అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చిత పరిస్థితులు ఎదురైతే వెంటనే దాన్ని ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతుంది. ఇతర దేశాల నుంచి వస్తువులను దిగమతి చేసుకుంటున్న దేశాలకైతే మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయి. దాంతో వస్తువులు, ఆహారసామగ్రి ధరలు పెరుగుతాయి. ఆ సాకుతో కంపెనీలు అడ్డగోలుగా క్యాప్‌ఫ్లోలు పెంచుకుంటాయి. తిరిగి ఆ అనిశ్చిత పరిస్థితులు సద్దుమణిగినా ఏ మేరకు ధరలు పెంచారో ఆ రీతిలో వాటిని తగ్గించరు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పెరిగిన వంటనూనె ధరలు ఇప్పటికీ అధికంగానే కొనసాగుతున్నాయి. దాంతో దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరల తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం వంట నూనె తయారీ సంస్థలను ఆదేశించింది. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని వంటనూనెల కంపెనీలు ప్రభుత్వానికి వెల్లడించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
నూనెల ఉత్పత్తికి ఉపయోగించే కొన్ని పంటల కోతలు ప్రారంభమయ్యే మార్చి వరకు ధరల తగ్గింపు సాధ్యంకాదని పరిశ్రమల నిర్వాహకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా వెజిటబుల్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడం గమనార్హం. శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని గతేడాది జూన్‌లో 17.5% నుంచి 12.5%కి తగ్గించారు. అందుకు అనుగుణంగా ధరలు తగ్గించాలనే డిమాండ్ ఉంది.
ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. కానీ..
ఇండియా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో సహా తక్కువ మొత్తంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్, రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి నూనెలపై అంతర్జాతీయంగా తగ్గిన ధరల మేరకు దేశంలో తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment