Edible oil business
-
నూనెల ధర ఎందుకు పెరిగింది?
న్యూఢిల్లీ: వంటనూనెల రిటైల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం వివరణ కోరింది. పాత సుంకాల ఆధారంగా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు తగినంత ఉన్నందున ధరలు స్థిరంగా ఉంచాలని ఈ సందర్భంగా సూచించింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?‘వచ్చే పండుగ సీజన్లో రిటైల్ ధరలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. దిగుమతి సుంకం పెంపు ప్రకటన నుండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై కారణాలను వెల్లడించాలని పరిశ్రమను ప్రభుత్వం కోరింది’ అని ఆహార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న నూనెలు సుమారు 30 లక్షల టన్నుల నిల్వ ఉందని, ఇవి సులభంగా 45–50 రోజుల డిమాండ్‌ను తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రాసెసింగ్ కంపెనీలు గరిష్ట రిటైల్ ధరలను పెంచడం మానుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
వంట నూనె ధరలు తగ్గించాలన్న కేంద్రం.. కంపెనీల రియాక్షన్..?
అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చిత పరిస్థితులు ఎదురైతే వెంటనే దాన్ని ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతుంది. ఇతర దేశాల నుంచి వస్తువులను దిగమతి చేసుకుంటున్న దేశాలకైతే మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయి. దాంతో వస్తువులు, ఆహారసామగ్రి ధరలు పెరుగుతాయి. ఆ సాకుతో కంపెనీలు అడ్డగోలుగా క్యాప్ఫ్లోలు పెంచుకుంటాయి. తిరిగి ఆ అనిశ్చిత పరిస్థితులు సద్దుమణిగినా ఏ మేరకు ధరలు పెంచారో ఆ రీతిలో వాటిని తగ్గించరు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పెరిగిన వంటనూనె ధరలు ఇప్పటికీ అధికంగానే కొనసాగుతున్నాయి. దాంతో దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరల తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం వంట నూనె తయారీ సంస్థలను ఆదేశించింది. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని వంటనూనెల కంపెనీలు ప్రభుత్వానికి వెల్లడించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. నూనెల ఉత్పత్తికి ఉపయోగించే కొన్ని పంటల కోతలు ప్రారంభమయ్యే మార్చి వరకు ధరల తగ్గింపు సాధ్యంకాదని పరిశ్రమల నిర్వాహకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా వెజిటబుల్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడం గమనార్హం. శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని గతేడాది జూన్‌లో 17.5% నుంచి 12.5%కి తగ్గించారు. అందుకు అనుగుణంగా ధరలు తగ్గించాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్.. కానీ.. ఇండియా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో సహా తక్కువ మొత్తంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్, రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి నూనెలపై అంతర్జాతీయంగా తగ్గిన ధరల మేరకు దేశంలో తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ తెలిపారు. -
మళ్ళీ భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
-
భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రిటైల్ మార్కెట్లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ & ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా & సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్) -
కేంద్రం తాజా నిర్ణయంతో దిగిరానున్న వంటనూనెల ధరలు
న్యూఢిల్లీ: మార్కెట్లో మండిపోతున్న వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధిస్తున్నట్లు వెల్లడించింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయంతో నూనెల ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార, వినియోగదారు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటికే ఎన్సీడీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై.. మస్టర్డ్ ఆయిల్ ట్రేడింగ్‌ను అక్టోబర్ 8 నుంచి నిలిపివేశారు. పన్నులు తగ్గించినా ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరంగా రెండు రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ఆవాల నూనె కాకుండా వంట నూనె ధరలు సుమారు 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. నూనె ధరల తగ్గింపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిల్వలపై పరిమితిని విధించాలని ఆదేశించింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‌లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. (చదవండి: ఈ స్మార్ట్ హోమ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!) -
వంట నూనెల వ్యాపారంలోకి మహీంద్రా
న్యూప్రో బ్రాండ్‌లో ఆవాల నూనె కోల్‌కత : మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ వంటనూనెల వ్యాపారంలోకి ప్రవేశించింది. గ్రూప్‌నకు చెందిన వ్యవసాయ వ్యాపార విభాగం న్యూప్రో బ్రాండ్ పేరుతో ఆవాల నూనెను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నూనెను ముందుగా కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చామని గ్రూప్ ఆగ్రి బిజనెస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ చెప్పారు. తర్వాత ఒడిశా, జార్ఖండ్‌ల్లో ప్రవేశపెడతామని వివరించారు. త్వరలోనే పాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసుల రిటైల్ సెగ్మెంట్లోకి అడుగిడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం పప్పు దినుసులను బీ2బీ చానళ్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపారు. త్వరలోనే సన్‌ఫ్లవర్, సోయా, రైస్ బ్రాండ్ తదితర ఇతర వంటనూనెల రకాలను అందిస్తామని చెప్పారు. గత నాలుగేళ్లలో తమ వ్యవసాయ-వ్యాపారం ఆదాయం రూ.70 కోట్ల నుంచి రూ.580 కోట్లకు పెరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.