పెట్రోల్‌పై రూపాయి తగ్గింపు
అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధర
డీజిల్‌పై త్వరలో రూ. 2.50 తగ్గించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గిడంతో ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున ధర (స్థానిక పన్నులు మినహాయించి) తగ్గించాయి. తగ్గించిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ధర తగ్గింపుపై చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా బుధవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఒక రోజు ముందే నిర్ణయాన్ని ప్రకటించాయి. ఈ నెలలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి. చమురు సంస్థలు ఈ నెల 1న పెట్రోల్‌పై లీటర్‌కు 54 పైసల చొప్పున ధర తగ్గించాయి.
స్థానిక పన్నులతో కలుపుకొని పెట్రోల్ ధర ఢిల్లీలో లీటర్‌కు రూ.1.21 తగ్గి రూ.66.65కి చేరింది. హైదరాబాద్‌లో రూ.74.15 నుంచి రూ. 72.83 కు తగ్గింది. కాగా కేంద్రం డీజిల్ ధరను ఐదేళ్ల వ్యవధిలో తొలిసారి తగ్గించనుంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌న ఉపసంహరించగానే ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 చొప్పున తగ్గించే అవకాశం ఉంది. చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కొడ్ అమల్లో ఉందని...అందువల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.