
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించినట్లు పేర్కొంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్‌లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది.
ఈ సుంకం తగ్గింపు తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. "పండుగ సీజన్‌లో అధిక ధరల కారణంగా ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించింది" అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివీ మెహతా తెలిపారు.(చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం)
Comments
Please login to add a commentAdd a comment