Edible oil import
-
వంటనూనె ధరలు మరింత ప్రియం?
దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) నివేదిక తెలిపింది.ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, నన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్ఈఏ నివేదించింది.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసంసాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల బేస్ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. -
నూనెల ధర ఎందుకు పెరిగింది?
న్యూఢిల్లీ: వంటనూనెల రిటైల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం వివరణ కోరింది. పాత సుంకాల ఆధారంగా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు తగినంత ఉన్నందున ధరలు స్థిరంగా ఉంచాలని ఈ సందర్భంగా సూచించింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?‘వచ్చే పండుగ సీజన్లో రిటైల్ ధరలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. దిగుమతి సుంకం పెంపు ప్రకటన నుండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై కారణాలను వెల్లడించాలని పరిశ్రమను ప్రభుత్వం కోరింది’ అని ఆహార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న నూనెలు సుమారు 30 లక్షల టన్నుల నిల్వ ఉందని, ఇవి సులభంగా 45–50 రోజుల డిమాండ్‌ను తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రాసెసింగ్ కంపెనీలు గరిష్ట రిటైల్ ధరలను పెంచడం మానుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్‌లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
వంట నూనె ధరలు తగ్గించాలన్న కేంద్రం.. కంపెనీల రియాక్షన్..?
అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చిత పరిస్థితులు ఎదురైతే వెంటనే దాన్ని ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతుంది. ఇతర దేశాల నుంచి వస్తువులను దిగమతి చేసుకుంటున్న దేశాలకైతే మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయి. దాంతో వస్తువులు, ఆహారసామగ్రి ధరలు పెరుగుతాయి. ఆ సాకుతో కంపెనీలు అడ్డగోలుగా క్యాప్ఫ్లోలు పెంచుకుంటాయి. తిరిగి ఆ అనిశ్చిత పరిస్థితులు సద్దుమణిగినా ఏ మేరకు ధరలు పెంచారో ఆ రీతిలో వాటిని తగ్గించరు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పెరిగిన వంటనూనె ధరలు ఇప్పటికీ అధికంగానే కొనసాగుతున్నాయి. దాంతో దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరల తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం వంట నూనె తయారీ సంస్థలను ఆదేశించింది. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని వంటనూనెల కంపెనీలు ప్రభుత్వానికి వెల్లడించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. నూనెల ఉత్పత్తికి ఉపయోగించే కొన్ని పంటల కోతలు ప్రారంభమయ్యే మార్చి వరకు ధరల తగ్గింపు సాధ్యంకాదని పరిశ్రమల నిర్వాహకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా వెజిటబుల్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడం గమనార్హం. శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని గతేడాది జూన్‌లో 17.5% నుంచి 12.5%కి తగ్గించారు. అందుకు అనుగుణంగా ధరలు తగ్గించాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్.. కానీ.. ఇండియా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో సహా తక్కువ మొత్తంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్, రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి నూనెలపై అంతర్జాతీయంగా తగ్గిన ధరల మేరకు దేశంలో తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ తెలిపారు. -
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు నవంబర్‌లో గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 11,38,823 టన్నులతో పోల్చి చూస్తే, 32 శాతం పెరిగి 15,28,760 టన్నులకు చేరాయి. ముఖ్యంగా ముడి పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు అధికంగా జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి వంట నూనెలు, ఇతర నూనెల దిగుమతుల గణాంకాలను ఎస్ఈఏ బుధవారం విడుదల చేసింది. వంట నూనెలకు సంబంధించి 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో నవంబర్ మొదటి నెల అవుతుంది. పామాయిల్ రికార్డులు ► మొత్తం నూనెల దిగుమతులు నవంబర్ నెలకు 15,45,540 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి 11,73,747 టన్నులుగా ఉన్నాయి. ► కేవలం వంట నూనెల దిగుమతులు 15,28,760 టన్నులకు చేరాయి. ► ఇతర నూనెల దిగుమతులు ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 34,924 టన్నులతో పోలిస్తే 52 శాతం తగ్గి 16,780 టన్నులుగా ఉన్నాయి. ► ముడి పామాయిల్ దిగుమతులు 9,31,180 టన్నులుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇవి 4,77,160 టన్నులుగానే ఉన్నాయి. అంటే రెట్టింపైనట్టు తెలుస్తోంది. ► ఇప్పటి వరకు ఒక నెలలో ముడి పామాయిల్ అధిక దిగుమతులు ఇవే కావడం గమనించాలి. చివరిగా 2015 అక్టోబర్ నెలలో 8,78,137 టన్నుల ముడి పామాయిల్ దిగుమతులు జరిగాయి. ► రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు నవంబర్ నెలకు 2,02,248 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఉన్న 58,267 టన్నులతో పోలిస్తే మూడు రెట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ► ముడి సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 2,29,373 టన్నులకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఇవి 4,74,160 టన్నులుగా ఉన్నాయి. ఎస్ఈఏ ఆందోళన..: రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ దిగుమతులు పెరిగిపోవడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఎస్ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ముడి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ మధ్య టారిఫ్ అంతరం 7.5 శాతమే ఉండడంతో, రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి దారితీస్తోంది. తుది ఉత్పత్తుల దిగుమతులు పెరగడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. దేశీ సామర్థ్య వినియోగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి.. వాటిని ఎగుమతి చేసే దేశాలు (ఇండోనేషియా, మలేషియా) అక్కడి పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వల్లే. ముడి పామాయిల్ ఎగుమతులపై ఆయా దేశాలు అధిక సుంకాలు విధించాయి. తుది ఉత్పత్తి అయిన పామోలీన్ ఆయిల్‌పై తక్కువ డ్యూటీ విధించాయి’’అని అసోసియేషన్ పేర్కొంది. దేశీ పరిశ్రమను ఆదుకునేందుకు, ముడి పామాయిల్ దిగుమతిని ప్రోత్సహించేందుకు పరిశ్రమ కీలక సూచన చేసింది. రెండింటి మధ్య సుంకాల్లో అంతరం 15 శాతం మేర ఉంచాలని పేర్కొంది. రిఫైన్డ్ పామోలీన్ ఆయిల్‌పై డ్యూటీని 20 శాతం చేయాలని కోరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వంట నూనెల దిగుమతులు అంతకుమందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 131 లక్షల టన్నుల నుంచి 140 లక్షల టన్నులకు పెరగడం గమనార్హం. -
మళ్ళీ భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
-
సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గనున్న వంటనూనె ధరలు!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చదవండి👉 హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు -
సామాన్యుడికి శుభవార్త.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు జీఎస్టీ ప్రభావం మరింత భారం కానుంది. ఈ క్రమంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల తగ్గింపుపై కేంద్రం ఆహార మంత్రిత్వశాఖ వంటనూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం(ఆగస్టు4)న సమావేశం కానుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే తర్వాత ఇలాంటి సమావేశాలు జరగడం ఇది మూడోసారి. ముఖ్యంగా పామాయిల్ అతిపెద్ద ఎగుమతిదారుడు ఇండోనేషియా రవాణాపై నిషేధాన్ని తొలగించి, సన్‌ఫ్లవర్, సోయా నూనెల సరఫరాను సడలించిన తర్వాత అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్(వంటనూనెల) ధరలు క్షీణించాయి. అయితే దేశీ మార్కెట్లో రిటైల్ ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. గురువారం ఆయిల్ కంపెనీలతో జరగబోయే సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది. కాగా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచచ్చిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం, జూన్ 1 నుంచి దేశీయ మార్కెట్లో ఆవాలు, సోయా, సన్ ఫ్లవర్ పామాయిల్ రిటైల్ ధరలు 5-12% శ్రేణిలో క్షీణించాయి. తగ్గుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. భారత్ వార్షిక దిగుమతులు దాదాపు 13-14 మిలియన్ టన్నులు ఉండగా, అందులో ఇండోనేషియా, మలేషియా నుంచి 8 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటోంది. అయితే సోయా , సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుంచి వస్తాయి. చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి! -
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్‌కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది. వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్‌కు వస్తోంది. యుద్ధం కొనసాగితే.. ‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్‌ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది. దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్‌కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్‌కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది. -
కేంద్రం శుభవార్త, వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో వంటనూనెలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వివిధ రకాల నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు పెరిగాయి. దీంతో రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు పెరుగుతాయనే అంచనాల నడుమ కేంద్రం వాటి ధరల్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. ఇక అన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించడంతో.. తాజా ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరనుండగా దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ధరలు మరితం తగ్గనున్నాయి. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు
సామాన్యులకు ఊరట కలుగనుందా? వంట నూనె ధరలు దిగిరానున్నాయా? అంటే అవును అని అంటున్నారు కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే. గత ఏడాది నుంచి 20 - 50 శాతం మధ్య పెరిగిన వంటనూనె ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి వంట నూనెల ధరలు దిగిరావొచ్చన్నారు. కొత్త పంట మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గే అంచనాలు ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. "రాబోయే డిసెంబర్ నుంచి సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది" అని ఆహార & ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.(చదవండి: నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు) పాండే మాట్లాడుతూ.. "రాబోయే రోజుల్లో సోయాబీన్ పంట కోతకు వస్తుంది. ఆ నాలుగు నెలల తర్వాత రబీ ఆవాల పంట చేతికి వస్తుంది, కాబట్టి ధరలు నియంత్రణలో ఉండాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. అలాగే, కొత్త పంటల రాక, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ఆయిల్ ధరల ఇందుకు కారణం అని అన్నారు. ప్రస్తుతం 60 శాతం ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుంది అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే, అప్పుడు ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అని పాండే అన్నారు. గత ఏడాది కాలంలో దేశంలో వంట నూనె ధరలు 64 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలను అరికట్టడం కోసం మిషన్ ఆయిల్‌పామ్ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
వంటనూనెల దిగుమతి సుంకం 5 శాతం పెంపు
న్యూఢిల్లీ : రైతు ప్రయోజనాలను పరిరక్షించడానికి, దేశీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం.. ముడి వంటనూనెల దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి 12.5 శాతానికి, రిఫైన్డ్ వంటనూనెల దిగుమతి సుంకం 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వంటనూనెల దిగుమతి సుంకాన్ని స్వల్పంగా పెంచడం వల్ల దేశంలోకి తక్కువ ధరలకు అధిక మొత్తంలో జరుగుతున్న వంటనూనెల దిగుమతులను అడ్డుకోలేమని, అలాగే రైతులకు, దేశీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగదని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టార్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) పేర్కొంది. ప్రభుత్వ చర్య ఆహ్వానించదగ్గదేనని, కానీ ముడి వంటనూనెల దిగుమతి సుంకాన్ని 25 శాతానికి, రిఫైన్డ్ వంటనూనెల దిగుమతి సుంకాన్ని 45 శాతానికి పెంచితేనే పెంపు ప్రయోజనాలు రైతులకు, దేశీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు అందుతాయని ఎస్ఈఏ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.వి.మెహతా అభిప్రాయపడ్డారు. 2013-14 ఆయిల్ సంవత్సరం (నవంబర్-అక్టోబర్)లో 11.6 మిలియన్ టన్నులుగా ఉన్న మొత్తం వంటనూనెల దిగుమతులు 2014-15 ఆయిల్ సంవత్సరానికి వచ్చేసరికి 14 మిలియన్ టన్నులకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోకి వంటనూనెలు అధికంగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.