oil prices
-
'మంట' పుట్టిస్తున్న వంటనూనెలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఓ వైపు పప్పుల ధరలు చుక్కలనంటుతుంటే.. మరోవైపు వంటæనూనెల ధరలు తారాజువ్వల్లా దూసుకెళ్తుండడంతో పండుగ వేళ పిండివంటలు చేసుకోవాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. – సాక్షి, అమరావతిచిరువ్యాపారులపై తీవ్ర ప్రభావం వంటనూనెల ధరల పెరుగుదల ప్రభావం సామాన్య, మధ్యతరగతులపైనే కాదు.. హోటల్ ఇండస్ట్రీస్‌పై కూడా తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా రోడ్‌సైడ్ చిన్న చిన్న తోపుడు పండ్లపై చిరువ్యాపారులు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కృత్రిమ కొరత సృష్టిస్తోన్న వ్యాపారులపై నిఘా కొరవడింది. సుంకం సాకుతో ధరలు పెంచిన తర్వాత మొక్కుబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. అయితే కూటమి పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు.చూసీ చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం..క్రూడ్ పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలు 5.5 శాతం నుంచి 27.5 శాతానికి కేంద్రం పెంచేసింది. శుద్ధి చేసి తినదగిన నూనెలపై 13.7 శాతం నుంచి 35.7 శాతానికి దిగుమతి సుంకాలు పెరిగాయి. ఈ పెంపు సెపె్టంబర్ 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చీ రాగానే దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు మామూళ్ల మత్తులో చూసీచూడనట్టు వ్యవహరించడంతో కంపెనీలు ఉన్నఫళాన రేట్లను అమాంతం పెంచేసాయి. ధరలు పెరిగిన సందర్భంలో పౌరసరఫరాల మంత్రి హడావుడి చేసినా ఆ తర్వాత ధరల పెంపుపై నోరు మెదపడం లేదు. వంటనూనెలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు 20–30 శాతం పెరగగా, కూరగాయల ధరలు 40–60 శాతం మేర పెరిగాయి. చివరికి కాఫీ ధరలు 60 శాతం, టీ ధరలు 25 శాతం పెరిగాయి. ప్రధానంగా బియ్యం ధర 15 శాతం, పప్పుల ధరలు 50–67 శాతం మేర పెరిగాయి.5 నెలల్లో 60% పెరిగిన ధరలుపామాయిల్ ధర సరిగ్గా ఐదు నెలల క్రితం మే 29న బ్రాండ్‌ను బట్టి లీటర్ రూ.88–90 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.128–140కు చేరుకుంది. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.108–113 నుంచి రూ.149–160 పెరిగిపోయింది. వేరుశనగ నూనె గతంలో రూ.157 ఉండగా, ప్రస్తుతం రూ.170–200 వరకు ఉంది. సన్‌డ్రాప్, ప్రియా, ఫ్రీడమ్ వంటి కంపెనీల ఆయిల్స్ అయితే ఏకంగా రూ.200కు పైగానే ఉన్నాయి. గత నెలతో పోలిస్తే 29–37 శాతం మేర పెరగగా, మేతో పోలిస్తే వంట నూనె ధరలు 40–60 శాతం మేర పెరిగాయి. ఇళ్లల్లో వాడే ఆవనూనె ధర సైతం నెల రోజుల్లో ఏకంగా 29శాతం పెరిగింది. గత నెలలో ముడిపామ్, సోయా బీన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు వరుసగా 10.6 శాతం, 12.3 శాతం, 16.8 శాతం చొప్పున పెరిగినందున.. ఆ ప్రభావం ధరలపై పడుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అండగా వైఎస్ జగన్ ప్రభుత్వంగతంలో ఉక్రేయన్ యుద్ధం నేపథ్యంలో 2022లో ఇదే రీతిలో పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ధరలు అనూహ్యంగా పెరిగిన సందర్భంలో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వినియోగదారులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టింది. ఆయిల్ ఫెడ్ ఉత్పత్తి అయిన విజయా బ్రాండ్ ఆయిల్స్‌ను రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలపై అందుబాటులోకి ఉంచింది.ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాదు.. కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి సుమారు 3.5లక్షల లీటర్ల ఆయిల్స్‌ను సబ్సిడీ ధరలకు అందించారు. అదే విధంగా టమాటా, ఉల్లిపాయలను సబ్సిడీపై అందించి అండగా నిలిచింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నూనెల ధర ఎందుకు పెరిగింది?
న్యూఢిల్లీ: వంటనూనెల రిటైల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం వివరణ కోరింది. పాత సుంకాల ఆధారంగా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు తగినంత ఉన్నందున ధరలు స్థిరంగా ఉంచాలని ఈ సందర్భంగా సూచించింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?‘వచ్చే పండుగ సీజన్లో రిటైల్ ధరలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. దిగుమతి సుంకం పెంపు ప్రకటన నుండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై కారణాలను వెల్లడించాలని పరిశ్రమను ప్రభుత్వం కోరింది’ అని ఆహార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న నూనెలు సుమారు 30 లక్షల టన్నుల నిల్వ ఉందని, ఇవి సులభంగా 45–50 రోజుల డిమాండ్‌ను తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రాసెసింగ్ కంపెనీలు గరిష్ట రిటైల్ ధరలను పెంచడం మానుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
పండుగల ముందు 'ధర'.. దడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండుగల ముందు నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. రోజురోజుకూ నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రెండు వారాల్లోనే మొదలవనుంది. తర్వాత పదిరోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది. బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంటే.. నూనెలు, కూరగాయల ధరలు గత వారంలోనే ఒక్కసారిగా 20–30 శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది. ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంపైగానీ.. సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపైన గానీ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. బియ్యం మార్కెట్‌పై నియంత్రణ లేక.. రాష్ట్రంలో సన్నబియ్యం బంగారమైపోతోంది. పప్పులతో పోటీపడుతూ రేటు పెరుగుతోంది. జైశ్రీరాం, సోనామసూరి, హెచ్ఎంటీ రకాల బియ్యం రేటు కిలో రూ.70కిపైగా పలుకుతోంది. రైతుల నుంచి సన్నరకాల ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3,000కే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకు విక్రయిస్తున్నారు. బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత ఊతమిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జైశ్రీరాం రకం రా రైస్ (ముడి బియ్యం) మార్కెట్లో 26 కిలోల బ్యాగ్ ధర రూ.1,800 వరకు ఉండగా.. స్టీమ్ రైస్ ధర రూ.1,500 వరకు ఉంది. సోనా మసూరి, హెచ్ఎంటీ రకాల ధరలు రూ.1,700కు చేరాయి. కేంద్రం ప్రకటనతో పెరిగిన వంట నూనెల ధర వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ఈనెల 14న ఉదయం ప్రకటన చేయగా.. అదే రోజు సాయంత్రానికే నూనెల ధరలు రూ.20కుపైగా పెరిగాయి. ఇటీవలి వరకు లీటర్ రూ.105గా ఉన్న పొద్దుతిరుగుడు నూనె ధర ప్రస్తుతం రూ.130–140కి చేరింది. పామాయిల్ రేటు రూ.95 నుంచి రూ.120 దాటిపోయింది. వేరుశనగ నూనె రూ.170 దాటింది. నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది. కానీ ఇప్పటికే దిగుమతి అయి, నిల్వ ఉన్న స్టాక్‌పైనా అధిక రేటు వసూలు చేస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ వంట నూనె ధరలనూ అమాంతం పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘విజయ’ వంట నూనెలను తక్కువ ధరకు అందించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలేవీ చేపట్టడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం విజ్ఞప్తిని పట్టించుకోని వ్యాపారులు సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు.. నూనెల ధరలను గరిష్ట రిటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు 30 లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని.. అది 45–50 రోజుల వరకు సరిపోతుందని అంచనా. అయినా కూడా హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు అన్నిచోట్లా వంటనూనెల ధరలు పెంచేశారు. దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో.. వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటుండటం గమనార్హం. అందుబాటులో లేని ఉల్లి, వెల్లుల్లి.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లుల్లి కిలో రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా.. ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా 40 శాతం వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది. దీనితోపాటు వెల్లుల్లి పండించే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ.. వాతావరణ పరిస్థితులు కలసి రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో వెల్లుల్లి రేటు మరింతగా పెరగొచ్చని అంటున్నాయి. ఉల్లి పంటకు కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే రూ.60 దాటింది. ఇది రూ.100కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పప్పులు, కూరగాయల మోత కూడా.. కందిపప్పు, పెసర, మినుములు, శనగ.. ఇలా పప్పుల ధరలన్నీ పెరిగాయి. కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు ఉండగా.. పెసర పప్పు రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. శనగపప్పు ధర గత పదిరోజుల్లోనే రూ.85 నుంచి రూ.105కు పెరిగింది. మినపపప్పు రూ.150పైనే పలుకుతోంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కిలోకు కాలీఫ్లవర్ రూ.150కిపైగా, పచ్చిమిర్చి రూ.120కిపైగా ఉంది. టమాటా ధర వారం క్రితం వరకు కిలో రూ.25–30 ఉంటే.. ఇప్పుడు రూ.60కి చేరింది. బీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఏది చూసినా కిలో రూ.50–60 దాటిపోయాయి. చిక్కుడు, బీన్స్ అయితే కిలో రూ.120కి తగ్గడం లేదు. సర్కారులో స్పందనేదీ? అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదని, పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కాస్త దృష్టిపెడితే.. ధరలను కాస్తయినా నియంత్రించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తున్నారు. గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్‌దుకాణాలు, రైతుబజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు, ఉప్పు, పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పండుగ ముందు ధరలు పెరిగాయి ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ 15 రోజుల కింద రూ.570 ఉంటే.. ఇప్పుడు రూ.639 తీసుకుంటున్నారు. 15 రోజుల్లోనే 70 రూపాయలు పెరిగింది. దసరా పండుగ ముందు ధరలు పెరిగాయి. ఇంకా పెరుగుతాయని అంటున్నారు. – నాయిని రవి, న్యూశాయంపేట, హనుమకొండ అన్నింటి ధరలు మండిపోతున్నాయి వంట నూనె ఒకటే కాదు..అన్ని నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు. – యానం విద్య , కాకాజీ కాలనీ, హనుమకొండ కూరగాయల రేట్లు పెంచేశారు కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. టమాటా మొన్నటివరకు 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 50, 60 రూపాయలకు అమ్ముతున్నారు. కాకర 30 నుంచి 45కు పెంచారు. వారంలోనే అన్ని కూరగాయల రేట్లు పెరిగాయి. రోజువారీగా కూరగాయల ధరలను చూసి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సాంబయ్య, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదు వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదువంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ -
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం. -
‘విండ్‌ఫాల్’ బాదుడు!
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దేశీయంగా వెలికి తీస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కు పెంచారు. ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) రూపంలో వసూలు చేస్తారు. డీజిల్ ఎగుమతులపై ఎస్ఏఈడీ లీటరుకు రూ.1.50 ఉండగా, పూర్తిగా తొలగించారు. ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు పెట్రోలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(విమాన ఇంధనం)పై సుంకం లేదు. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అదాటు లాభాలపై పన్నును తొలిసారిగా 2022 జులై 1న ప్రభుత్వం విధించింది. -
చమురు, గ్యాస్ ధరల ఎఫెక్ట్.. పడిపోయిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 9,536 కోట్ల లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 11,045 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తక్కువ. సమీక్షాకాలంలో చమురు, గ్యాస్ ధరలు తగ్గడమే.. లాభాల క్షీణతకు కారణమని సంస్థ తెలిపింది. క్యూ3లో క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 5.2 మిలియన్ టన్నులకు పరిమితం కాగా, గ్యాస్ ఉత్పత్తి 4.3 శాతం క్షీణించి 5.12 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. క్యూ3లో స్థూల ఆదాయం 10 శాతం తగ్గి రూ. 34,789 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలానికి షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 5,032 కోట్లు అవుతుందని తెలిపింది. -
వంట నూనె ధరలు తగ్గించాలన్న కేంద్రం.. కంపెనీల రియాక్షన్..?
అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చిత పరిస్థితులు ఎదురైతే వెంటనే దాన్ని ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతుంది. ఇతర దేశాల నుంచి వస్తువులను దిగమతి చేసుకుంటున్న దేశాలకైతే మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయి. దాంతో వస్తువులు, ఆహారసామగ్రి ధరలు పెరుగుతాయి. ఆ సాకుతో కంపెనీలు అడ్డగోలుగా క్యాప్ఫ్లోలు పెంచుకుంటాయి. తిరిగి ఆ అనిశ్చిత పరిస్థితులు సద్దుమణిగినా ఏ మేరకు ధరలు పెంచారో ఆ రీతిలో వాటిని తగ్గించరు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పెరిగిన వంటనూనె ధరలు ఇప్పటికీ అధికంగానే కొనసాగుతున్నాయి. దాంతో దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరల తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం వంట నూనె తయారీ సంస్థలను ఆదేశించింది. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని వంటనూనెల కంపెనీలు ప్రభుత్వానికి వెల్లడించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. నూనెల ఉత్పత్తికి ఉపయోగించే కొన్ని పంటల కోతలు ప్రారంభమయ్యే మార్చి వరకు ధరల తగ్గింపు సాధ్యంకాదని పరిశ్రమల నిర్వాహకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా వెజిటబుల్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడం గమనార్హం. శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని గతేడాది జూన్‌లో 17.5% నుంచి 12.5%కి తగ్గించారు. అందుకు అనుగుణంగా ధరలు తగ్గించాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్.. కానీ.. ఇండియా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో సహా తక్కువ మొత్తంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్, రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి నూనెలపై అంతర్జాతీయంగా తగ్గిన ధరల మేరకు దేశంలో తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ తెలిపారు. -
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..
భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి. -
‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్ హెచ్చరించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ 14వ ఎడిషన్– ఎన్రిచ్ 2023 కార్యక్రమంలో చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్–హమాస్ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను. పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి. భారత్ ఇంధన డిమాండ్ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్ చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. నాల్గవ అతిపెద్ద ఎన్ఎన్జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగి ఉన్న దేశం. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్! భారత్ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, రష్యా తమ ఉత్పత్తి– ఎగుమతి కోతల విధానాన్ని ఏడాది చివరి వరకు పొడిగించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్ల పైకి చేరాయి. ఇది 10 నెలల గరిష్ట స్థాయి. దీనితో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. చమురు అవసరాల కోసం 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగితే, దేశంపై దిగుమతుల భారం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. రష్యాతో కలిసి కూటమిగా ఉన్న ఒపెక్ (ఓపీఈసీ– పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా డిసెంబర్ చివరి వరకు ప్రపంచ మార్కెట్‌కు సరఫరాలో రోజుకు ఒక మిలియన్ బ్యారెల్స్ తగ్గింపును కొనసాగించాలని ఇటీవల నిర్ణయించింది. అటు తర్వాత బ్రెంట్ ధర గత వారంలో 6.5% పెరిగింది. ఇక రష్యా కూడా ఇటీవలి నెలల్లో చమురు ఎగుమతులపై కోతలకు నిర్ణయం తీసుకుంది. భారత్ బిల్లు బ్యారెల్ సగటు 89.81 డాలర్లు! తాజా పరిణామాలతో మంగళవారం మొదటిసారి ఈ సంవత్సరంలో బ్రెంట్ బ్యారెల్ ధర మొదటిసారి 90 డాలర్లు దాటింది. బుధవారం కూడా ఈ వార్త రాసే 11 గంటల సమయంలో అదే స్థాయిలో ట్రేడవుతోంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ఆగస్టులో 86.43 డాలర్లు. ఈ నెలలో 89.81 డాలర్లకు పెరుగుతుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ ధర 73 నుంచి 75 డాలర్ల శ్రేణిలో తిరిగింది. అయితే జూలైలో 80.37 డాలర్లకు తాజాగా 90 డాలర్లకు పెరిగింది. దీనితో దేశీయంగా రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు ముగింపు పడినట్లయ్యింది. నిజానికి గత సంవత్సరం తీవ్ర స్థాయికి ధరలు చేరినప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ యేడాది మేలో పరిస్థితి కొంత మెరుగుపడుతోందనుకుంటుండగా, ధరలు మళ్లీ దూసుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నిజానికి 17 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో నిలకడగా కొనసాగుతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 పలుకుతుండగా, డీజిల్ ధర రూ.89.62 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు అంతర్జాతీయ ఇంధన ధరల బెంచ్‌మార్క్ 15 రోజుల రోలింగ్ యావరేజ్ ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాలి. అయితే ఆయా సంస్థలు 2022 ఏప్రిల్ 6 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల తర్వాత రిటైల్ రేట్ల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పుడు మే 22న చివరిసారిగా ధరలు మారాయి. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్ ధర 73–74 డాలర్ల శ్రేణిలో ఉంటే, చమురు కంపెనీలు రోజువారీ ధరల సవరణను మళ్లీ ప్రారంభించేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇక తగ్గింపు అవకాశాలే సన్నగిల్లాయన్నది నిపుణుల అంచనా. భారీ ‘విండ్‌ఫాల్’ ఆదాయం! అధిక ధరల పరిస్థితుల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి దేశీయ ఉత్పత్తి సంస్థలు అధిక ఆదాయాలను పొందుతాయి. దీనితో పెరుగుతున్న ఆదాయాల నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ రూపంలో భారీ మొత్తాలను పొందే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) రూపంలో విధించే పన్ను సెప్టెంబర్ 2 నుండి టన్నుకు రూ. 6,700కి తగ్గింది. ఇది గతంలో టన్నుకు రూ.7,100గా ఉంది. రానున్న నెలల్లో మళ్లీ పెంపు బాట పట్టవచ్చు. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎౖMð్సజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత అంచనా. -
గుడ్ న్యూస్ చెప్పిన మోడీ భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు..!
-
సౌదీ అరామ్కో లాభం రికార్డ్
దుబాయ్: గ్లోబల్ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో గతేడాది(2022) కొత్త చరిత్రను లిఖిస్తూ 161 బిలియన్ డాలర్ల(రూ. 13 లక్షల కోట్లకుపైగా) నికర లాభం ఆర్జించింది. వెరసి ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలరీత్యా లిస్టెడ్ కంపెనీలలో సరికొత్త రికార్డును సాధించింది. సౌదీ అరామ్కోగా పిలిచే సౌదీ అరేబియన్ ఆయిల్ కో కొద్ది నెలలుగా చమురు ధరలు జోరందుకోవడంతో తాజా ఫీట్‌ను సాధించింది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఇందుకు సహకరించింది. రష్యా చమురు, నేచురల్ గ్యాస్ అమ్మకాలపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ప్రభావం చూపింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2021లో సాధించిన 110 బిలియన్ డాలర్లతో పోలిస్తే నికర లాభం 46 శాతంపైగా ఎగసింది. కాగా.. కోవిడ్–19 సంక్షోభం తదుపరి ఇటీవల చైనా ఆంక్షలు సడలించడంతో చమురుకు డిమాండ్ మరింత ఊపందుకోనున్నట్లు సౌదీ అరామ్కో భావిస్తోంది. వెరసి ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. అయితే మరోపక్క వాతావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల విక్రయం ద్వారా ఒక కంపెనీ 161 బిలియన్ డాలర్లు ఆర్జించడం షాక్‌కు గురిచేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఏన్స్ కాలమార్డ్ వ్యాఖ్యానించారు. -
మళ్ళీ భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
-
క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు..!
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్‌కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విపరిణామాలు.. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది. మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్‌కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్‌కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్‌తో ముగిసిపోతుంది. చైనా లాక్డౌన్లు, మొత్తం మీద డిమాండ్‌పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు. -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్‌పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్‌పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
రష్యా ఆయిల్‌పై నియంత్రణకు మా కూటమిలో చేరండి: అమెరికా
న్యూఢిల్లీ: రష్యన్ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. -
2022 ఆరంభం నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే!
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్లో ఆల్ టైం కనిష్టాన్ని టచ్ చేసింది. 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది. అంతేకాదు సమీప కాలంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 కి పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు దేశీయ కరెన్సీని అతలాకుతలం చేశాయి. ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా వార్ తరువాత రూపాయి ఏకంగా 27 సార్లు అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి ఐదుసార్లు కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. 2022 ప్రారంభంలో డాలరకు 74 వద్ద ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి 6.4 శాతం నష్టపోయి 80 స్థాయికి చేరేందుకు అతి సమీపంలో ఉంది. మరోవైపు ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్‌ను కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 20 సంవత్సరాల గరిష్ట స్థాయి 107.74కి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ డేటా తెలుపుతోంది. ఇకవైపు ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, భారత కరెన్సీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ పాలసీ మరింత కఠినంకానుందన్న అంచనాలు మధ్య డాలరుపై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ప్రపంచమాంద్య భయాలు, యూరప్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు లాంటివి రూపాయిని దెబ్బ తీస్తున్నాయి. రూపాయి పతనం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ పతనాన్ని అడ్డుకోలే పోతున్నాయి. రూపాయిని రక్షించేందుకు బంగారం దిగుమతులపై పన్ను, స్పాట్ అండ్ ఫ్యూచర్స్ ఫారెక్స్ మార్కెట్లలో జోక్యం, ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను నేరుగా పెంచడానికి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం రుపీ సెటిల్మెంట్ విధానాన్నిఇటీవల ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దిగొచ్చిన చమురు ధర: మార్కెట్లకు ఊతం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 54101 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 16121 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా రెండు రోజుల నష్టాలకి చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16100 పాయింట్లకు ఎగువన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్; హెచ్‌యూఎల్, ఏషియన్స్ పెయింట్స్ లాభపడుతుండగా, ఫలితాల ప్రభావంతో హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజర్‌గా ఉంది. ఇంకా ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, రిలయన్స్, డా. రెడ్డీస్ నష్టపోతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరడంతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. -
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్‌గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్‌కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
ప్రభుత్వ ఔట్లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్లెట్లలో 1,01,165 లీటర్ల వంట నూనెను విక్రయించడం విశేషం. ఇందులో రైతుబజార్లలో 70,580 లీటర్లు, మున్సిపల్ మార్కెట్లలో 30,585 లీటర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనె విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీ.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్‌ను సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసి 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్‌ఫ్లవర్ స్థానంలో సోయాబీన్, రైస్‌బ్రాన్ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు ఔట్లెట్లలో ప్రభుత్వ ధరలకే.. అంతర్జాతీయంగా నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి రావడంతో పాటు ఎక్కడా కూడా కృత్రిమ కొరత తలెత్తలేదు. హోల్‌సేల్ విక్రేతల సాయంతో 256 రిటైల్ ఔట్లెట్స్ ద్వారా సుమారు 11.20లక్షల లీటర్ల వంట నూనెను ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే అందించడం గమనార్హం. విజయ ఆయిల్స్‌కు మంచి ఆదరణ వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విజయ ఆయిల్ పేరుతో విక్రయాలు చేపట్టింది. మార్కెట్ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాం. – చవల బాబురావు, ఏపీ ఆయిల్‌ఫెడ్ ఎండీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాం.. ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం – గిరిజా శంకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ -
నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. వంటనూనెల ధరల నియంత్రణపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక రేట్లకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వలు ఉంచినా బైండోవర్ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ దందా పై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వ్యాపా ర దుకాణాలు, నూనె తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రణాళిక ప్రకారం రైతుబజా రులు, మున్సిపల్ మార్కెట్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, బయటి ధరల కంటే తక్కువకు వంటనూనెలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా మండలాల వారీగా నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల న్నారు. సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకాన్ని ప్రోత్సహించాలి పామ్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షలున్న నేపథ్యంలో సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకం వైపు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి కారుమూరి సూచించారు. ఆ నూనెలను ఆయిల్ ఫెడ్ ద్వారా విక్రయించడంతో పాటు కనోల ఆయిల్ (ఆవనూనె) అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించి, సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బ్లాక్ మార్కెట్, కల్తీ నూనెల విషయంలో ఇప్పటి వరకు 76 కేసులు నమోదు చేశామని, 22,598 క్వింటాళ్ల నూనెలను జప్తు చేశామని మంత్రి వివరించారు. వీటిల్లో కేసులు పరిష్కరించిన బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి విడుదల చేసినట్టు చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కిశోర్‌కుమార్, రైతుబజార్ సీఈవో శ్రీనివాస రావు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
Sakshi Cartoon: మళ్లీ పెరగనున్న వంట నూనె ధరలు
మళ్లీ పెరగనున్న వంట నూనె ధరలు -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎఫెక్ట్, 23.2శాతం పెరిగిన వంట నూనెల ధరలు!
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న నల్ల సముద్రం మీదిగా ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. తద్వారా ప్రపంచ ఆహార పదార్ధాల ధరలు మార్చి నెలలో ఆకాశాన్నంటినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) వెల్లడించింది. ►ఎఫ్ఏఓ ఆహార ధరల సూచీ మార్చిలో సగటున 159.3 పాయింట్లు నమోదు కాగా ఫిబ్రవరితో పోలిస్తే 12.6శాతం పెరిగింది. ►ఇక ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఎఫ్ఏఓ తృణధాన్యాల ధరల సూచీ 17.1 శాతం అధికంగా ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఫలితంగా గోధుమలు, ఇతర ధాన్యం ధరలు ఎక్కువగా పెరిగాయి. ►గత మూడేళ్లలో ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్లు వరుసగా 30 శాతం, 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవుడంతో మార్చి నెలలో ప్రపంచంలో గోధుమ ధరలు 19.7 శాతం పెరిగాయి. ఎగుమతులు ఆగిపోవడంతో యూఎస్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►ఇదిలా ఉండగా, మొక్కజొన్న ధరలు నెలవారీగా 19.1 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. బార్లీ, జొన్నలతో పాటు మొక్క జొన్న ధర గరిష్ట రికార్డ్‌ను తాకాయి. ►వెజిటబుల్ ఆయిల్ ప్రైస్ ఇండెక్స్ 23.2 శాతం పెరిగింది. పొద్దుతిరుగుడు విత్తన నూనె ఎక్కువగా ధరకే అమ్మకాలు జరుగుతున్నాయి. ►అధిక పొద్దుతిరుగుడు, విత్తన చమురు ధరలు, పెరుగుతున్న ముడి చమురు ధరల ఫలితంగా పామ్, సోయా,రాప్సీడ్ చమురు ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, . ముడి సోయా చమురు ఎగుమతులు తగ్గడంతో దక్షిణ అమెరికాలో ఆందోళలు మరింత బలపడ్డాయి. ►ఎఫ్ఏఓ చక్కెర ధరల సూచీ ఫిబ్రవరి నుండి 6.7 శాతం పెరిగింది. ఇటీవల పెరిగిన ధర గతేడాది మార్చి కంటే..ఈ ఏడాది 20శాతం ఎక్కువగా పెరిగాయి. విచిత్రంగా భారత్‌లో మాత్రం ఉత్పత్తి అవకాశాలు కారణంగా నెలవారీ ధరల పెరుగుదలను నిరోధించాయి. -
ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా..న్యూస్ చెప్పిన క్యాబ్ కంపెనీలు!
ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా షాకిస్తున్నాయి ఆయా క్యాబ్ కంపెనీలు. సమ్మర్ సీజన్లో క్యాబ్‌లో ప్రయాణిస్తే వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఏసీని ఉపయోగిస్తుంటాం. కానీ ఇకపై క్యాబ్‌లో తిరిగే ప్రయాణికులు ఏసీ వినియోగించుకుంటే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు క్యాబ్ డ్రైవర్లు సిద్ధమయ్యారంటూ పలు వార్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం ప్రయాణికుల్ని ఆందోళన కలిగిస్తుండగా..తాజాగా యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఉబర్ తాజాగా ట్రిప్ ఛార్జీలను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది ఉబర్ క్యాబ్ ఛార్జీలను పెంచింది. గతేడాది ఉబర్ ఏప్రిల్ నెలలో 15శాతం ఛార్జీలను పెంచింది. ఈ ఏడాది తాజాగా దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఉబర్ క్యాబ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సౌత్ ఏసియా సెంట్రల్ ఆపరేషన్ హెడ్ నితీష్ భూషణ్ తెలిపారు. ‘ఇంధన ధరలలో ప్రస్తుత పెరుగుదల డ్రైవర్లను ఆందోళన కలిగిస్తోంది. వారి నుంచి వచ్చిన విన్నపం మేరకు ట్రిప్ ఛార్జీలను 15% పెంచుతున్నాం. రాబోయే వారాల్లో ఇంధన ధరల కదలికలను పరిశీలిస్తామని చెప్పారు. కాగా ఉబర్ సంస్థ హైదరాబాద్, ముంబై సహా పలు నగరాల్లో చార్జీలను సవరించింది.అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఉబర్ ఇండియా, సౌత్ ఆసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీశ్ భూషన్ తెలిపారు. ఏసీ ఆన్ చేశారా? ఇక బాదుడే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆయా క్యాబ్ సంస్థలకు చెందిన క్యాబుల్లో జర్నీ చేసే ప్రయాణికులు ఏసీ ఉపయోగిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా పలు క్యాబుల్లో ఏసీ ఆన్ చేస్తే ఎంత చెల్లించాలో తెలుపుతూ పలు బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామంటూ క్యాబ్ సంస్థల డ్రైవర్లు స్టికర్లను అతికించారు. చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
సెన్సెక్స్ 350 పాయింట్లు ప్లస్
ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడం ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ఇస్తాంబుల్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో పురోగతి చోటుచేసుకుంది. ఫలితంగా ఆర్థిక, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ, కన్జూమర్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 57,944 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు బలపడి 17,325 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. కాగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఇంధన, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.35 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,713 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 43 పైసలు బలపడింది. ఆసియాలో చైనా, ఇండోనేసియా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభంతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మూడున్నర శాతం దాకా దూసుకెళ్లాయి. అమెరికా ఫ్యూచర్లు ఒకటిశాతం లాభంతో కదలాడుతున్నాయి. ‘‘బాండ్లపై రాబడులను పరిమితం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్యపాలసీ విధానానికే మొగ్గుచూపడంతో ఆసియా మార్కెట్లు రాణించాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ విరమణ చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్నాయి. చైనాలో కోవిడ్ కేసుల కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో డిమాండ్ తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాలు కలిసిరావడంతో క్రూడాయిల్ ధరలు దిగివచ్చాయి. ఈ అంశాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా...! ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్ సూచీలు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 57,815 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 17,297 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో దాదాపు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో దేశీ మార్కెట్లో అస్థిరతలు తగ్గాయి. ట్రేడింగ్ ముగిసేవరకు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్ 408 పాయింట్లు పెరిగి 58,002 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 17,344 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►హీరో మోటోకార్ప్ షేరు ఏడుశాతం నష్టపోయి రూ.2,208 వద్ద స్థిరపడింది. ఐటీ శాఖ రూ.1,000 కోట్ల బోగస్ ఖర్చులు గుర్తించిందంటూ వస్తున్న వార్తలపై బీఎస్ఈ ఎక్సే్చంజీ స్పష్టత కోరడంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి కారణమైంది. ►రుచి సోయా షేరుకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈలో ఈ షేరు 16% లాభపడి రూ.945 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో 20 శాతం మేర బలపడి రూ.978 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ప్రక్రియ నేపథ్యంలో గడచిన నాలుగు రోజుల్లో ఈ షేరు 11 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ►ఇండెక్సుల్లో రెండో అతిపెద్ద వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ షేరు మూడు శాతం లాభపడి రూ.2,337 వద్ద స్థిరపడింది. ఇటీవల అమ్మకాల ఒత్తిడికిలోనైన ఈ షేరుకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. -
బేగంపేటలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
-
Sakshi Cartoon: వార్తో ‘వంద’ పెరిగిన నూనె ధరలు
Sakshi Cartoon: వార్తో ‘వంద’ పెరిగిన నూనె ధరలు -
భగ్గుమన్న బల్క్ డీజిల్.. ఒక్కరోజులో లీటరుపై రూ.19
సాక్షి, హైదరాబాద్: బల్క్ డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. ఒక్కరోజులోనే లీటరుపై రూ.19 మేర పెరిగింది. బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా పన్నుల్లో సర్దుబాటు చేస్తుండంతో ధర స్థిరంగా ఉండగా, చమురు కంపెనీల నుంచి నేరుగా సరఫరా చేసే బల్క్ ఆయిల్ ధర మాత్రం.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతూ పోతోంది. మంగళవారం వరకు హైదరాబాద్‌లో బల్క్ డీజిల్ లీటరుకు రూ.99 (దూరాన్ని బట్టి రూపాయి మేర తేడా) ఉండగా, బుధవారం అది రూ.19 మేర పెరిగి రూ.118కి చేరుకుంది. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగటంతో దేశీయంగా కూడా వాటి ధరలు పెరిగాయి. కానీ ఒకే రోజు ఏకంగా రూ.19 మేర లీటరుపై పెరగటం ఇదే తొలిసారి. రిటైల్‌లోనే ఆర్టీసీ కొనుగోళ్లు నిత్యం సగటున ఆరున్నర లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీ నేరుగా చమురు కంపెనీల నుంచి బల్క్‌గా డీజిల్ కొంటోంది. అయితే యుద్ధం నేపథ్యంలో బల్క్ డీజిల్ ధర అంతకంతకూ పెరుగుతుండటంతో బల్క్ కొనుగోళ్లు ఆపేసి రిటైల్‌గా కొనటం ప్రారంభించింది. కానీ ప్రతి బస్సు బంకుకు వెళ్లి రావటంతో కొంత డీజిల్ వృథాగా వినియోగం కావడంతో చాలా డిపోల్లో బల్క్ డీజిల్‌నే వినియోగిస్తున్నారు. అయితే, బుధవారం డీజిల్ ధర ఒక్కసారిగా భగ్గుమనేసరికి ఆర్టీసీ బెంబేలెత్తిపోయింది. వెంటనే బల్క్ కొనుగోళ్లు ఆపేసి ప్రతి బస్సు బంకుకు వెళ్లి డీజిల్ నింపుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
చమురు బిల్లు తడిసి మోపెడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ – 2022 మార్చి) ముడి చమురు దిగుమతుల బిల్లు 125 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) దాటిపోనుంది. క్రితం ఆర్థిక సంవత్సరం బిల్లుతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణం. అంతర్జాతీయంగా చమురు ధరలు ఏడేళ్ల గరిష్టాలకు చేరడంతో దిగుమతులపై మరింత మొత్తం వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో చమురు దిగుమతుల కోసం వెచ్చించిన మొత్తం 110 బిలియన్ డాలర్లుగా ఉంది. పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలైసిస్ సెల్ (పీపీఏసీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క జనవరిలోనే ముడి చమురు కోసం 11.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2021 జనవరిలో ఈ మొత్తం 7.7 బిలియన్ డాలర్లుగానే ఉంది. చమురు ధరలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో చమరు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 110 డాలర్ల వరకు వెళ్లడం తెలిసిందే. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దిగుమతి చేసుకున్న చమురును ఆయిల్ కంపెనీలు రిఫైనింగ్ ప్రక్రియ ద్వారా పెట్రోల్, డీజిల్‌గా మారుస్తాయి. మన దేశానికి సంబంధించి రిఫైనింగ్ సామర్థ్యం మిగులు ఉంది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నాం. ఎల్పీజీని సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెట్రోలియం ఉత్పత్తులదీ అదే పరిస్థితి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 33.6 మిలియన్ టన్నులుగా ఉంది. వీటి విలువ 19.9 బిలియన్ డాలర్లు. అదే కాలంలో 33.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 51.1 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు నమోదయ్యాయి. భారత్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు కోసం 62.2 బిలియన్ డాలర్లను (196.5 మిలియన్ టన్నులు) ఖర్చు చేసింది. కరోనా కారణంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం లాభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులు జనవరి చివరికి 175.9 మిలియన్ టన్నులు దాటిపోవడం గమనార్హం. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో 227 మిలియన్ టన్నుల ముడి చమురును నికరంగా దిగుమతి చేసుకున్నాం. ఇందుకోసం చేసిన ఖర్చు 101.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు పెరిగిపోతే అది స్థూల ఆర్థిక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. దేశీయంగా తగ్గిన చమురు ఉత్పత్తి దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగకపోగా, ఏటా క్షీణిస్తూ వస్తోంది. ఇది కూడా దిగుమతులు పెరిగేందుకు దారితీస్తోంది. 2019–20లో 30.5 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. 2020–21లో ఇది 29.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు చేసిన ఉత్పత్తి 23.8 మిలియన్ టన్నులుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఉత్పత్తి 24.4 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఎల్ఎన్జీ దిగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరకు 9.9 బిలియన్ డాలర్లకు పెరిగిపోయాయి. స్టోరేజీ నుంచి సరఫరాలు.. ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు ప్రపంచ ఇంధన మార్కెట్లలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చమురు శాఖ తాజాగా పేర్కొంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ భయాల నేపథ్యంలో సరఫరా అవాంతరాలు, తదితర సవాళ్లను పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో అవసరమైతే ధరలు తగ్గేందుకు వీలుగా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇటీవల అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు దాదాపు 110 డాలర్లవరకూ ఎగసిన విషయం విదితమే. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ దాడుల కారణంగా సరఫరాలకు విఘాతం కలగవచ్చన్న అంచనాలు ప్రభావం చూపాయి. రష్యాపై పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ దేశాలలో సరఫరా మార్గాలకు అవాంతరాలు లేకుంటే æచమురు ధరల తీవ్రత నెమ్మదించే వీలుంది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను నిరోధించేందుకు భారత్ తగిన చర్యలు సైతం చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా అమెరికా, జపాన్ బాటలో గతేడాది నవంబర్‌లో వ్యూహాత్మక నిల్వల నుంచి భారత్ 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేసేందుకు అంగీకరించింది. తీవ్ర ధరల నేపథ్యంలో ఎన్నికలు పూర్తవడంతోనే ధరలు రూ.10 వరకూ పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నిరాటంకంగా రష్యన్ వజ్రాల సరఫరా: జీజేఈపీసీ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లు అందరికీ వజ్రాలను నిరాటంకంగా సరఫరా చేస్తామని రష్యాకు చెందిన డైమండ్ మైనింగ్ సంస్థ అల్రోసా భరోసా ఇచ్చింది. రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా ఈ విషయం తెలిపారు. అల్రోసా ఉత్పత్తి చేసే మొత్తం రఫ్ డైమండ్‌లో దాదాపు 10 శాతాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపారం యథాప్రకారంగానే కొనసాగుతోందని, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫిబ్రవరి 28న జీజేఈపీసీకి అల్రోసా నుంచి లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
అటు బాంబుల మోత.. ఇటు ధరల వాత
-
వాణిజ్యంపై రష్యా–ఉక్రెయిన్ దెబ్బ..
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఎగుమతులు, చెల్లింపులు, చమురు ధరలు మొదలైనవి కాస్త సమస్యాత్మకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలకు చేసే ఎగుమతులను ఆపి ఉంచాలని ఎగుమతిదారులకు సూచించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్–జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న దానిపై వాణిజ్యంపై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. ఆ ప్రాంతంలో (రష్యా, ఉక్రెయిన్) వ్యాపార లావాదేవీల విషయంలో ఎగుమతిదారులు అప్రమత్తంగా ఉన్నారు‘ అని సహాయ్ వివరించారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 9.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు ఔషధాలను ఎగుమతి చేసే విషయంలో వేచి చూసే ధోరణి పాటిస్తున్నట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని .. ఆ ప్రాంతంలోని తమ ఉద్యోగుల క్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వర్గాలు తెలిపాయి. ‘ ఆయా దేశాలకు ఫార్మా ఎగుమతులపై ప్రస్తుతం ఆంక్షలేమీ లేవు. అయినప్పటికీ పరిస్థితులపై మరింత స్పష్టం వచ్చే వరకూ కాస్త వేచి చూడాలని భావిస్తున్నాం. అంతిమంగా యుద్ధ ఫలితంగా మాకు రావాల్సిన చెల్లింపులపై ప్రభావం పడకూడదు కదా‘ అని మరో ఫార్మా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్‌కు 181 మిలియన్ డాలర్లు, రష్యాకు 591 మిలియన్ డాలర్ల విలువ చేసే ఔషధాలు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. గోధుమలపరంగా అవకాశాలు.. ప్రస్తుత సంక్షోభంతో గోధుమల ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, ఎగుమతిదారులు వీటిని అందిపుచ్చుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా గోధుమల ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా పావు భాగం పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యా ఎగుమతి చేస్తోంది. ఈజిప్ట్ అత్యధికంగా ఏటా 4 బిలియన్ డాలర్లపైగా విలువ చేసే గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా, ఉక్రెయిన్ల వాటా 70 శాతం మేర ఉంటుంది. అలాగే టర్కీ, బంగ్లాదేశ్‌లు కూడా రష్యా నుంచి గోధుమలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాపై ఆంక్షలు గానీ అమలైతే.. వివిధ దేశాలకు గోధుమలపరంగా దేశీ ఎగుమతిదారులకు అవకాశాలు లభించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
సామాన్యులకు శుభవార్త, వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం..ఎంతంటే
వంటనూనె వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో వంట నూనెల ధరల గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా రూ.20 వరకు తగ్గినట్లు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. Delhi | Edible oil prices have declined quite significantly, ranging from a decline of Rs 20, 18, 10, 7 at many places. Decline is witnessed on palm oil, groundnut, soybean, sunflower & all major oils: Sudhanshu Pandey, secretary of the Department of Food and Public Distribution pic.twitter.com/rmAdD2VO8t — ANI (@ANI) November 5, 2021 పామాయిల్,శనగ నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్రధానమైన నూనె రకాలపై ధరలు తగ్గినట్లు తెలిపారు.దేశంలోని ప్రాంతాల్ని బట్టి ధరలు రూ.20, రూ.18,రూ.10,రూ.7లు తగ్గనున్నట్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే కేంద్రం కీలక నిర్ణయం మార్కెట్లో మండిపోతున్న వంట నూనెల ధరలపై కేంద్రం అక్టోబర్‌లోనే కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించేలా వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధించింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. తాజాగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ స్టాక్ పరిమితులను అమల్లోకి తీసుకురావడంతో వంటనూనెలల ధరలు తగ్గాయి. -
సాక్షి కార్టూన్ 25-10-2021
-
TSRTC: చుక్కలు చూపిస్తున్న చమురు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు పెరుగుతున్న చమురు భారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తీవ్రంగా కలవరపెడుతోంది. చూస్తుండగానే మొత్తం వ్యయంలో డీజిల్ వాటా ఏకంగా 30 శాతాన్ని మించింది. రెండేళ్ల స్వల్ప విరామంలోనే లీటరు డీజిల్‌పై రూ.24 మేర ధర పెరగటంతో ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. సంస్థ తాజా లెక్కల ప్రకారం.. ఒక కిలోమీటరుకు వ్యయం (కాస్ట్ పర్ కిలోమీటర్) రూ.60గా ఉండగా, అందులో డీజిల్ వాటా రూ.21కి చేరింది. ఉద్యోగుల జీతాల ఖర్చు 53 శాతం ఉండగా, ఇప్పుడు డీజిల్ భారం 30 శాతాన్ని మించటంతో ఈ రెంటినీ ఎలా తగ్గించుకోవాలనే విషయంపై ఆర్టీసీ మేధోమధనం ప్రారంభించింది. సంస్థ కొత్త ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్, వీలైనంత త్వరగా డీజిల్ ఖర్చు తగ్గింపుపై సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రోజుకు 5.4 లక్షల లీటర్ల వాడకం రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.73గా ఉంది. ఆ సమ్మె సమయంలో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీపై డీజిల్ భారాన్ని తగ్గించడం కూడా ఒకటి. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను ఎత్తేయటం ద్వారా ఆర్టీసీని రక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు లీటర్ ధర రూ.97కు చేరింది. ఆర్టీసీకి చమురు కంపెనీలు కొంత తగ్గింపు ధరలకే డీజిల్‌ను సరఫరా చేస్తున్నా.. లీటర్‌పై మొత్తం మీద రూ.24 పెరిగిపోవటంతో రోజువారీ వినియోగంలో అదనపు భారం దాదాపు రూ.1.30 కోట్లకు చేరింది. పేరుకుపోతున్న బిల్లులు ఆర్టీసీ నిత్యం 5.4 లక్షల లీటర్ల ఆయిల్‌ను వాడు తుంది. కోవిడ్ వల్ల ఏడాదిన్నరగా పూర్తిస్థాయి లో బస్సులు తిరగకపోవటంతో ఈ ఖర్చు కొం త ఆదా అయింది. ఇప్పుడు కోవిడ్ దాదాపు తగ్గిపోవటంతో పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతున్నారు. దీంతో డీజిల్ వినియోగం మళ్లీ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఖర్చును భరించలేక ఆర్టీసీ కిందామీదా పడుతోంది. గతంలో ఇలాగే బిల్లులు పేరుకుపోతే సరఫరా నిలిపేస్తామని ఆయిల్ కంపెనీలు హెచ్చరించటంతో కొంతచెల్లించి సమస్య లేకుండా చూసింది. ఇప్పుడు ప్రతినెలా బిల్లులు పేరుకుపోతుండటంతో కంపెనీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మళ్లీ ప్రత్యామ్నాయాలపై దృష్టి.. చమురు ధరల భారాన్ని తట్టుకోలేక కొంతకాలం క్రితం ఆర్టీసీ కొన్ని ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించింది. అందులో ముఖ్యమైంది ఎలక్ట్రిక్ కన్వర్షన్. ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చమురు వినియోగం ఉండనందున అటువైపు మొగ్గు చూపింది. అయితే ఆ బస్సుల ఖరీదు ఎక్కువ కావటంతో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇందుకోసం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని యోచించింది. ఈ మేరకు కొన్ని కంపెనీలతో చర్చించింది. కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. దీంతో కన్వర్ట్ చేసిన కంపెనీలే కొన్నేళ్లు వాటిని నిర్వహించి డీజిల్ ఆదా రూపంలో మిగిలిన మొత్తంలో లాభం తీసుకోవటం లాంటి ఒప్పందాలు చేసుకోవాలని భావించింది. కానీ నాటి ఎండీ దీనిపై ఎటూ తేల్చకుండా పెండింగులో పెట్టారు. -
Petrol Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇప్పుడు దాదాపు రోజుకు ఒకసారి పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 11 పైసలు పెంపు విధించాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ లీటర్ వంద మార్క్‌ను దాటేసింది. ఈ నెలలో ఇది ఆరో పెంపు. పది రాష్రా్టలపై పెట్రో ఉత్పత్తుల పెంపు ప్రభావం పడింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50పై కాగా, డీజిల్ ధర రూ.97.68పై.గా ఉంది. ఇక అత్యధికంగా భోపాల్‌లో రూ.108గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.106- డిజీల్ రూ.92గా ఉంది. -
Oil Prices: అమెరికాలో కరువు.. ఇండియా వంటగదిలో పిడుగు
న్యూఢిల్లీ : అమెరికా, బ్రెజిల్‌లలో వచ్చిన కరువు.. ఇండియా పాలిట శాపంగా మారింది. అక్కడ పంట ఉత్పత్తులు తగ్గితే దాని ఎఫెక్ట్ ఇండియాపై పడింది. అక్కడ నూనె గింజల ఉత్పత్తి తగ్గితే ఇక్కడ వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తగ్గిన దిగుబడి ఇండియాను మించిన విధ్వంసాన్ని అమెరికా, బ్రెజిల్‌లలో సృష్టించింది కరోనా మహమ్మారి. లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు అక్కడ నమోదు అయ్యాయి. దీంతో గతేడాది ఆ రెండు దేశాల్లో వంట నూనె తయారీలో ఎక్కువగా ఉపయోగించే సోయా దిగుబడి తగ్గిపోయింది. అమెరికా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఐదేళ్ల కనిష్ట స్థాయికి సోయా దిగుబడులు అక్కడ తగ్గిపోయి కేవలం 87 మిలియన్ టన్నులకే పరిమితమైంది. పెరిగిన ధరలు అమెరికాలోనే దాదాపు డెబ్బై శాతం మేర సోయా పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ఒక్కసారిగా సోయా ధరలు పెరిగాయి. మరోవైపు మలేషియాలోనే ఇదే పరిస్థితి నెలకొంది. టన్ను పామాయిల్ గింజల ధర ఏకంగా 1007 డాలర్లు పెరిగింది. 2008 తర్వాత ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే ప్రథమం. ఒకేసారి ఇటు సోయా, అటు పామాయిల్ పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో దాని ప్రభావం మన వంట నూనెపై పడింది. దిగుమతులపైనే ఆధారం మన వంట నూనె అవసరాల్లో దేశీయంగా ఉత్పత్తి అవుతోంది కేవలం 35 శాతమే. మిగిలిన 65 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వల్లో పెట్రోలు, బంగారం తర్వాత అథ్యధికంగా ఖర్చు చేస్తోంది వంట నూనెలకే. ఇటు అమెరికా, అటు మలేషియా, ఇండోనేషియాలలో వంట నూనె ముడి పదార్థాల ధర పెరగడంతో నాలుగైదు నెలల్లోనే వంట నూనెల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. తగ్గేది ఉందా ? ప్రస్తుతం వంట నూనెలపై 35 సుంకాన్ని ప్రభుత్వం విధిస్తోంది. ఇప్పటికిప్పుడు వంటి నూనెల సెగ నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలగాలంటే ఈ పన్ను తగ్గించడం ఒక్కటే మార్గం లేదంటే. మరోసారి అమెరికా, బ్రెజిల్, మలేషియాలలో వంట నూనె మూల ఉత్పత్తుల దిగుబడి పెరిగే వరకు ఈ ఇబ్బందులు తప్పవు. వంట నూనెల ధరలు పెరగడంతో గత ఏప్రిల్‌లో వంట నూనె అమ్మకాలు 3 శాతం క్షీణించాయి. చదవండి : గల్వాన్ ఎఫెక్ట్: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ -
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 34 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 కి చేరగా, డీజిల్ ధర రూ. 82.06 కి చేరింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్, రూ .97.86, డీజిల్ రూ .89.17 చెన్నై పెట్రోల్ రూ .93.38, డీజిల్ రూ .86.96 కోల్‌కతాలో పెట్రోల్ రూ .91.66, డీజిల్ రూ.84.90 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 95.13.డీజిల్ ధర రూ.89.47 విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.65 డీజిల్ ధర రూ.91.43 చదవండి: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ -
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ
హైదరాబాద్: అసలే దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మరోపక్క నిత్యవసర, అత్యవస వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో స్థానిక లాక్ డౌన్ లతో ఉద్యోగాలు పోయి సామాన్య ప్రజానీకం భాదపడుతుంటే స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోగా పొగ.. ప్రజల బాధలతో సంబంధం లేకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ చేశాయి. ఆదేమని అడిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి అందుకే మేము కూడా పెంచాల్సి వచ్చినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం పెరిగింది పైసాలలోనైన ఇలా కొన్ని రోజులు పెరగిన పెంపును కలిపితే అవి మనకు రూపాయిల్లో కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది ఎంత ఎక్కువ పెంచేశారో అని. చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి నిత్యవసర వస్తువు మీద పెట్రో ధరల ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి 23 తర్వాత వచ్చిన ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి నుంచి పెట్రో ధరలను పెంచలేదు. అవి అయిపోయిన వెంటనే ధరలను మళ్లీ పెంచేశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెంచింది. మంగళవారం పెట్రోల్ లీటరుకు రూ.90.55, డీజిల్ లీటరుకు రూ.80.91 చొప్పున రిటైల్ కు అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కి రూ.0.17 పైసలు పెరిగి రూ.94.16కి చేరుకుంటే, డీజిల్ ధర లీటర్ రూ.0.20 పెరిగి రూ.88.25 అయ్యింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ 92.12 ఉండగా డీజిల్ ధర రూ.89.72 ఉంది. ధరలు పెరుగుదలకు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ధరలు పెంచితే ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయరన్న ఉద్దేశంతో బలవంతంగా ధరలను స్థిరంగా ఉంచారనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంధన ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. చదవండి: భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు -
మార్కెట్ బౌన్స్‌బ్యాక్!
న్యూఢిల్లీ: కనిష్ట స్థాయిల వద్ద అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీ, రూపాయి విలువ బలపడటం, దిగివచ్చిన చమురు ధరలు వంటి సానుకూలాంశాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెనెక్స్ 568 పాయింట్లు పెరిగి 49,009 వద్ద స్థిరపడింది. సెనెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 14,507 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండురోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. మార్కెట్ రెండురోజుల భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదునుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లలో అధికంగా కొనుగోళ్లు కన్పించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.50 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,703 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఇక వారం మొత్తం మీద సెనెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 236 పాయింట్లను కోల్పోయాయి. ‘‘కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపులతో రికవరీ అవుతున్న ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చనే భయాల మధ్య మార్కెట్లో స్థిరీకరణ చోటు చేసుకుంటోంది. ఈ బౌన్స్‌బ్యాక్ కేవలం స్వల్పకాలికమే. మార్కెట్లో స్థిరమైన పరిస్థితులు నెలకొనే వరకు ట్రేడర్లు అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్‌ను కొనసాగించాలి. నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకొనేందుకు ఇది సరైన సమయం. రెండో దశ కోవిడ్ కేసుల నమోదు, అధిక వ్యాల్యుయేషన్లలతో మార్కెట్లో స్వల్పకాలం పాటు ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగుతుంది’’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఆరంభం నుంచి దూకుడుగానే.... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్ భారీ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 48,969 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 14,506 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. భారీ గ్యాప్ అప్ నేపథ్యంలో కొద్దిగా ఇంట్రాడేలో కొద్ది లాభాల స్వీకరణ జరిగింది. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లు మరింత విశ్వాసాన్నిచ్చింది. దీంతో మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీ... కొద్దిరోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం రికవరీ బాటపట్టాయి. అర్థిక అగ్రరాజ్యమైన అమెరికాలో ఉద్యోగ నియమాక గణాంకాలు ఆర్థికవేత్తలను మెప్పించాయి. లాక్డౌన్ అవాంతరాలను అధిగమిస్తూ క్యూ4లో యూఎస్ స్థూల జాతీయోత్పత్తి 4.3 శా తంగా నమోదైంది. అలాగే అంతర్జాతీయంగా బాం డ్ ఈల్డ్స్ దిగివచ్చాయి. ఈ పరిణామాలన్నీ కలిసిరావడంతో ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, థాయిలాండ్, కొరియా, ఇండోనేషియా దేశాల స్టాక్ సూచీలు 1–2% లాభపడ్డాయి. యూరప్‌లోని ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు మార్కెట్లు ఒక శాతం పెరిగాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► నోయిడా ప్రాజెక్ట్‌లో మంచి విక్రయాలు జరగడంతో గోద్రేజ్ ప్రాపర్టీస్ షేరు 2.5 శాతం లాభపడి రూ.1,365 వద్ద స్థిరపడింది. ► ఇండియా రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో వెల్స్పన్ ఇండియా షేరు 9% లాభంతో రూ.83 వద్ద ముగిసింది. ► గెయిల్ గ్యాస్‌తో వ్యూహాత్మక వ్యాపార ఒప్పందాన్ని చేసుకోవడంతో కాన్ఫిడెన్స్ పెట్రోలియం షేరు 5.5 లాభంతో రూ.43 వద్ద నిలిచింది. ► ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్‌కు సంబంధించి తక్కువ ధరకే బిడ్డింగ్ కోట్ చేయడంతో హెచ్‌జీ ఇన్ ఫ్రా 5% లాభపడి రూ.293 వద్ద ముగిసింది. -
నూనెల ధరలు పెరుగుదల
సాక్షి, అమరావతి: దసరా దగ్గర కొస్తున్నందున పిండివంటలు చేయమని ఇంటిల్లిపాది కోరటంతో విజయవాడ పటమటలో నివాసం ఉండే ఏ.లక్ష్మి మార్కెట్లో నూనె ధరలు చూసి నివ్వెరపోయారు. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే ఇప్పుడు వంట నూనెల ధరలు లీటర్‌కు ఏకంగా రూ.27 నుంచి రూ.45 వరకు పెరిగాయి. పిండివంటలు కావాలని పిల్లలు, భర్త పట్టుబట్టడంతో ఏం చేయాలో ఆమెకు తోచడం లేదు. లాక్డౌన్లతో పోటీగా నూనె ధరలు.. కరోనా ప్రభావం ఆర్థిక రంగంతోపాటు వంట నూనెలపై కూడా పడింది. లాక్డౌన్లతో పోటీగా వీటి ధరలు కూడా పెరిగాయి. నూనె దిగుమతులు తగ్గడం, అంతా ఇళ్లల్లోనే ఉంటున్నందున దేశీయంగా వాడకం ఎక్కువ కావడం ధరల మంటకు కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మన దేశానికి మలేసియా, ఇండోనేసియా నుంచి పామాయిల్, అర్జెంటైనా, బ్రెజిల్ నుంచి సోయా ఆయిల్, రష్యా, యుక్రేయిన్ నుంచి సన్‌ఫ్లవర్ నూనెలు దిగుమతి అవుతాయి. దేశంలో సగటున ఏటా 16 కిలోల చొప్పున నూనె వినియోగిస్తున్నట్లు అంచనా. పుంజుకుంటున్న వ్యాపారాలతో గిరాకీ.. మరోవైపు లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగడం, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్లతోపాటు బిస్కెట్ల తయారీ కారణంగా నూనెల వాడకం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సరఫరా లేక పోవడంతో ధరలు ఎగబాకుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే... ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నూనెలు రూ.127 నుంచి రూ.145 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో లీటర్ నూనె రూ.85 నుంచి రూ.100 మధ్యలో ఉండటం గమనార్హం. ఇక తొలిసారి లాక్డౌన్ విధించిన మార్చి నెలలో రూ.వంద నుంచి రూ.110 మధ్య ఉన్న నూనెల ధరలు ఇప్పుడు మండిపోతున్నాయి. రిఫైన్డ్పై భారీగా.. జూలైలో 5 కిలోల సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ టిన్ను రూ.495 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.580 దాటింది. ప్రస్తుతం సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ విజయా బ్రాండ్ లీటర్ ప్యాకెట్ రూ.127 ఉండగా గత నెలలో ఇది రూ.105గా ఉంది. ధరల మంటకు కారణాలు.. ► దేశీయంగా ఉత్పత్తి అవుతున్న నూనెలు మన అవసరాలకు సరిపోకపోవడం, దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో నూనెల వినియోగం పెరగడం. ► కరోనా సమయంలో ప్రజలు తక్కువ కొవ్వు పదార్థాలున్న నూనెలపై మొగ్గు చూపడం వల్ల కూడా రిఫైన్డ్ ఆయిల్ ధరలు పెరిగాయి. -
‘‘వైరస్ ప్రభావాన్ని ముందే ఊహించా’’
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చమురు మార్కెట్ బ్లాక్ స్వాన్ లాంటి ప్రమాదాన్ని ఎదుర్కొబోతుందని ఫ్రెంచ్ చమురు వ్యాపారి పియరీ అండురాండ్ గతంలో హెచ్చరించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధాలు, అనూహ్య ఉగ్రవాద సంఘటనలను సాధారణంగా బ్లాక్ స్వాన్‌తో పోలుస్తారు. కరోనా కారణంగా చమురుకు డిమాండ్ లేనప్పుడు ధరలు సాధారణంగా తగ్గుతాయని అన్నారు. అయితే దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారమవుతుందని.. కానీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆండురాండ్ క్యాపిటల్ అనే చమురు సంస్థను పియరీ అండురాండ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చమురు డిమాండ్, సప్లయ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడు చమురు ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు. కోవిడ్ విశ్వరూపం చూపకముందే వైరస్ వ్యాప్తిని ప్రపంచ దేశాలు అరికట్టలేవని తానే ముందే గ్రహించినట్లు పేర్కొన్నారు. చమురు మార్కెట్ లాభాల భాట పట్టాలంటే దేశాలు విదిస్తున్న లాక్డౌన్లను ఎత్తేయాలని తెలిపారు. ముఖ్యంగా రవాణా, తయారీ రంగం వేగంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తేనే చమురుకు డిమాండ్ పెరిగి మార్కెట్లో జోష్ నెలకొంటుందని పియరీ అండురాండ్ అభిప్రాయపడ్డారు. -
చమురు చిక్కులకు.. డాలర్లతో చెక్!
చమురు బావుల ప్రధాన కేంద్రం పశ్చిమాసియాలో అమెరికా– ఇరాన్ ప్రతీకార చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవలి కాలంలో ఉన్న ధరలతో చూస్తే బ్యారెల్‌కు 5 డాలర్ల వరకు పెరిగాయి. చమురును అత్యధికంగా వినియోగిస్తూ, వినియోగంలో 80%కి పైగా దిగుమతి చేసుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఈ ధరల పెరుగుదల పెద్ద ఇబ్బందే. అయితే, ఆర్బీఐ ముందుచూపు మన ఆర్థిక వ్యవస్థ చమురు ప్రకంపనల నుంచి తట్టుకునేలా దృఢంగా నిలిపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు గత డిసెంబర్ 27వ తేదీ నాటికి 457.5 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది (2019లో) ఆర్బీఐ భారీ ఎత్తున డాలర్లను కొనుగోలు చేసింది. ఫలితంగా 64 బిలియన్ డాలర్ల మేర ఫారెక్స్ నిల్వలు 2019లో (డిసెంబర్ 27 నాటికి) పెరిగాయి. ఆసియాలోని ఇతర దేశాల్లో మరే కేంద్ర బ్యాంకు ఈ స్థాయిలో డాలర్ల కొనుగోళ్లకు దిగకపోవటాన్ని ఇక్కడ గమనించాలి. మనం చమురు దిగుమతులను అధిక శాతం డాలర్ల రూపంలోనే చేసుకుంటున్నందున... దండిగా ఉన్న డాలర్ నిల్వలు ఈ సమయంలో మనకు కలసిరానున్నాయి. 2019లో తైవాన్ 15 బిలియన్ డాలర్లు, థాయిలాండ్ 14 బిలియన్ డాలర్ల చొప్పున కొన్నాయి. ఇక ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేసియా, దక్షిణ కొరియా ఇంకా తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేయడం గమనార్హం. ఆరేళ్లలో 176 బిలియన్ డాలర్లు ఆర్బీఐ డాలర్ల కొనుగోళ్ల తీరును సింగపూర్‌కు చెందిన డీబీఎస్ గ్రూపు అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. 2013 ఆగస్ట్ ట్యాపర్ టాంటమ్ (యూఎస్ ఫెడ్ పరిమాణాత్మక ద్రవ్య సడలింపు విధానం నుంచి వెనక్కి మళ్లడం) తర్వాత నుంచి భారత రిజర్వ్ బ్యాంకు మొత్తం మీద 176 బిలియన్ డాలర్ల మేర ఫారెక్స్ నిల్వలను పెంచుకుంది. పరిమాణాత్మక సడలింపు విషయంలో నిదానంగా వ్యవహరించనున్నట్టు నాడు యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనకు అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ కఠినంగా మారడంతో వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం అధికమైంది. ఈ ఆరేళ్ల కాలంలో ఫారెక్స్ నిల్వల విషయంలో దక్షిణ కొరియా 76 బిలియన్ డాలర్లను పెంచుకుని రెండో స్థానంలో, తైవాన్ 65 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను పెంచుకుని మూడో స్థానంలో ఉన్నాయి. 10 నెలల వరకూ ఓకే..! ప్రస్తుతం ఆర్బీఐ వద్దనున్న ఫారెక్స్ నిల్వలు పది నెలల దిగుమతుల అవసరాలను తీర్చగలవు. తాజా అంతర్జాతీయ అనిశ్చితిలో రూపాయి విలువను కాపాడేందుకు ఈ నిల్వలు ఆర్బీఐకి ఆయుధంగా పనిచేస్తాయనేది నిపుణుల మాట. అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి బలమైన నిల్వల ఏర్పాటు దిశగా అధికార యంత్రాంగం వేగంగా వ్యవహరిస్తున్నట్టు డీబీఎస్లోని భారత ఆర్థిక వేత్త రాధికా రావు తెలిపారు. స్వల్పకాలిక నిధుల రాక, ఎక్స్టర్నల్ రుణాల రూపేణా వచ్చే ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఈ నిల్వలు ఉపకరిస్తాయన్నారు. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్టు.. పెరిగిన డాలర్ నిల్వలు రూపాయి మారకంపై ప్రభావం చూపించొచ్చనని చెప్పారామె. -
ఇరాన్‌పై సౌదీ రాజు సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసి రాకపోతే మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు చేరే అవకాశముందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే చమురు ధరలు మన జీవితకాలంలో చూడని అనూహ్య రీతిలో పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్ టీవీ ఛానల్లో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో మహమ్మద్ బిన్ సల్మాన్ కార్యక్రమం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో ప్రపంచం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ముఖ్యంగా సైనిక చర్యకంటే..రాజకీయపరమైన, శాంతియుత పరిష్కారమే మంచిదని తాము భావిస్తున్నామంటూ ప్రకంపనలు రేపారు. ఇరాన్‌తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఇది ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందని, తద్వారా ఇంధన ధరలు జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. సౌదీలో ఆయిల్ రిఫైరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడులు ఇరాన్ చర్యేనని సౌదీ ఆరోపిస్తోంది. మరోవైపు సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయమున్నట్లు సౌదీ అరేబియాతో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఇరాన్ తమ ప్రమేయం లేదని ఇరాన్ కొట్టిపారేసింది. కాగా ఏడాది క్రితం జరిగిన వాషింగ్టన్ పోస్టు కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యలో తన ప్రమేయం లేదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టంచేశారు. అయితే సౌదీ రాజ్యాధినేతగా ఖషోగ్గి హత్యకు తాను పూర్తి బాధ్యతవహిస్తున్నట్లు స్పష్టంచేశారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
చల్లబడ్డ చమురు ధరలు
ముడి చమురు ధరలు దిగిరావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్ల నిర్ణయం బుధవారం రాత్రికి వెలువడనున్నందున మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. బీఎస్ఈ సెన్సెక్స్ 83 పాయింట్లు పెరిగి 36,564 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 10,841 పాయింట్ల వద్ద ముగిశాయి. చమురు ధరలు 1 శాతం మేర తగ్గాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 52 పైసలు పుంజుకొని 71.26ను తాకింది. 247 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... గత శనివారం సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆ దేశపు రోజువారీ చమురు ఉత్పత్తిలో దాదాపు సగానికి గండి పడింది. అయితే దీంట్లో సగం మొత్తాన్ని రికవరీ చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. దీంతో చమురు ధరలు 6 శాతం మేర దిగివచ్చాయి. మరోవైపు ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. నెలాఖరుకల్లా చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రాగలదని సౌదీ అరేబియా చమురు మంత్రి పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల తర్వాత గానీ, తక్షణం గానీ చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పేర్కొనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఒకింత జోష్‌నిచ్చింది. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైంది. వెంటనే 232 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత ఆ లాభాలను పోగొట్టుకొని 15 పాయింట్ల మేర నష్టపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల బాట పట్టింది. స్వల్ప లాభాలతో పరిమిత శ్రేణిలో కదలాడింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆయిల్, హోటల్, సిగరెట్ల షేర్ల ర్యాలీ.... వాహన షేర్లు పరిమిత శ్రేణిలో కదలాడాయి. వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తే, పన్ను వసూళ్లు తగ్గుతాయని, ఫలితంగా ద్రవ్యలోటు లక్ష్యం సాధించడం కష్టమవుతుందన్న అంచనాల కారణంగా వాహనాలపై జీఎస్టీను తగ్గించే అవకాశాల్లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు దిగిరావడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పెరిగాయి. హెచ్‌పీసీఎల్ 3.6 శాతం, బీపీసీఎల్ 3.6 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.6 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు ఫైవ్‌స్టార్ హోటళ్లపై జీఎస్టీని తగ్గించే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా హోటల్ షేర్లు ఇంట్రాడేలో 15 శాతం వరకూ పెరిగాయి. హోటల్ లీలా వెంచర్, తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, రాయల్ ఆర్చిడ్ హోటల్స్, ఈఐహెచ్ అసోసియేటేడ్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఇండియన్ హోటల్స్ 3–5 శాతం లాభపడ్డాయి. ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ, అమ్మకాలను నిషేధిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో సిగరెట్ల షేర్లు 5.5 శాతం వరకూ పెరిగాయి. ఫెడ్ రేటు తగ్గించిన వెంటనే అమెరికా మార్కెట్లు ఒక శాతం వరకూ పడ్డాయి. చదవండి : టీవీ ధరలు దిగొస్తాయ్! -
మూడో రోజూ రూపాయి పరుగు..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమ, మంగళ, బుధవారాల్లో రూపాయి 89 పైసలు లాభపడితే, ఒక్క బుధవారం 33 పైసలు పెరిగింది. 68.41 వద్ద ముగిసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్ బలహీనత ఇక్కడ రూపాయికి ప్రధానంగా కలిసివస్తోంది. ఉదయం 68.72 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 68.37ను కూడా తాకింది. రూపాయికి నిరోధం 68.50 వద్ద ఉంటే, ఆ స్థాయిపైన రూపాయి ముగియడం గమనార్హం. ఇదే విధమైన ముగింపులు మరో రెండు రోజులు కొనసాగితే, రూపాయి తిరిగి 67ను చూస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నేడు రేటు తగ్గిస్తే, మరింత బలోపేతం! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గిస్తే, రూపాయి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు పెంచలేని పరిస్థితి ఉంటేనే దేశంలోనూ ఆర్బీఐ మరో పావుశాతం రేటు కోతకు నిర్ణయం తీసుకుంటుంది. ఫెడ్ ఫండ్ రేటు పెరగలేదంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి నిదర్శనం. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. రూపాయికి మరింత లాభం చేకూర్చే అంశం ఇది. రూపాయి పరుగుకు మరిన్ని కారణాలను విశ్లేషిస్తే... ► ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు. ► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు. ► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు. ► డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్చంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేయడం. ► వెరసి ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరును రూపాయి కనబరిచింది. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 18 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కాగుతున్న వంట నూనె
సాక్షి సిటీబ్యూరో: సంక్రాంతి పండగ ఎఫెక్ట్ రైళ్లు, బస్సులనే కాదు.. వంట నూనెనూ తాకింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు, బస్సుల టికెట్ ధరలు పెంచినట్టే ప్రయాణికు వంట నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. నగరంలో రోజుకు వందల టన్నులకు పైగా వంట నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. హోటల్స్, క్లబ్బులు, బార్లలో వంటలకు అత్యధికంగా వివిధ రకాల నూనెలు వినియోగిన్నారు. ఇక ఇళ్లలో కూడా నూనె వినియోగం పెరిగింది. ప్రస్తుతం సంక్రాంతి పండగ కాడంతో నగరంలో వంట నూనె వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో నూనె ధరలు భగ్గుమంటున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో అన్ని రకాల నూనెపై లీటర్‌కు రూ. 3 నుంచి రూ. 5 పెరిగింది. ఇక రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతి లీటరు నూనెపై రూ.10 నుంచి రూ.12 పెంచారు. నూనె ఏదైనా ‘ధరా’ఘాతం పామాయిల్, రిఫైండ్ ఆయిల్, వేరుశనగ, రైస్‌బ్రాన్ నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెకు సంబంధించి హోల్‌సేల్ ధరలకూ, రిటైల్ మార్కెట్లో ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్లో పామాయిల్ 10 కిలోల ధర రూ.650 నుంచి రూ.750కు చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ.85కు పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్ మార్కెట్లో 15 కేజీల ధర రూ.1350 నుంచి రూ.1400 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.1450కు చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ.95 నుంచి రూ.97కు పెరిగింది. కిలో వేరుశనగ నూనె ధర నెలక్రితం రూ.98 ఉండగా ప్రస్తుతం రూ.105కు చేరింది. వీటితోపాటు రైస్‌బ్రాన్ ఆయిల్ రూ.87 నుంచి రూ.92కు పెరిగింది. ఈ స్థాయిలో వంట నూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. గోడౌన్లలో దాచిన పాత సరుకుని ఇప్పుడు బయటకు తీసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇదే అకాశంగా కొందరు వ్యాపారులు కల్తీకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
బ్యాంక్ షేర్ల పతనానికి... అంతంతమాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశలు తగ్గుముఖం పట్టడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బ్యారెల్బ్రెంట్ చమురు ధరలు మళ్లీ 60 డాలర్లపైకి ఎగియడంతో రూపాయి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 36,107 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,822 పాయింట్ల వద్ద ముగిశాయి. 198 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ట్రేడింగ్ ముగిసేదాకా ఈ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 56 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 142 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లకు నష్టాలు లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 2 శాతం వరకూ నష్టపోయాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ స్వల్పంగా లాభపడగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ∙వాటెక్ వాబాగ్ షేర్ 15 శాతం ఎగసి రూ.321 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్ 26 శాతం ఎగసింది. ఈ నెల మొదటి వారంలో నోర్జేస్ బ్యాంక్ 3.31 లక్షల షేర్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, నాలుగు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), లిండే ఇండియా, టొరెంట్ ఫార్మా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముడి చమురు ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. -
సగం తగ్గిన లాభాలు
స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ లాభాలు కొనసాగాయి. రిటైల్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడయ్యాయి. బ్యాంక్‌ల అధినేతలతో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ కానుండటం కూడా కలసివచ్చింది. రూపాయి బలపడగా, ముడి చమురు ధరలు నిలకడగా ఉండటంతో స్టాక్‌సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 35,930 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 10,792 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే మూడు రోజుల వరుస లాభాల కారణంగా మధ్యాహ్నం తర్వాత మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో స్టాక్ సూచీల లాభాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. గణాంకాలతో కళకళ.... ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ఆరంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి 8.1 శాతానికి పుంజుకోవడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. రిటైల్ ద్రవ్యల్బోణం తగ్గడంతో కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు పెరిగాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ గురువార భేటీ కానుండటంతో బ్యాంకింగ్ రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 317 పాయింట్లు, నిఫ్టీ 101 పాయింట్ల వరకూ పెరిగాయి. అయితే వరుస మూడు రోజుల ర్యాలీ కారణంగా మధ్యాహ్నం తర్వాత కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ లాభాలు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. ఆల్‌టైమ్ హైకి హెచ్‌యూఎల్.. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల రానున్నందున గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారిస్తుందని, గ్రామీణ మార్కెట్లో డిమాండ్‌ను పెంచే పథకాలు, నిర్ణయాలు రానున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వినియోగ కంపెనీల షేర్లు మంచి లాభాలు సాధించాయి. హిందుస్తాన్ యూనిలివర్, కాల్గేట్ పామోలివ్ (ఇండియా) షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ► సన్‌ఫార్మాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సెబీ వెల్లడించడంతో సన్ ఫార్మా షేర్ 2 శాతం నష్టంతో రూ.422 వద్ద ముగిసింది. ► టార్గెట్ ధరను రూ.350 నుంచి రూ.375కు మోర్గాన్ స్టాన్లీ పెంచడంతో ఎస్బీఐ షేర్ 1 శాతం లాభంతో రూ. 288 వద్దకు చేరింది. ► ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలపడంతో ఈ రెండు షేర్లు ఇంట్రాడేలో చెరో 7 శాతం వరకూ ఎగిశాయి. రూపాయి వరుస నష్టాలకు బ్రేక్ ముంబై: వరుసగా మూడు రోజుల పాటు నష్టపోయిన రూపాయి.. గురువారం కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 33 పైసలు బలపడి 71.68 వద్ద క్లోజయ్యింది. డాలర్ బలహీనపడటం, ముడిచమురు ధరలు కాస్త తగ్గుముఖం పడుతుండటం ఇందుకు కారణం. కీలక అంశాల్లో సంబంధిత వర్గాలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటానంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కొత్తగా నియమితులైన శక్తికాంత దాస్ భరోసానివ్వడం కూడా రూపాయికి కొంత ఊతమిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఆయిల్ బూస్ట్ : రూపాయి రయ్..రయ్
సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దిగి వస్తుండటంతో దేశీయ కరెన్సీ దూకుడుమీద ఉంది. వరుస సెషన్లలో లాభపడుతూ కీలక మద్దతు స్థాయిలపైకి ఎగబాకింది. తాజాగా గురువారం డాలరు మారకంలో సుదీర్ఘ కాలం తరువాత 70 స్థాయికి పుంజుకుంది. ఇటీవల ర్యాలీ బాట పట్టిన దేశీయ కరెన్సీ మరోసారి బలాన్ని ప్రదర్శిస్తోంది. మంగళవారం నాటి 71.46 స్థాయితో పోలిస్తే (బుధవారం ఈద్ సెలవు) ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 32 పైసలు ఎగసి 71.14 వద్ద ప్రారంభమైంది. తదుపరి 71.12వరకూ పుంజుకుంది. వెరసి వరుసగా 7వ రోజు రూపాయి లాభాల బాటలో సాగుతోంది. అనంతరం 54 పైసలు లాభపడి 70.92 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబరు 3 తరువాత తిరిగి ఈ స్థాయికి చేరింది. తన జోష్‌ను కొనసాగించిన దేశీయ కరెన్సీ చివరికి ఆగస్టు 29 నాటి 70.69 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. అటు లిక్విడిటీ మెరుగుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ద్వారా రూ.8వేల కోట్లను విడుదల చేయనుందన్న వార్తలు రూపాయి విలువకు బలాన్నిచ్చినట్టు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. -
క్రూడ్, విదేశీ పెట్టుబడులు కీలకం
ముంబై: చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం ఈ వారం మార్కెట్ పయనాన్ని నిర్ణయించనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం ఏ విధంగా ఉంటుంది? లిక్విడిటీ సమస్య నివారణకు ఆర్బీఐ సోమవారం (ఈ నెల 19న) నాటి భేటీలో తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో ఒడిదుడుకులు ఉంటాయని భావిస్తున్నారు. ‘‘రూపాయి కదలిక, చమురు ధరలు, విదేశీ పెట్టుబడులను ఇన్వెస్టర్లు గమనించాల్సి ఉంటుంది. నిఫ్టీ 10,500–10,900 మధ్య ట్రేడ్ కావొచ్చు. బ్యాంకు నిఫ్టీ 25,800– 26,600 పాయింట్ల మధ్య చలించొచ్చు’’ అని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్ తెలిపారు. అధిక నిల్వలు, ప్రపంచ ఆర్థిక వృద్ధి నిదానించొచ్చన్న ఆందోళనలతో గత వారం చమురు బ్యారెల్ 67.74 డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ ప్రారంభంలో 86 డాలర్లు ఉండగా, చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గడంతో ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు తగ్గి, మన స్టాక్ మార్కెట్లలో రికవరీకి దారితీసింది. ప్రపంచంలో మన దేశం మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న విషయం తెలిసిందే. గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,502 కోట్ల మేర విలువైన షేర్లను కొన్నారు. అంతకుముందు వారంతో పోలిస్తే 22 రెట్లు అధికం. గత వారంలో రూపాయి 57 పైసలు లాభపడి 71.92కు చేరింది. ‘‘ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో తగ్గుతాయన్న విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయి. అయితే, నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్లను బ్రేక్ చేసి పైకి వెళుతుందా? రూపాయి, చమురు ధరల్లో స్థిరత్వం అన్నవి మార్కెట్ దిశను నిర్దేశిస్తాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. ఈ వారం నిఫ్టీకి 10,755 పాయింట్లు నిరోధంగా, 10,440 పాయింట్లు మద్దతు స్థాయిగా పనిచేస్తాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. -
రూపాయికి తగ్గిన చమురు సెగ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం ఒకేరోజు 36 పైసలు బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ఎక్సే్చంజ్‌లో 72.31 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తాజా గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లు పతనం కావడం... దీనితో దేశంపై దిగుమతుల బిల్లు భారం తగ్గే అవకాశాలు... కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–వెళ్లే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) అలాగే ధరల పెరుగుదల భయాలు తగ్గడం వంటి అంశాలు రూపాయి లాభానికి కారణాలు. దీనికితోడు కొన్ని విదేశీ కరెన్సీలపై డాలర్ బలహీనత, దేశీయ మార్కెట్లో దిగుమతిదారులు, బ్యాంకర్ల అమెరికా కరెన్సీ అమ్మకాల వంటివి కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. రూపాయి ట్రేడింగ్ ప్రారంభంలోనే మంగళవారం ముగింపుతో పోల్చితే పటిష్ట స్థాయిలో 72.18 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.99కి కూడా రికవరీ అయ్యింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) మార్కెట్లో రూ.277 కోట్ల నికర కొనుగోళ్లు జరిపినట్లు తొలి గణాంకాలు వివరించడం మరో అంశం. అక్టోబర్ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది. -
రూపాయిపై చమురు ఎఫెక్ట్
ముంబై: ముడి చమురు ధరలు మళ్లీ ఎగియడంతో పాటు డాలర్ కూడా బలపడటం దేశీ కరెన్సీ రూపాయిపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 39 పైసలు క్షీణించి 72.89 వద్ద ముగిసింది. డిసెంబర్ నుంచి ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 5 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించనున్నట్లు ప్రకటించిన సౌదీ అరేబియా చమురు రేటు మరింత పడిపోకుండా ప్రపంచ దేశాలన్నీ రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గించాలంటూ పిలుపునిచ్చింది. దీంతో క్రూడాయిల్ పది రోజుల క్షీణతకు అడ్డుకట్ట పడింది. బ్యారెల్ ధర 1 శాతం పెరిగి 71 డాలర్ల స్థాయిని తాకింది. అటు బ్రెగ్జిట్ డీల్‌పై ఆందోళనలతో బ్రిటన్ పౌండు పతనమవడం తదితర అంశాల నేపథ్యంలో మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు విలువ 18 నెలల గరిష్టానికి ఎగిసింది. -
గణాంకాలు, ప్రపంచ పరిణామాలు కీలకం
కంపెనీల క్యూ2 ఫలితాలు దాదాపు ముగింపు దశకు రావడంతో దేశీ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉండనున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, ప్రపంచ మార్కెట్ల గమనం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి ప్రపంచ పరిణామాలు, రాష్ట్రాల ఎన్నికల సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు కూడా స్టాక్‌సూచీల గమనాన్ని నిర్ధేశించనున్నాయి. నేడు రిటైల్ గణాంకాలు.. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడతాయి. ఈ ఏడాది ఆగస్టులో 3.69 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 3.77 శాతానికి పెరిగింది. ఇదే రోజు ఈ ఏడాది సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వస్తాయి. ఈ ఏడాది జూలైలో 6.5 శాతంగా ఉన్న ఐఐపీ ఈ ఏడాది ఆగస్టులో 4.3 శాతానికి పడిపోయింది. ఈ నెల 14న (బుధవారం) గత నెలకు సంబంధించిన టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది ఆగస్టులో 4.53 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఈ సెప్టెం బర్లో 5.13 శాతానికి ఎగసింది. ఇక ఈ వారంలో 2,300 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. కీలక కంపెనీలు–సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, సీఈఎస్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండి యా, నాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అశోక్ లే లాండ్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, మహానగర్ గ్యాస్, ఎన్‌ఎమ్‌డీసీల ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. రిలీఫ్ ర్యాలీ... స్టాక్ మార్కెట్లో గత రెండు నెలల్లో భారీ కరెక్షన్ చోటు చేసుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. దీంతో సాంకేతిక కారణాల రీత్యా స్వల్ప కాలంలో రిలీఫ్ ర్యాలీ చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారంలో రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కొంత జోష్‌నిచ్చాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఫలితాల సీజన్ చివరకు రావడంతో రాష్ట్రాల ఎన్నికల పరిణామాలు ప్రధానం కానున్నాయని వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలిగా ఛత్తీస్‌గఢ్‌లో నేటి నుంచి పోలింగ్ జరగనున్నది. ఇతర నాలుగు రాష్ట్రాలు–తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరమ్‌లో పోలింగ్ వచ్చే నెల 7న ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న వెల్లడవుతాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, ఈ నెల 14న జపాన్ క్యూ3 జీడీపీ గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ నెల 15న అమెరికా రిటైల్ గణాంకాలు వెల్లడవుతాయి. విదేశీ పెట్టుబడులకు చమురు జోష్ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు ఈ నెలలో పెరిగాయి. ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.4,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ మార్కెట్లో రూ.215 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.4,557 కోట్లు చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు. ముడిచమురు ధరలు తగ్గడంతో రూపాయి మారకం విలువ పెరగడం, బాండ్ల రాబడులు కూడా తగ్గడంతో లిక్విడిటీ కష్టాలు తగ్గుముఖం పట్టడం దీనికి ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.38,900 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.95,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంట్లో ఈక్విటీల వాటా రూ.41,900 కోట్లుగా, డెట్ మార్కెట్ వాటా రూ.53,600 కోట్లుగా ఉన్నాయి. -
స్టాక్‌మార్కెట్ల దూకుడు : భారీ లాభాలు
-
స్టాక్‌మార్కెట్ల దూకుడు : భారీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆరంభంలోనే భారీ లాభాలను సాధించిన కీలక సూచీలు కొనుగోళ్ల జోష్‌తో మరింత లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 34, 859 వద్ద,నిఫ్టీ 133 పాయింట్లు ఎగిసి 10, 13 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. దీంతో నిఫ్టీ 10500 స్థాయిని అధిగమించింది. దీంతో దేశీయంగా దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా సెక్టార్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, యస్‌బ్యాంక్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హీరోమోటో, ఇండస్ఇండ్, ఐషర్, ఎంఅండ్ఎం, ఐవోసీ, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్‌గా ప్రారంభమైంది. డాలరుమారకంలో నిన్నటి ముగింపు 73.45 తో పోలిస్తే. 73.10 వద్ద బలంగా ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు దిగి రావడం, ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వార్ ముగింపు సంకేతాలతో ఇన్వెస్టర్లలో జోష్ వచ్చింది. అటు వరుసగా మూడో రోజు అమెరికా మార్కెట్లు హైజంప్ చేశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లోనూ ఇదే ధోరణి నెలకొంది. -
74ను దాటిన రూపాయి!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు రోజుల నుంచీ ఏ రోజుకారోజు కొత్త కనిష్ట స్థాయిలకు జారిపోతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం ఒకదశలో 74.23కు జారింది. అయితే కొంత రికవరీతో 73.76 వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో పోలిస్తే ఇది 18 పైసలు పతనం. ఈ రెండు ముగింపులూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇవి రెండూ గురువారానికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. సోమవారం నుంచీ వరుసగా జరిగిన నాలుగు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్ సెలవు) ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 128 పైసలు కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ దాదాపు 17% పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్ అకౌంట్ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. రూపాయి పతనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు. ఆర్బీఐ పాలసీ కూడా నష్టానికి కారణమే! రూపాయి శుక్రవారం 74 దిగువకు పడిపోడానికి ఆర్బీఐ పాలసీ విధానమూ కారణమయ్యింది. వివరాల్లోకి వెళితే, అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ తన వడ్డీరేట్లను (వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతం) పెంచుతూ వస్తోంది. దీనితో ఈ బాండ్ల రేట్లు తగ్గుతూ, దీనిపై వచ్చే ఈల్డ్స్ (వడ్డీ) పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈల్డ్స్ నుంచి ప్రయోజనం పొందడానికి దేశంలోని విదేశీ పెట్టుబడులు మార్కెట్ నుంచి వెనక్కు వెళ్లడం ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి దేశంలోనూ రేటు పెంపు తప్పదని నిపుణులు విశ్లేషించారు. దీనికి భిన్నంగా రేటు యథాతథ స్థితి కొనసాగించడంతో దేశీయ కరెన్సీ సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. డాలర్లకు డిమాండ్ తీవ్రమవడంతో రూపాయి కుదేలయ్యింది. -
అంచనాలు తలకిందులు
అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్నిరకాల సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్బీఐ పాలసీ కమిటీ (ఎంపీసీ) 3 రోజులు సమావేశమై... ఒక్క నివారణ చర్య లేకుండా ముగించేయడం ఆశ్చర్యపరిచింది. ముంబై: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఎంపీసీ కమిటీ నాలుగో ద్వైమాసిక సమావేశం, చివరికి కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథ విధానాన్నే కొనసాగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. బెంచ్‌మార్క్ రెపో రేటు 6.5 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని మొత్తం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఓటు వేశారు. రివర్స్ రెపో 6.25 శాతంలోనూ మార్పు లేదు. పెరిగే చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం అవుతుండటం మన దేశ వృద్ధికి, ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నా... అందుకు తన వైపు నుంచి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం. కాకపోతే పాలసీ విధానాన్ని తటస్థం నుంచి ‘క్రమంగా కఠినతరం’ (క్యాలిబ్రేటెడ్ టైటనింగ్)కు మార్చింది. అంటే ఇకపై సమీప భవిష్యత్తులో రేట్ల పెంపే గానీ, తగ్గేందుకు అవకాశాల్లేవని సంకేతాలిచ్చింది. మధ్య కాలానికి ధరల పెరుగుదలను (ద్రవ్యోల్బణాన్ని) 4 శాతానికి నియంత్రించాలన్న విధానానికి కట్టుబడి ఉన్నట్టు మరోసారి పేర్కొంది. నిజానికి కీలక రేటును కనీసం పావు శాతం అయినా పెంచుతారని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. రూపాయి బలహీనత చూసి కొందరయితే... ఈ పెంపు అర శాతం కూడా ఉండొచ్చని అనుకున్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన తర్వాత రూపాయి ఫారెక్స్ మార్కెట్లో 74 స్థాయిని కోల్పోయింది. స్టాక్ మార్కెట్లు మాత్రం ఆర్బీఐ విధానంతో కకావికలం అయ్యాయి. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అస్థిరతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో పరిస్థితి కఠినతరం అవుతుండడం మనదేశ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలకు పెద్ద సవాళ్లుగా ఆర్బీఐ పేర్కొంది. ఈ తరహా సమస్యల ప్రభావాన్ని తటస్థ పరిచే విధంగా దేశీ స్థూల ఆర్థిక మూలాలు మరింత బలపడాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%గానే ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6%కి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశాల రక్షణాత్మక విధానాలు, కరెన్సీ యుద్ధాల ముప్పు, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అన్నవి దేశ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సమస్యలుగా ఎంపీసీ అభిప్రాయపడింది. ఎంపీసీ ఆగస్ట్‌లో జరిగిన సమావేశంలో పాలసీ రేట్లను పావు శాతం పెంచిన విషయం గమనార్హం. రూపాయి ఇప్పటికీ బాగానే ఉంది... దేశీయ కరెన్సీ రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఆర్బీఐకి ఎటువంటి టార్గెట్, బ్యాండ్ లేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇప్పటికే మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న విదేశీ మారక నిల్వలు 400.5 బిలియన్ డాలర్లని, ఇవి పది నెలల దిగుమతులకు సరిపోతాయని చెప్పారు. రూపాయి పతనం కొన్ని అంశాల్లో పలు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మోస్తరుగానే ఉందని ఉర్జిత్ చెప్పారు. ద్రవ్యోల్బణం... ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో (అక్టోబర్–మార్చి) రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ఆహార ధరలు ఊహించనంత అనుకూలంగా ఉండడమే కారణం. 2019–20 మొదటి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉండొచ్చని, సమస్యలు ఎదురైతే కొంత అధికంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. మధ్య కాలానికి వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4%కి (2% అటూ, ఇటూగా) తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగానే... క్రమంగా కఠినతరమనే విధానం తీసుకున్నట్టు తెలిపింది. ద్రవ్యలోటు లక్ష్యాలను దాటితే ప్రమాదమే ద్రవ్యలోటు లక్ష్యాలను దాటకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ సూచించింది. లక్ష్యాలు తప్పితే ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం పడడమే కాకుండా, మార్కెట్లలో అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది. ‘‘కేంద్రం లేదా రాష్ట్రాల స్థాయిలో ద్రవ్యలోటు కట్టుతప్పితే అది ద్రవ్యోల్బణ అంచనాలపై, ప్రైవేటు పెట్టుబడులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఐఎల్ఎఫ్ఎస్ పరిస్థితి కుదుటపడుతుంది ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంలో ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుందని, పరిస్థితిని ఇది సద్దుమణిగేట్టు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. పూర్తి నిర్మాణాత్మక సంస్థాగత చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. నూతన యాజమాన్యానికి ఆర్బీఐ సహకారం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. స్వల్పకాలిక రుణాలపై అధికంగా ఎన్బీఎఫ్సీలు ఆధారపడడాన్ని హ్రస్వదృష్టి విధానంగా డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య అభివర్ణించారు. ఇది సంస్థలపైనే కాకుండా వ్యవస్థాగత స్థిరత్వంపైనా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘వరుసగా రెండు సార్లు రేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందన్న అంచనాలే యథాతథ స్థితిని కొనసాగించేందుకు, కఠినతర విధానానికి మళ్లేలా చేశాయి. ప్రతి సమావేశంలోనూ రేట్ల పెంపునకు మేమేమీ కట్టుబడలేదు. ఈ సమయంలో అది అవసరం పడలేదు. ఆర్బీఐ, ఎంపీసీ ఇందుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. తటస్థ విధానం నుంచి క్రమంగా కఠినతర విధానానికి మళ్లడం ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకు సమస్యలు పొంచి ఉండడం వల్లే. ఈ విధానంలో రెండే ఆప్షన్లు ఉన్నాయి. రేట్లను పెంచడం లేదా వాటిని స్థిరంగా కొనసాగించడం ’’ – ఉర్జిత్పటేల్, ఆర్బీఐ గవర్నర్ రూపాయి, మార్కెట్లకు ఇబ్బందే! సమస్య తీవ్రమవుతుంది.. ఆర్బీఐ చర్య ఇబ్బందిని సృష్టించేదే. ప్రస్తుతం రూపాయి పతనాన్ని అడ్డుకోవడం ప్రధానం. రూపాయి బలోపేతం మార్కెట్‌కూ అవసరం. కానీ ఆర్బీఐ నిర్ణయం ఈ దిశలో లేదు. రేటు పెంపు లేకపోవడం వల్ల కరెన్సీ, అలాగే ఇతర అసెట్స్ మార్కెట్లు తీవ్ర సర్దుబాటుకు (కరెక్షన్) గురయ్యే అవకాశాలున్నాయి. ఫైనాన్షియల్ సంక్షోభ సమయాల్లో ఒక్క ద్రవ్యోల్బణం లక్ష్యాలను మాత్రమే చూడ్డం సరికాదు. అయితే ఆర్బీఐ పాలసీ వైఖరి మార్చుకోవడం గమనించాలి. వచ్చే నెలల్లో రేటు పెంపు ఉంటుందని ఈ పాలసీ వైఖరి మార్పు తెలియజేస్తోంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అనిశ్చితిని సూచిస్తోంది ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి తీవ్రతను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుంది. గ్లోబల్ ట్రేడ్, ఫైనాన్షియల్ స్థిరత్వ పరిస్థితులు బలహీనతకు అవకాశాలు ఉన్నట్లు పాలసీ నిర్ణయాలు సూచిస్తున్నాయి. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ఆశ్చర్యానికి గురిచేసింది రెపోపై ఆర్బీఐ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయి. రైతులకు కనీస మద్దతు ధరల పెరుగుదల, చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి, కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యలోటు లక్ష్యాలు కట్టుతప్పే అవకాశాలు దీనికి కారణం. – సునీల్ మెహతా, ఐబీఏ చైర్మన్ రియల్టీకి సానుకూలమే గడచిన ఆరు నెలల్లో వృద్ధి సంకేతాలను ఇస్తున్న రియల్టీకి తాజా ఆర్బీఐ నిర్ణయం మరింత సానుకూలమైనదే. కొనుగోలుదారులకు ఇది ఒక అవకాశం. పండుగల సీజన్, దేశ వ్యాప్తంగా ప్రొపర్టీ రేట్లు దాదాపు తక్కువగానే ఉండడం వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగం సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తున్నాయి. – జాక్షయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎఫ్‌పీఐల ఆకర్షణకు వీఆర్ఆర్ మార్గం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్ రూట్/వీఆర్ఆర్) ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్‌పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్ఆర్ అనే పత్య్రేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది. స్వల్పకాలిక పెట్టుబడుల పరంగా నియంత్రణపరమైన మినహాయింపులు కూడా ఉంటాయి’’ అని ఆర్బీఐ తెలిపింది. ఈ వీఆర్ఆర్ మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు అర్హతగా... పెట్టుబడుల్లో కనీస శాతాన్ని, నిర్ణీత కాలం వరకు భారత్‌లో కొనసాగించేందుకు వారు ఎంచుకోవచ్చని ఆర్బీఐ వివరించింది. -
సౌదీని కాపాడుతున్నాం: ట్రంప్
దుబాయ్: చమురు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశం సౌదీ అరేబియాపై స్వరం పెంచారు. అమెరికా సైనిక మద్దతు లేకుంటే సౌదీ రాజు రెండు వారాలు కూడా పదవిలో ఉండరని హెచ్చరించారు. ముడిచమురు ధరలను తగ్గించాలని ఓపెక్, సౌదీ అరేబియాలను ట్రంప్ తరచూ కోరుతున్న సంగతి తెలిసిందే. మిసీసీపీలోని సౌతవెన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘సౌదీ అరేబియాను మనం కాపాడుతున్నాం. మన మద్దతు లేకుంటే రెండు వారాలు కూడా పదవిలో ఉండరని సౌదీ రాజు సల్మాన్‌కు తేల్చిచెప్పా. సైన్యానికి మీరు డబ్బు చెల్లించాల్సిందే’ అని అన్నారు. 82 ఏళ్ల సల్మాన్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారో తెలియరాలేదు. వారిద్దరు చివరిసారిగా శనివారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై సౌదీ అరేబియా స్పందించలేదు. కాగా, ఒపెక్‌కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాతో ట్రంప్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు కలిగివుండటం గమనార్హం. -
మెట్రో నగరాల్లో పెట్రో, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై: ముడి చమురు ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో గురువారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌పై 20 పైసలు చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 83.85 నుంచి 15 పైసలు పెరిగి 84 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర రూ .75.45. ముంబైలో ఇది ధర 91.34 కి చేరుకుంది. మరోవైపు డీజిల్ 21.45 పైసలు పెరిగి లీటకు ధర 80.10 రూపాయలకు చేరింది. ఢిల్లీ: పెట్రోలు రూ. 84, డీజిల్ 75.45 ముంబై: పెట్రోలు ధర రూ. 91.34 , డీజిల్ ధర రూ.య 80.10 కోలకతా: పెట్రోల్ ధర రూ .85.80 , డీజీల్ ధర రూ. 77.30 చెన్నై: పెట్రోలు ధర రూ .87.33, డీజిల్ 79.79 రూపాయలు విజయవాడ : పెట్రోలు రూ. 88. 05, డీజిల్ ధర రూ. 80.75 హైదరాబాద్: పెట్రోలు ధర 89.06 రూ. డీజిల్ ధర రూ. 82.07 చండీగడ్: పెట్రోల్ ధర 80.85 రూపాయలు, డీజిల్ ధర 73.36 రూపాయలు -
నాలుగేళ్ల గరిష్టానికి చమురు ధర
సాక్షి,న్యూఢిల్లీ: చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్‌ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో తాజాగా బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 83 డాలర్లనూ దాటేసింది. ఇదే విధంగా నైమెక్స్ చమురు సైతం 73 డాలర్లను అధిగమించింది. ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 0.57 శాతం ఎగసి 83.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.43 శాతం పెరిగి 73.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నవంబరు 4 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు అమలుకానున్న నేపథ్యంలోఆయిల్ ధరలకు 100 డాలర్ల చేరనుందనే అంచనా మరింత ఊపందుకుంది. మరోవైపు డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం క్షీణించింది. శుక్రవారం కొంతమేర బలపడినప్పటికీ ప్రస్తుతం 33 పైసలు నష్టంతో 72.82 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరలు మరింత మండుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని పరిస్థితుల కారణంగా ఇప్పటికే ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.91 ల మార్క్‌ను అధిగమించింది. అంతేకాదు ఈ చమురు సెగ ఏవియేషన్ కంపెనీలను మరింత బలంగా తాకనుంది. విమానయాన ఇంధన ఏటీఫ్ ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలతో ఏవియేషన్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. స్పైస్‌జెట్ దాదాపు 5 శాతం, జెట్ ఎయిర్వేస్ దాదాపు 5 శాతం, ఇంటర్‌గ్లోబ్ 2 శాతం నష్టపోతున్నాయి. అటు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. -
ఏవియేషన్ షేర్లకు చమురు సెగ
సాక్షి,ముంబై: దడ పుట్టిస్తున్న క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో విమానయాన సంస్థలకు షేర్లు పతనం వైపు పరుగులు తీశాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు అంతర్జాతీయ వాణిజ్యంలో బ్యారెల్ మార్కుకు 80 డాలర్లు దాటడంతో సోమవారం ఏవియేషన్ సెక్టార్లో అమ్మకాలకు తెరతీసింది. అటు న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 72 డాలర్లను తాకింది. సోమవారం ఉదయం ఒకేసారి రెండు శాతం పెరగడంతో స్సైస్ జెట్ 4.15 శాతం నష్టపోయి 73.85 స్థాయికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ స్టాక్ 47.85 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 48.78 శాతం కోల్పోయింది. దీంతో తాజా 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ 6 శాతం క్షీణించింది. గత ఏడాది నుంచి 22.48 శాతం కోల్పోయి ఇది కూడా లైఫ్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్ కూడా 7.70 శాతం పడిపోయింది. ఇరాన్‌పై ఆంక్షలు అమలు గడువు దగ్గరపడేకొద్దీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు జెట్ స్పీడుతో పరుగులు తీస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 80 డాలర్లకు చేరగా, నవంబర్ నెలకల్లా 90 డాలర్లు, ఏడాది చివరికల్లా 100 డాలర్లకు చేరుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఆంక్షలు కారణంగా రాబోయే నెలల్లో చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లు ఉంటుందని జెపి మోర్గాన్ తన తాజా మార్కెట్ విశ్లేషణలో పేర్కొంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో సెగ కొనసాగుతోంది. గత ఐదు వారాల్లో 71 డాలర్ల నుంచి బ్యారెల్ 80 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు దిగుమతిలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌లో ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
పెట్రో ధరలు: ఒపెక్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వెంటనే ధరలను తగ్గించాలంటూ ఒపెక్ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు. ఆయిల్ ఎగుమతిదారుల కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించాలంటూ గురువారం ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేశారు. మధ్యప్రాచ్య దేశాలకు తామే సైనిక రక్షణ అందిస్తున్నామనీ, ఇది కొనసాగాలంటే ధరల పెరుగుదల ఎంతమాత్రం మంచికాదన్నారు. ముడి చమురు ధరల పెరుగుదలకు ఒపెక్ దేశాల గుత్తాధిపత్యమే కారణమంటూ ట్రంప్ మరోసారి కన్నెర్రజేశారు. ఈ తరుణంలో ధరలు తగ్గించడం అవసరమని పేర్కొన్నారు. మధ్యప్రాచ్య దేశాలను మేం కాపాడుతున్నాం. తాములేకుండా ఎంతోకాలం సురక్షితంగా ఉండలేరు. ధరలు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. దీన్ని మేం గుర్తు పెట్టుకుంటామంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ తరువాత యుఎస్ బెంచ్ మార్కు ఫ్యూచర్స్ ధరలు కొద్దిగా పడిపోయాయి. దీంతో 70 డాలర్లను అధిగమించిన బ్యారెల్ ధర గురువారం 0.2 శాతం నష్టపోయింది. కాగా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు అలాగే ఉత్పత్తిని పెంచాల్సిందిగా మిత్రదేశం సౌదీసౌదీ అరేబియాను అమెరికా కోరింది. ఒపెక్ వ్యవస్థాపక సభ్యులైన ఇరాన్, వెనిజులా కూడా ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం, జులై 2016 ఇరాన్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిని నమోదు చేసింది. నవంబరు 4న ఇస్లామిక్ రిపబ్లిక్ చమురు పరిశ్రమను దెబ్బతీసేందుకు కూడా కొత్త ఆంక్షలు విధించింది అమెరికా. ఒపెక్ దేశాల ఈ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఆలోచనలతో ఆమెరికా షేల్‌గ్యాస్ ఉత్పత్తిని పెంచి, ఆయిల్ దిగుమతులను తగ్గించుకుంది. దీంతో ఆయిల్ ధరలు తగ్గడంతో అమెరికా కుయుక్తులను దెబ్బతీసేందుకు ఒపెక్ దేశాలు కూడా ఆయిల్ ఉత్పత్తులను తగ్గించాయి. ప్రధానంగా 2014లో చమురు ధరలు కుప్పకూలిన నేపథ్యంలో 2016లో ప్రధాన చమురు ఉత్పత్తి సంస్థలన్నీ ( ఒపెక్, నాన్-ఒపెక్ దేశాలు) ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. మరోవైపు సౌది అరేబియా ఇరాన్‌లు, రష్యాలాంటి నాన్ ఒపెక్దేశాలతో భేటీ కానున్నాయి. ఉత్పత్తి స్థాయిలపై చర్చించనున్నాయి. నవంబరులోజరగనున్న అమెరికా మిడ్ టెర్మ్ ఎన్నికలకు మందు ఆదే చివరి సమావేశం. We protect the countries of the Middle East, they would not be safe for very long without us, and yet they continue to push for higher and higher oil prices! We will remember. The OPEC monopoly must get prices down now! — Donald J. Trump (@realDonaldTrump) September 20, 2018 -
భారత్ : అంచనాలకు కోత అయినా టాప్‌లోనే..
న్యూఢిల్లీ : పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళన పరుస్తున్న డాలర్-రూపాయి ఎక్స్చేంజ్ రేటు, ద్రవ్యోల్బణం దెబ్బకు కఠినతరమవుతున్న మానిటరీ పాలసీ ఇవ్వన్నీ దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా అప్డేట్ చేసిన వరల్డ్ ఎకానమిక్ అవుట్‌లుక్‌లో, దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. 2018లో దేశీయ వృద్ధి అంచనాలను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి, 7.3 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. అదేవిధంగా 2019లో వృద్ది అంచనాలను సైతం 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతం నమోదవబోతున్నట్టు పేర్కొంది. అంతకముందు ఇవి 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతంగా ఉండనున్నట్టు ఐఎంఎఫ్ అంచనావేసింది. అయితే ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ, భారత్ అత్యంత వేగవంతంగా ఆర్థిక వ్యవస్థగానే ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతంగానే ఉండనున్నట్టు పేర్కొంది. ఎన్నికల ఏడాదిలో భారత వృద్ధి స్టోరీ ప్రపంచ దేశాలకు పోటీగా ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.9 శాతంగా ఉండబోతున్నట్టు అంచనా వేసింది. ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో భారత్ వృద్ధి అంచనాలను 2018, 2019ల్లో 0.1 శాతం, 0.3 శాతం చొప్పున తగ్గించాం. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం దెబ్బకు అంచనాల కంటే కఠినతరంగా మానిటరీ పాలసీని రూపొందించడం ఇవన్నీ భారత్ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపాయి’ అని తన ఐఎంఎఫ్ అప్డేట్లో పేర్కొంది. కాగ, గతవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన రిపోర్టులో భారత్, ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు తెలిసిన సంగతి తెలిసిందే. కాగ, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో గత నాలుగున్నరేళ్లలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో రెపో రేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు పెంచి, రెపో రేటును 6.25 శాతంగా నిర్ణయించింది. ఆర్బీఐ భయపడిన విధంగానే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఎన్నడు లేనంతగా 5.77 శాతానికి ఎగిసింది. ఈ ద్రవ్యోల్బణ భయాలతోనే అర్జెంటీనా, భారత్, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ లాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా తమ పాలసీ రేట్లను పెంచాయి. -
నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసింది. కొన్ని ఆహారోత్పత్తులు, ఆయిల్ ధరలు పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) జూన్ నెలలో 5.77 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. మే నెలలో డబ్ల్యూపీఐ 4.43 శాతంగానే ఉండేది. 2017 జూన్‌లో అయితే కేవలం 0.90 శాతం మాత్రమే. మొత్తం టోకు ధరల సూచీల్లో ఐదో వంతు కంటే ఎక్కువ కలిగి ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ జూన్ నెలలో 5.3 శాతం పెరిగాయి. మే నెలలో ఇవి 3.16 శాతంగా మాత్రమే ఉన్నాయి. కూరగాయల ధరలు కూడా జూన్ నెలలో 8.12 శాతానికి పెరుగగా.. బంగాళదుంప ధరలు జూన్‌లో 99.02 శాతానికి ఎగిశాయి. పప్పు ధాన్యాలు ధరలు మాత్రం రివర్స్ ట్రెండ్‌లో తగ్గుతూ వస్తున్నాయి. మే నెలలో -21.13 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ధరలు, జూన్ నెలలో -20.23 శాతంగా నమోదయ్యాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ డబ్ల్యూపీఐలో 13.15 శాతం వెయిటేజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం మాత్రం మే నెలలో 11.22 శాతంగా ఉంటే, జూన్ నెలలో ఏకంగా 16.18 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు 13.90 శాతం నుంచి 17.45 శాతానికి, డీజిల్ ధరలు 17.34 శాతం నుంచి 21.63 శాతానికి ఎగిశాయి. గత వారం విడుదలైన జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 5 శాతం ఎగిసింది. ఇది నాలుగు నెలల గరిష్టం. -
జీఎస్టీలోకి పెట్రోల్‌ను చేర్చలేరా?
మనదేశంలో వస్తు సేవా పన్ను (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్– జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చి నేటికి (జూలై 1) సరిగ్గా ఏడాది పూర్తయింది. గతంలోని సంక్షిష్ట పన్ను విధానం నుంచి ఏకరూప పన్నుల విధానం అమలు వల్ల వివిధ వస్తువుల ధరలు కొంత మేర తగ్గాయి. అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీలో చేర్చాలనే డిమాండ్ మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. రోజువారీ ప్రాతిపదికన వీటి ధరలు పెరుగుతుండటంతో పాటు వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్నులు విధిస్తుండటంతో పెట్రోఉత్పత్తుల ధరలు తడిసి మోపెడవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతుండటంతో కనీసం ఈ ఏడాదైనా వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరల నియంత్రణకు అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటీ ? వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలు, అడ్డంకులు ఏమిటన్నది చర్చకు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు - ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్,డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రూపంలో వేస్తున్న పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. వివిధ రాష్ట్రాలు పెట్రోల్‌పై 15 నుంచి 40 శాతం మధ్యలో, డీజిల్‌పై 10 నుంచి 28.5 శాతం మధ్యలో పన్నులు విధిస్తున్నాయి. మొత్తంగా 50 శాతం వరకు పన్నులు అధికంగా పడుతున్నాయి. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలు సిద్ధం చేస్తున్నట్టు కేంద్రం చెబుతున్న నేపథ్యంలో బహిరంగ చర్చల్లో కనీసం మూడు పరిష్కారాలు ఎక్కువగా వినపడుతున్నాయి. - స్వల్పకాలిక పరిష్కారంలో భాగంగా పెరిగిన ధరలను ఓఎన్జీసీ సంస్థ భరించేలా చూడాలి (గతంలో ఇది అమలైంది). అయితే దీనివల్ల ఈ సంస్థ ఆర్థికవనరులు తగ్గిపోయి మరిన్ని సహజవాయు, చమురు నిక్షేపాలు వెలికితీసే కార్యక్రమాలు కుంటుపడతాయి. దాంతో ముడిచము రు దిగుమతిపై ఆధారపడటం పెరుగుతుంది. - పెట్రోల్, డీజిల్ ధరల నిర్థారణను ఇంపోర్ట్ ప్యారిటీ ప్రైసింగ్ (ఐపీపీ) పద్ధతి నుంచి కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ (సీపీపీ) పద్ధతికి మార్చాలని కొందరు సూచిస్తున్నారు.అంటే దిగుమతి చేసుకునే చమురు ధరల ఆధారంగా ధర నిర్ణయం(ఐపీపీ) నుంచి వినియోగదారుడికి చేర్చడానికి అయ్యే మొత్తం ఖర్చు ఆధారంగా నిర్ణయించే (సీపీపీ) స్థితికి మార్చాలని ప్రతిపాదన. దీనివల్ల చమురు శుద్ధి, ఉత్పత్తి జరిగే సముద్ర, నదీతీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలకు లాభం, మిగతా రాష్ట్రాలపై భారం పడుతుంది. అందువల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు. - పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవడా న్ని మరో పరిష్కారంగా చూపుతున్నారు. జీఎస్టీ లో భాగంగా గరిష్టంగా కేంద్రం 28% పన్ను విధించవచ్చు, దీంతో పాటు సెస్సు కూడా వేయవచ్చు (ఇందులో 14% రాష్ట్రాలకు వాటా వస్తుంది). ఈ కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గుతుంది. ఈ మేరకు తగ్గే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. దీంతో పెట్రోధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో అన్ని రాష్ట్రాలను ఏకాభిప్రాయానికి తీసుకురావడం అంత సులభమేమీ కాదు. వీటిపై జీఎస్టీ విధిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే ధర అమల్లోకి రావడం వల్ల ఆయా రాష్ట్రాల అమ్మకపు పన్నులు తగ్గి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఈ కారణంగానే వీటిపై వినియోగదారులు అధిక సొమ్ము చెల్లించాల్సి వస్తో్తంది. పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ విధించి, దాని పన్నుల శ్లాబ్‌లో గరిష్టంగా ఉన్న 28 శాతం పన్ను, 15 శాతం సెస్సు విధించినా కూడా వీటి ధరలు తగ్గుతాయని జీఎస్టీ డీజీఎం విశాల్ రహేజా చెబుతున్నారు. రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాక పెట్రో ఉత్ప త్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. అయితే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదంటున్నారు. -
ఒడిదుడుకుల వారం..
న్యూఢిల్లీ: పలు అంశాల కారణంగా ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల సంకేతాల్ని మన మార్కెట్ అందిపుచ్చుకోవొచ్చని వారన్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గత శుక్రవారం హఠాత్తుగా పెరిగిన పరిణామంతో ఈ వారం ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జూన్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్న ప్రభావం కూడా సూచీలపై వుంటుందని వారు అంచనావేసారు. రుతుపవనాల గమనం మార్కెట్‌కు కీలకమైనదని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే అన్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కాస్త శాంతించినందున, ఈక్విటీలు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. 75 డాలర్ల సమీపంలోనే క్రూడ్... ముడి చమురు(క్రూడ్) ఉత్పత్తి సరఫరాల్ని అంచనాలకు అనుగుణంగా ఒపెక్(క్రూడ్ ఉత్పత్తి దేశాల కూటమి) పెంచని కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర 75 డాలర్ల సమీపంలోనే కదలవచ్చని ఇండియాబుల్స్ వెంచర్స్ ఫండమెంటల్ అనలిస్ట్ ఫోరమ్ పారిఖ్ అంచనావేశారు. రోజుకు 1 మిలియన్ బ్యారళ్లకు మించి చమురు సరఫరాల్ని పెంచాలంటూ ఓపెన్ నిర్ణయించినట్లయితే ధరలు బాగా తగ్గివుండేవని ఆమె వ్యాఖ్యానిం చారు. బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల స్థాయిని మించితే, మన కరెంటు ఖాతాలోటు పెరిగిపోతుందని, దాంతో ఆర్బీఐ మళ్లీ రేట్లను పెంచే అవసరం ఏర్పడుతుందని, బ్రెంట్ క్రూడ్ ధర 70–75 డాలర్ల శ్రేణిలో ఉన్నంతవరకూ భారత్ ఈక్విటీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడబోదని, ఎంపికచేసిన షేర్లు పెరుగుతుంటాయని పారిఖ్ విశ్లేషించారు. ట్రేడ్‌వార్ పరిణామాలు సర్దుబాటు.. అమెరికా–చైనాల మధ్య తలెత్తిన ట్రేడ్ వార్ పరిణామాల్ని మార్కెట్ సర్దుబాటు చేసుకున్నదని, ప్రస్తుతం వాణిజ్య యుద్ధం విస్తృతమైతే తప్ప..మార్కెట్‌కు అది పెద్ద రిస్క్ కాదని ఎపిక్ రీసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్తాఫా నదీమ్ చెప్పారు. ముఖ్యంగా వాణిజ్య యుద్ధ ప్రభావం లేని రంగాల్లో ఆ రిస్క్ వుండబోదని ఆయన అంచనా వేశారు. మరో అభిప్రాయాన్ని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్ శర్మ వ్యక్తంచేస్తూ...ప్రస్తుత భౌగోళిక రాజకీయ అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధాన్ని ఇన్వెస్టర్లు సునిశితంగా గమనిస్తున్నారని, ఈ అంశంతో ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని అన్నారు. దేశీయంగా మార్కెట్‌కు చోదకంగా పనిచేసే అంశాలేవీ పెద్దగా లేనందున, అంతర్జాతీయ సంకేతాలే మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. జూన్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనున్నందున, ట్రేడర్లు వారి ప్రస్తుత నెల పొజిషన్లను క్లోజ్చేసుకోవడం, వచ్చే నెలకు రోలోవర్ చేయడం వంటి కార్యకలాపాలతో మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని ఆయన వివరించారు. -
వంటనూనె మంట
వీరఘట్టం శ్రీకాకుళం : మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అవస్థలు పడుతున్న ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లుగా వంటనూనెల ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవి అమాంతంగా ఒకేసారి పెరగడంతో ప్రజలు నూనె జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ధరలు శనివారం నుంచి అమల్లోకి రానుండటంతో ఇక వంటకాలు ఎలా చేసుకోవాలి దేవుడా.. అంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ప్రజలపై రూ.82.50 లక్షల భారం జిల్లాలో 2.50 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతీ కుటుంబం సరాసరిన 3 లీటర్ల వంటనూనె వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లీటరుకు సరాసరిన రూ.11 ప్రస్తుత ధరల ప్రకారం పెరిగింది. దీంతో ప్రతీ కుటుంబంపై నెలకు రూ.33 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన జిల్లా ప్రజల నెలకు వంటనూనెల రూపంలో రూ.82.50 లక్షల భారం పడనుంది. మార్కెట్‌కి వెళ్లాలంటే భయపడుతున్న వైనం సాధారణంగా వంటనూనెల కోసం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, రైస్‌బ్రాన్ ఆయిల్, కార్న్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, జంజీర్ ఆయిల్, ఆవనూనె, కొబ్బరినూనెలు విరివిరిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొబ్బరినూనె అర లీటరు రూ.166 నుంచి రూ.199కి పెరిగింది. ప్రస్తుతం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌కు మాత్రమే ప్రభుత్వం ధర పెంచింది. దీంతో వంట నూనెలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే వినియోగదారులు భయపడుతున్నారు. ఇక పండగలకు, వివాహాది శుభకార్యాలకు పిండి వంటలు వండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. హోటళ్లపై నూనె ధరల ప్రభావం ఇంటిలోనే కాకుండా హోటళ్లకు వెళ్తే అక్కడా నూనె ధరల ప్రభావంతో భోజనం, టిఫిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. వీటితోపాటు మిఠాయిలు, తినుబండారాలు, ఇలా ఒకటేమిటి నూనెలో వేగించే ప్రతీ వస్తువు ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వేపుడు వంటలంటే భయపడాల్సిందే నూనెల ధరలు పెరగడంతో వంటగదిలో ఉడకబెట్టిన కూరలు తప్ప వేపుళ్లంటే భయపడాల్సిం దే. పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం కూరలు వండాలన్న ఆర్థిక ఇబ్బందులు తప్పవు. – కే శ్రీదేవి, గృహిణి, వీరఘట్టం పిండి వంటలు వండుకోలేం పండగలకు, ఉత్సవాలకు పిండివంటలు వండుకోలేం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రభుత్వం నూనె ధరలు పెంచితే సామాన్యులు ఎలా బతికేది? – దుప్పాడ ఇందు, గృహిణి, వీరఘట్టం -
ద్రవ్యోల్బణానికి చమురు సెగ..
న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం (హోల్‌సేల్ ధరల ఆధారిత) మే నెలలో కట్టుతప్పింది. చమురు ధరల సెగకు ఏకంగా 4.43 శాతానికి పెరిగింది. ఇది 14 నెలల గరిష్ట స్థాయి. అంతకుముందు నెల ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతమే. గతేడాది మే నెలలో ఇది 2.26 శాతం. గతేడాది మార్చిలో హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.11 శాతంగా నమోదైన అనంతరం, మరోసారి గరిష్ట స్థాయికి చేరడం ఈ ఏడాది మే నెలలోనే. ♦ ఆహారోత్పత్తుల విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 0.87 శాతంగా ఉంటే, మే నెలలో 1.60 శాతానికి చేరింది. ♦ ఇంధనం, విద్యుత్ విభాగంలో 11.22 శాతం నమోదైంది. ఏప్రిల్‌లో 7.85 శాతంగానే ఉంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ♦ కూరగాయల ధరల పరంగా 2.51 శాతం నమోదైంది. ఆలుగడ్డల వరకే చూస్తే ద్రవ్యోల్బణం 81.93 శాతానికి పెరిగింది. ♦ పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం 15.40 శాతం. ♦ పప్పు ధాన్యాల్లో డిఫ్లేషన్ చోటు చేసుకోవడం గమనార్హం. 21.13% డిఫ్లేషన్ నమోదైంది. ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తే, ధరల పతనం డిఫ్లేషన్‌కు కారణమవుతుంది. అంటే సాధారణ స్థాయి కంటే ధరలు పడిపోవడం. ♦ ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించిన టోకు ద్రవ్యోల్బణం 2.47% నుంచి 2.74కు సవరించారు. ♦ ఏప్రిల్ నెలలో బ్యారెల్ చమురు 66 డాలర్లుగా ఉంటే, అదిప్పుడు 74 డాలర్ల స్థాయిలో ఉంది. చర్యలు తీసుకోవాలి: అసోచామ్ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయాలని అసోచామ్ ప్రభుత్వానికి సూచించింది. లేదంటే దిగుమతుల బిల్లు భారీగా పెరిగి కరెన్సీ మారకంపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అదనంగా ముడి పదార్థాల ధరలపైనా ఇది ప్రభావం చూపిస్తుందని, ఇప్పటికే ఈ ప్రభావంతో లాభాలపై ఒత్తిడి మొదలైందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. మరికాస్త పెరగొచ్చు:ఇక్రా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ స్పందిస్తూ... అధిక ముడి పదార్థాల ధరలను వినియోగదారులకు బదిలీ చేయడం, బలహీన రూపాయి ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణంగా పేర్కొన్నారు. ‘‘టోకు ద్రవ్యోల్బణం మరో 0.80 శాతం మేర పెరగొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏ స్థాయిలో స్థిరపడతాయి, దేశీయంగా చమురు ధరలపై వాటి ప్రభావం, రుతుపవనాల తీరు, ఎంఎస్పీలో మార్పులు ద్రవ్యోల్బణాన్ని నిర్ణయిస్తాయి’’ అని అదితి నాయర్ వివరించారు. -
ఆ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధర రూ.1 తగ్గింపు
సాక్షి, తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఇంధన ధరలకు చెక్ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనంపై రీటైల్ వాట్‌ను తగ్గించనుంది. దీంతో ఇటీవల అడ్డూ అదుపులేకుండా పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా మాత్రం పెట్రో ధరల వాత తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వామపక్ష పాలక రాష్ట్రం కేరళలో పెట్రోల్, డీజిల్ ధరల స్వల్పంగా నైనా శాంతించనుండటం విశేషం. జూన్ 1వ తేదీ శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ లీటర్ ధరపై ఒక రూపాయి తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. పెట్రోల్‌పై పన్నుపై కోత పెట్టడం ద్వారా వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ .2 రూపాయల మేర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించగా, నాలుగు రాష్ట్రాలు కేవలం వాట్ కట్‌ను ప్రకటించాయి. కాగా గత 16 రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే గ్లోబల్‌గా చమురు ధరలు శాంతించడంతో దేశీయంగా బుదవారం 1 పైసా ధర తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ భగ్గుమన్న ధరలను భరిస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా మండిపడ్డారు. చమురు ధరలు చల్లబడిన తరువాత కూడా లీటరుకు కేవలం ఒక పైసా తగ్గింపుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
పెట్రో ధరల తగ్గింపు; ప్రభుత్వం దిగొచ్చిన వైనం
ఇది మన దేశానికి సంబంధించిన వార్త కాదు. అయినాసరే, ప్రస్తుత సందర్భంలో దృష్టిసారించాల్సిందే! భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు మోతమోగుతుండటంతో రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఊరట లభించకపోగా.. రేపో మాపో ఆయా రాష్ట్రాల ఆర్టీసీలు కూడా టికెట్ల ధరలు పెంచనున్నాయన్న వార్తలు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇంత జరుగుతున్నా సగటు పౌరులు, సంబంధిత సంఘాలు ఆవేదన చెందడంతప్ప చేసేదేమీలేకుండాపోయింది. దాదాపు ఇలాంటి పరిస్థితే దక్షిణఅమెరికా దేశం బ్రెజిల్లో చోటుచేసుకోగా.. అక్కడివారు గట్టి పట్టుదలతో ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గేలా చేశారు! అంతేకాదు.. రాబోయే రెండు నెలలపాటు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచబోమని పాలకులచేత చెప్పించారు!! వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్లో జనవరి నాటికి లీటరు డీజిల్ ధర 3.36 రియిస్ (మన కరెన్సీలో సుమారు రూ.61) ఉండేది. ఒక్కసారే ధరను 3.6 రియిస్ (రూ.65)కు పెంచేశారు. ఇంధనం ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు తడిసిమోపెడయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడి ట్రక్కు(లారీ) యజమానులు ఆందోళనబాట పట్టారు. నిరసనలో చివరి అంకమైన సమ్మెను కూడా చేపట్టారు. గడిచిన వారం రోజులుగా ఎక్కడి ట్రక్కులు అక్కడే నిలిపేశారు. దరిమిలా దేశంలో ఆహార, ఇధనాల కొరత ఏర్పడింది. మరికొద్ది రోజులు సమ్మె కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. లీటర్ డీజిల్‌పై 0.46 రియిస్ (రూ.8.36) మేర తగ్గిస్తున్నట్టు బ్రెజిల్ అధ్యక్షుడు మిఛెల్ టెమెర్ ప్రకటన చేశారు. వచ్చే రెండు నెలల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆ వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు ట్రక్కు యజమానులు చెప్పారు. ఆయిల్ ధరల నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉందికాబట్టి బ్రెజిల్ అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకోగలిగారు. భారత్‌లో మాత్రం ఆ నిర్ణయాధికారం ఆయిల్ కంపెనీల చేతుల్లో ఉండటం, ప్రతిరోజూ సవరణ పేరుతో పైసలకు పైసలు ధరను పెంచుతూ పోవడం చూస్తున్నాం. ఇటీవల దేశ చరిత్రలోనే రికార్డుస్థాయికి పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడం తెలిసిందే. అయితే, కర్ణాటక ఎన్నికల సందర్భంలో ఆయిల్ కంపెనీలు కొన్ని రోజుల పాటు ధరలను పెంచకపోవడం గమనార్హం. (సమ్మె కారణంగా ఎక్కడిక్కడే నిలిచిపోయిన ట్రక్కులు, ఇతర వాహనాలు) -
చల్లబడ్డ చమురు ధరలు : మార్కెట్లు జంప్
ముంబై : గత కొన్ని రోజులకు వాహనదారులకు, ఇటు మార్కెట్లకు కాక పుట్టిస్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు చల్లబడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కిందకి దిగిరావడంతో పాటు, రూపాయి విలువ రికవరీ అవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పైకి జంప్ చేశాయి. ప్రారంభంలోనే 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 151 పాయింట్ల లాభంలో 35,076 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 56 పాయింట్ల లాభంలో 10,661 వద్ద కొనసాగుతోంది. ఆయిల్‌ను ఉత్పత్తి చేసే టాప్ ఉత్పత్తిదారులు, అవుట్‌పుట్‌ను పెంచనున్నామని సంకేతాలు ఇవ్వడంతో ఆయిల్ ధరలు దిగొచ్చాయి. దీంతో ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు 5 శాతం నుంచి 7 శాతం మధ్యలో పైకి ఎగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్‌కు 80.50 డాలర్ల వద్ద 2018 గరిష్ట స్థాయిని చేరుకోగా, ప్రస్తుతం ఇవి 75 డాలర్లుగా నమోదయ్యాయి. టాప్ గెయినర్లుగా బ్యాంకు ఆఫ్ బరోడా, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మాలు లాభాలు పండిస్తుండగా.. టెక్ మహింద్రా, వేదంతా, పీసీ జువెల్లరీ, ఐడీబీఐ బ్యాంకులు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 110 పాయింట్లు లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి కూడా 27 పైసలు లాభపడింది. ప్రస్తుతం మరింత పుంజుకుని 95 పైసల లాభంలో 67.39 వద్ద కొనసాగుతోంది. వరుసగా ఆరు వారాల తర్వాత రూపాయి విలువ డాలర్ మారకం విలువతో పోటీగా బలపడుతోంది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, పై స్థాయిల వద్ద ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వంటి కారణాలతో రూపాయి విలువ పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ చెప్పాయి. గత కొన్ని సెషన్ల నుంచి రూపాయిలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను నిరోధించడానికి ఆర్బీఐ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. -
కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లు
ముంబై : రూపాయి బలపడటం, ఆయిల్ ధరలు కరెక్షన్కు గురవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు కళకళలాడాయి. నిన్ననే జిల్‌జిగేల్‌మనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, నేడు కూడా కొనుగోళ్ల జోరుతో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఆయిల్, మెటల్స్, టెక్నాలజీ స్టాక్స్ మద్దతుతో సెన్సెక్స్ 262 పాయింట్లు లాభపడి 34,924.87 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 91 పాయింట్ల లాభంలో 10,605 వద్ద క్లోజైంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం వరకు ర్యాలీ నిర్వహించింది. నేటి మార్కెట్లో అన్ని రంగాల షేర్లు గ్రీన్‌గానే ట్రేడయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు లాభాల బాట కొనసాగించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, ఐబీ హౌసింగ్, హిందాల్కో, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫిన్, ఓఎన్జీసీ, గెయిల్, టాటా స్టీల్, యస్‌బ్యాంక్, బీపీసీఎల్‌లు 5.4-2.7 శాతం లాభపడగా.. ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 1-0.5 శాతం మధ్య నష్టాలు గడించాయి. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు కిందకి పడిపోయాయి. రష్యా నుంచి ఆయిల్ సప్లై పెరుగుతుందనే సంకేతాలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3 శాతం పడిపోయి బ్యారల్‌కు 78 డాలర్లుగా నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారల్‌కు 80.50 డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు రూపాయి విలువ కూడా వరుసగా రెండో రోజు బలపడింది. 18 నెలల కనిష్టస్థాయిల నుంచి 55 పైసల వరకు లాభపడి రూ.67.79గా నమోదైంది. -
చమురు సంస్థలపై సెస్సు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు దాటిపోతున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల స్థాయి దాటితే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ఉత్పత్తి కంపెనీలకొచ్చే అదనపు ఆదాయం ప్రభుత్వానికి దఖలు పడేలా చూసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సెస్సు రూపంలో వచ్చే ఈ మొత్తాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలకు సర్దుబాటు చేయడం ద్వారా అవి రేట్లను మరింతగా పెంచకుండా చూడొచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. రిటైల్ స్థాయిలో రేట్లు భారీగా పెరగకుండా చూసేందుకు ఎక్సైజ్ సుంకం రేట్లలో స్వల్ప మార్పులు, చేర్పులు చేయడంతో పాటు వ్యాట్ తగ్గించేలా రాష్ట్రాలకు కూడా సూచించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంక్షేమ పథకాలకు తగినన్ని నిధులు సమకూర్చుకునే ఉద్దేశంతో ఆర్థిక శాఖ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడానికి ససేమిరా అంటున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దేశీ చమురు కంపెనీలు క్రూడాయిల్‌ను దేశీయంగానే ఉత్పత్తి చేసినా.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా రేటు లభిస్తుంది. తాజా ప్రతిపాదన ప్రకారం ముడిచమురు బ్యారెల్ ధర 70 దాటిన పక్షంలో ఉత్పత్తి కంపెనీలకు వచ్చే అదనపు ఆదాయాలను .. మార్కెటింగ్ కంపెనీలకు మళ్లించడం ద్వారా రిటైల్ రేట్లు పెరగకుండా చూడొచ్చన్నది కేంద్రం భావన. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ చమురు ఉత్పత్తి సంస్థలన్నింటిపైనా ఈ సెస్సును విధించడం ద్వారా విమర్శలు రాకుండా చూసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2008లో చమురు రేట్లు భారీగా పెరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి ప్రతిపాదనే వచ్చినప్పుడు కెయిర్న్ ఇండియా వంటి ప్రైవేట్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బ్రిటన్, చైనా తదితర దేశాల్లో ఈ తరహా విధానం అమల్లో ఉంది. ఓఎన్జీసీ, ఆయిల్ షేర్ల పతనం: సెస్సు ప్రతిపాదన నేపథ్యంలో గురువారం ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు క్షీణించాయి. బీఎస్ఈలో ఓఎన్జీసీ షేర్లు 4.5 శాతం పతనమై రూ. 167.65 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా 11.44 శాతం క్షీణించి రూ. 155.45 స్థాయిని కూడా తాకాయి. -
జియో ఆఫర్ వద్దు.. పెట్రోల్ ధర తగ్గిస్తే చాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: పెరిగిన ఇంధన ధరలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒడిశా బీజేపీ సీనియర్ నాయకుడు జయనారాయణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని నవ్వులపాలు చేశాయి. కాంగ్రెస్‌పై విమర్శలు చేసే క్రమంలో అనాలోచితంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మిశ్రా మంగళవారం ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఇంధన ధరల పెరుగుదలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మొబైల్ డాటాకు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చేదని, కానీ నేడు దాదాపు ఉచితంగా లభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించడమే కాంగ్రెస్ లక్ష్యంగా మారిందంటూ.. యూపీఏ ప్రభుత్వ కాలంలో పెట్రోలు ఇతర వస్తువుల ధరలు ఏమేరకు పెరిగాయో వివరించారు. ‘2004లో లీటరు పెట్రోలు రూ.29కి లభించేది. పదేళ్ల యూపీఏ పాలన అనంతరం దాని ధర 74 రూపాయలకు చేరింది. కిలో నెయ్యి 2004లో రూ.130 ఉండగా.. 2014లో రూ.380 కి చేరింది. నాటి యూపీఏ హయాంలో 1 జీబీ డాటా కోసం రూ.300 చెల్లించాల్సి వచ్చేది.. కానీ, నేడు ఉచితంగా డాటా లభిస్తోంద’ని మిశ్రా వివరించారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ట్విటర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘డాటా ఉచితం అయితే కావచ్చు. కానీ, డాటాతో బండి నడవదు కదా..!’ అంటూ ఒకరు స్పందించగా.. ‘ఈయన లెక్కలు బాగా చెబుతున్నారు. కొంపదీసి వచ్చే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేస్తారేమోన’ని ఇంకొకరు చమత్కరించారు. ‘జియో వచ్చాక దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం సులభమయింది. కానీ, ఏం లాభం. జియో మాదిరే పెట్రోలుపై కేంద్రం దృష్టి సారిస్తే మంచిది. 399 రూపాయలకే 70 రోజుల పాటు.. రోజూ ఒక లీటర్ చొప్పున జియో మాదిరే పెట్రోలు పథకం ప్రవేశపెడితే బాగుంటుంద’ని మరొకరు ట్వీట్ చేశారు. ‘మాకు జియో మ్యాజిక్ ఏం వద్దు. నిత్యావసరమైన పెట్రోలు ధరలు తగ్గిస్తే చాల’ని ఇంకో నెటిజన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వాలను విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందనీ.. వారేం చేశారు.. వీరేం చేశారు అని మునుపటి ప్రభుత్వాలను వేలెత్తి చూపడం మానుకొని.. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కేంద్రానికి సూచించారు. Congress talks about fuel price to criticise govt. Don't they remember their past? Petrol was Rs29/l in '04&Rs74/l in '14, Ghee Rs130/kg in '04&Rs380/kg in '14, data charges Rs300 for 1 GB,100 GB at Rs300 now, call rates Rs 8/min & free with data pack today: J Mishra, BJP (23.05) pic.twitter.com/BqSSuvSoko — ANI (@ANI) May 24, 2018 Hope this guy doesn't become next finance minister of India. — Jerin saviour (@Jerinsaviour) May 24, 2018 Hey bhagwan Data se Gaadi chalegi — S a n j e e v 🇮🇳🇮🇳 (@sanjeevjena1) May 24, 2018 Whenever a question is directed towards them, they try to deflect it. What Cong did, what communist did. Why can't you answer why you did ,what you did ? And what are you going to do about it. BJP is so busy pinning the blame on other. A party with a difference has changed. — Arun (@DrArun_) May 24, 2018 -
చమురు సెగ: హ్యుందాయ్ కార్ల ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న చమురు ధరలతో కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ కోవలో హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన కార్ల ధరలను పెంచేసింది. జూన్ నుంచి 2 శాతం మేర పెంచుతున్నట్టు హ్యుందాయ్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఎస్యూవీ మినహాయించి దాదాపు అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ఇంధన ధరల పెంపు, పన్నులు, ఇన్పుట్ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని హెచ్ఎంఐఐఎల్ డైరెక్టర్ - సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. 9.44 లక్షల రూపాయల ధరలో కొత్తగా లాంచ్ చేసిన హ్యుందాయ్ ఎస్యూవీ క్రెటా ధర అన్ని కార్లపై ధరలను పెంచినట్టు చెప్పారు. -
ముడిచమురు, ఫలితాలు ‘మార్కెట్’కు దిశానిర్దేశం
ఈ వారంలో వెలువడే ఎస్బీఐ, సిప్లా వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారంలో ఎస్బీఐ, టాటా మోటార్స్, సిప్లా, జెట్ ఎయిర్వేస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. మొత్తం 800 కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ పతనం మార్కెట్‌పై స్వల్పంగానే ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ చెప్పారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం ఏమీ ఉండదని ఆయన అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరలు 80 డాలర్లకు చేరడం, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, కరెన్సీ మారకం, జీడీపీ వృద్ధిపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావం... తక్షణం మార్కెట్‌ను ఆందోళన పరుస్తున్న అంశాలని పేర్కొన్నారు. బ్యారెల్ ముడి చమురు ధరలు 85 డాలర్లకు చేరితే మార్కెట్లో భారీ పతనం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, బాండ్ల రాబడులు కూడా పెరుగుతుండటం మార్కెట్లకు ప్రతికూలమేనని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ టీనా వీర్మాణి చెప్పారు. నేడు ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ లిస్టింగ్ రూ.572 ఇష్యూ ధరతో ఈ నెల 9–11 మధ్య ఐపీఓకు వచ్చిన ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ సోమవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. కొనసాగుతున్న ‘విదేశీ’ అమ్మకాలు మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.18,000 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,830 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.12,947 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో అమ్మకాలు జరుపుతున్నారని విశ్లేషకులంటున్నారు. -
నూనెకు సుంకం సెగ
శ్రీకాకుళం: నూనెల ధరలు మండిపోతున్నాయి. దిగుమతులపై సుంకాన్ని కేంద్రం పెంచుతుండటంతో పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు ని ప్పులు కక్కుతున్నాయి. కిలో నూనెపై ఒక్కరోజులో రూ.10 పెరిగింది. డబ్బా పరంగా (15 కిలోలు) చూసుకుంటే రూ. 150 పెరిగింది. నూనెల మార్కె ట్ చరిత్రలో ఇంత పెరుగుదల కనిపించడం ఇదే ప్రథమం. మలేషియా నుంచి రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా పామ్‌క్రూడ్ (శుద్ధి చేయని పామాయిల్), పామాయిల్ (రిఫైన్డ్ చేసిన పామాయిల్), సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అవుతోంది. దిగుమతులను ప్రోత్సహించే క్రమంలో 200 శాతం ఉన్న సుంకాన్ని గత యూపీఏ ప్రభుత్వం క్రమేణా తగ్గించుకుంటూ వచ్చింది. చివరకు దిగుమతి సుంకం జీరోకు చేరుకుంది. దేశంలో పా మాయిల్ సాగు విస్తరించడం, విదేశాల నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటే దేశీయ రైతులకు నష్టం వాటిల్లుతుందనే కారణంగా కేంద్రం ఇటీవల పామ్‌క్రూడ్ దిగుమతులపై సుంకాలు విధించడం మొదలైంది. 12 శాతంగా మొదలై 30 శాతానికి చేరుకుంది. బుధవారం నుంచి ఇది మరింత ఎగసి 44 శాతానికి పెరిగింది. దీనిపై సంక్షేమ సర్‌చార్జీలు 4.4 శాతం కలిపితే దిగుమతి సుంకం 48.4 శాతా నికి చేరుకుంది. ఈ ప్రభావం నేరుగా ధరపై పడి ఒక్కరోజులో కిలో పామాయిల్ ధర రిటైల్ మార్కెట్లో రూ.10 పెరిగి రికార్డు సృష్టించింది. రిఫైన్డ్ బ్లీచ్డ్ డీ ఆక్సైడ్ ఆయిల్ (డీబీడీ) శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై కూడా సుంకాలు పెరిగాయి. 40 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 59.40 శాతానికి చేరుకుంది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో పామాయిల్, సన్‌ఫ్లవర్‌కు, ఇతర నూనెల ధ రలకు రెక్కలు వచ్చాయి. పది కిలోల పామాయిల్ రూ.670 నుంచి రూ.770కి చేరుకుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ 10 కిలోల ధర రూ.750 నుంచి రూ.850 కి చేరుకుంది. వీటి ప్రభావం మిగిలిన నూనెల ధరలపై కూడా పడింది. 10 కిలోల రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.723 నుంచి రూ.790కు పెరిగింది. చేతులెత్తేసిన దిగుమతిదారులు కాకినాడ, కృష్ణపట్నం రేవుల్లో సుమారు 10 మంది దిగుమతిదారులు నూనెల దిగుమతులు నిలిపివేశారు. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో నూనెల ధర పెరగడంతో మార్కెట్లో నూనె వ్యాపారం స్తంభించిపోయింది. ఈ కారణంగా జిల్లాలోని హోల్‌సేల్ నూనె వ్యాపారుల కొనుగోలు చేయడం నిలిపివేశారు. ఈ ప్రభావం ఇప్పటికే ఉన్న స్టాక్ పడి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొందరి వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రూ.10 కోట్ల వరకూ భారం పెరిగిన ఒక్క పామాయిల్, సన్‌ఫ్లవర్ ధరలను చూసుకుంటే రాష్ట్రంలోని వినియోగదారులపై రూ.8 కోట్ల భారం పడినట్టు తెలుస్తోంది. రోజుకు రాష్ట్రానికి రెం డు పోర్టుల ద్వారా 90 ట్యాంకుల పామాయిల్ దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రకారం నెలకు 2,700 ట్యాంకర్ల ద్వారా నూనె దిగుమతి అవుతోంది. ఒక్కో ట్యాంకరులో వెయ్యి కిలోల నూనె ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకరుకు రూ.21వేల ధర పెరుగుతోంది. 90 ట్యాంకర్లకు కలిపితే రూ.18 .90 లక్షల పెరుగుదల ఉండగా, మొత్తంగా రూ.8కో ట్ల పైమాటే. జిల్లా విషయానికి వస్తే రోజుకి 6 టన్ను ల పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ విక్రయం అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈలెక్కన రోజుకు జిల్లా ప్రజలపై రూ.60వేల భారం పడుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత పెరుగుదల తొలిసారిగా నూనెల ధర ఒక్కసారిగా పెరగడం చూస్తున్నా. ఇంతలా మార్కెట్ చరిత్రలోనే నమోదుకాలేదు. ఏకంగా కిలోకు రూ.8 దాటి పెరుగుదల ఉంది. సర్‌చార్జీ, పన్నులు కలుపుకొని కిలోకు రూ.10 పెరిగింది. దిగుమతి సుంకం 12 శాతం నుంచి సుమారు 50 శాతం దాటి పెరిగింది. ఈ ధరల్లో నూనె వ్యాపారం చేస్తే సొమ్ముకు వడ్డీ కూడా దండగలా ఉంది. – శ్రీనివాసరావు,హోల్‌సేల్ నూనెల వ్యాపారి, శ్రీకాకుళం -
7వారాల గరిష్టానికి చమురు ధర
సాక్షి,న్యూఢిల్లీ: అనూహ్యంగా చమురు మరోసారిపైకి ఎగబాకాయి. ముఖ్యంగా అంచనాలకు విరుద్ధంగా అమెరికా ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు బుధవారం మరోసారి వేడెక్కాయి. మంగళవారం పుంజుకున్న చమురు ధరలు మరింత ఎగిసి ఏడువారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. వాషింగ్టన్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కనిపిస్తోందనీ, ఇది ముడి చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీయనుందని డెన్మార్క్ సాక్సో బ్యాంక్ కమొడిటీ స్ట్రాటజిస్ట్ హెడ్ ఓలే హాన్సెన్ పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కూడా చమురు ధరలకు తోడ్పడుతున్నాయని విశ్లేషకుల అంచనా. యూఎస్ మార్కెట్ నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం బలపడి 65.39 డాలర్లను తాకగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.3 శాతం ఎగసి దాదాపు 70 డాలర్లకు చేరింది. వెరసి ఏడు వారాల గరిష్టానికి చమురు ధరలు చేరాయి. కాగా.. ప్రస్తుతం నైమెక్స్ 65.22 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బ్రెంట్ బ్యారల్ 69.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మార్చి 16తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 2.74 మిలి యన్ బ్యారళ్లమేర తగ్గినట్లు మంగళవారం అమెరికా ఇంధన శాఖ వెల్లడించింది. వాస్తవానికి 2.55 మిలియన్ బ్యారళ్లమేర నిల్వలు పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో 5మిలియన్ బ్యారళ్లమేర అంచనాలు తారుమారు కావడంతో చమురు ధరలు భారీగా పెరిగాయని నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామంటూ సౌదీ అరేబియా ప్రకటించడం, వెనిజులాలో చమురు ఉత్పత్తి గత నెలలో 1.54 మిలియన్ బ్యారళ్లమేర తగ్గడం వంటి అంశాలు సైతం ధరల మంట పుట్టించినట్లు నిపుణులు తెలియజేశారు. -
మళ్లీ రూ.80 మార్కు దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గరిష్ట స్థాయిల్లో ఈ ధరలు సోమవారం నమోదయ్యాయి. సోమవారం లీటరు పెట్రోల్ ధర 15 పైసలు, లీటరు డీజిల్ ధర 7 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో మరోసారి రూ.80 మార్కును పెట్రోల్ ధర అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్ రూ.68.30గా ఉంది. ముంబైలో స్థానిక పన్ను లేదా వ్యాట్ రేట్లు అత్యధికంగా ఉండటంతో, అక్కడ ధరలు మోత మోగుతున్నాయి. ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్ ధర ఎగిసింది. లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్ ధర రూ.64.14గా రికార్డయ్యాయి. డిసెంబర్ మధ్య నుంచి లీటరు పెట్రోల్ ధర కనీసం రూ.4, డీజిల్ ధర రూ.5.77 మేర పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి. రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైన అంతర్జాతీయ ఆయిల్ ధరలు ప్రస్తుతం తగ్గుతున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఆ ప్రభావం కనుబడుట లేదు. -
ఎన్నికల ముందు మోదీకి కొత్త తంటా
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి కొత్త తంటాలు ఎదురుకాబోతున్నాయి. ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు చేరుకోబోతున్నాయి. ఉత్తర సముద్ర బ్రెంట్‌లో ఆయిల్ ధరలు శుక్రవారం బ్యారల్‌కు 59.30 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. గురువారమైతే ఈ ధరలు 59.55 డాలర్ల మార్కును తాకి 2015 నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేశాయి. దీంతో అత్యధిక మొత్తంలో దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌కు ఇవి అగ్నిపరీక్షలా నిలుస్తున్నాయి. భారత్ 82 శాతం ఆయిల్ అవసరాలను దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటోంది. దేశీయ బాస్కెట్లో ఆయిల్ ధరలు బ్యారల్‌కు గురువారం 56.92 డాలర్లుగా నమోదయ్యాయి. సోమవారం వరకు ఈ ధరలు 60 డాలర్ల మార్కును చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా రోజువారీ ధరల సమీక్ష ఉండటంతో, వినియోగదారులపై కూడా ఈ ధరల పెంపు భారం అధికంగా పడుతోంది. ఆగస్టు నుంచి కూడా వినియోగదారులు ఆయిల్‌కు అత్యధిక మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు. అక్టోబర్ 3 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో, కేంద్రప్రభుత్వం ఇటీవలే ఎక్సైజ్ డ్యూటీకి కోత పెట్టింది. ఎక్సైజ్ డ్యూటీ కోత మేర రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని ప్రభుత్వం కోరింది. కొన్ని రాష్ట్రాలు ఈ మేరకు వ్యాట్ శాతాలను తగ్గించాయి. కానీ ప్రస్తుతం ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు మళ్లీ పన్ను కోతలను కోరవచ్చు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి మింగుడు పడని అంశమే. ఒకవేళ పన్నుల్లో కోత పెడితే ప్రభుత్వం ఆదాయాలకు గండికొడుతోంది. కానీ తగ్గించపోతే, ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి రావొచ్చు.