న్యూఢిల్లీ: వంటనూనెల రిటైల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం వివరణ కోరింది. పాత సుంకాల ఆధారంగా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు తగినంత ఉన్నందున ధరలు స్థిరంగా ఉంచాలని ఈ సందర్భంగా సూచించింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
‘వచ్చే పండుగ సీజన్‌లో రిటైల్ ధరలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. దిగుమతి సుంకం పెంపు ప్రకటన నుండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై కారణాలను వెల్లడించాలని పరిశ్రమను ప్రభుత్వం కోరింది’ అని ఆహార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న నూనెలు సుమారు 30 లక్షల టన్నుల నిల్వ ఉందని, ఇవి సులభంగా 45–50 రోజుల డిమాండ్‌ను తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రాసెసింగ్ కంపెనీలు గరిష్ట రిటైల్ ధరలను పెంచడం మానుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment