మొబైల్‌ ఫోన్లు ఇక కాస్ట్‌లీనే | Budget 2018 : Mobiles to cost more | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్లు ఇక కాస్ట్‌లీనే

Feb 1 2018 1:53 PM | Updated on Feb 1 2018 3:38 PM

Budget 2018 : Mobiles to cost more - Sakshi

మొబైల్‌ ఫోన్లపై కస్టమ్‌ డ్యూటీ పెంపు(ఫైల్‌)

న్యూఢిల్లీ : మొబైల్‌ ఫోన్లకుఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ షాకిచ్చారు. నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అరుణ్‌జైట్లీ ఈ ప్రకటన చేశారు. 2017 డిసెంబర్‌లోనే దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. మరో నెల వ్యవధిలోనే మరోసారి మొబైల్‌ ఫోన్లకు కేంద్రం షాకిచ్చింది. ఈ ప్రభావం ఎక్కువగా ఆపిల్‌ వంటి కంపెనీలపై ప్రభావం చూపనున్నట్టు టెక్‌ వర్గాలు చెప్పాయి. చైనా ఫోన్లపై మరింత ప్రభావం ఉంటుందన్నారు.

గత నెలలోనే మొబైల్‌ ఫోన్లపై కస్టమ్‌ డ్యూటీతో పాటు టీవీలు, మైక్రోవేల్‌ అవెన్లపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం 20 శాతానికి పెంచింది. తద్వారా విదేశీ దిగుమతులు తగ్గి దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫోన్లను భారత్‌లో తయారుచేసే విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు పరోక్ష పన్నుల కన్సల్టెన్సీ ఈవై హెడ్‌ బిపిన్‌ సప్రా తెలిపారు. కొన్ని వాహనాల పరికరాలపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు. ఆరెంజ్‌ జ్యూస్‌లు కూడా కూరగాయలు, పండ్ల జ్యూసుల ధరలు కూడా 50 శాతం పెరుగనున్నాయి. గోల్డ్‌ , సిల్వర్‌పై సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జీని విధించారు. స్మార్ట్‌వాచస్‌,  ఫుట్‌వేర్‌ భాగాలపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement