ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు జీఎస్టీ ప్రభావం మరింత భారం కానుంది. ఈ క్రమంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల తగ్గింపుపై కేంద్రం ఆహార మంత్రిత్వశాఖ వంటనూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం(ఆగస్టు4)న సమావేశం కానుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మే తర్వాత ఇలాంటి సమావేశాలు జరగడం ఇది మూడోసారి. ముఖ్యంగా పామాయిల్ అతిపెద్ద ఎగుమతిదారుడు ఇండోనేషియా రవాణాపై నిషేధాన్ని తొలగించి, సన్‌ఫ్లవర్, సోయా నూనెల సరఫరాను సడలించిన తర్వాత అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్(వంటనూనెల) ధరలు క్షీణించాయి. అయితే దేశీ మార్కెట్‌లో రిటైల్ ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది.
దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. కాగా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచచ్చిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం, జూన్ 1 నుంచి దేశీయ మార్కెట్‌లో ఆవాలు, సోయా, సన్ ఫ్లవర్ పామాయిల్ రిటైల్ ధరలు 5-12% శ్రేణిలో క్షీణించాయి.
తగ్గుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. భారత్ వార్షిక దిగుమతులు దాదాపు 13-14 మిలియన్ టన్నులు ఉండగా, అందులో ఇండోనేషియా, మలేషియా నుంచి 8 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటోంది. అయితే సోయా , సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుంచి వస్తాయి.
చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!
Comments
Please login to add a commentAdd a comment