ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబిఐసీ) ట్వీట్ చేసింది. మొత్తంగా ఉత్పత్తుల మీద 350 కస్టమ్స్ సుంకాలను ఉపసంహరించుకుంటామని సీబిఐసీ తెలిపింది. వీటిలో మినహాయింపులు పొందుతున్న కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్య పరికరాలు, మందులు లాంటివి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, హెడ్ సెట్స్ పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల వంటి ఉత్పతులను దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించేందుకు గ్రేడెడ్ రేట్ స్ట్రక్చర్‌ను అందించడానికి కస్టమ్స్ డ్యూటీ రేట్లను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. మొబైల్ ఫోన్ ఛార్జర్ల, ట్రాన్స్ఫార్మర్ భాగాలు, మొబైల్ కెమెరా మాడ్యూల్ కెమెరా లెన్స్, కొన్ని ఇతర వస్తువులకు కూడా డ్యూటీ రాయితీలు కల్పిస్తామని ఆమె చెప్పారు. రత్నాలు, ఆభరణాల రంగానికి ఊతమిచ్చేందుకు కట్, పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి, సాన్ డైమండ్‌పై సున్నా శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఆభరణాలను ఎగుమతి చేయడానికి 2022 జూన్ నాటికి సరళీకృత నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆమె అన్నారు. తక్కువ విలువతో అనుకరణ ఆభరణాల దిగుమతిని అరికట్టేందుకు అనుకరణ ఆభరణాలపై కిలోకు 400 రూపాయల కస్టమ్స్ సుంకాన్ని విధించాలని చూస్తున్నట్లు తెలిపారు. (చదవండి: Elon Musk: అపర కుబేరుడు మరీ ఇంత పిచ్చోడా?) -
వజ్రాలు, రత్నాలు కొనేవారికి కేంద్రం శుభవార్త..!
న్యూఢిల్లీ: మీరు వజ్రాలు, రత్నాలు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలోప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్లో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పాలిష్ చేయని వజ్రాలపై ఎలాంటి దిగుమతి సుంకం ఉండదని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ మేరకు వజ్రాలు, రత్నాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్, రత్నాలపై 7.5 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. లోక్ సభలో 2022-23 బడ్జెట్ సమర్పించిన సీతారామన్, ఈ కామర్స్ ద్వారా ఆభరణాల ఎగుమతి చేయడానికి ప్రభుత్వం సులభతరం విధానాన్ని ఈ ఏడాది జూన్ నాటికి తీసుకొని రానున్నట్లు ప్రకటించారు. తక్కువ విలువ కలిగిన అనుకరణ ఆభరణాల దిగుమతులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకాన్ని కిలోకు కనీసం రూ.400 చెల్లించే విధంగా సిఫారసు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనపై ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పెతే మాట్లాడుతూ.. "మొత్తం మీద బడ్జెట్ 2022-23 సానుకూలంగా కనిపిస్తోంది. కానీ, ఈ బడ్జెట్లో పరిశ్రమకు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు ఏమీ లేవు. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకంలో కోత తప్ప" అని ఆయన అన్నారు. కేంద్రం వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ రంగానికి చెందిన షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. (చదవండి: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!) -
పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద చిక్కుల్లో పడింది. షావోమి ఇండియా కస్టమ్స్ సుంకాన్ని ఎగవేస్తోందని వచ్చిన సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) షావోమి, దాని కాంట్రాక్టు ఉత్పత్తిదారులపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తు సందర్భంగా డీఆర్ఐ దేశవ్యాప్తంగా ఉన్న షావోమి ఇండియా కార్యాలయాల్లో సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్కామ్ యూఎస్ఏ, బీజింగ్ షావోమి మొబైల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్‌కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు గుర్తించింది. భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో షావోమి ఇండియా మొబైల్స్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్ చేస్తుంది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది. విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. 'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది. ఇలా చేయడం కస్టమ్స్ చట్టం-1962 కస్టమ్స్ వాల్యుయేషన్ నిబంధనలను, 2007లోని సెక్షన్ 14ను ఉల్లంఘించడమే అని తెలిపింది. 'డీఆర్ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత 1962, కస్టమ్స్ చట్టం ప్రకారం.. షావోమి టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్ చేస్తూ 3 షోకాజ్ నోటీసులు జారీ చేశాం' అని డీఆర్ఐ తెలిపింది. (చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!) -
పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించినట్లు పేర్కొంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ సుంకం తగ్గింపు తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. "పండుగ సీజన్లో అధిక ధరల కారణంగా ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించింది" అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివీ మెహతా తెలిపారు.(చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం) -
కేంద్రం శుభవార్త, వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో వంటనూనెలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వివిధ రకాల నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు పెరిగాయి. దీంతో రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు పెరుగుతాయనే అంచనాల నడుమ కేంద్రం వాటి ధరల్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. ఇక అన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించడంతో.. తాజా ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరనుండగా దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ధరలు మరితం తగ్గనున్నాయి. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
బడ్జెట్ 2021 : పడిన పసిడి ధర
సాక్షి,న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక ప్రతిపాదన చేసింది. బంగారంపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారంపై సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి . తద్వారా పసిడి ప్రేమికులకు ఊరట కలుగనుంది. అయితే 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాలు , అభివృద్ధి సెస్ (ఏఐడీసీ)ను బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ అగ్రి సెస్ విధించడం వల్ల వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకే, కస్టమ్స్ సుంకం రేట్లు తగ్గించినట్టు వెల్లడించారు. జూలై, 2019లో సుంకం 10శాతం నుండి పెంచిన తరువాత విలువైన లోహాల (బంగారం,వెండి) ధరలు బాగా పెరిగాయి. వాటిని మునుపటి స్థాయిలకు దగ్గరగా తీసుకొచ్చేందుకు కస్టమ్ సుంకాన్ని హేతుబద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే డైమండ్, బంగారు ఆభరణాల వ్యాపారుల దీర్ఘకాలిక డిమాండ్ కనుగుణంగా దిగుమతి సుంకం తగ్గింపు సరైన నిర్ణయమని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు బంగారం అక్రమ లావాదేవీలను అడ్డుకునేందుకు ఇ-గవర్నెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర ఏకంగా 3 శాతం కుప్పకూలింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,500 పడిపోయింది. రూ.47,918లుగా ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 1.2 శాతం పెరిగింది. ఔన్స్‌కు 1872.4 డాలర్లుగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్‌టైం గరిష్టం నుంచి దిగి వచ్చాయి. కిలో ధర 73,508 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లలో 10 శాతం పెరిగింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2019 జూలై నెలలో దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఇటీవలికాలంలో పుత్తడి ఆల్‌టైం గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్, బంగారం మరింత ప్రియం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ఇటు సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఏసీల ధరలు సైతం అధికమవనున్నాయి. పన్నులు పెరుగుతుండటంతో వీటి ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, కెమెరా పరికరాలు, మొబైల్ ఫోన్ల చార్జర్లు, సెట్ టాప్ బాక్సుల ధరలు తగ్గనున్నాయి. ‘మేకిన్ ఇండియా లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకోవడంలో భాగంగా పలు వస్తువులపై సుంకాన్ని పెంచుతున్నాం..’అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపుని ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. ‘దేశీయ ముద్రణ రంగానికి ఊతమిచ్చేలా పామాయిల్‌కు సంబంధించిన స్టెరాయిన్, కొవ్వు నూనెలు, వివిధ రకాల కాగితపు ఉత్పత్తులపై మినహాయింపుని తొలగిస్తున్నాం. దిగుమతి చేసుకునే పుస్తకాలపై 5 శాతం కస్టమ్ డ్యూటీ విధిస్తున్నాం.’అని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఒక లీటర్‌పై రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్ కింద రూ.1, ఎక్సైజ్ సుంకం కింద రూ.1 విధించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఇటు బీడీలు, సిగరెట్లపై పరిమాణం, రకాన్ని బట్టి 10 పైసల నుంచి రూ.10 వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించారు. అలాగే హుక్కా, జర్దాలాంటి పొగాకు ఉత్పత్తులపై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించారు. పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలు, విదేశీ కార్ల దిగుమతులపై 25 శాతం నుంచి 30 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. ఆటో మొబైల్ పరికరాలు, వాహనాల ఇం జన్ల ఫిల్టర్లు, అద్దాలు, తాళాలపై 2.5 శాతం నుంచి 5 శాతానికి.. మార్బుల్స్‌పై 20 శాతం నుంచి 40 శాతానికి, ఏసీలపై 10 శాతం నుంచి 20 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. సెరామిక్ టైల్స్, గోడకు అతికించే టైల్స్ వంటి వాటిపై 10 శాతం నుంచి 15 శాతానికి.. దిగుమతి చేసుకునే స్టెయిన్లెస్ స్టీల్ దాని సంబంధిత పరికరాలపై 5 శాతం నుంచి 7.5 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంచినట్లు వెల్లడించారు. ఇక సీసీటీవీ కెమెరా/ఐపీ కెమెరా చార్జర్, చార్జింగ్ కేబుల్, లౌడ్ స్పీకర్లు, ఆఫ్టికల్ ఫైబర్‌లపై 15 శాతం.. డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్), సీసీటీవీ కెమెరా, ఐపీ కెమెరాలపై 5 శాతం నుంచి 20 శాతం కస్టమ్ డ్యూటీ పెంచినట్లు ఆమె తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పరికరాలపై కస్టమ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి కావాల్సిన ముడి సరుకులు, కెమెరాకు సంబంధించిన పరికరాలు, మొబైల్ ఫోన్ చార్జర్లు, సెట్ టాప్ బాక్సుల ధరలు మరింత తగ్గుతాయని వెల్లడించారు. -
మోదీ ప్రొడక్షన్స్ సమర్పించు.. మదర్ భారత్
అర్థం ఒకటే!. కానీ ఆర్థికంగా భారత్–ఇండియా వేర్వేరు!! ‘పల్లెలు – పేదలు – రైతులు’... ఇది అత్యధికులుండే భారతమైతే... ‘పట్టణాలు– మధ్యతరగతి – ఉద్యోగులు’ అనే ధోరణి ఇండియాది!! వీటి మధ్య అంతరాన్ని తగ్గించాలనుకున్నారు నిర్మలా సీతారామన్. అందులో భాగమే శుక్రవారం నరేంద్ర మోదీ సమర్పణలో ‘మదర్ ఇండియా’కు బదులు ఆవిష్కరించిన ‘మదర్ భారత్’ బడ్జెట్. మూడేళ్లలో కరెంటు లేని గ్రామమనేదే లేకుండా చేస్తామన్నారు. నాలుగేళ్లలో మంచినీరు అందని పల్లె ఉండదన్నారు. 80వేల కోట్లతో 1,25,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తామని... ఐదేళ్లలో ప్రతి ఊరికీ రోడ్డు ఉంటుందని చెప్పారు. దేశ చరిత్రలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ కనక మహిళలకు ఓవర్‌డ్రాఫ్ట్ వంటి వరాలిచ్చారు. అయితే భారత్ కోసం ఇండియాపై చెర్నాకోల ఝుళిపించారు. మధ్య తరగతికి పన్ను ఊరట లేదు సరికదా... ధనికులకు చుర్రుమనిపించారు. రూ.5 కోట్ల వార్షికాదాయం దాటినవారిపై ప్రపంచంలో ఎక్కడా లేనంతగా 42.5% పన్ను బాదేశారు. లీటరు పెట్రోల్, డీజిల్‌పై రెండు రూపాయల మేర పెంచేశారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని సైతం అదనంగా 2.5% వడ్డించారు. ‘‘అరె! మీరు మహిళలా ఆలోచించరెందుకు? బంగారం ధర అంతలా పెరిగితే ఎలా?’’ అన్న విపక్షాల ప్రశ్నలకు... ‘నేను మహిళనే కానీ.. మంత్రిని’ అనేది ఆమె సమాధానం కావచ్చు. దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నిర్మల భారీ సంస్కరణలకు తెరలేపారు. విదేశాల నుంచి మరిన్ని రుణాలు తేవటం.. ప్రభుత్వ సంస్థల్లో వాటాలమ్మి రూ.1.05 లక్షల కోట్లు సమీకరించడం.. మీడియా, ఏవియేషన్, యానిమేషన్, బీమా మధ్యవర్తిత్వ వ్యాపారాల్లోకి ఎఫ్‌డీఐలను పెంచటం... రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ట్రస్టుల్లోకి విదేశీ నిధులు ఆకర్షించడం.. ఇలా ఎన్నో ఆశల్ని కళ్లెదుట పెట్టారు. కాకపోతే ఇవేవీ అంత తేలిగ్గా అయ్యేవి కావు. ‘‘ప్రభుత్వ సంస్థల్లో వాటాలమ్మినా కొనేవారుండాలిగా? అసలంత నాణ్యమైన ప్రభుత్వ సంస్థలెక్కడున్నాయి? ఎఫ్‌డీఐలు ఎందుకొస్తాయ్?’’ అనేది విపక్షాల విమర్శ. అయితే ఎంత నడకైనా ఆరంభమయ్యేది ఒక అడుగుతోనే!!. అదిగో... ఆ మొదటి అడుగు వేస్తూ భారత్‌ను పటిష్ఠ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే చర్యలకు టెంకాయ కొట్టారు నిర్మల. ఈ నడక తీరుతెన్నులను చెప్పేది తదుపరి బడ్జెట్లే!!. 2019–20 బడ్జెట్ ముఖ్యాంశాలివీ పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ ప్రతి లీటరుకు ఒక రూపాయి పెంపు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డునైనా వాడుకునేందుకు వెసులుబాటు. సంవత్సరంలో కోటి రూపాయల కంటే ఎక్కువ డబ్బును నగదు రూపంలో బ్యాంకు ఖాతాల నుంచి తీసుకుంటే 2 శాతం టీడీఎస్ (డబ్బు చేతికందక ముందే దానిపై పన్ను) విధింపు. బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి, స్టెయిన్లెస్ స్టీల్‌పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు బంగారం, ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.5 శాతానికి, స్టెయిన్లెస్ స్టీల్‌పై 5 నుంచి 7.5 శాతానికి పెంపు స్వయం సహాయక బృందాల్లోని ఒక మహిళకు ముద్ర పథకం కింద రూ. లక్ష వరకు రుణం. మిగతా మహిళలకు రూ. 5వేల వరకు ఓడీ చిన్న దుకాణాల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేయనున్న ఆర్బీఐ, బ్యాంకులు అందుబాటు ధరల ఇళ్ల రుణాలపై రూ. 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపు పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్యలో ఉంటే పన్ను రేటు 3%. అదే ఆదాయం రూ. 5 కోట్లు దాటితే, పన్ను రేటు 7% ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పుపై చెల్లించే వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు పన్ను తగ్గింపు రూ. 400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా 25% కార్పొరేట్ పన్ను పరిధిలోకి -
దిగుమతి సుంకం పెంపు: ఎవరికి షాక్, ఎవరికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ పెంపును ప్రకటించింది. కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణ, చారిత్రక కనిష్టాలకు పడిపోతున్న రూపాయి విలువ నేపథ్యంలో 19 రకాల విలాస వస్తువులపై (నాన్ ఎసెన్షియల్) దిగుమతి సుంకాన్ని పెంచింది. ఈ పెంపు సెప్టెంబరు 27నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఈ సుంకంనుంచి బంగారం నుంచి మినహాయించడం విశేషం. మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులు, విమాన ఇంధన ధరలపై సుంకాన్ని పెంచడం ఆయా రంగాలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో కుదేలవుతున్న విమానయాన పరిశ్రమ ఉపయోగించే టర్బైన్ ఆయిల్ దిగుమతులపై మొదటిసారి 5శాతం సుంకాన్ని విధించింది. అలాగే రానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీలు, ఫ్రీజ్, వాషిగ్మెషీన్లపై దిగుమతి సుంకం పెంపు సాధారణ కొనుగోలు దారులకు చేదువార్తే. మెటల్ జ్యుయల్లరీ, సెమీ ప్రాసెస్డ్ డైమండ్స్,కొన్ని రకాల విలువైన రాళ్లపై 5శాతం నుంచి 7.5శాతానికి పెంపు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్మెషీన్లు, టీవీలపై 10శాతం నుంచి 20 శాతం పెంపు ప్లాస్టిక్ వస్తులపై10నుంచి 15శాతానికి పెంపు సూట్‌కేసులపై 10 నుంచి 5శాతానికి పెంపు ఏవియేషన్ టర్బైన్ ఆయిల్‌పై 5శాతం రేడియల్ కారు టైర్లపై 10 నుంచి 15శాతానికి ఫుట్‌వేర్‌పై 20 నుం 25 శాతానికి పెంపు కిచెన్‌వేర్‌పై 10నుంచి 15శాతానికి పెంపు షవర్ బాత్, సింక్లు, వాష్ బేసిన్, స్పీకర్లపై 10 శాతం నుండి 15 శాతం పెంపు -
మొబైల్ ఫోన్లు ఇక కాస్ట్లీనే
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లకుఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ షాకిచ్చారు. నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అరుణ్‌జైట్లీ ఈ ప్రకటన చేశారు. 2017 డిసెంబర్లోనే దిగుమతి చేసుకునే స్మార్ట్ఫోన్లపై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. మరో నెల వ్యవధిలోనే మరోసారి మొబైల్ ఫోన్లకు కేంద్రం షాకిచ్చింది. ఈ ప్రభావం ఎక్కువగా ఆపిల్ వంటి కంపెనీలపై ప్రభావం చూపనున్నట్టు టెక్ వర్గాలు చెప్పాయి. చైనా ఫోన్లపై మరింత ప్రభావం ఉంటుందన్నారు. గత నెలలోనే మొబైల్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీతో పాటు టీవీలు, మైక్రోవేల్ అవెన్లపై కూడా కస్టమ్స్ డ్యూటీని కేంద్రం 20 శాతానికి పెంచింది. తద్వారా విదేశీ దిగుమతులు తగ్గి దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫోన్లను భారత్‌లో తయారుచేసే విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు పరోక్ష పన్నుల కన్సల్టెన్సీ ఈవై హెడ్ బిపిన్ సప్రా తెలిపారు. కొన్ని వాహనాల పరికరాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచారు. ఆరెంజ్ జ్యూస్‌లు కూడా కూరగాయలు, పండ్ల జ్యూసుల ధరలు కూడా 50 శాతం పెరుగనున్నాయి. గోల్డ్ , సిల్వర్‌పై సాంఘిక సంక్షేమ సర్ఛార్జీని విధించారు. స్మార్ట్‌వాచస్, ఫుట్‌వేర్ భాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచారు. -
పరోక్ష పన్ను వసూళ్లలో స్వల్ప వృద్ధి
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) 4.6 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఈ మొత్తం రూ.1.13 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1.08 లక్షల కోట్లు. వసూళ్లు స్వల్పంగా మాత్రమే పెరగడానికి ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వసూళ్లు క్షీణించడం, మాంద్యం కారణంతో తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 25 శాతం అధికంగా (6,24,902 కోట్లు) ఉండాలని బడ్జెట్ నిర్దేశిస్తోంది. లక్ష్యంతో పోల్చితే జూన్ క్వార్టర్ వసూళ్ల స్పీడ్ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరడం సవాలేనని సీబీఈసీ చైర్పర్సన్ శాంతి సుందరం ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. క్యూ1లో విభాగాల వారీగా... ఎక్సైజ్ సుంకాల వసూళ్లలో అసలు వృద్ధిలేకపోగా 0.2 శాతం క్షీణించాయి. వసూళ్లు రూ.35,159 కోట్లు. కస్టమ్స్ సుంకాల వసూళ్లూ 3.1 శాతం క్షీణించాయి. రూ.39,549 కోట్లుగా నమోదయ్యాయి. సేవల పన్నులు మాత్రం 19.1 శాతం వృద్ధితో రూ.38,862 కోట్లుగా నమోదయ్యాయి.