
న్యూఢిల్లీ: మార్కెట్లో మండిపోతున్న వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధిస్తున్నట్లు వెల్లడించింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయంతో నూనెల ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార, వినియోగదారు మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇప్పటికే ఎన్సీడీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై.. మస్టర్డ్ ఆయిల్ ట్రేడింగ్‌ను అక్టోబర్ 8 నుంచి నిలిపివేశారు. పన్నులు తగ్గించినా ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరంగా రెండు రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ఆవాల నూనె కాకుండా వంట నూనె ధరలు సుమారు 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. నూనె ధరల తగ్గింపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిల్వలపై పరిమితిని విధించాలని ఆదేశించింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‌లో పొందుపరచాలని కేంద్రం సూచించింది.
(చదవండి: ఈ స్మార్ట్ హోమ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment