edible oil
-
వంట నూనెల దిగుమతులు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది.ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. 2022–23 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్ తెలిపింది. విభాగాల వారీగా ఇలా.. ముడి పామాయిల్ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్బీడీ పామోలిన్ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది. -
వంటనూనె ధరలు మరింత ప్రియం?
దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) నివేదిక తెలిపింది.ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, నన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్ఈఏ నివేదించింది.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసంసాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల బేస్ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. -
వంటనూనెల రేట్లు పెంచొద్దు
న్యూఢిల్లీ: ఇటీవల దిగుమతి సుంకాలు పెంచినప్పటికీ రిటైల్ ధరలను (ఎంఆర్పీ) పెంచొద్దంటూ వంటనూనెల కంపెనీలకు కేంద్ర ఆహార శాఖ సూచించింది. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇలా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉంటాయని, అవి 45–50 రోజులకు సరిపోతాయని వివరించింది.సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ (ఎస్ఈఏ), ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) తదితర సంస్థల ప్రతినిధులతో ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా భేటీ అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొంది.దేశీయంగా నూనెగింజల ధరలకు మద్దతు కల్పించే దిశగా కేంద్రం గత వారం వివిధ రకాల వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాల ప్రకారం ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్ మొదలైన వాటిపై డ్యూటీ సున్నా స్థాయి నుంచి 20 శాతానికి పెరిగింది. ఇతరత్రా అంశాలన్నీ కూడా కలిస్తే ముడి నూనెలపై ఇది 27.5 శాతంగా ఉంటుంది.మరోవైపు, రిఫైన్డ్ పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మొదలైన వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి, నికరంగా 37.5 శాతానికి పెరిగింది. భారత్ పామాయిల్‌ను మలేషియా, ఇండొనేషియా నుంచి, సోయాబీన్ ఆయిల్‌ను బ్రెజిల్, అర్జెంటీనా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. -
సామాన్యులకు షాక్.. వంటనూనెలు ప్రియం
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్‌ఫ్లవర్ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో లీటర్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.16 పెరిగింది. సూపర్మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్‌కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్‌కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్‌కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్‌లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
వంట నూనెల ధరలు తగ్గాయి.. దిగుమతులు భారీగా పెరిగాయి!
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022–23లో తొలి తొమ్మిది నెలల సీజన్లో (నవంబర్–అక్టోబర్) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది. వెజిటబుల్ నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి. ఇక ఈ ఏడాది జూలైలో వంట నూనెల దిగుమతుల వరకే చూస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి. ఇతర నూనెల దిగుమతులు 9,069 టన్నుల నుంచి 15,999 టన్నులకు పెరిగాయి. దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ తిరిగి పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. పామాయిల్‌ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి అవుతోంది. సన్‌ఫ్లవర్ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తోంది. -
సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్‌లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది. చదవండి: ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే! -
సామాన్యులకు భారీ ఊరట..తగ్గనున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. -
గొంగ్లూర్ టు జపాన్! గానుగ వంటనూనెల ఎగుమతికి సన్నాహాలు..
సాక్షి, సంగారెడ్డి: సంఘటితమై పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామ మహిళలు (స్వయం సహాయక బృందం) తయారు చేస్తున్న గానుగ (కోల్డ్ ప్రెస్డ్) వంటనూనెలను జపాన్‌కు ఎగుమతి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గొంగ్లూర్ గ్రామానికి చెందిన 126 మంది మహిళలు నడుపుతున్న సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న గానుగ వంటనూనెల నమూనాలను ఇటీవల నాణ్యతా పరీక్షలకు తీసుకెళ్లిన జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) వాటి ఫలితాలపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయా నూనెల ఎగుమతికి వీలుగా సర్వోదయ సంస్థ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. నూనెలు.. చేతితో చేసిన సబ్బులు.. శుద్ధిచేసిన పప్పు దినుసులు ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు వైద్యుల సహకారంతో గ్రామంలో పలు రకాల కుటీర పరి శ్రమలను స్థాపించారు. అందులో ఒకటైన సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్... ‘సర్వోదయాస్ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన సబ్బులు, పప్పు దినుసుల ప్రాసెసింగ్‌తోపాటు సహజ పద్ధతుల్లో వంట నూనెలను తయారు చేస్తోంది. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెలు, కుసుమ, కొబ్బరినూనెలను ఉత్పత్తి చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ సహకారం.. ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ తయారీ, నాణ్యతా పరీక్షలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని గొంగ్లూర్ మహిళలు గతంలో ఐఐటీ–హైదరాబాద్‌ను కోరారు. అందుకు అంగీకరించిన ఐఐటీ–హెచ్... భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంలో భాగంగా తమ క్యాంపస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీ) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఎస్ఐసీ ద్వారా ‘జెట్రో’ను సంప్రదించింది. ఐఐటీ–హెచ్, ఎస్ఐసీలు ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాయి. మరోవైపు పర్యావరణ అనుకూల పద్ధతుల్లో తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ తయారీకి తోడ్పాటు అందించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) హైదరాబాద్‌కు గొంగ్లూర్ మహిళలు విజ్ఞప్తి చేయగా ఆ సంస్థ సైతం అందుకు అంగీకారం తెలిపింది. కీలక ముందడుగు పడింది.. సర్వోదయ మంజీరా వంట నూనెల ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మేము పంపిన శాంపిల్‌ను పరిశీలించి దిగుమతి చేసుకోవాలని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సానుకూల నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎంవోయూ కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ప్రతినెలా 5 వేల లీటర్ల నూనెలను ఉత్పత్తి చేస్తున్నాం. ఎగుమతి ఆర్డర్ వస్తే ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌నాయక్, మంజీరా సర్వోదయ ఫౌండర్ తొలుత బెంగళూరుకు.. వంట నూనెల ఎగుమతులకు సంబంధించి జపాన్ సంస్థలు సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గొంగ్లూర్ మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను ఆయా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన వంటనూనెలను తొలుత బెంగళూరులోని ‘జెట్రో’ గోదాములకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేసే యోచనలో ఉన్నారు. జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు.. సర్వోదయ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ ఇప్పటికే పలు జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు పొందింది. బహుళజాతి సంస్థలు తీసుకున్నట్లే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్), హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మెటిక్స్ ఉత్పత్తులకు ఆయూష్ విభాగం నుంచి కూడా లైసెన్స్ పొందింది. చదవండి: బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ కావాలా? చలో పోచారం.. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరండి.. -
మళ్ళీ భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
-
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతుల విలువ అక్టోబర్‌తో ముగిసిన సంవత్సరంలో రూ.1.57 లక్షల కోట్లకు చేరుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 34.18 శాతం అధికం కావడం గమనార్హం. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయిన∙వంట నూనెల పరిమాణం 6.85 శాతం అధికమై 140.3 లక్షల టన్నులుగా ఉంది. 2020–21 నవంబర్–అక్టోబర్‌లో 131.3 లక్షల టన్నుల నూనెలు భారత్‌కు వచ్చి చేరాయి. వీటి విలువ రూ.1.17 లక్షల కోట్లు. 2021–22 నవంబర్–అక్టోబర్ కాలానికి పామ్ ఆయిల్ దిగుమతులు 4 లక్షల టన్నులు తగ్గి 79 లక్షల టన్నులుగా ఉంది. ధరల అధిక అస్థిరత ఈ తగ్గుదలకు కారణం. ఆర్బీడీ పామోలిన్ దాదాపు మూడింతలై 18.4 లక్షల టన్నులకు చేరింది. ముడి పామాయిల్ 20 శాతం క్షీణించి 59.94 లక్షల టన్నులు నమోదైంది. సాఫ్ట్ ఆయిల్స్ 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు ఎగసింది. సాఫ్ట్ ఆయిల్స్‌లో సోయాబీన్ 28.66 లక్షల టన్నుల నుంచి 41.71 లక్షల టన్నులు, సన్‌ఫ్లవర్ స్వల్పంగా అధికమై 19.44 లక్షల టన్నులకు చేరింది. నవంబర్ 1 నాటికి దేశంలో 24.55 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నెలకు 19 లక్షల టన్నుల నూనె వినియోగం అవుతోంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ అధికంగా ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యవసరాల సరుకుల ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు కాస్త ఊరటరానుంది. దేశంలో కుకింగ్ ఆయిల్ రేట్లు (Cooking Oil) దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని నెలల్లో ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ తగ్గుదలకు కారణమని పేర్కొంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు 200-300 డాలర్లు తగ్గాయి. దీని ప్రభావం భారత్‌లోని రిటైల్ మార్కెట్లో కూడా కనిపించడం ప్రారంభించిందని తెలిపింది. సామాన్యులకు రిలీఫ్.. ధరలు తగ్గాయ్! దేశవ్యాప్తంగా వీటిపై ఓ లుక్కేస్తే.. RBD పామోలిన్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వనస్పతి రిటైల్ ధరలు గత 6 నెలల్లో 26%, 9%, 12%, 9% 11% తగ్గాయి. గత మూడు నెలల్లో, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ సగటు దేశీయ రిటైల్ ధరలు కిలోకు రూ.181 నుంచి రూ.170కి తగ్గింది. వనస్పతి ధరలు రూ.154 నుంచి రూ.146, రిఫైన్డ్ సోయాబీన్ రూ.157 రూ. 154 తగ్గింది. మహమ్మారి, సరఫరా కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలను అరికట్టడానికి దిగుమతి సుంకాలు, పప్పులపై సెస్ తగ్గింపు, సుంకాల హేతుబద్ధీకరణ, తినదగిన నూనెలు, నూనెగింజలపై స్టాక్ పరిమితులను విధించడం, బఫర్ స్టాక్ నిర్వహణ వంటి పలు నిర్ణయాల కారణంగా వంట నూనె ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన ఫలితంగా చమురు ధరలు తగ్గాయి. ప్రస్తుతం తగ్గించిన సుంకం పూర్తి ప్రయోజనాన్ని ప్రజలకు అందేలా చూడాలని పరిశ్రమలను కేంద్రం కోరింది. చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట! -
పండుగ తర్వాత షాకిచ్చిన కేంద్రం.. పెరగనున్న వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6-11 శాతం పెంచనుంది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్‌పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పామాయిల్ (CPO) దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952డాలర్లకి పెరిగింది. అలాగే ఆర్బీడీ (RBD) పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905డాలర్ల నుంచి 962డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు అధిక భాగం రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి సరఫరా జరుగుతోంది. చదవండి: 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! -
సామాన్యులకు శుభవార్త, భారీగా తగ్గిన వంట నూనెల ధరలు
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ కారణంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరి గాయి. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇ బ్బందులు పడ్డారు. పల్లి, సన్‌ఫ్లవర్, పామాయిల్ నూనెలను వంటలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువగా ఉండటంతో పొరుగు దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దిగుమతులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తు తం నెల రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులపై భారం తప్పింది. గతంలో సన్‌ఫ్లవర్ నూనె లీటర్‌కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి చేరింది. పల్లి నూనె లీటర్‌కు రూ.220 పలుకగా రూ.165కి తగ్గింది. పామాయిల్ ధర లీటర్‌కు రూ.150 నుంచి రూ.95కు తగ్గింది. పామాయిల్‌న్ గతంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణా ల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నూనె సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతం నూనె ధరలు రూ.55 నుంచి రూ.60 వరకు తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు మళ్లీ పెరగకుండా చూడాలని కోరుతున్నారు. చదవండి👉 చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట? -
సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
-
సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గనున్న వంటనూనె ధరలు!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చదవండి👉 హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు -
వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట
న్యూఢిల్లీ: వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ ఈడీ బీవీ మెహతా తెలిపారు. -
సామాన్యుడికి శుభవార్త.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు జీఎస్టీ ప్రభావం మరింత భారం కానుంది. ఈ క్రమంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల తగ్గింపుపై కేంద్రం ఆహార మంత్రిత్వశాఖ వంటనూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం(ఆగస్టు4)న సమావేశం కానుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే తర్వాత ఇలాంటి సమావేశాలు జరగడం ఇది మూడోసారి. ముఖ్యంగా పామాయిల్ అతిపెద్ద ఎగుమతిదారుడు ఇండోనేషియా రవాణాపై నిషేధాన్ని తొలగించి, సన్‌ఫ్లవర్, సోయా నూనెల సరఫరాను సడలించిన తర్వాత అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్(వంటనూనెల) ధరలు క్షీణించాయి. అయితే దేశీ మార్కెట్లో రిటైల్ ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. కాగా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచచ్చిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం, జూన్ 1 నుంచి దేశీయ మార్కెట్లో ఆవాలు, సోయా, సన్ ఫ్లవర్ పామాయిల్ రిటైల్ ధరలు 5-12% శ్రేణిలో క్షీణించాయి. తగ్గుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. భారత్ వార్షిక దిగుమతులు దాదాపు 13-14 మిలియన్ టన్నులు ఉండగా, అందులో ఇండోనేషియా, మలేషియా నుంచి 8 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటోంది. అయితే సోయా , సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుంచి వస్తాయి. చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి! -
తగ్గనున్న వంట నూనె ధరలు..ఎప్పటి నుంచంటే..?
సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ఆగస్ట్ 31 వరకు అన్ని పామాయిల్ ఉత్పత్తులకు ఎగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్‌లో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ సంక్షోభం తలెత్తినా ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. ఉదాహరణకు..ఉక్రెయిన్ నుంచి భారత్ 70శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా భారత్‌లో ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి ముందు రూ.135 నుంచి 150 మధ్యలో ఉన్న వంట నూనె రూ.200కి చేరింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె రావడం లేదని వ్యాపారస్తులు వాటి ధరల్ని భారీగా పెంచారు. ధరల్ని తగ్గించాలి ఈ నేపథ్యంలో కేంద్రం ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిపోతున్న నిత్యవసర ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేలా వెంటనే ఆయిల్ ధరల్ని రూ.15 తగ్గించాలని సూచించింది. ఈ తరుణంలో పామాయిల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఇండోనేషియా రద్దు చేయడంతో..దేశీయ ఆయిల్ కంపెనీలు నూనెల ధరల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వంట నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే! 'విదేశాల నుంచి భారత్‌కు రవాణా అయ్యే సరకు జులై 15 ముందు నుంచే ప్రారంభమవుతుంది. జులై 25కల్లా భారత్‌కు చేరుతుంది. కాబట్టి.. అదే నెలలో (జులై) వంట నూనెల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాతి నెల నుంచి ధరలు తగ్గుతాయని' అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ అన్నారు. ఆయిల్ ధరల్ని తగ్గించాయి భారత్‌లో కొన్ని ఆయిల్ కంపెనీలు వాటి ధరల్ని తగ్గించాల్సి ఉంది. అదే సమయంలో అదానీ విల్మార్, మదర్ డెయిరీ, ఇమామి ఆగ్రోటెక్ పాటు ఇతర సంస్థలు గత నెలలో ఆయిల్ ఉత్పత్తులపై రూ .10 -15 ధరని తగ్గించాయి. -
భారీ ఊరట: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెల ధరలను అదుపు చేసేందుకవసరమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా శుభవార్త అందించింది. వంట నూనెల రిటైల్ ధరను లీటరుకు రూ. 15 తగ్గించింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ధర తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు తక్షణమే అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో సామాన్యులకు వంటింటి భారం నుంచి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల నపథ్యంలో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. కాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామాయిల్ రిటైల్ ధరలు 5-11 శాతం తగ్గాయి. -
శుభవార్త! వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్..
వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్! అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు ఈ తగ్గింపు ఉండవచ్చని చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్యులు బడ్జెట్ తలకిందులైపోయింది. మేలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. మనం వినియెగించే వంట నూనెలో సగానికి పైగా దిగుమతి చేసుకోవ్లాసి ఉంది. దీంతో కేంద్రం సైతం దిగుమతి సుంకాలు తగ్గించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సన్‌ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు తగ్గాయని ఇండియన్ వెజిటేబుల్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే తగ్గింపు హోల్‌సేల్ మార్కెట్లలో అమలకు చర్యలు మొదలయ్యాయని ఆయిల్ అసోసియేషన్ తెలిపింది. వారం పదిరోజుల్లో రిటైల్ మార్కెట్లో ఎంఆర్పీ ధరలు కూడా తగ్గుతాయంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 నుంచి 15, సోయాబీన్‌పై రూ.5 వంతున ధరలు తగ్గే అవకాశం ఉంది. చదవండి: బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్‌పై సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఇండోనేషియా నిషేధం...సామాన్యులపై మరో పిడుగు....!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధిక వంటనూనె ధరలతో సతమతమవుతోన్న సామాన్యులకు ఇప్పుడు ఇండోనేషియా నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేయనుంది. ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో మరోసారి వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. వీపరితమైన కొరత..! ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారు ఇండోనేషియా. ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతులను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించుకుంది. ఇండోనేషియాలో వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశీయంగా వంటనూనెకు వీపరితమైన కొరత ఏర్పడటంతో పామాయిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతులను నిషేధించేందుకు ఇండోనేషియా సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనాపై ప్రభావం..! ఇండోనేషియా నిర్ణయం నేరుగా భారత్, చైనాలపై పడనుంది. ఆ దేశం నుంచి పామాయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో చైనా, భారత్‌లు తొలి స్థానంలో ఉన్నాయి. ఇరు దేశాల దిగుమతులు ప్రపంచ సరఫరాలో సగానికి పైగా ఉంది. ఇండోనేషియా నుంచి పామాయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల భారత్‌కు ప్రతి నెలా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్తో ఇప్పటికే భారత్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా నెలకు దాదాపు లక్ష టన్నులకు సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో వంటనూనె ధరలు వీపరితంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పామాయిల్ వాడకం ఎక్కువ..! పామాయిల్‌ను వంట నూనెల నుంచి ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాస్మొటిక్స్, జీవ ఇంధనాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే కూరగాయల నూనె. అంతేకాకుండా బిస్కెట్లు, వనస్పతి, లాండ్రీ డిటర్జెంట్లు, చాక్లెట్ వంటి అనేక ఉత్పత్తుల తయారీలో కూడా పామాయిల్‌ను విరివిరిగా ఉపయోగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..! -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే!
ముంబై: భారత్ ఎకానమీపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 0.8 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో క్రితం 7.8 శాతం అంచనాలు 7.2 శాతానికి తగ్గాయి. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ముఖ్యాంశాలు... ►కమోడీటీ ధరల పెరుగుదల ప్రధాన సమస్య. యుద్ధం నేపథ్యంలో తాజా సరఫరాల సమస్యలు తలెత్తుతున్నాయి. ►2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలు ప్రస్తు తం 7.8%గా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో ఈ అంకెను తగ్గించే అవకాశం ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4% కాగా, నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి 2022) ఈ రేటు 3 నుంచి 4 % మేరకే నమోదయ్యే వీలుంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 8.5%గా ఉంటుందని భావిస్తున్నాం. ►ఊహించినట్లుగానే మహమ్మారి కరోనా మొదటి, రెండవ వేవ్‌లతో పోల్చితే మూడవ వేవ్‌లో ఆర్థిక, ప్రాణ నష్టాలు చాలా తక్కువగానే నమోదయ్యాయి. 2022 మార్చి ప్రారంభంలో ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికీ, రష్యా–ఉక్రెయిన్ వివాదం, వస్తువుల ధరలలో పెరుగుదల ఎకానమీలో అనిశ్చితిని పెంచిం ది. పలు కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ►ఇంధనం, వంట నూనెల వంటి వస్తువుల అధిక ధరలు మధ్య, దిగువ స్థాయి ఆదాయ వర్గాల విచక్షణ రహిత వ్యయాలను తగ్గించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్ పునరుద్ధరణను అడ్డుకుంటుంది. ►సెప్టెంబరు 2022 వరకు ఉచిత ఆహారధాన్యాల పథకం పొడిగింపు హర్షణీయం. బలహీన ఆర్థిక కుటుంబాల ఆహార బడ్జెట్లకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. ►భారత్ ఎగుమతుల విషయానికి వస్తే, మూడవ త్రైమాసికంతో పోల్చితే నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) సామర్థ్య వినియోగ స్థాయిలు 72% నుంచి 75%కి పెరిగింది. ►2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోడానికి కేంద్ర మూలధన వ్యయాలు కీలకంగా మారనున్నాయి. ►ఎకానమీలో వివిధ రంగాల్లో పలు స్థాయిల్లో (కే నమూనాలో) రికవరీ చోటుచేసుకునే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతాయి. వ్యవసాయంలో వృద్ధి 3 % లోపే... ఇక్రా నివేదిక ప్రకారం, 2022లో రిజర్వాయర్ స్థాయిలు బాగున్నాయి. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడినా, వ్యవసాయ రంగంపై అంతగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. అయితే ఎరువుల కొరత వ్యవ సాయ రంగానికి ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీ య మార్కెట్లో పరిమిత లభ్యత, పెరిగిన ధరలు, తక్కువ దిగుమతులు వంటి అంశాలు వ్యవసాయ రం గంపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అందువల్ల తగిన రిజర్వాయర్ స్థాయిలు, సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగే అవకాశం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3%కన్నా తక్కువగా నమోదయ్యే వీలుంది. -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన రాష్ట్రంలో సామాన్యులపై భారం మోపుతోంది. వంట నూనెల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. వంట నూనెలను ప్రధానంగా మన దేశం ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వంట నూనెలకు ఉన్న డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం అల్పాహార ధరలపై పడింది. వంట నూనెలతో తయారయ్యే అన్ని రకాల టిఫిన్ ధరలను హోటళ్ల యాజమాన్యాలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. నూనెతో తయారయ్యే దోశె, పూరి, వడ, బజ్జి, పుణుకులు వంటివాటి ధరలు ఇప్పటికే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా పెరిగాయి. యుద్ధం రాకముందు సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.135గా ఉండేదని, ఇప్పుడు అది రూ.180కు చేరుకుందని.. దీంతో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని విజయవాడలోని సాయి ప్రియాంక హోటల్ యజమాని తెలిపారు. మొన్నటి దాక రూ.40గా ఉన్న ప్లేట్ మైసూర్ బజ్జి, గారెల ధరలను ఇప్పుడు రూ.50కు పెంచామని వివరించారు. అలాగే దోశెల ధరలను రూ.5 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. చదవండి: సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు భగ్గుమంటున్న ఇతర వస్తువుల ధరలు ఇదే సమయంలో వంట నూనెలతోపాటు వంట గ్యాస్, ఎండు మిర్చి వంటి వాటి ధరలు కూడా భారీగా పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా ఇప్పుడిది రూ.1,980కు చేరిందన్నారు. అలాగే ఎండు మిర్చి ధర 15 రోజుల క్రితం కిలో రూ.200లోపు ఉండగా అది ఇప్పుడు రూ.260కి చేరిందని వివరించారు. అలాగే లైవ్ చికెన్ కిలో ఫిబ్రవరిలో రూ.92–112 మధ్య ఉంటే ఇప్పుడది రూ.149కి చేరిందని దీంతో చికెన్‌తో తయారయ్యే ఆహార ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. నష్టాలు భరించలేని చిన్న హోటల్స్ ధరలు పెంచాయని.. పెద్ద హోటల్స్ మాత్రం వేచిచూస్తున్నట్లు తెలిపారు. యుద్ధం సద్దుమణిగితే నూనె ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందేమోనని వేచిచూస్తున్నట్టు తిరుపతిలోని స్టార్ హోటల్ యజమాని ఒకరు ‘సాక్షి’కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా రిటైల్ ధరలను సవరించలేదన్నారు. ఒక్కసారి డీజిల్ ధరలు పెరిగితే అందరూ ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. నష్టాలు భరించలేం.. గత రెండేళ్లుగా కరోనాతో హోటల్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. అయినా వ్యాపారం పునరుద్ధరించుకోవడం కోసం రెండేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టిఫిన్ ధరలను పెంచకుండా నష్టాలను భరించాం. కానీ ఇప్పుడు వంట నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు ఇదేవిధంగా కొనసాగితే అన్ని రకాల టిఫిన్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. – బాలకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్, ఏపీ హోటల్స్ అసోసియేషన్